depressed
-
మొక్కలు కూడా అరుస్తాయి..శబ్దాలు చేస్తాయ్.!
మొక్కలకు భాష ఉంటుందని, నీళ్లు పోసినపుడు ఆనందంతో కొమ్మలు ఊపూతూ ఆనందాన్ని ప్రకటిస్తాయని చాలా సార్లు విన్నాం. తాజాగా మొక్కలకూ బాధ ఉందనే విషయాన్ని తొలిసారిగా గుర్తించారు. తీవ్ర ఒత్తిడికి లోనైనప్పుడు మొక్కలు కూడా గట్టిగా అరుస్తాయని పరిశోధకులు వెల్లడించారు. చెట్లు, మొక్కలను కూకటి వేళ్లతో సహా పెకలించినప్పుడు, లేదా వాటి కాండాన్ని మధ్యలో నరికినప్పుడు మొక్కలు ఆక్రోశిస్తాయి. ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తమ పరిశోధనలో ఈ విషయాలను గుర్తించారు. సెల్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. నిశ్శబ్దమైన మైదానంలో కూడా మనకు వినబడని శబ్దాలు చేస్తాయి. ఆ శబ్దాలకు అర్థం ఉంటుంది. ఈ శబ్దాలను వినగలిగే జంతువులూ ఉన్నాయి. కాబట్టి చాలా శబ్ద పరస్పర చర్య జరిగే అవకాశం ఉందని పరిణామాత్మక జీవశాస్త్రవేత్త లిలాచ్ హడానీ తెలిపారు. సాధారణ సమయాల్లో కూడా మొక్కలు కొన్ని రకాల శబ్దాలు చేస్తాయని, మనిషి వినలేని ఈ శబ్దాలను కొన్ని జంతువులు, కీటకాలు గుర్తిస్తాయని తేల్చారు. లిలాచ్ హడానీ డా. హడానీ , ఆమె బృందం ఈ ప్రయోగాల కోసం టమాటాలు, పొగాకు మొక్కలను పరిశీలించారు. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ ద్వారా ఒత్తిడి లేని మొక్కలు, కాండం పెకిలించిన మొక్కలు, నిర్జలీకరణ మొక్కలు ఉత్పత్తి చేసే శబ్దాల మధ్య తేడాను గుర్తించానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఒత్తిడి ఎదుర్కొంటున్న సమయాల్లో మొక్కలు మీటరు దూరం మేర వినబడేలా హై పిచ్ శబ్దాలు చేస్తాయని గుర్తించారు. ఒత్తిడి లేని మొక్కలు ప్రశాంతంగానే ఉంటున్నట్టు గుర్తించారు. ఒత్తిడిలో ఉన్న మొక్కలు చేసిన శబ్దాలు అల్ట్రా సౌండ్ ఫ్రీక్వెన్సీల్లో ఉండే ఈ ధ్వనులు చిటికెలు లేదా క్లిక్ చేసినట్టుగా ఉంటాయని, మనుషులకు వినబడవని పేర్కొన్నారు. మొక్కలు తమ బాధలను తమ చుట్టూ ఉన్న ప్రపంచానికి తెలియజేయడానికి ఉపయోగించే మార్గాలలో ఇదొకటి కావచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడి సమయాల్లో చెట్లు, మొక్కలు తమ రంగులు మార్చుకోవడం, లేదా ముడుచుకుపోవడం, ఇతర మార్పులకు లోనవుతాయని తెలుసు. అయితే, ఇవి శబ్దాలను కూడా వెలువరిస్తాయో లేదో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.. అయితే, మొక్కలు ఈ శబ్దాలను ఎలా చేస్తాయనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. -
ఓటమి నుంచే గాంధీ నేర్చుకున్నారు..
సాక్షి, హైదరాబాద్: ‘‘గెలుపు కన్నా ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం.. గాంధీజీ సైతం అలాగే ఓటమి నుంచే నేర్చుకున్నారు.. అందుకని ఏ రంగంలోనైనా ఓడిపోతే కుంగిపోకూడదు ’’ అని ఒడిశా హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ ఎస్.మురళీధర్ ఉద్బోధించారు. గాంధీ జయంతి నాడు ప్రముఖుల ప్రసంగాలకు పట్టం కట్టే మంథన్ సంవాద్ వార్షిక చర్చాగోష్టిని నగరంలోని శిల్పకళా వేదికలో సోమవారం నిర్వహించింది. కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ మురళీధర్ మాట్లాడుతూ రాజకీయా ల్లోకి రాక పూర్వం న్యాయవాదిగా గాంధీజీ ఎదుర్కొన్న వృత్తిపరమైన ఆటుపోట్లు, దక్షిణాఫ్రికా లో రెండు దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో పొందిన అనుభవాలను ప్రస్తావించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా, నేర్చుకోవడాన్ని మానకుండా సత్యాన్ని వీడకుండా నిరుపేదలకు అండగా గాంధీజీ న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. నవతరం న్యాయవాదులు గాంధీజీ న్యాయవాద ప్రస్థానం నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధికి దోహదం చేయలేని ఆర్ధికాభివృద్ధి: యామినీ అయ్యర్ సిటిజన్ వర్సెస్ లాభార్థి? అంశంపై ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు యామినీ అయ్యర్ మాట్లాడారు. దేశంలో పేర్కొంటున్న ఆర్థికాభివృద్ధి లాభదాయకమైన ఉపాధి అవకా శాలకు, ఉద్యోగాలకు దోహదం చేయలేకపోతోందని అభిప్రాయపడ్డారు. నిజమైన సంక్షేమానికి ఇంకా సరైన నిర్వచనాన్ని వెదికే క్రమంలోనే ఉన్నామన్నారు. ది క్వశ్చన్ ఆఫ్ అకడమిక్ ఫ్రీడమ్ అనే అంశంపై లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ నీరజా గోపాల్ జయాల్ మాట్లాడుతూ విద్యా సంబంధ స్వేచ్ఛ (అకడమిక్ ఫ్రీడమ్) అనేది మన దేశంలో ఇంకా తగిన స్థాయిలో లేదన్నారు. సదస్సులో ‘‘వై ఇండిపెండెంట్ న్యూస్ మీడియా షుడ్ త్రైవ్’’ అనే అంశంపై ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ధన్యా రాజేంద్రన్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీపై వచ్చిన ఆరోపణల విషయంలో మీడియా పూర్తిస్థాయిలో నిష్పక్షపాత్ర పోషించలేకపోయిందన్నారు. ఫైటింగ్ ది ఫేక్ న్యూస్ పాండమిక్ అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ప్రచారం సాగుతోందని ఆరోపించారు. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్ ఆర్ఘ్యాసేన్గుప్తా ‘ది గ్లోబల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. సదస్సులో హిందీ కవి,వ్యంగ్యరచయిత సంపత్ సరళ్ పలు కవితలు,వ్యంగ్యరచనలు వినిపించారు. -
కెనడాలో కొడుకు మరణం.. తట్టుకోలేక ఆగిన తల్లి గుండె..
చంఢీగడ్: కన్న కొడుకు మరణవార్త వినలేకపోయింది. ఆ వార్త తన చెవిలో పడగానే కళ్లు తిరిగి పడిపోయింది. అంతే.. ఇగ తిరిగి మేల్కోలేదు. కొడుకుతోపాటు తాను అనంతలోకాలకు చేరింది. కొడుకు, తల్లికి ఒకేసారి అంత్యక్రియలు జరిపారు. ఈ బాధాకర ఘటన పంజాబ్‌లోని నవాన్షహర్ జిల్లాలో జరిగింది. పంజాబ్‌కు చెందిన గుర్విందర్ నాథ్(24) చదువు కోసం కెనడా వెళ్లాడు. ఒంటారియో ప్రావిన్స్‌లో పిజ్జా డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. జూలై 9న కొందరు దుండగులు అతనిపై దాడి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జులై 14న అక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని గుర్విందర్ తల్లి నరీందర్ కౌర్‌కు చెప్పలేదు. గుర్విందర్ మృతదేహం శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చిందనే విషయం అతని తల్లికి ఎట్టకేలకు తెలిసింది. ఇక కుమారుని మరణవార్త విన్న ఆమె తీవ్ర మనోవేదనకు గురైంది. దుఖిస్తూ కళ్లు తిరిగి పడిపోయింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత ఆమెను లూథియానాలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాడు. తల్లి, కొడుకుకు ఒకేసారి శుక్రవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరిపారు. ఇదీ చదవండి: షాకింగ్..! ఆర్టీఐ ధరఖాస్తుకు 40 వేల పేజీల రిప్లై.. ఏకంగా ట్రక్కులోనే.. -
నష్టాల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు
బ్యాంకాక్: ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ చైనా జూలై పారిశ్రామికోత్పత్తి, రిటైల్ విక్రయ గణాంకాలు నిరాశపరచడంతో సోమవారం ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. చైనా ఎక్సే్చంజీ షాంఘై సూచీ ఒక పాయింటు స్వల్ప నష్టపోయి 3,276 వద్ద ఫ్లాటుగా ముగిసింది. సింగపూర్, ఇండోనేషియా మార్కెట్లు సైతం 0.50–0.20% మధ్య నష్టపోయాయి. తైవాన్, దక్షిణ కొరియా, థాయిలాండ్ అతి స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. కాగా జపాన్ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ నికాయ్ ఒకశాతం లాభపడి ఏడు నెలల గరిష్టం 28,871 స్థాయి వద్ద స్థిరపడింది. కోవిడ్ ఆంక్షల సడలింపుతో రెండో క్వార్టర్ నుంచి తమ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని అక్కడి అధికార వర్గాల ప్రకటన మార్కెట్ ర్యాలీకి కారణమైంది. చైనా ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్నట్లు సంకేతాలు రావడంతో యూరప్ మార్కెట్లు సైతం బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. ఫ్రాన్స్, జర్మన్ దేశాల స్టాక్ సూచీలు 0.14–0.16 % మధ్య నష్టపోయాయి. బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్టీయస్సీ పావుశాతం పతమైంది. ఆర్థిక అగ్రరాజ్యం అమెరికా మార్కెట్లు ఈ వారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. క్రూడాయిల్ ధరల పతనం, ఆర్థిక మాంద్య భయాలతో పాటు నాలుగు వారాల వరుస ర్యాలీ నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు. -
