సాక్షి, హైదరాబాద్ : గతంలో సంస్కృతి, విలువలకు పట్టం కట్టేవారు. కానీ, ఇప్పుడు అవార్డులంటే ఓటు బ్యాంకు రాజకీయాల్లా మారాయి అని సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ మార్కెట్ యార్డ్ లో తన కొత్త సినిమా షూటింగ్ అనుమతి కోసం ఆయన గురువారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా నంది అవార్డులు-విమర్శలపై మీడియా ఆయన్ను ప్రశ్నించింది.
రుద్రమదేవి చిత్రానికి అవార్డు రావాల్సింది. సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్ర ఎలాంటిదో.. తెలుగు జాతికి రుద్రమదేవి అలాంటిది. అయినా ఈ మధ్య కమర్షియల్ చిత్రాలకు అవార్డులు ఇవ్వటం ఆనవాయితీగా మారిందని ఆయన అన్నారు. చారిత్రక నేపథ్యంల, కుటుంబ చిత్రాలను కూడా ఆదరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
సాంకేతికంగా, వినోదపరంగా బాహుబలి చిత్రం తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లిందన్న ఆయన... అందుకు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అన్నారు. కానీ, ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయిందని నారాయణమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment