nandi awards
-
సీఎం అపాయింట్మెంట్ కోసం యత్నించాం: టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ దర్శక, నిర్మతా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాము సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని వెల్లడించారు. కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. అందువల్లే సీఎంను కలిసే అవకాశం దక్కలేదని తమ్మారెడ్డి తెలిపారు.గద్దర్ పేరుతో అవార్డ్స్ తీసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కోసం రెండు, మూడుసార్లు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. మీరు ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిస్ కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. సీఎం రేవంత్ రెడ్డికాగా.. అంతకుముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని.. గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులని ప్రకటించామని, కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. -
టాలీవుడ్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి.. సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా)ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని.. గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులని ప్రకటించామని, కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడి సెంటిమెంట్.. పాత భవనానికి రూ. 37 కోట్లు!) -
Gaddar Awards: నంది అవార్డు ఇక గద్దర్ అవార్డు
హైదరాబాద్, సాక్షి: కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా పేరు మారుస్తూ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించనుంది. ఇక నుంచి కవులు కళాకారులకు నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు ఇస్తాం అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్వయంగా తెలియజేశారు. బుధవారం(జనవరి 31) గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఇకపై గద్దరన్న పేరిట అవార్డులు ఇస్తాం. అర్హులైన కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఈ అవార్డులు ఇస్తాం. వచ్చే ఏడాది గద్దరన్న జయంతి నుంచి ఈ అవార్డుల ప్రదానం ఉంటుంది. త్వరలోనే జీవో రిలీజ్ చేస్తాం అని ప్రకటించారాయన. ‘‘నంది అవార్డులు పునరుద్ధరించాలని సినిమా వాళ్లు అడిగారు. నంది అవార్డులు కాదు.. మా ప్రభుత్వం కచ్చితంగా అవార్డులు ఇస్తుంది. గద్దర్ అవార్డుల పేరుతో పురస్కారాలు ఇస్తాం. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఇచ్చే అధికారిక అవార్డులకు గద్దర్ అవార్డు ఇస్తాం. ఇదే శాసనం.. నా మాటే జీవో’’ అని సీఎం రేవంత్ అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక నుంచి ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహ ఏర్పాటునకు కృషి చేస్తామని రేవంత్ ప్రకటించారు. మరోవైపు తెల్లపూర్(సంగారెడ్డి) మున్సిపాలిటీలో గద్దర్ విగ్రహ(తొలి!) ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. -
Nandi Drama Festivals 2023 Pics: గుంటూరులో ఘనంగా ముగిసిన నంది నాటకోత్సవాలు (ఫొటోలు)
-
ఘనంగా నంది బహుమతుల కార్యక్రమం.. ఎన్టీఆర్, వైఎస్ఆర్ అవార్డ్స్ వారికే!
ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నగరంలో నాటకోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సామాజిక సమస్యలపై ఎక్కుపెట్టిన చైతన్యాస్త్రాలుగా ఉన్న నాటికలు, నాటకాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి ప్రదర్శనలోనూ నటీనటుల నటన ప్రేక్షకుల మనసులను హత్తుకుంటున్నాయి. నంది నాటక బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టివి, నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డితో పాటు 2011 నందమూరి తారక రామారావు రంగస్థలం పురస్కార గ్రహీత KST సాయి ఈ కార్యక్రమానికి హజరయ్యారు. ఈ నంది నాటక బహుమతుల కార్యక్రమంలో పోసాని మురళీకృష్ణ ఇలా మాట్లాడారు. ' ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాకు సమస్ధ చైర్మన్‌గా పదవి ఇచ్చారు. కానీ నేను మూడు నెలలు పాటు ఆయనకు కనిపించకుండా తిరుగుతూనే ఉన్నాను. ముఖ్యమంత్రి జగన్ గారు తరువాత నన్ను పిలిపించుకుని, కలను కాపాడాల్సిన బాధ్యత నీకు అప్పగించాను దాన్ని నువ్వు నిర్వర్తించాలని చెప్పారు. దీంతో నేను నిరంతరం నా కార్యచరణ కొనసాగుతుంది. ఈ క్రమంలో నంది నాటకోత్సవానికి నిష్ణాతులైన న్యాయ నిర్ణీతలను ఎంపిక చేశాం. ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా 87 మంది న్యాయ నిర్ణీతల్ని ఎంపిక చేశాం. నంది నాటకాల ఎంపిక విషయంలో కులం, మతం, ప్రాంతం వంటి సిఫార్సులకు తావులేదు. ఎక్కడైనా పొరపాటు ఉంటే నా చొక్కా పట్టుకుని నిలదీయండి. అని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు. మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు పలు వ్యాఖ్యలు చేశారు.' గుంటూరులో ఏడు రోజుల నుంచి నంది నాటకోత్సవాలు జరుగుతున్నాయి. నాటకం అనేది చాలా కష్టమైన ప్రక్రియ. నాటకం సజీవమైనది. సినిమాల్లో కన్నా నాటకాల్లో నటించడం చాలా కష్టం. సినిమాల్లో టేకులు తీసుకోవచ్చు కానీ నాటకాల్లో అలాంటి పరిస్థితి ఉండదు. సినిమాల్లో టీవీల్లో నటించిన వారు బాగా డబ్బు సంపాదించిన వాళ్లు చాలామంది ఉన్నారు. కానీ నాటక రంగంలో డబ్బులు పోగొట్టుకున్న నటీనటులే ఎక్కువగా ఉన్నారు. నాటక రంగ కళాకారులకు డబ్బులు ముఖ్యం కాదు ప్రేక్షకులకు కొట్టే చప్పట్లే వారికి గౌరవం. నాటక రంగానికి ప్రాముఖ్యత చాలా ఉంది దానిని మనం కాపాడుకోవాలి. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు' తెలిపారు. ప్రముఖ సంగీత నవధానం సృష్టికర్త మేగడ రామలింగ స్వామికి 2022 నందమూరి తారక రామారావు రంగస్థలం పురస్కారం దక్కింది. ఆయనకు లక్షన్నర నగదు బహుమతితో పాటు అవార్డు దక్కింది. ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ అధ్యక్షులు దంటు భాస్కరరావుకు 2022 డాక్టర్ వైఎస్ఆర్ రంగస్థలం పురస్కారం దక్కింది. ఆయనకు అవార్డుతో పాటు రూ. 5 లక్షల నగదు బహుమతి దక్కడం విశేషం ది యంగ్మెన్స్ హేపీ క్లబ్ గురించి తెలుసా? చితామణి, భక్తరామదాసు, కృష్ణ లీల, లోబి, డాటర్, నాటకాలు ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాలలో ప్రదర్శనలిచ్చి ఎనలేని కీర్తిని పొందింది. ఎస్వీ రంగారావు, రేలంగి వెంకట్రావు, అంజనీదేవి, సూర్యకాంతం వంటి నటులు ది యంగ్మ్న్స్ క్లబ్ నుంచి వచ్చినవారే. క్లబ్ వృద్ధ కళాకారులకు ఆర్థిక సహాకారం కూడా అందజేస్తుంది. రాజమహేంద్రవరం కేంద్రంగా తెలుగు రాష్ట్రమంతటా నాటకోద్యమం జరుగుతున్న తరుణంలో ఆ సంస్కృతికోత్సవంలో భాగంగా కాకినాడ నగరంలో 1913లో పల్లె హనుమంతరావు, యరగల సత్తిరాజు యువజన ఆనంద సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘాన్ని 1916లో యంగ్మ్న్స్ హాపీ క్లబ్‌గా దంటూ సూర్యారావు, గండికోట జోగినాధం, మాదిరెడ్డి రామానుజల నాయుడు, ఖాశిం సాహెబ్ మార్పు చేశారు. కళాకారులు, కళాభిమానుల శ్రమదానంతో ది యంగ్మెన్స్ హాపీ క్లబ్ ప్రదర్శనశాల నిర్మాణం జరిగింది. -
అర్హులకే నంది అవార్డులు.. ఎవరికీ అన్యాయం జరగదు: పోసాని
సాక్షి, హైదరాబాద్: నంది అవార్డులు అర్హులకే వస్తాయని.. ఎవరికీ అన్యాయం జరగదని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అర్హులైన నటులను గుర్తించి గౌరవిస్తామని, నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండదని ఆయన స్పష్టం చేశారు. పారదర్శకంగా అవార్డుల ఎంపిక ఉంటుందన్నారు. సీఎం జగన్ నాపై గొప్ప బాధ్యత పెట్టారు. నంది నాటకోత్సవాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. అర్హులైన వారికి అవార్డులిచ్చి సత్కరిస్తాం’’ అని పోసాని కృష్ణమురళి వెల్లడించారు. ఇదీ చదవండి: ఏపీలో నేరాలు తగ్గాయి: డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి -
ఈనెల 23న నాటకరంగ నంది అవార్డులు అందిస్తున్నాం: పోసాని
-
పారదర్శకంగా నాటక రంగ నంది అవార్డుల ఎంపిక: పోసాని
సాక్షి, అమరావతి: ఈ నెల 23న నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నామని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేపడుతున్నామన్నారు. ప్రముఖ నాటకరంగ వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నంది అవార్డుల కోసం 115 దరఖాస్తులు వచ్చాయి. అందులో 38 మందిని ఎంపిక చేశారు. 5 కేటగిరీలలో మొత్తం 74 అవార్డులు ఇస్తాం. ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సులకు తావులేదు’’ అని పోసాని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం: సీఎం జగన్ -
నంది అవార్డులకు 38 మంది ఎంపిక.. వారిద్దరి పేర్లతో అవార్డ్స్: పోసాని
ఏపీలో నంది అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి రంగం సిద్ధమైంది. ఈ అవార్డుల బాధ్యతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించారని, ఉత్తములు, అర్హులకు మాత్రమే ఆ అవార్డులను అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఒకేసారి డ్రామా, టీవీ, సినిమా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్యం కాదని, మొదటగా పద్యనాటకాలకు అందించి, ఆ తర్వాత మిగతా రంగాలకు అందిస్తామని ఆయన గతంలోనే వెల్లడించారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) అందులో భాగంగా తాజాగా నంది అవార్డుల పోటీలలో 38 మంది ఎంపికయ్యారని పోసాని కృష్ణమురళి తెలిపారు. వీరికి ఫైనల్ పోటీలను గుంటూరులో నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. అవార్డుల ఎంపికలో ఎలాంటి విమర్శలకు తావు ఇవ్వకుండా 12 మంది జడ్జిలను నియమించామని ఆయన చెప్పారు. వారందరూ కలిసి 38 మందిని అవార్డుల కోసం ఎంపిక చేశారు. ఈ ఏడాది నుంచి ఎన్టీఆర్ రంగస్థల అవార్డును ఇస్తున్నట్లు పోసాని చెప్పారు. ఆ అవార్డుతో పాటు రూ. 1.5 లక్షలు బహుమానం ఇస్తామన్నారు. వైఎస్సార్ రంగస్థల పురష్కారం కూడా అందిస్తున్నట్లు పోసాని ప్రకటించారు. ఈ అవార్డుతో పాటు రంగస్థల రంగానికి కృషి చేసినందుకు రూ. 5లక్షలు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎం అయ్యాక 2004 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రంగ స్థలాన్ని ప్రోత్సహించారని ఆయన గుర్తుచేశారు. అందుకే ముఖ్యమైన జిల్లాల్లో ఆడిటోరియంలు కట్టించినట్లు చెప్పుకొచ్చారు. నాటక సమాజానికి సాయం చేసినందుకు వైఎస్ఆర్ పేరుతో పురష్కారం ఇస్తున్నట్లు పోసాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న నటులు, సాంకేతిక నిపుణులకు త్వరలోనే గుర్తింపు కార్డులు ఇస్తాం. సినిమా ఇండస్ట్రీలో చాలా పేద ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. సినీ నటులందరికి గుర్తింపు కార్డులు ఇస్తాం. వారితో పాటు సాంకేతిక నిపుణులకు కూడా గుర్తింపు కార్డులు ఇస్తాం. ఆన్లైన్లో నటుల వివరాలు అన్ని పొందుపరుస్తాం. ఉచితంగానే నటులకు గుర్తింపు కార్డులు జారీ చేస్తాం. షూటింగ్‌లకు వెళ్లే సినీ నటుల కోసం బస్సు రాయితీ ప్రతిపాదనపై చర్చిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా షూటింగ్ ఉచితంగా చేసుకోవచ్చు. స్టూడియోలు కడితే వారికి స్థలాలు ఇచ్చి సహకరిస్తామని సీఎం జగన్ చెప్పారు. సినిమా రంగం అభివృద్ది కోసం సీఎం జగన్ ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు.’అని పోసాని అన్నారు. -
పాటల ప్రపంచంలో రారాజు బాలసుబ్రహ్మణ్యం తృతీయ వర్ధంతి
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. సంగీత ప్రపంచంలో రారాజుగా వెలుగొందారు. పాటల పల్లకిలో నెలరాజుగా గుర్తింపు పొందారు. వేల పాటలు పాడి తెలుగువారికి ఎనలేని గుర్తింపు తెచ్చారు. అమరగాయకుడిగా చరిత్రలో నిలిచిపోయారు. బాలు లేని పాటల ప్రపంచంలో ఎంతోమంది యువ గాయకులు ఆయన బాటలో ముందుకు నడుస్తున్నారు. ఆయన స్పూర్తితో దశదిశలా సంగీత పరిమళాలను విరజిమ్ముతున్నారు. అర్ధ శతాబ్దకాలం పాటు తన నవరస గాత్రంతో భారతీయ సినీ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వేశారు. ఎన్నో పాటలతో మనల్ని ఉర్రూతలూగించిన ఈ 'గాన చంద్రుడు' మనల్ని విడిచిపెట్టి నేటికి మూడేళ్లు. 2020 సెప్టెంబర్ 25న ఆయన కరోనా మహమ్మారి వల్ల మనకు దూరం అయ్యారు. నేడు ఆయన తృతీయ వర్ధంతి సందర్భంగా సాక్షి నుంచి ప్రత్యేక కథనం. తండ్రే తొలి గురువు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 1946 జూన్ 4న నెల్లూరు జిల్లా కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. బాలు అసలు పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో అలా బాలుకి చిన్నతనం నుంచే సంగీతం మీద ఆసక్తి పెరిగింది. దీంతో తండ్రే ఆయనకు తొలి గురువు అయ్యారు. ప్రాథమిక విద్యను చిత్తూరు జిల్లా నగరిలో తన మేనమామ శ్రీనివాసరావు ఇంట పూర్తి చేసిన బాలు హైస్కూల్ విద్యను మాత్రం శ్రీకాళహస్తి బోర్డు స్కూలులో కొనసాగించారు. అప్పట్లో మన బాలు చదువు, ఆటల్లో ప్రథమ స్థానంలో ఉండేవారు. అనంతపురంలో ఇంజనీరింగు సీటు వచ్చినా.. శ్రీకాళహస్తిలో పి.యు.సి పూర్తి చేసుకుని నెల్లూరు వెళ్లిన బాలు అక్కడ కొంతమంది మిత్రులతో కలిసి ఒక ఆర్కెస్ట్రా బృందాన్ని ఏర్పాటు చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడు. తర్వాత అనంతపురంలో ఇంజనీరింగులో సీటు వచ్చింది. కానీ ఆయనకు అక్కడి వాతావరణం నచ్చక తిరిగి వచ్చేశాడు. మద్రాసు వెళ్ళి ఇంజనీరింగుకి ప్రత్యామ్నాయమైన ఎ.ఎం.ఐ.ఇ కోర్సులో చేరాడు. సాంబమూర్తికి తన కుమారుడు ఇంజనీరు కావాలని కోరిక. తండ్రి కోరిక ననుసరించి బాలసుబ్రహ్మణ్యం కూడా చదువుతో పాటు సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. అలా ఇంజినీరింగ్ కోర్సు చదువుతుండగానే బాలుకి సినిమాల్లో పాడే అవకాశం వచ్చింది. 'మహమ్మద్ బిన్ తుగ్లక్' అనే సినిమాలో రమాప్రభ పుట్టినరోజు వేడుకలో 'హ్యాపీ బర్త్ డే టు యూ' అంటూ పాటపాడుతూ తొలిసారి బాలు వెండితెరమీద మెరిశారు. పలు వేదికలపై కూడా ఆ కాలం లోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు. బాలు తొలిపాట ఈ సినిమాలోనే 1964లో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ నిర్వహించిన లలిత సంగీత పోటీల్లో బాలుకి ప్రథమ బహుమతి లభించింది. ఆ పోటీకి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తి, పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల వెంకటేశ్వరరావులు న్యాయనిర్ణేతలు. అదే పోటీలో ఎస్. పి. కోదండపాణి బాలు ప్రతిభను గమనించారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తానని బాలుకు మాట ఇచ్చారు. అలా ఎ.ఎం.ఐ.ఇ రెండో సంవత్సరంలో ఉండగా బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. 1966లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించారు బాలు. 'ఏమి ఈ వింత మోహం' అనే పల్లవి గల ఈ పాటను ఆయన పి. సుశీల, కల్యాణం రఘురామయ్య, పి. బి. శ్రీనివాస్‌లతో కలిసి పాడారు. అలా 1967 జూన్ 2న విడుదలైన ఈ సినిమా చలనచిత్ర సంగీత ప్రపంచంలో గానగంధర్వుడు ‘బాలు’ ప్రభంజనానికి తెరలేపింది. ఈ చిత్రానికి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకత్వము వహించారు. కోదండపాణి, బాలు పాడిన మొదటి పాటను రికార్డిస్టు స్వామినాథన్‌తో చెప్పి చెరిపివేయకుండా అలాగే ఉంచి తన దగ్గరకు వచ్చిన సంగీత దర్శకులను అది వినిపించి బాలుకు అవకాశాలు ఇప్పించేవారు. అలా తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్‌కు 'కోదండపాణి ఆడియో ల్యాబ్స్' అని అతని పేరే పెట్టుకున్నారు బాలు. సంగీతం ఎవరి దగ్గరా నేర్చుకోకపోయినా రాగ తాళాల జ్ఞానం, సంగీత పరిజ్ఞానం పుష్కలంగా ఉండటంతో ట్యూను ఒకసారి వింటే యథాతథంగా పాడగలిగే టాలెంట్ బాలుకి సొంతం. ప్రపంచంలోనే అరుదయిన రికార్డు సృష్టించిన మన బాలు 1969 నుంచి బాలుకు గాయకుడిగా పుష్కలంగా అవకాశాలు రాసాగాయి. ఆయన పాటలు ముఖ్యంగా ఆ నాటి యువతను ఆకట్టుకున్నాయి. చాలామంది నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా అతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాధుర్యాన్ని గమనించి అతను చేసే ఉచ్చారణ అతని పాటను పండిత పామరులకి చేరువ చేసింది. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ఏక్ దుజే కేలియే లాంటి హిందీ చిత్రాలకు అతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచం లోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించారు. డబ్బింగ్ చెప్పడంలోనూ బాలుకు సాటిలేరు కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన తమిళ అనువాద చిత్రం మన్మధ లీలతో సంగీత దర్శకుడు కె.చక్రవర్తి ప్రోద్బలంతో అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా బాలు మారారు. అందులో కమల్ హాసన్‌కు చక్రవర్తి డబ్బింగ్ చెబితే కమల్ హాసన్ ఆఫీసులో పనిచేసే ఒక క్యారెక్టర్‌కు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పారు. తర్వాత ఆయన కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. పసివాడిప్రాణం చిత్రంలో రఘు వరన్కు చెప్పిన డబ్బింగ్ సిసినిమాకే హైలెట్‌గా నిలిచింది. అలాగే తమిళం నుంచి తెలుగులోకి అనువాదమయ్యే కమల్ హాసన్ చిత్రాలన్నింటికి ఈయనే డబ్బింగ్ చెబుతుండేవారు. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది. అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన గాంధీ చిత్రంలో గాంధీ పాత్రధారియైన బెన్ కింగ్స్లేకు తెలుగులో బాలు డబ్బింగ్ చెప్పడం విశేషం. నటుడిగా చివరి చిత్రం ఇదే 1969లో వచ్చిన పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించారు. 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో బాలు కథానాయకుడినా నటించారు. ఇందులో రాధిక కథానాయిక. ఈ సినిమా తెలుగులో ఓ పాపా లాలి అనే పేరుతో అనువాదం అయింది. ఆయన నటించిన వాటిలో ఎక్కువగా అతిథిగా పాత్రలైనా అన్నీ గుర్తుండిపోయేవే. ప్రేమికుడు, రక్షకుడు, పవిత్రబంధం, మిథునం తదితర చిత్రాల్లో ఆయన నటనతోనూ మెప్పించారు. చివరిగా నాగార్జున-నాని కథానాయకులుగా నటించిన ‘దేవదాస్’లో మెరిశారు. ఎప్పటికీ చెరగని రికార్డులతో పాటు మధుర స్మృతులు ► భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాలైన ‘పద్మభూషణ్’, ‘పద్మశ్రీ’ అవార్డులను బాలు అందుకున్నారు. ► ‘శంకారభరణం’(1979) చిత్రానికి గానూ తొలిసారి జాతీయ అవార్డును దక్కించుకున్న బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు ఉన్నాయి. ► ‘మైనే ప్యార్‌కియా’ చిత్రానికి గానూ తొలిసారి ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న బాలు ఖాతాలో మొత్తం 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ► 29 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. ► 2016లో సైమా లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును ఆయన సొంతం చేసుకున్నారు. ► అటెన్ బరో దర్శకత్వంలో వచ్చిన ‘గాంధీ’ చిత్రంలో టైటిల్ రోల్ పోషించిన కింగ్ బెన్‌స్లేకు ఎస్పీబీనే డబ్బింగ్ చెప్పారు. ► 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 16 భాషలలో 40 వేలకు పైగా పాటలతో మెప్పించిన బాలు ► లిపి లేని భాషలు కొంకణి, తులులోనూ పాటలు పాడిన బాలు. ► ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తొలిపాట పాడింది (1966)లో 'శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న కథ' ► 'శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న' చిత్రానికి గాను తన మొదటి రెమ్యురేషన్ రూ.300 ఇచ్చారు. ఆ రోజుల్లో ఘంటసాలగారు 500 రూపాయలు తీసుకునేవారు. ఆ సినిమా నిర్మాత హాస్యనటుడు పద్మనాభం కావడం విశేషం. ► 'మాటే రాని చిన్నదాని కళ్లు పలికే ఊసులు' అంటూ గుక్కతిప్పుకోకుండా రాధికకు ప్రేమ కవిత్వం వినిపిస్తూ కనిపించే బాలసుబ్రహ్మణ్యాన్ని ఇప్పటికీ మరిచిపోలేరు ఆయన అభిమానులు. ► ప్రేమికుడులో ప్రభుదేవాతో పోటీపడి స్టైలిష్ స్టెప్లు వేశారు బాలసుబ్రహ్మణ్యం. ''అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే'' అనే పాటలో కనిపించిన బాలు అందులో కొడుకు పాత్రలో ఉన్న ప్రభుదేవాతో సమానంగా డ్యాన్స్ చేశారు. సాక్షి- వెబ్ డెస్క్ ప్రత్యేకం -
మేమొచ్చాక నందికి బదులుగా గద్దర్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు అందజేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టిస్తామని వెల్లడించారు. శనివారం ఇక్కడ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగిన కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీ పరిస్థితి ఏంటో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అడిగితే చెబుతారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎంపీల్లో సగం మంది బయటి నుంచి వచ్చిన వాళ్లేనని, వారికి నమస్తే... సదావత్సలే అంటే ఏంటో కూడా తెలియదని అన్నారు. రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డిలకు దీని గురించి తెలుసా అని ప్రశ్నించారు. తననుద్దేశించి తెలంగాణకు పట్టిన వ్యాధిగా అభివర్ణించిన మంత్రి కేటీఆర్‌కు వ్యాధికి, వ్యాధులకు తేడా తెలియదని అన్నారు. తాను ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారని చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీలు మోసం చేశాయని అంటున్నారని, ఆ రెండు పార్టీల్లో కేసీఆర్ ఉన్నారని, తెలంగాణకు ఏ అన్యాయం ఎప్పుడు జరిగినా కేసీఆరే ప్రత్యక్ష ద్రోహి అని విమర్శించారు. తన పార్టీ పేరులోని తెలంగాణ పదం తీసేసి ఆ పేరును హత్య చేసిన కేసీఆర్ తెలంగాణవాది ఎలా అవుతారని ప్రశ్నించారు. సెస్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని, ఆ తర్వాత తాము ప్రజలకు ఏం చేస్తామో కూలంకషంగా వివరిస్తామని రేవంత్ చెప్పారు. -
తప్పుడు ప్రచారం జరుగుతోంది
‘‘తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబరులో దుబాయ్‌లో నిర్వహించాలనుకుంటున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ ఫంక్షన్‌కు, తమకు సంబంధం లేదని, టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదని తెలుగు, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశాయి. ఈ విషయంపై శనివారం టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ స్పందిస్తూ– ‘‘మాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌత్ ఇండియాలోని ఆర్టిస్టులకు అవార్డులు ఇవ్వనున్నాం. దీన్ని కాదనే హక్కు దామోదర ప్రసాద్, సునీల్ నారంగ్‌లకు లేదు. ‘టీఎఫ్‌సీసీ’ పేరుతో ట్రేడ్ మార్క్, టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ రిజిస్ట్రేషన్ చేయించాం. టీఎఫ్‌సీసీ నంది ఈవెంట్స్ పేరుతో దుబాయ్ ప్రభుత్వం నుండి లైసెన్స్ తీసుకున్నాం. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుక జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం టీఎఫ్‌సీసీ నంది అవార్డులకు అనుమతితో కూడిన లెటర్ కూడా ఇచ్చింది’’ అన్నారు. -
టీఎఫ్‌సీసీకి ప్రభుత్వ గుర్తింపు లేదు
‘‘తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్’ (టీఎఫ్‌సీసీ) తెలంగాణ ప్రభుత్వంచే గుర్తింపు పొందలేదు. ఆ ఛాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 24న దుబాయ్‌లో నిర్వహించే నంది అవార్డు వేడుక ఆయన వ్యక్తిగతంతో పాటు ఓ ప్రైవేట్ వేడుక. ఈ నంది అవార్డు వేడుకకు, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి)కు ఎలాంటి సంబంధం లేదు. ఈ వేడుకకి మేం భాగస్వామ్యం వహించం’’ అని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి గౌరవ కార్యదర్శి కేఎల్. దామోదర్ ప్రసాద్, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి కె. అనుపమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి, తెలంగాణ చలన చిత్ర వాణిజ్య మండలి, ఏపీ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద టీఎఫీసీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్నది తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి మాతృసంస్థ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రమే తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన సంస్థలు. 24–09–2023న దుబాయ్‌లో నిర్వహించనున్న టీఎఫ్‌సీసీ నంది అవార్డుల గురించి మా రెండు ఛాంబర్లకు సంబంధం లేదు. ‘నంది’ అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పేటెంట్. నంది పేరును ఉపయోగించడం, అవార్డు వేడుక నిర్వహించడాన్ని ఖండిస్తున్నాం. ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ల వద్ద కూడా టీఎఫ్‌సీసీ నంది అవార్డుల వేడుకకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. -
నంది అవార్డ్స్ వివాదం.. ఆయన మధ్యలోకి ఎంటర్ కావడంతో!
దుబాయిలో జరగనున్న నంది అవార్డుల వేడుకపై తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి(TFCC) కీలక ప్రకటన చేసింది. అది రామకృష్ణ గౌడ్ వ్యక్తిగతం అని, తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. నంది పేరుతో అవార్డులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పుకొచ్చింది. ఈ అవార్డుల పేటెంట్ పూర్తిగా ఏపీ పేరు మీదే ఉందని, దుబాయిలో వేడుకలపై సినిమాటోగ్రఫీ మంత్రులు విచారణ జరపాలని టీఎఫ్‌సీసీ డిమాండ్ చేసింది. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి థ్రిల్లర్ సినిమా.. కాకపోతే!) అలానే నంది పేరుతో ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు ఎలాంటి పురస్కారాలు ఇవ్వకూడదని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆదేశాలు జారీ చేసింది. నంది అవార్డుల పేటెంట్ పూర్తిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ పేరుతోనే ఉంది, అందుకే తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు మాత్రమే ఆ హక్కు ఉందని క్లారిటీ ఇచ్చింది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరుతో ప్రతాని రామకృష్ణగౌడ్ ప్రైవేటు సంస్థగా, వ్యక్తిగతంగా నంది అవార్డులు ఇస్తున్నారు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఈ వేడుకలకు ఫిల్మ్ ఛాంబర్ కు ఎలాంటి సమాచారం లేదని టీఎఫ్‌సీసీ చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: ఒక్క సినిమా.. నాలుగు భాషలు.. ఐదుగురు స్టార్స్!) -
ఉత్తములు, అర్హులకు మాత్రమే నంది అవార్డులు : పోసాని
నంది అవార్డుల బాధ్యతలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అప్పగించారని, ఉత్తములు, అర్హులకు మాత్రమే ఆ అవార్డులను అందిస్తామని ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి అన్నారు. ఒకేసారి డ్రామా, టీవీ, సినిమా రంగాలకు అవార్డులు ఇవ్వడం సాధ్యం కాదని, మొదటగా పద్యనాటకాలకు అందించి, ఆ తర్వాత మిగతా రంగాలకు అందిస్తామని వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలుగు రాష్ట్రాల్లో 1998 నుంచి 2004 వరకు నంది అవార్డులు ఉండేవి. కానీ అవి కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం అయ్యాయి. చంద్రబాబు హయంలో నంది అవార్డులు ఇస్తామని చెప్పి రద్దు చేశారు. ఇప్పుడు సీఎం జగన్ మళ్లీ నందీ అవార్డులు ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ బాధ్యతను నాకు అప్పగించారు. నిజాయితీగా, వివక్ష లేకుండా అర్హులకు మాత్రమే అవార్డులు ఇస్తాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా షూటింగ్ ఉచితంగా చేసుకోవచ్చు. స్టూడియోలు కడితే సహకరిస్తామని సీఎం జగన్ చెప్పారు. సినిమా రంగం అభివృద్ది కోసం సీఎం జగన్ ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు’అని పోసాని అన్నారు. ఎఫ్డీసీ ఎండీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. నాటక రంగానికి నంది అవార్డుల నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామని, దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు ఉంటుందని అన్నారు. ఉప సంహరణకు నెల రోజుల గడువు ఇస్తున్నామన్న ఆయన ఐదు క్యాటగిరీల్లో పోటీలు ఉంటాయని అన్నారు. పద్య, సాంఘిక నాటకాలు, సాంఘిక నాటికలు, పిల్లల నాటకాలు, యువ నాటికలు అన్నీ కలిపి మొత్తం 73 అవార్డులు ఇస్తామని విజయ్ కుమార్ తెలిపారు. -
నంది అవార్డులు.. హీరో వెంకటేశ్ కీలక వ్యాఖ్యలు!
టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేశ్ నంది అవార్డులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అవార్డుల విషయంపై పలువురు సినీ ప్రముఖులు కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నంది అవార్డులపై హీరో వెంకటేష్ స్పందించారు. (ఇది చదవండి: నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి) వెంకటేశ్ మాట్లాడుతూ..'నేను అవార్డుల గురించి ఆలోచించను. ప్రభుత్వం ఇస్తే ఇవ్వొచ్చు ..లేదంటే లేదు..కానీ అవార్డులు మాకు ఎంకరేజ్‌మెంట్‌ను అందిస్తాయి.' అని అన్నారు. కాగా.. వెంకీ ఇటీవలే విడుదలైన సల్మాన్ ఖాన్ చిత్రం కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్ చిత్రంలో ప్రత్యేకపాత్రలో కనిపించారు. అంతకు ముందే రానాతో కలిసి రానానాయుడు అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ ఏడాది సైంధవ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. (ఇది చదవండి: లగ్జరీ కారు కొనుగోలు రామ్ చరణ్ హీరోయిన్.. ధర ఎన్ని కోట్లంటే?) -
నంది అవార్డు ప్రతి ఆర్టిస్ట్ కల
‘‘1964 నుండి నంది అవార్డ్స్ ఇస్తున్నారు. ఆ అవార్డు అందుకోవాలనేది ప్రతి ఆర్టిస్ట్ కల. 7 సంవత్సరాల క్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను తిరిగి ప్రారంభిస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్‌గారికి థ్యాంక్స్. అలాగే సీనియర్ నటుల పేరుతో స్మారక అవార్డ్స్ ఇవ్వడం హర్షించదగ్గ విషయం’’ అని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, నటుడు అలీ అన్నారు. ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ఆగస్టు 12న దుబాయ్‌లో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్‌ను అలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ విడుదల చేశారు. ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సహకారంతో నంది అవార్డ్స్ పంపిణీ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ వేడుకకి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు హాజరవుతారు’’ అన్నారు. -
ఆగస్టులో టీఎఫ్‌సీసీ నంది అవార్డులు
తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఆధ్వర్యంలో ‘టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ వేడుక జరగనుంది. దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఆగస్టు 12న ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జ్యూరీ సభ్యులను సెలెక్ట్ చేసుకున్న సందర్బంగా సోమవారం పాత్రికేయుల సమావేశంలో టీఎఫ్‌సీసీ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ– ‘‘2021, 22 సంవత్సరాల్లో విడుదలైన చిత్రాల వారు ఈ అవార్డుల కోసం టీఎఫ్‌సీసీ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు చివరి తేదీ జూన్ 15. తెలంగాణ ప్రభుత్వం నుండి నంది అవార్డ్స్‌కి సంబంధించిన లెటర్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు సంతకం చేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్ర ప్రభుత్వం సహకారం కూడా కోరనున్నాం. ఆగస్టు 12న దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు ఇవ్వనున్నాం’’ అన్నారు. ‘‘జ్యూరీ కమిటీకి నన్ను చైర్మన్‌గా ఉండమన్నారు. కానీ నేను జ్యూరీ మెంబర్‌గా ఉంటూ సపోర్ట్ చేస్తానని చెప్పాను. తెలంగాణ ప్రభుత్వ సహకారం తీసుకున్నట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది’’ అన్నారు మురళీ మోహన్. సుమన్, బి. గోపాల్ తదితరులు మాట్లాడారు. -
తెలుగు రాష్ట్రాల్లో నంది అవార్డులు ఇవ్వడం లేదంటూ ఇద్దరు నిర్మాతల వ్యాఖ్యలు
-
నంది పురస్కారం లేక ఆరేళ్లు.. ఎక్కువ అవార్డులు ఏ హీరోకో తెలుసా?
మీరు సినిమా బాగా చేశారండి.. పెదాలపై చిన్న చిరునవ్వు.. మీ నటనకు నంది అవార్డు వచ్చిందండి.. గుండె నిండా సంతోషం.. ఈ జీవితానికి ఇంతకంటే ఏం కావాలన్న తన్మయత్వం.. ఇదంతా ఒకప్పటి ముచ్చట. ఇప్పుడు నంది అవార్డులు ఎవరిస్తున్నారని! ఈ అవార్డులు ప్రకటించక ఆరేడేళ్లవుతోంది. నంది పురస్కారాలను ఎవరూ పట్టించుకోవట్లేదని ఇటీవలే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు నిర్మాత ఆది శేషగిరి రావు. నంది అవార్డులకు ప్రాముఖ్యతే లేకుండా పోయిందని బాధపడ్డారు. ఈ క్రమంలో నిర్మాత అశ్వినీదత్ నోరు జారుతూ ఇస్తారులే.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ అవార్డులు అంటూ వెటకారంగా మాట్లాడారు. దీంతో చిర్రెత్తిపోయిన ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన చైర్మన్, నటుడు పోసాని కృష్ణమురళి ఉత్తమ మోసగాడు అవార్డులు మీకే ఇస్తాంలే అని కౌంటరిచ్చాడు. అయినా బాబు హయాంలో కులాలాను బట్టి నంది అవార్డులు ప్రకటించేవారని, నిజాయితీగా అవార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. నిజమే., టీడీపీ హయాంలో నీది ఏ కులం? ఏ ప్రాంతం? నీకు అవార్డు ఇస్తాను.. మరి నాకేటిస్తావు? ఇలా అన్నీ చర్చించుకున్న తర్వాతే నంది ఎవరికి ఇవ్వాలనిపిస్తే వారికే ఇచ్చేవారట. ఈ క్రమంలో కొన్ని అద్భుతం అనిపించిన చిత్రాలను సైతం నిర్దాక్షిణ్యంగా పక్కన పడేసేవారు. దీంతో ఎంతోమంది చిన్నబుచ్చుకునేవారు. వారిలో కొందరే ఆక్రోశం అణుచుకోలేక బయటపడేవారు. అలా రుద్రమదేవి తీసిన గుణశేఖర్, రేసుగుర్రం నిర్మించిన బన్నీ వాసు, డైరెక్టర్ మారుతి సోషల్ మీడియాలో తమ అసహనాన్ని ప్రదర్శించారు కూడా! తెలుగు ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా నంది పురస్కారానికి పేరుంది. అలాంటి నంది పురస్కారాల వేడుక మళ్లీ ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాబట్టి ఓసారి ఈ అవార్డుకు సంబంధించిన విశేషాలను గుర్తు చేసుకుందాం.. ► 1964లో నంది అవార్డుల ప్రదానం మొదలైంది. దాదాపు 50 సంవత్సరాలు ఈ పరంపర కొనసాగింది. 2014, 2015, 2016 సంవత్సరాలకు గానూ 2017లో నంది అవార్డులు ప్రకటించారు. ఆ తర్వాత నంది అవార్డుల ప్రదానంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ► 1964లో ఉత్తమ ఫీచర్ ఫిలింగా డాక్టర్ చక్రవర్తి సినిమా ఎంపికైంది. అప్పుడు కేవలం ఉత్తమ చిత్రం కేటగిరీ మాత్రమే ఉండేది. ► 1977 నుంచి నటీనటులు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు పురస్కారం ఇచ్చే పరంపర మొదలైంది. ► ఎక్కువ నంది అవార్డులు అందుకున్న హీరో నాగార్జున. నటుడిగా నాలుగు, నిర్మాతగా ఐదు నందులు గెలుపొందారు. ► 8 నంది పురస్కారాలతో మహేశ్‌బాబు ఆ తర్వాతి స్థానంలో ఉన్నారు. ►వెంకటేశ్, జగపతి బాబు 7 సార్లు, చిరంజీవి, కమల్ హాసన్, బాలకృష్ణ మూడేసి చొప్పున నందులు పొందారు. ► 2016లో చివరగా జూనియర్ ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్‌గా(నాన్నకు ప్రేమతో) అవార్డు అందుకున్నారు. ► ఉత్తమ గీత రచయితగా సిరివెన్నెల సీతారామశాస్త్రి 11సార్లు నంది అవార్డు అందుకున్నారు. చదవండి: చిన్నవయసులోనే పెళ్లి, కొంతకాలానికే విడాకులు: నటుడు -
నంది అవార్డులు ఎవరు పడితే వారు అడిగితే ఇచ్చేవి కావు: తలసాని
-
నంది అవార్డుల వివాదంపై స్పందించిన మంత్రి తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం తరపున సినీ అవార్డులను వచ్చే ఏడాది నుంచి ప్రకటిస్తామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం దివంగత దాసరి నారాయణరావు 76వ జయంతిని పురస్కరించు కుని మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో ఆయన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ సినీరంగానికి దాసరి చేసిన సేవలను కొని యా డారు. దర్శకుడిగా 150 సినిమాలను తెరకెక్కించి గిన్నిస్‌బుక్ రికార్డును స్వంతం చేసుకున్న ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దాసరి వంటి దర్శక దిగ్గజం మన తెలుగు సినీ పరి శ్రమలో ఉండటం మనందరికీ గర్వకారణమన్నారు. మమ్మల్ని ఎవరూ సంప్రదించలేదు రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నంది అవార్డులు ఎందుకు ఇవ్వట్లేదని కార్యక్రమంలో విలేకరు లు మంత్రి తలసానిని అడిగారు. అవార్డులు ఇవ్వాలని సినీ పరిశ్రమ నుంచి ప్రభుత్వాన్ని ఎవరూ సంప్రదించలేదని మంత్రి బదులిచ్చా రు. కార్యక్రమంలో చిత్రపురి హౌసింగ్ సొసై టీ, 24 క్రాఫ్ట్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్‌కుమార్, సినీ ప్రముఖులు సి.కల్యాణ్, దామోదర ప్రసాద్, ప్రసన్నకుమార్, దర్శ కులు ఎన్.శంకర్, రేలంగి నర్సింహారావు, దాసరి అరుణ్‌కుమార్, ఫిలించాంబర్ అధ్యక్షుడు బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్గా సంయుక్తా మీనన్! -
నీ బతుకేంటో నాకు తెలుసు.. అశ్వనీదత్‌పై పోసాని ఫైర్
ఏపీలో నంది అవార్డులపై చేసిన కామెంట్స్‌పై నటుడు, నిర్మాత, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. అశ్వనీదత్ చేసిన కామెంట్స్‌కు గట్టిగా కౌంటరిచ్చారు. ఉత్తమ రౌడీ, ఉత్తమ గుండా అని కాదు.. ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ మోసగాడు అనే అవార్డులు ఇవ్వాలని చురకలంటించారు. ఉత్తమ వెధవలు.. ఉత్తమ సన్నాసులు అని మీ వాళ్లకే అవార్డులు ఇవ్వాలని అన్నారు. మీరంతా ఎందుకు వైఎస్ జగన్ మీద పడి ఏడుస్తున్నారని నిలదీశారు. మీకు ఏమి అన్యాయం చేశారని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబులాగా వెన్నుపోటు పొడిచాడా.. ఎవరికైనా అన్యాయం చేశారో నిరూపించు.. నీ కాళ్లకు మొక్కుతా అని అన్నారు. ఎన్టీఆర్‌ను చెప్పులతో కొట్టినప్పుడు నువ్వేం చేశావు అని ప్రశ్నించారు. నీ బతుకు నాకు తెలుసు.. నా బతుకు నీకు తెలుసు.. ఇప్పటికైనా కొంచెం నీతితో జీవించు అని హితవు పలికారు. పోసాని మాట్లాడుతూ.. 'వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతోంది. రెండేళ్లు కరోనా వచ్చింది. దాని నుంచి రాష్ట్ర ప్రజలను కాపాడుకున్నారు. తరువాత దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో ఇస్తున్నారు. ఆయన వచ్చిన తరువాత నంది అవార్డులు ఇవ్వలేదు. అవార్డులు ఇస్తే ఎవరూ పేరు పెట్టని విధంగా ఇస్తారు. రజనీకాంత్ రోజూ చెన్నై నుంచి విజయవాడ వచ్చి చంద్రబాబు ను పొగిడినా మాకు అభ్యంతరం లేదు. మాకు సూపర్ స్టార్ చిరంజీవి. చిరంజీవికి జగన్ అంటే ఎంత ప్రేమో.. అలాగే చిరంజీవికి ఎనలేని గౌరవం ఇస్తారు సీఎం జగన్’ అని పోసాని పేర్కొన్నారు. కాగా.. నంది అవార్డులపై అశ్వనీదత్ మాట్లాడుతూ.. ఉత్తమ గూండా, ఉత్తమ రౌడీ.. అనే అవార్డులను ఇస్తారేమో అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. -
నిర్మాత ఆదిశేషగిరిరావు కీలక వ్యాఖ్యలు
-
నంది అవార్డులపై నిర్మాత అది శేషగిరావు కీలక వ్యాఖ్యలు
తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డులపై ప్రముఖ నిర్మాత ఆది శేషగిరిరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాలకు అనుకూలంగా ఉన్నవాళ్లకే నంది అవార్డ్స్ ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయాక నంది అవార్డులను ఎవరూ పట్టించుకోవట్లేదన్నారు. మే31న సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత ఆది శేషగిరిరావు మాట్లాడుతూ.. రెండు ప్రభుత్వాలు ఫిల్మ్ ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రకటించే అవార్డులకు చాలా ప్రాముఖ్యత ఉండేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. తన ఉద్దేశంలో నంది అవార్డులకు ప్రాముఖ్యత లేదని తెలిపారు. (చదవండి: చైతన్య మాస్టర్ ఆత్మహత్య.. శ్రద్దా దాస్, శేఖర్ మాస్టర్ ఎమోషనల్ ) గతంలో కూడా పలువురు సినీ ప్రముఖులు నంది అవార్డుల ప్రకటనపై అసంతృప్తి వెల్లడించారు. చంద్రబాబు నాయుడు హయాంలో కులాలను బట్టే నంది అవార్డులను ప్రకటించేవారని ప్రముఖ నటుడు పొసాని కృష్ణమురళి ఆరోపించారు. ప్రతిభను ప్రామాణికంగా తీసుకోకుండా.. చంద్రబాబు భజనే కొలమానంగా తీసుకొని అవార్డుల పంపకాలు జరిగాయని విమర్శించారు. ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, మహేశ్‌బాబు బాబాయ్ ఆది శేషగిరిరావు కూడా అలాంటి వ్యాఖ్యలే చేయడం హాట్ టాపిక్‌గా మారింది. -
అలాంటి చిత్రాలకు అవార్డ్స్ ఇస్తే బాగుంటుంది: విజయేంద్ర ప్రసాద్
గత కొంతకాలంగా ఆపేసిన నంది అవార్డులను ఇచ్చి సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ అన్నారు. అవార్డులు ఇవ్వడం ద్వారా తెలంగాణ పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా- 2023 వేడుకలు దుబాయ్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన విజయేంద్రప్రసాద్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలోనే `ఆర్ఆర్ఆర్` సినిమాటోగ్రాఫర్ కె.కె సెంథిల్ కుమార్‌ను ఘనంగా సన్మానించారు. విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ..' గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్‌ను ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు స్పెషల్‌గా నంది అవార్డులు కేటాయిస్తే బాగుంటుందని నా ఆలోచన. అలాగే తెలంగాణలో అద్భుతమైన టూరిజం స్పాట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని 90 శాతం ఇక్కడే షూటింగ్ చేసే సినిమాలకు నంది అవార్డ్స్‌తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తే తెలంగాణలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది.' అని అన్నారు. టీయస్‌ఐఐసీ ఛైర్మన్ గ్యాదరి బాలమల్లు మాట్లాడుతూ...' ప్రతాని రామకృష్ణ ఇస్తోన్న అవార్డ్స్‌కు ప్రభుత్వం తరఫు నుంచి కచ్చితంగా మంచి సపోర్ట్ ఉంటుంది. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. విజయేంద్రప్రసాద్ చెప్పిన విషయాన్ని కచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.' అని అన్నారు. ఈ కార్యక్రమంంలో ప్రసన్న కుమార్, కెయల్ఎన్ ప్రసాద్, శంకర్ గౌడ్, అశోక్ గౌడ్, వంశీ , శ్రీశైలం , నటి శుభశ్రీ తదితరులు పాల్గొన్నారు. -
నంది అవార్డుల జాప్యంపై స్పందించిన సినీ రచయిత విజయేంద్రప్రసాద్
-
ఇది నీకు..ఇది నీకు..ఇది నాకు..నందిని ఎలా పంచుకున్నారంటే..