‘వివక్ష లేని ఆరోగ్య ప్రపంచం నిర్మిద్దాం’
అమ్మ కంటి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లమంది.టైమ్ దొరకట్లేదు.భార్య థైరాయిడ్ డౌట్ ఉందని తోడు రమ్మంది.టైమ్ ఉండట్లేదు. కూతురు కళ్ల కింద చారలు వచ్చాయని బెంగ పెట్టుకుంది. అదేమైనా సమస్య. తర్వాత చూద్దాం. సొంత అక్క... తమ్ముడూ కొంచెం గుండె పరీక్ష చేయించరా అనంటే ఎప్పుడు వీలు చిక్కింది కనుక. నాన్నకు, కొడుక్కు, భర్తకు ఆరోగ్య సమస్య వస్తే టైమ్ దొరికినంత సులువుగా ఇంట్లో స్త్రీలకు సమస్య వస్తే టైమ్ దొరకదు. ప్రపంచ ఆరోగ్య దినం నేడు. ఈ ప్రపంచం సగం స్త్రీలది. వారి ఆరోగ్యాన్ని పట్టించుకుంటున్నామా మనం? ‘టాబ్లెట్ వేసుకొని పడుకో’ అని ఇంట్లోని స్త్రీలకు చెప్పడం సులభం. ‘డాక్టర్ దగ్గరకు వెళ్దాం పద’ అని అనడం కష్టం. డాక్టర్ దగ్గరకు అయితే వాళ్లే వెళ్లాలి. లేదంటే ఇంట్లోనే ఉండిపోవాలి. పురుషులు మాత్రం తోడు వెళ్లరు. తోడు వారు స్వయంగా చూపించుకోలేక కాదు. ‘నా తోడు నా కుటుంబం ఉంది’ అని అనిపించడం ముఖ్యం. కుటుంబం మీద పురుషుడి నిర్ణయాధికారం ఉండటం వల్ల స్త్రీ ఆరోగ్యం మీద కూడా అతడిదే నిర్ణయాధికారం అవుతుంది. ‘సంప్రదాయ భావధార’ ప్రకారం కూడా ఇంట్లో పురుషుడి అనారోగ్యానికి ఎంతైన ఖర్చు చేయవచ్చు. స్త్రీ అనారోగ్యానికి ఖర్చయితే ‘అనవసర ఖర్చు వచ్చి పడింది’ అని చికాకు. ఈ ప్రపంచంలో ఆరోగ్యాన్ని పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. మన ఇళ్లల్లో అది స్త్రీలకు ఎంత ఉంది? ‘వివక్ష లేని ఆరోగ్య ప్రపంచం’ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) 2021 సంవత్సరానికి ‘ప్రపంచ ఆరోగ్య దినం’కు సంబంధించిన ‘వివక్ష లేని ఆరోగ్య ప్రపంచం నిర్మిద్దాం’ అనే నినాదాన్ని ఇచ్చింది. వివక్ష లేని అంటే? పేదవాళ్లు కావడం వల్ల, బాధిత కులాలు కావడం వల్ల, ఫలానా మతం వారు కావడం వల్ల, ఫలానా దేశంలో ప్రాంతంలో నివహించడం వల్ల వారు ఆరోగ్యానికి యోగ్యులు కారు అని అనుకోవడం. లేదా వారు ఈ రోగాలకు తగినవారే అని అనుకోవడం. వీళ్ల కంటే ముఖ్యం వివక్ష అంటే ‘స్త్రీలకు ఆరోగ్యం గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు’ అని భావించడం. స్త్రీల ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయడం. ఆర్థికంగా పురుషుడి మీద ఆధారపడే వ్యవస్థను స్త్రీకి కల్పించి తన ఆరోగ్య ఖర్చుల కోసం కూడా అతడి మీద ఆధారపడేలా చేయడం వల్ల పురుషుడి (ఇంటి పెద్ద) అంగీకార అనంగీకారాలు స్త్రీ ఆరోగ్యానికి కీలకంగా మారాయి. ‘ఏమంటాడో’, ‘ఇప్పుడు చెప్పడం అవసరమా’, ‘తర్వాత చెబుదాంలే’, ‘చెప్పినా పట్టించుకోడు’ వంటి స్వీయ సంశయాల కొద్దీ స్త్రీల తమ అనారోగ్యాలను ముదరబెట్టుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. సూపర్‌మామ్ సిండ్రోమ్ ప్రసిద్ధ రచయిత్రి పి.సత్యవతి ‘సూపర్‌మామ్ సిండ్రోమ్’ అనే కథ రాశారు. అందులో ఒక అరవై ఏళ్ల స్త్రీ మరణిస్తుంది. కాని మరణించిన మరుక్షణం ఆమె శరీరం అంతా మందు బిళ్లల మయంగా మారిపోతుంది. శరీరం ఉండదు... అన్నీ మందు బిళ్లలే. ఇన్ని మందుబిళ్లల మయం ఎందుకయ్యింది ఆమె? పిరియడ్స్ టయానికి రావాలని, పిరియడ్స్ టయానికి రాకూడదని, మొటిమలు నివారించాలని, జుట్టు పెరగాలని, పెళ్లయ్యాక సంతానం నిరోధించాలని, సంతానం కలగాలని, ఇంటి పనికి ఓపిక తెచ్చుకోవాలని, నిద్ర సరిగ్గా పట్టాలని, తెల్లారే లేవడానికి నిద్ర అసలు పట్టకూడదని, గర్భాశయంలో సమస్యలకు, ఒత్తిడి వల్ల వచ్చిన బి.పికి, సుగర్‌కు, ఇంటి పని ఆఫీస్ పని చేయలేక వచ్చిన డిప్రెషన్‌కు... ఇంకా అనంతానంత సమస్యలకు ఆమె బిళ్లలు మింగీ మింగీ ఈ పరిస్థితికి వచ్చిందని అబ్సర్డ్స్గా కథ చెప్పడం అది. తమ సమస్యలకు డాక్టర్ దగ్గరకు వెళ్లడం కంటే సొంత వైద్యం చేసుకునే స్త్రీలు ఎక్కువ మన దేశంలో. వారు డాక్టర్ దగ్గరకు వెళ్లి తమ సమస్య నుంచి బయటపడే హక్కు ఉంది అని అనుకునే సహకరిస్తున్నాడా పురుషుడు? కాసింత ప్రేమ... ఎంతో ఆప్యాయత మందు కంటే ఒక మంచి మాట ఏ మనిషికైనా ఉపయోగపడుతుంది. ‘ఎలా ఉన్నావమ్మా’, ‘ఆరోగ్యం ఎలా ఉంది’, ‘ఏంటలా ఉన్నావు... ఏమైనా సాయం కావాలా’, ‘తలనొప్పిగా ఉందా టీ పెట్టనా’... లాంటి చిన్న చిన్న మాటలు కూడా భర్తలు, కుమారులు మాట్లాడని ఇళ్లు ఉన్నాయి. ఉండటం ‘నార్మల్’ అనుకునే వ్యవస్థా ఉంది. కాని ఒక్క మాట మాట్లాడితే అదే స్త్రీలకు సగం ఆరోగ్యం అని ఎవరూ అనుకోరు. ప్రతి సంవత్సరం కంప్లీట్ బాడీ చెకప్ చేయించుకునే భర్త భార్యను కూడా అందుకు ప్రోత్సహిస్తున్నాడా... చేయించుకోవాలని భార్య కూడా అనుకుంటూ ఉందా? చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తిండి ఎవరిది? ‘తిండి కలిగితే కండ కలదోయ్’ అన్నాడు కవి. ఈ కండ పురుషుడికే. స్త్రీకి కాదు. ఉదయాన్నే లేచి వాకింగ్‌కు వెళ్లడం, జిమ్‌లో చేరడం, బజారు లో నచ్చింది తినడం పురుషుడి వంతు. ఉదయాన్నే నాష్టా చేయడంలో బిజీ అయ్యి, ఇంటి పనుల్లో మునిగిపోయి, ప్రత్యేకంగా ఫలానాది నా కోసం ఏం ఒండుకుని తింటాంలే అని అందరికీ వొండింది, అందరూ వొదిలిపెట్టింది తినడం స్త్రీ వంతుగా ఉందంటే అది కాదనలేని సత్యం. స్త్రీల పుష్టికి ప్రత్యేకంగా పౌడర్లు, టానిక్కులు, విటమిన్ టాబ్లెట్లు, పండ్లు, వారికి ఇష్టమైన ఆహారమూ తెచ్చి పెట్టే సందర్భాలు ఎన్ని ఉన్నాయో గమనించుకోవాలి. ‘నాకు ఫలానాది తినాలని ఉంది’ అని స్త్రీ చెప్పే పరిస్థితి కొన్ని ఇళ్లల్లో ఉండదు. ఉద్యోగం చేసే స్త్రీలు కూడా తాము తాగే సోడాకు భర్తకు లెక్క చెప్పే పరిస్థితి ఉందని అంగీకరించడానికి సిగ్గు పడాల్సిన పని లేదు. వివక్ష లేని ఆరోగ్య ప్రపంచం నిర్మిద్దాం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతున్న మాట తక్కిన ప్రపంచం సంగతి ఎలా ఉన్నా ఇంటినే లోకంగా భావించే స్త్రీల వైపు అందరం దృష్టి పెట్టాల్సిన అక్కరను గుర్తు చేస్తోంది. ఇవాళైనా విందామా? – సాక్షి ఫ్యామిలీ -
కష్టాలు.. పంచుకుంటే పెరుగుతాయట!