-
ప్రతిభ ప్రామాణికం కాదు బాబూ భజనే కొలమానం
-
నంది పురస్కారాల్లోనూ చంద్రబాబు రాజకీయం
-
చంద్రబాబుకు జైకొట్టిన వాళ్లకే ‘నంది’ ఇచ్చారు: పొసాని
నంది అవార్డులపై నటుడు, ఏపీ ఎఫ్డీసీ ఛైర్మన్ పొసాని కృష్ణమురళి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో ఆయన అనుకూల నటనావర్గానికే నంది అవార్డులు ఇచ్చారని ఆరోపించారు. ప్రతిభను ప్రామాణికంగా తీసుకోకుండా చంద్రబాబు భజనే కొలమానంగా తీసుకొని అవార్డుల పంపకాలు జరిగాయని విమర్శించారు. తాజాగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ నంది అవార్డులను గత ప్రభుత్వం అపహాస్యం చేసిందన్నారు. ‘నంది అవార్డులు ప్రతిభ ఉన్నవారికి దక్కడం లేదు. చంద్రబాబుకు అనకూలంగా ఉన్నవారికే అవార్డులు ఇచ్చేవారు. ఆయనకు జైకొడితేనే అవార్డుల జాబితాలో పేరు ఉండేది. లేదంటే ఎంత టాలెంట్ ఉన్నా పక్కన పెట్టేవారు. మోహన్‌గాంధీ రికమెండ్ చేసినా నాకు నంది అవార్డు దక్కలేదు. ఇక టెంపర్ సినిమాకు నాకు తప్పనిసరి పరిస్థితుల్లో నంది అవార్డు ఇచ్చారు. కమిటీలో ఉన్న 12 మందిలో 10మంది కమ్మవాళ్లు ఉన్నారు. అందుకే ఆ అవార్డుని తిరస్కరించాను. ఈ విషయాన్ని 2017లోనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. ప్రతి విషయంలోనూ రాజకీయం చేసే చంద్రబాబు... చివరకు నంది పురస్కారాల్లో తన అనుకూల వర్గానికే ఇచ్చాడు. వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. ఒక్కవర్గానికే కొమ్ముకాశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా కాదు. సొంతంగా పార్టి పెట్టుకొని అధికారంలోకి వచ్చారు. అన్ని వర్గాల వారికి ఆయన న్యాయం చేస్తున్నాడు. నిజయితీగా పని చేస్తున్నారు’అని పొసాని అన్నారు. -
నంది అవార్డుపై పోసాని సంచలన వ్యాఖ్యలు
-
నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసానీ
ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన అవి నంది అవార్డులు కావని, కాపు,కమ్మ అవార్డులంటూ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'గ్రూపులు, కులాలుగా విడిపోయి నంది అవార్డులను పంచుకున్నారు.చంద్రబాబు హయాంలో కులాలను బట్టే పంపకాలు జరిగేవి. టెంపర్ సినిమాకు నాకు నంది అవార్డు ఇచ్చారు. అంటే తప్పని పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక నాకు ఇచ్చారు. నేను కూడా వెళ్లి తీసుకున్నా. అసలు ఎవరెవరికి ఏయే అవార్డులు ఇచ్చారో చూశా. అప్పుడు అవార్డుల కమిటీలో 12 మంది సభ్యులు ఉంటే, అందులో 11 మంది కమ్మ కులస్తులే ఉన్నారు. అవార్డులు ఒక కులానికే పంచేసుకుంటారని అప్పుడు అర్థమైంది. నాకు వచ్చిన అవార్డు కమ్మనందిలా కనిపించింది. అందుకే నంది అవార్డును తిరస్కరించాను. అవార్డులు అనేవి కులాలు, మతాలకు సంబంధం లేకుండా ఇవ్వాలి' అంటూ పోసానీ ధ్వజమెత్తారు. -
శేఖర్ కమ్ములకు ఎన్ని ‘నంది’ అవార్డులో తెలుసా?
ఎపుడొచ్చామన్నది కాదు.. హిట్ కొట్టామా లేమా అనేది సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల స్టయిల్. కొత్త వాళ్లతో ప్రయోగాలు.. చాలా కూల్‌గా , అంతే డీప్‌గా ప్రేక్షకుల్లోకి చొచ్చుకుపోవడం ఆయన శైలి. సిల్వర్ స్క్రీన్‌పై ఫీల్ గుడ్ మూవీలకు కేరాఫ్ అడ్రస్. ఆనంద్, గోదావరి, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ.. జానర్ ఏదైనా అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాడు శేఖర్ కమ్ముల. ఫిబ్రవరి 4 మిస్టర్ కూల్ డైరెక్టర్ శేఖర్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ స్టోరీ.. Happy Birthday Shekhar Kammula: ‘డాలర్ డ్రీమ్స్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శేఖర్ కమ్ముల 1972 ఫిబ్రవరి 4న జన్మించారు. తొలి సినిమాతోనే ఫస్ట్ సినిమాతోనే పలు అవార్డులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు.అచ్చతెలుగు తియ్యదనం, విలువలకు ప్రాధాన్యత ఇస్తూ తెలుగు సినిమాకు వన్నెలద్దిన అతికొద్దిమందిలో శేఖర్ కమ్ముల ఒకరు. సిల్వర్ స్క్రీన్ పై తన దర్శక ప్రతిభతో ఆబాలగోపాలాన్ని ఆకట్టుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే ఐనా తనదైన స్టైల్ ఆఫ్ మేకింగ్‌తో మంచి కాఫీ లాంటిమూవీల నుంచి తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఆనంద్, గోదావరి లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ఫిదా, లవ్‌స్టోరీ లాంటి సినిమాలను భారీ విజయాలను సాధించాయి. అటు మిడిల్ క్లాస్ వారైనా ఇటు యూత్ ప్రేక్షకులైనా ఫిదా అవ్వాల్సిందే. సకుటుంబ సపరివారం సమేతంగా థియేటర్ల ముందు జనం క్యూ కట్టాల్సిందే. తనకేసొంతమైన టేకింగ్‌తో ఏకంగా ఆరు నంది అవార్డులను సొంతం చేసుకున్నాడు. దటీజ్ దర్శక లీడర్ శేఖర్ కమ్ముల. అంతేకాదు ప్రముఖ దర్శకుడు బాపు, విశ్వనాథ్ తరువాత హీరోయిన్ను అందంగా, ఆత్మవిశ్వాసంగా ప్రొజెక్ట్ చేసిన ఘనత శేఖర్‌దే అని కచ్చితంగా చెప్పవచ్చు. అందంగా లేనా అంటూ తనదైన మేకింగ్ స్టైల్‌తో అదరగొట్టేస్తాడు. పాపికొండల అందాలు, ఉప్పొంగే గోదావారితో పాటు హీరోయిన్ కమలినీ ముఖర్జీని తనదైన శైలిలో అందంగా చూపించాడు శేఖర్ కమ్ముల. ఈ సినిమా కమర్షియల్‌గా గ్రాండ్ సక్సెస్ కాలేపోయిప్పటికీ బెస్ట్ దర్శకుడుగా నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఆ తరువాత అందరూ కొత్త నటులతో చేసిన హ్యాపీడేస్‌తో సూపర్ డూపర్ హిట్కొట్టాడు.ఫిల్మ్ ఫేర్ అవార్డును కైవసం చేసుకుంది ఈ సినిమా ద్వారా పరిచయం అయిన నటులు స్టార్స్‌గా ఎదిగారు. అవకాయ్ బిర్యాని మూవీ కూడా పెద్దగా విజయం సాధించలేదు. పాలిటికల్ జానర్లో దగ్గుబాటి రానాను హీరోగా పరిచయం చేసిన మూవీ లీడర్. ఈ మూవీ విమర్శలకు ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. బెస్ట్ స్టోరీ రైటర్‌గా ఈ సినిమాకు శేఖర్ కమ్ముల నంది అవార్డు అందుకున్నారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్’, అలాగే కహానీ సినిమాకు రీమేక్‌గా తెలుగులో నయనతార కథానాయికగా వచ్చిన ‘అనామిక’ కూడా నిరాశపర్చాయి. ఆ తర్వాత వరుణ్ తేజ్, సాయిపల్లవి జోడీగా వచ్చిన ‘ఫిదా’ మూవీ ఆడియన్స్‌ను ఫిదా చేసింది. తెలంగాణ, అమెరికా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్నందుకుంది. ఇక తాజాగా నాగ చైతన్య, సాయి పల్లవి కాంబోలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా హిట్టా ఫట్టా అనేది తనకు తెలిసిపోతుందని ఒక సందర్భంలో శేఖర్ కమ్ముల చెప్పారు. తన కథల్ని పెద్ద హీరోలు రిజెక్ట్ చేశారు. ఎందుకంటే తనకు కథని నేరేట్ చేయడం రాదు. తాను స్టోరీ చెప్తుంటే వినేవాళ్లకి ఆవలింతలు వస్తాయని చమత్కరించారు హ్యాపీడేస్ సినిమా ట్రెండ్ సెట్టర్ అని బల్లగుద్ది మరీ చెప్పాను. అలాగే పాలిటిక్స్ సినిమాల్లో లీడర్ నిలబడుతుందన్నా. బట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ దెబ్బతీసిందంటూ తన అనుభవాలను గతంలో గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. -
సిరివెన్నెలను వరించిన 11 నంది అవార్డులు.. ఆ పాటలు ఇవే..
Top 11 Sirivennela Sitaramasastry Nandi Award Winning Songs List: సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.. అందులోని భావానికి వావ్ అనాల్సిందే. ఆయన రచన, సాహిత్యం అలాంటిది. అంతే కాదు అక్షరానికి ఎంత శక్తి ఉంటుందని తెలియజేసేవారిలో అతి ముఖ్యులు సీతారామశాస్త్రి. సరసం, శృంగారం, వేదన, ఆలోచన.. ఇలా కవిత్వానికి ఎన్ని ఒంపులు ఉన్నాయో, అక్షరంలో ఎన్ని అందాలు ఉన్నాయో అన్నీ తెలిసిన చిత్రకారుడు సిరివెన్నెల. ‘విధాత తలపున ప్రభవించినదీ’ అంటూ ఏ క్షణాన ఆయన తెలుగు సినిమా పాట కోసం కలం పట్టుకున్నారో, అప్పుడే ఆయన తెలుగు పాటకు ముద్దు బిడ్డ అయిపోయారు. ‘సరస స్వర సుర ఝరీ గమనమౌ’ అంటూ మొదలైన ప్రయాణంలో ఎన్నో అవార్డులు. ఒకటి కాదు, రెండు కాదు, భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ కూడా ఆయన సాహిత్యానికి కానుకగా వరించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఆయన సాహిత్యం అందించిన పాటలు, నంది అవార్డులు గెలుచుకున్న విశేషాలు ఇవే. 1. చెంబోలు సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట ‘విధాత తలపున’. ‘సిరివెన్నెల’ చిత్రంలోని ఈ పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు. కే. విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కె.వి. మహదేవన్ స్వరాలు అందించారు. 2. రెండోసారి కూడా కే. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'శ్రుతిలయలు' సినిమాలోని 'తెలవారదేమో స్వామి' పాటకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఈ పాటకు కూడా కె.వి. మహదేవన్ స్వరాలు సమకూర్చారు. 3. మూడోసారి హైట్రిక్గా కే. విశ్వనాథ్ డైరెక్ట్ చేసిన సినిమాలోని పాటకే నంది అవార్డు సీతారామ శాస్త్రిని వరించింది. ఇళయరాజా స్వరాలు అందించిన ‘స్వర్ణకమలం’లో ‘అందెల రవమిది పదములదా!’ అంటూ సాగే పాట ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 4. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో జగపతిబాబు కీలక పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘గాయం’. ఇందులో ‘సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని’ అంటూ సాగే పాటను సిరివెన్నెల రాశారు. శ్రీ కొమ్మినేని స్వరాలు సమకూర్చిన ఈ పాటకు నంది అవార్డు దక్కింది. 5. ఐదో నంది అవార్డు 'శుభలగ్నం' సినిమాలోని ‘చిలుక ఏ తోడు లేక’ అనే పాట రచిచించనందుకు దక్కింది. 6. శ్రీకారం చిత్రంలోని ‘మనసు కాస్త కలత పడితే' అంటూ సాగే గేయానికి ఆరో నంది అవార్డు లభించింది. 7. ఏడో నంది అవార్డు ‘సింధూరం’ చిత్రంలోని ‘అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే’ పాటకు వరించింది. 8. సుమంత్ హీరోగా అరంగ్రేటం చేసిన ‘ప్రేమకథ’ సినిమాలోని 'దేవుడు కరుణిస్తాడని' అనే పాటకు ఎనిమిదో నంది అవార్డు వచ్చింది. 9. తొమ్మిదో నంది అవార్డు ‘చక్రం’లోని 'జగమంత కుటుంబం నాది' అనే పాటకు దక్కింది. 10. పదో నంది అవార్డు ‘గమ్యం’ (ఎంత వరకూ ఎందుకొరకు) 11. పదకొండో నంది అవార్డు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (మరీ అంతగా) వీటితో పాటు సిరివెన్నెలకు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, గమ్యం, మహాత్మ, కంచె చిత్రాలకు పాటలు రాసినందుకుగాను సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు వరించాయి. గోవాలోని పనాజీలో 2017లో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతులమీదుగా 'సంస్కృతి' కేటగిరీ కింద 'ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్' అవార్డును అందుకున్నారు సిరివెన్నెల. ఇది చదవండి: సంగీత ప్రపంచంలో వికసించిన తామరలు.. సిరివెన్నెల ఆణిముత్యాలు -
కల్చర్‌లో అఫైర్స్
చాలా రోజుల క్రితం నా మిత్రుడొకాయన రాష్ట్ర సాంస్కృతిక శాఖలో, కొంచెం ఎత్తు కుర్చీలో ఉండేవాడు. అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్లం. ఒకసారి కలిసినపుడు మిత్రమా కుశలమా అని పలకరిస్తూ, ఈ మధ్య మీ శాఖలో కల్చర్ తక్కువగానూ, అఫైర్స్ ఎక్కువగానూ తూగుతున్నాయని వినిపిస్తోంది. నిజమా?! అని అడిగాను. మిత్రుడు నవ్వేసి రెండూ తక్కువగానే ఉన్నాయంటూ చప్పరించాడు. ‘మన నాయకులకి చాలా సంగతులు తెలియవు. కవులని, కళాకారులని గుర్తించి గౌరవిస్తే వచ్చే ఖ్యాతి క్యాపిటల్ కట్టినా రాదు’ అంటూ ప్రారంభించాను. కృష్ణదేవరాయలతో మొదలు పెట్టా. అష్టదిగ్గజాల గురించి, వారి ప్రతిభా పాటవాల గురించి, పోషణ గురించి గుక్క తిప్పుకోకుండా మాట్లాడా. కవులు చాలా అల్ప సంతోషులు. పాత రోజుల్లో కూడా పాపం పావలా ఇస్తే ఆనందంతో రెచ్చిపోయి రెండు సీసాలు, వాటికి తోడు రెండు ఎత్తు గీతులు ఆశువుగా డౌన్లోడ్ చేసేవారు. అన్నీ రాజుగారి మీద పొగడ్తల జల్లులే. యతి ప్రాసలతో కురిపించి ఆనంద పరవశులను చేసేవారు. మీ చంద్రబాబుకి రాజకీయం తప్ప రసికత లేదు– అంటూ అక్కడికి ముగించాను. విశ్వవిద్యాలయాలు, అకాడెమీలు, నంది అవార్డులిచ్చే పెద్దలు కొంచెం పెద్ద మనసుతో ఉండాలంటారు విజ్ఞులు. అందులో కులాభిమానాన్ని, ప్రాంతీయతత్వాన్ని పులమకూడదంటారు. చంద్రబాబు హయాంలో ఒకసారి, రెండు సార్లు నంది గొడవలు రేగిన జ్ఞాపకం. మొన్న జగన్మోహన్రెడ్డి తాజా బడ్జెట్లో కొన్ని పద్దులు ఉదారంగానే కనిపించాయి. మన ప్రభుత్వాలు ఉదారంగా పింఛన్లు ఇస్తున్నాయి. సంతోషం. అదే గొప్ప కళాకారులుంటారు. జీవితమంతా యాభై, అరవై ఏళ్లు వేరే ఊసు లేకుండా వారు నమ్ముకున్న కళతోనే దీనంగా బతికేస్తూ ఉంటారు. ఎప్పుడో వారి అదృష్టం కలిసి వస్తే ప్రభుత్వం సొంతంగానో, విశ్వవిద్యాలయం ద్వారానో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అనే జీవన సాఫల్య పురస్కారాన్ని ఘనంగా ప్రతిపాదిస్తుంది. ఇంతా చేసి ఆ పురస్కారం అవార్డు పాతిక లేదా యాభై వేలుంటుంది. ‘దాన్ని విలువ కట్టకూడదు. తప్పు. అందులో మా ముఖ్యమంత్రిగారి దీవెనలున్నాయ్. మా ఇతర మంత్రుల ఆకాంక్షలున్నాయ్’ అంటూ భయపెట్టి సమర్థించుకుంటారు. నిజానికి అరవై ఏళ్ల కృషికి గాను ఆ కాస్తని భాగించి లెక్కిస్తే రోజుకి పావలా కూడా పడదని ఒక గ్రహీత వాపోయాడు. చంద్రబాబు చేతికి ఎముకలెక్కువ, మనిషికి ఔదార్యం తక్కువ అని నిట్టూర్చాడు. రాష్ట్ర భాషాభివృద్ధికి సమృద్ధిగా నిధులుంటాయ్. అవి కేంద్రం నించి వస్తాయ్. ఇక్కడి పసుపు కుంకుమ ఖాతాలోంచి తియ్యక్కర్లేదు. చంద్రబాబు పాలనలో ఎప్పుడూ ఆ నిధులు సద్వినియోగం అయిన పాపాన పోలేదు. ఈ డబ్బులతో ఎన్నో మంచి తెలుగు పుస్తకాలు అచ్చు వేయవచ్చు. ఎన్నో అమూల్యమైన పుస్తకాలను పునర్ ముద్రించి ఈతరం వారికి అందు బాటులోకి తేవచ్చు. ప్రతి చిన్న స్కూలు లైబ్రరీలోనూ పిల్లలు విధిగా చదవాల్సిన పుస్తకాలను పెట్టవచ్చు. చంద్రబాబు పాలనలో, గడచిన సంవత్సరాలలో దీనికి సంబంధించిన నిధులు కోట్లాదిగా మురిగిపోయాయి. ఇటువంటి నిధులు గడువుదాటిపోతే అవి వృథా అయినట్టే. ఇలాంటి దారుణాలు ఎన్నో జరిగి పోతుంటాయి. ఇలా కేంద్రం నుంచి, ఇతర చోట్ల నుంచి వచ్చే నిధులను రాబట్టి సద్వినియోగం చేసుకోవడానికి ప్రత్యేకించి ఒక కార్యాలయం బాధ్యతాయుతంగా పనిచేయాలి. అంతర్జాతీయంగా చదువు, గ్రామీణ క్రీడలు ఇలాంటి వాటి ఉద్ధరణకి వచ్చే నిధులు అనేకం ఉన్నాయి. వాటిని సకాలంలో సంప్రదించి అందుకోవాలి. వినియోగించుకోవాలి. ప్రతి చిన్న అంశాన్ని పరిశీలనగా చూస్తున్న జగన్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారిస్తుందని ఆశిద్దాం. కల్చర్, అఫైర్స్ సమతుల్యంతో నడుస్తాయని నమ్ముతున్నాం. శ్రీరమణ ప్రముఖ కథకుడు -
ప్రేమని వ్యక్తపరచడం ఎలా?