దగ్గర వారితో కష్టాలను పంచుకుంటేనే కాసింత ఉపశమనం కలుగుతుందనేది ఇప్పటి వరకు అందరూ నమ్మే సంగతి. అయితే, ఒక తాజా పరిశోధన ఇందుకు పూర్తి విరుద్ధమైన వాస్తవాన్ని బయటపెట్టింది. కష్టాలను, సమస్యలను ఇతరులతో పంచుకుంటే ఉపశమనం కలగడం కంటే, మానసిక ఆందోళన, దిగులు పెరిగి పరిస్థితి మరింత జటిలమవుతుందని బ్రిటిష్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ లాంకషైర్‌కు చెందిన మానసిక చికిత్స నిపుణులు ఈ అంశంపై విస్తృత పరిశోధన నిర్వహించారు. సమస్యలకు స్పందించి సహాయానికి, సమస్య నుంచి త్వరగా బయటపెట్టే సలహాలు ఇచ్చేవారికి సమస్యలు వెల్లడించడంలో పొరపాటు లేదని, అయితే, వినడానికి ఎవరో ఒకరు దొరికారు కదా అని అదే పనిగా సమస్యల గురించి చెప్పుకుంటూ పోతే ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా, మానసిక ఆందోళన మరింత పెరుగుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఏదైనా సమస్యల ఎదురైనప్పుడు ఆత్మీయులతో చెప్పుకుంటే, వారి నుంచి ఏదో ఒక పరిష్కారం లభిస్తుందని చాలామంది ఆశిస్తారని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ రాబిన్ బెయిలీ చెబుతున్నారు. అయితే, సమస్యలను వినేవాళ్లలో చాలా కొద్దిమంది మాత్రమే పరిష్కారానికి సహకరిస్తారని, మిగిలిన వాళ్లు ఊరకే వింటూ జాలి కురిపిస్తారని, దీని వల్ల సమస్యల్లో చిక్కుకున్న వారి పరిస్థితి మరింత దిగజారుతుందని వివరిస్తున్నారు. -
డిప్రెషన్‌ను ప్రతిబింబించే ఇన్‌స్ట్రాగ్రామ్ ఫిల్టర్
ఇన్‌స్ట్రాగ్రామ్ ఫిల్టర్ మీరు గ్రహించిన దానికంటే ఎక్కువగానే మీ మానసిక ఆరోగ్యం గురించి తెలుపుతుందట. ఇన్‌స్ట్రాగ్రామ్ ఫోటోలతో యూజర్ల డిప్రెషన్‌ను విశ్లేషించవ్చని రీసెర్చర్లు కనుగొన్నారు. పోస్టు చేసే ఫోటోల లక్షణాలు ప్రకాశవంతం, రంగు బట్టి ఏ యూజర్లు నిరాశలో ఉన్నారో తెలుసుకోవచ్చని హార్వర్డ్, వెర్మాట్ యూనివర్సిటీ రీసెర్చర్లు తెలిపారు. డిప్రెషన్లో లేనివారు వాలెన్సియా ఫిల్టర్‌ను, డిప్రెషన్లో ఉన్నవారు ఇంక్వెల్ ను మోస్ట్ పాపులర్ ఫిల్టర్లుగా వాడుతున్నట్టు రీసెర్చర్లు కనుగొన్నారు. తక్కువ ప్రకాశవంతంగా, సంతృప్తికరంగా లేని ఫోటోలు, డిప్రెషన్ లెవల్స్ అత్యధిక స్థాయిలో ఉన్నట్టు ప్రతిబింబిస్తున్నాయని వెల్లడించారు. కంప్యూటర్ మాంద్యమంలో 70 శాతం మంది డిప్రెషన్లో ఉన్నట్టు రీసెర్చర్లు గుర్తించారు. 166 ఇన్‌స్ట్రామ్ యూజర్లతో సుమారు 13వేల ఫోటోలపై రీసెర్చుర్లు ఈ అనాలిసిస్ చేపట్టారు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను గుర్తిండంలో సోషల్ మీడియా చాలా చౌకగా, తేలికగా ఉపయోగపడుతుందని రీసెర్చర్లు తెలిపారు.