దాదాపు 150 సినిమాలకుపైగా ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేసి, 5 నంది అవార్డ్స్ గెలుచుకున్న అశోక్ కుమార్ తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ‘మౌనమే ఇష్టం’. రామ్ కార్తీక్ హీరోగా, పార్వతి అరుణ్, రీతూవర్మ హీరోయిన్లుగా నటించారు. ఏకే మూవీస్ పతాకంపై ఆశా అశోక్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అశోక్ కుమార్ మాట్లాడుతూ – ‘‘మంచి స్టోరీ కుదిరితే దర్శకత్వం చేయాలని 15 సంవత్సరాలుగా ఆలోచిస్తూనే ఉన్నాను. ‘మౌనమే ఇష్టం’ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. క్యూట్ జెండర్ లవ్ స్టోరీ. ప్రేమని ఎలా వ్యక్తపరచాలన్నదే ఈ సినిమాలో మెయిన్ పాయింట్. సినిమా ఔట్పుట్ చాలా బాగా వచ్చింది. తప్పకుండా అందరూ చూడండి’’ అన్నారు. ‘‘అశోక్ కుమార్‌గారు ఈ సినిమాను యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించారు. ప్రతి ప్రేమకు ప్రపోజల్ ఎంతో ముఖ్యమైనది. అలాంటిది ప్రేమకు ప్రపోజల్ ఇబ్బంది అయితే ఆ ప్రేమికుడు పడే బాధ ఏంటి? అనేది ఈ సినిమాలో చూపించాం. ఇలాంటి మంచి ప్రాజెక్టులో నాకు అవకాశం ఇచ్చిన అశోక్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు సాయి కార్తీక్. ‘‘ఈ సినిమా తప్పుకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది. కార్తీక్‌కి ఈ చిత్రం ద్వారా నటుడిగా మంచి పేరు వస్తుంది’’ అన్నారు రీతూవర్మ. కథా రచయిత సురేష్, నటి ప్రియాంక, ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్ నాయర్, కెమెరామేన్ రామ్ తులసి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ మహాదేవా. -
టీడీపీపై దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఫైర్
-
చంద్రబాబుకు దర్శక, నిర్మాత చురకలు
హైదరాబాద్ : నంది అవార్డులు తీసుకోలేదు.. పంచుకున్నారని దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆరోపించారు. నంది అవార్డులు తీసుకున్నపుడు గొడవ చేశామన్నారు కదా.. ఆ నంది అవార్డు కమిటీలు వేసింది కూడా మీరే(చంద్రబాబు నాయుడు)కదా అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. తమరు పంచిన నంది అవార్డులు తీసుకున్న వారు ఈ విషయంపై ఎందుకు స్పందించరని అడిగారు. ఆడవాళ్ల అందాలతో సినిమా తీసేవాళ్లు తమరి పక్కనే ఉన్నారు కదా వారెందుకు హోదా కోసం పోరాడరు అని ప్రశ్నించారు. తాము ఏసీల్లో కులుకుతున్నామా..? మీరే (టీడీపీ నాయకులనుద్దేశించి) లంచాలు తిని ఏసీల్లో కులుకుతున్నారని ధ్వజమెత్తారు. తాము రాత్రి, పగలు కష్టపడితే పది మందికి అన్నం దొరుకుతున్నదని తెలియజేశారు. తమరికి ప్రత్యేక హోదా విషయం కంటే జగన్, మోదీ, పవన్ ఎక్కడ కలుస్తారనే విషయం భయంగా ఉందని, అందుకే సినిమా వాళ్ల మీద నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడో చెప్పారు కానీ అప్పటి నుంచీ మౌనంగా ఉన్న చంద్రబాబు నాయుడికి ఇప్పుడెందుకు గుర్తుకొచ్చిందని సూటిగా అడిగారు. సినిమా వాళ్ల భార్యల గురించి అసభ్యంగా మాట్లాడినపుడు మాట్లాడని వారు ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని గట్టిగా ప్రశ్నించారు. -
ప్రేక్షకుల ఆదరాభిమానాలే నంది అవార్డులు:సాయి ధరమ్
పశ్చిమగోదావరి, ద్వారకాతిరుమల: మెగా ఫ్యామిలీకి ప్రేక్షుకుల ఆధరాభిమానాలే నంది అవార్డులని ప్రముఖ సినీ హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయాన్ని సోమవారం ’జవాన్’ చిత్ర యూనిట్ సందర్శించింది. హీరో సాయి ధరమ్ తేజ్‌తో పాటు హీరోయిన్ మెహ్రిన్, దర్శకుడు బీఎస్వీ.రవి, నిర్మాత కృష్ణలు శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఏఈ వో ఎం.దుర్గారావు హీరోకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం స్థానిక వీఐపీ లాంజ్‌లో సాయి ధరమ్ తేజ్ విలేకరులతో మాట్లాడారు. నంది అవార్డులపై మాట్లాడే స్థాయి తనకు లేదంటూనే.. మెగా ఫ్యామిలీకి ప్రేక్షకుల ఆదరణ మెండుగా ఉందని, అవే తమకు అవార్డులన్నారు. జనసేన పార్టీకి ప్రచారం చేస్తారా.. అన్న ప్రశ్నకు బదులిస్తూ, రాజకీయాలతో తనకు సంబంధం లేదన్నారు. జవాన్ చిత్రం తన వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉందని, ఒక సామాన్యుడు ఇంటికోసం, దేశం కోసం ఏ విధంగా పోరాడాడన్నది చిత్ర కథాంశమన్నారు. డిసెంబర్ 1న విడుదల కానుందని, ప్రేక్షకులు విజయవంతం చేస్తారన్న నమ్మకం ఉందన్నారు. తన తరువాత చిత్రం వీవీ వినాయక్ దర్శకత్వంలో చేయనున్నట్టు తెలిపారు. కిల్ పైరసీ అన్నారు. పెద్ద తిరుపతి, చిన తిరుపతి వెంకన్నలంటే తమకు సెంటిమెంట్ అని, అందుకే సినిమా రిలీజ్‌కు ముందు ఇక్కడికి వచ్చినట్టు నిర్మాత కృష్ణ తెలిపారు. ప్రతి ఇంటిలోను జవాన్ ఉండాలన్నారు. మా కుటుంబానికి ఇష్టదైవం ఆంజనేయస్వామి జంగారెడ్డిగూడెం రూరల్: అలాగే జవాన్ చిత్ర యూనిట్ మద్ది గుర్వాయిగూడెం ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. హీరో సాయిధరమ్ తేజ్ విలేకరులతో మాట్లాడుతూ తమ కుటుంబానికి ఇష్టదైవం ఆంజనేయస్వామి అని, మద్ది ఆంజనేయస్వామిని దర్శించుకోవడం తనకు ఇది రెండోసారని చెప్పారు. అనంతరం చిత్ర యూనిట్‌తో కలసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పెదపాడు : స్థానిక రామచంద్ర ఇంజినీరింగ్ కళాశాలలో జవాన్ చిత్రం యూనిట్ మంగళవారం సందడి చేసింది. కళాశాల యాజమాన్యం ఘంటా శ్రీరామచంద్రరావు, ప్రిన్సిపల్ డోలా సంజయ్ చిత్ర యూనిట్‌కు ఘన స్వాగతం పలికారు. సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ మెహ్రీన్, చిత్ర యూనిట్ సభ్యులు కళాశాల విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. చిత్రం యూనిట్ సభ్యులతో విద్యార్థులు సెల్ఫీలు దిగారు. ద్వారకా తిరుమలలో విలేకరులతో మాట్లాడుతున్న జవాన్ చిత్ర హీరో సాయి ధరమ్ తేజ్, హీరోయిన్ మెహ్రిన్ తదితరులు -
‘నంది’ వివాదంపై జీవీ ఘాటు వ్యాఖ్య
సాక్షి, రామచంద్రపురం రూరల్: ఇటీవల ప్రకటించిన నంది అవార్డులతో చిత్ర పరిశ్రమను, నంది అవార్డులను ‘ఎల్లో’(పచ్చ)గా మార్చేశారని సినీ నటుడు జీవీ సుధాకర్ నాయుడు విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. విజయవాడలో ఇటీవల జరిగిన బోటు ప్రమాదంపై స్పందిస్తూ... బోటు యజమాని రాష్ట్ర మంత్రి అయినందువల్లే ఆ విషయాన్ని మీడియాపరంగా తొక్కేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్ర పరిశ్రమకు తాను కావాలని రాలేదని, బంధువైన దాసరి నారాయణరావు నటించాలని కోరడంతో కాదనలేకే నటించానన్నారు. అంతఃపురం చిత్రంతో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. తనకు చిరంజీవిపై ఉన్న అభిమానం తెలిసిన దాసరి.. చిరంజీవి పేరులోని చివరి రెండు అక్షరాలు అయిన ‘జీవి’ని తన పేరు ముందు కలిపారని, అదే స్థిరపడిపోయిందని చెప్పారు. హైదరాబాద్‌లో 100 మంది పేద ముస్లిం పిల్లలను స్నేహితులతో కలసి పదేళ్లుగా చదివిస్తున్నానని, దీనిపై ఏనాడూ ప్రచారం చేసుకోలేదన్నారు. స్వీయ దర్శకత్వంలో తానే నిర్మాతగా వంగవీటి సినిమా తీస్తానని సుధాకర్‌నాయుడు చెప్పారు. -
‘చదువుకోవాలి’కి అన్యాయం జరిగింది
హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ‘చదువుకోవాలి’ చిత్రానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సినీవారం కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను రూపొందించిన ఎం. వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి దేశరాజు లలిత, కో డైరెక్టర్ సాయిశ్వేతను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తరఫున సత్కరించి, అభినందించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘చదువుకోవాలి’ వంటి సందేశాత్మక చిత్రం వల్ల సమాజంలో మంచి మార్పులు వస్తాయి. పాత్రికేయునిగా అపార అనుభవం ఉన్న ఎం. వెంకటేశ్వరరావు సామాజిక బాధ్యతగా సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘సినిమా తీసి ఐదేళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట విద్యార్థుల కోసం ఇంకా ప్రదర్శించబడుతోంది. విద్యపై చెతన్యంతో తీసిన సినిమా కావడమే ఇందుకు కారణం. ఐదు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన మా చిత్రానికి ఏపీ నంది అవార్డుల్లో అన్యాయం చేశారు’’ అన్నారు దర్శక నిర్మాత ఎం.వెంకటేశ్వరరావు. -
ఆధార్ కార్డులు ఉన్నవారే జ్యూరీలో సభ్యులా?
-
ఆధార్ కార్డులు ఉన్నవారే జ్యూరీలో సభ్యులా?
సాక్షి, విశాఖపట్టణం : నంది అవార్డుల విషయంపై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అధికార మదంతో, అహంభావంతో మాట్లాడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనర్హులకు అవార్డులు ఇవ్వడంపై ప్రశ్నిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్ కార్డు అడుగుతారా? అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్ కార్డులు ఉన్న వారినే జ్యూరీలోకి తీసుకున్నారా? అంటూ ప్రశ్నించారు. మంత్రి పదవిలో ఉన్న లోకేశ్ బాధ్యతారాహిత్యంతో మాట్లాడటం గర్హనీయమన్నారు. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పంచభూతాలను ప్రభుత్వ నేతలు దోచుకు తింటున్నారని మండిపడ్డారు. భోగాపురం ఎయిర్‌పోర్టు వ్యవహారంలో ముఖ్యమంత్రి, కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజులు దోచుకుతింటున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి భోగాపురం ఎయిర్‌పోర్టుపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
తప్పు జరిగినట్టు... ఒప్పుకున్నట్టేగా చంద్రబాబూ!
నాకు నంది అవార్డు రావడం సిగ్గుచేటు సోమవారం ఓ వార్తాపత్రిక చదివా. అందులో ‘ఆపేస్తా నంది.. రాద్ధాంతం శృతిమించితే అవార్డులు ఎత్తేస్తాం’ అని ప్రభుత్వం చెప్పినట్టుగా వార్త రాశారు. మంగళవారం ఆ పేపర్ చదివా. అందులో చంద్రబాబుగారు ఓ మాట, లోకేశ్‌బాబు ఓ మాట అన్నారు. లోకేశ్‌బాబు ఏమన్నారంటే.. ‘నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారంతా ఎన్.ఆర్.ఏ. (నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్). ఏపీలో ఆధార్ కార్డు, ఓటు హక్కు లేనివాళ్లే విమర్శలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడటంలో అర్థమేంటి? కేవలం ముగ్గురు నలుగురే ఈ విషయంలో విమర్శలు చేస్తున్నారు’ అన్నారు. కేసీఆర్‌గారికి పాదాభివందనం తెలంగాణ సామాజానికి, ప్రజానీకానికి, రాజకీయ నాయకులకు, ప్రభుత్వంలోని పెద్దలకు, కేసీఆర్‌గారికి నేను పాదాభివందనం చేస్తున్నా. తెలంగాణ ప్రజలెంత గొప్పవాళ్లో, నీతిమంతులో, ఎంత దయార్థ హృదయులో, ఎంత అమాయకులో లోకేశ్‌బాబు స్టేట్మెంట్ చూశాక వంద శాతం అర ్థం చేసుకున్నా. ఒక్క నంది విషయంలో విమర్శలు చేస్తే ఆంధ్రావాళ్లం నాన్ రెసిడెన్స్ ఆంధ్రాసా? ఎన్నో సంవత్సరాలు తెలంగాణలో ఉండి రాజకీయాలు చేశారు ఆంధ్ర నాయకులు. కేసీఆర్‌గారు ‘మా పేచీ అంతా తెలంగాణను దోచుకుంటున్న ఆంధ్ర నాయకుల గురించే కానీ, ఆంధ్ర ప్రజలతో కాదు. వాళ్లు మా బిడ్డల్లాంటి వాళ్లు’ అన్నారే కానీ, ‘వీళ్లు తెలంగాణావాళ్లు కాదు.. కొట్టండి.. తరమండి’ అనలేదు. అలా ఆయన అని ఉంటే తెలంగాణ ప్రజలు మమ్మల్ని కొట్టి ఖమ్మం బార్డర్ దాటించేవారు. లోకేశ్ సీయం అయితే మేం బతికుంటామా? లోకేశ్‌లాంటి మనస్తత్వం తెలంగాణ ప్రజలకుంటే ఇక్కడ ఆంధ్రావాళ్లను కొట్టేవారు. దీంతో మేం తలో దిక్కూ పారిపోయి తెలుగు రోహింగ్యాలు అయ్యేవాళ్లం. లోకేశ్ లాంటివారు ముఖ్యమంత్రి అయితే మేం బతికుంటామా? మమ్మల్ని బతకనిస్తారా? లోకేశ్‌బాబూ తాగి మాట్లాడావా? ‘ఏంటీ.. ఆధార్ కార్డులు ఇక్కడ (తెలంగాణ) ఉన్నాయా? ట్యాక్స్‌లు ఇక్కడే కడుతున్నారా? అయితే ఏం? ఇక్కడివాళ్లు ఆంధ్రాలో పనికిరారా? ఇక్కడ కూర్చొని మీరు రాజకీయాలు చేయొచ్చు? ఇక్కడి నుంచి విమర్శించకూడదా?’ అని లోకేశ్ అన్నారు. లోకేశ్‌బాబూ.. చదువుకున్నావా? కొంచెమైనా బుద్ధి, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా? 2014 నుంచి 2024 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నీకా స్పృహ ఉందా? తాగి మాట్లాడావా? అంటే.. 2024 వరకూ అధికారికంగా ఇక్కడ మేం బతకొచ్చు. తర్వాత కూడా బతకొచ్చు.మీ ఇళ్లు ఎక్కడున్నాయి? మీ కుటుంబానికంతటికీ ఆధార్ కార్డులు అక్కడే (అమరావతి) ఉన్నాయా? మీ భార్య, అత్త కుటుంబాలకు హైదరాబాద్‌లో సొంత ఇళ్లు లేవా? మీరు ట్యాక్స్ కట్టడం లేదా? మరి మీరెందుకు కడుతున్నారు? పన్ను తెలంగాణాలో కడతారు.. ఏపీలో మమ్మల్ని తిడతారా? అని మీరెందుకు మమ్మల్ని అంటున్నారు. రాష్ట్రం విడిపోయాక కూడా మీరు హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకోలేదా? మీకు ఆస్తులు లేవా? షాపింగ్ కాంప్లెక్స్‌లు లేవా? మీరు ఇక్కడ పన్ను కడుతూ విజయవాడలో ఉండి రాజకీయాలు చేయొచ్చా? మేము పన్నులు కడుతూ మిమ్మల్ని విమర్శించకూడదా? మీ నీతి ఏంటి? మా నీతి ఏంటి? మీకు మాట్లాడే అర్హత ఉంది. మాకు లేదా? జ్యూరీలో ఉన్నవాళ్లు నాన్ ఏపీ కాదా? మేం ఆంధ్రవాళ్లం కాదు.. తెలంగాణవాళ్లం కాదు. కానీ, ఇక్కడే ఉంటున్నాం. మాకు మాట్లాడే అర్హత లేదా? మరి నాన్ ఏపీ, నాన్ లోకల్ వాళ్లని ఎందుకు నంది అవార్డు జ్యూరీలో పెట్టుకున్నారు మీరు? మమ్మల్ని ‘నాన్ రెసిడెన్స్ ఆంధ్రాస్’ అన్నారు కదా? ప్రభుత్వం డబ్బుతో ఇక్కడి నుంచి ఫ్లైట్‌లో తీసుకెళ్లి ఫైవ్‌స్టార్ హోటల్లో పెట్టారే వాళ్లందరికీ ఆంధ్ర ఆధార్ కార్డులున్నాయా? వాళ్లు ఇక్కడ ఉండి ఓటు వేశారా? అక్కడికి వచ్చి ఓటు వేశారా? మరి వార్ని జ్యూరీలో ఎందుకు పెట్టుకున్నారు? మీ దృష్టిలో వాళ్లు కూడా నాన్ రెసిడెంట్స్, నాన్ లోకలే కదా? తెలుగు రోహింగ్యాలే కదా? వారికెందుకు జ్యూరీలో ప్లేస్ ఇచ్చారో చెప్పం డి. బుద్ధి తెచ్చుకుంటా. నాకు జ్ఞానోదయం కలిగించండి. ఇదేం నీతి? నీకు ఇక్కడ ఇల్లుంది. ఇక్కడ పన్ను కడతావు. ఆంధ్రలో మంత్రి అవుతావు. మేము ఏమీ కాకూడదు? నోరెత్తాం.. తప్పా? రాద్ధాంతం శ్రుతి మించితే నంది అవార్డులు ఎత్తేస్తాం అంటారా? 2014 నుంచి తెలుగు ప్రజలు రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. ఏం ఎత్తేశారు మీరు? మీ పార్టీలో గెలవలేదు. సైకిల్ గుర్తుపైన గెలవలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాను గుర్తుపై జగన్ తరఫున గెలిచారు. మీ పార్టీలోకి దూకారు. మీరు వారిని వాటేసుకున్నారు. ముద్దు లు పెట్టుకున్నారు. పార్టీలు చేసుకున్నారు. మేం రాద్ధాంతం చేస్తే నందులు ఎత్తేస్తారు. వాళ్లు మీ పార్టీ కాదు.. మీ గుర్తుకాదు.. జగన్ కష్టం అని ఫ్యాను గుర్తుకి ఓట్లేసిన ప్రజలు రాద్ధాంతం చేస్తున్నారే... మరి వాళ్లను (పార్టీ మారిన ఎమ్మెల్యేలు) ఎందుకు ఎత్తి పడేయడం లేదు? ఇదేం నీతి? విమర్శిస్తే నంది ఎత్తేస్తారా? మీలాంటి రాజకీయ నాయకులా ఈ దేశాధినేతలు.. ప్రజా సేవకులు. మేం వినాలి.. మా ఖర్మ కాలి. చిన్న విమర్శలకే నందులు తీసేస్తాం అంటున్నావే.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘భారతరత్న, పద్మ’ అవార్డులకూ విమర్శలున్నాయి. ఎత్తేస్తామన్నారా.. ఎత్తేశారా? విమర్శలు తీసుకోవడం లేదా? కాంగ్రెస్, బీజేపీ.. ఏ ప్రభుత్వానికైనా విమర్శలు తప్పవు. ఇది ప్రజాస్వామ్యం. మా మీద ప్రేమతో అవార్డులిస్తున్నారా? ప్రతిభావంతులకి పురస్కారాలు ఇస్తున్నారు. అది అన్ని రంగాల్లోనూ ఇస్తున్నారు. నంది అవార్డులు ఇస్తున్నారు. మేం ఇవ్వొద్దన్నామా? లోపాలున్నాయి. సరిదిద్దుకో అన్నందుకు నాన్ రెసిడెంట్సా? లోపాలు జరగలేదనీ న్యాయబద్ధంగా ఇచ్చామనీ జ్యూరీ సభ్యుల్ని లైవ్‌లో లై డిటెక్టర్ పరీక్షలు చేయించుకోమనండి. న్యాయంగా వస్తే అందరి కాళ్లూ పట్టుకుని పాలాభిషేకం చేస్తా. నాకూ నంది అవార్డు వచ్చింది. అవార్డు కోసం పైరవీలు చేయను. నేను లఫూట్గాణ్ణో, నిజాయితీగా బతికేవాణ్ణో అందరికీ తెలుసు. ఈ అవార్డు వచ్చినందుకు సిగ్గుపడుతున్నా. పోసాని కమ్మవాడు కాబట్టి, ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చి ఉంటార్రా అని అంటారు. అనే ఆస్కారం ఉండి ఉంటుంది. నేను కూడా విమర్శలు ఫేస్ చేయాలి.. తప్పదు. తెలుగు రోహింగ్యా అని మమ్మల్ని తరిమేస్తారేమో! అవార్డులపై విమర్శలు చేస్తే మేము తెలుగు రోహింగ్యాలమా? పెళ్లాం, పిల్లలతో ఎప్పుడైనా విజయవాడ వెళితే మమ్మల్ని బ్రతకనిస్తారా? వీడెవడ్రా తెలుగు రోహింగ్యా.. తరిమి కొట్టండి అంటారేమో? మీరు ఆంధ్రాకి పాస్‌పోర్టు రెడీ చేస్తారేమో? ఓన్లీ తెలుగుదేశానికి ఓట్లేసేవారే ఉండండి ఆంధ్రాలో.. అని ఫ్యూచర్లో అంటారేమో? అప్పుడు మేం కూడా పేర్లు మార్చుకుంటాం. పోసాని కృష్ణమురళి తీసేసి నర్సింగ్, యాదగిరి అని మార్చుకుని ఏ కరీంనగర్‌లోనే ఉంటాం. కనీసం వాళ్లు మమ్మల్ని బిడ్డల్లా చూస్తారు. ఇదే ఉమ్మడి ఆంధ్రాలో మీలాంటి నాయకులుంటే దేశం నాశనం అవుతుంది. రాష్ట్రం రెండు ముక్కలవడం అదృష్టం. కేసీఆర్‌లాంటి మహానుభావుడు రాబట్టి ఆంధ్ర అనే ఫీలింగ్ లేకుండా మా బిడ్డలు అని ప్రేమిస్తున్నాడు. మీరు నీతిగా, నిజాయితీగా, మనస్ఫూర్తిగా బ్రతకాలనుకుంటే... ఎలా రాజకీయాలు చేయాలో కేసీఆర్‌గారి దగ్గరకు వచ్చి నేర్చుకోండి. సాటి మనిషిని ఎలా ప్రేమించాలో నేర్చుకోండి. ఆయన రాజకీయాలు చేయొచ్చు. కానీ, ఒక మనిషిగా మానవత్వం ఉన్నవాడు కాబట్టి ఆయన కాళ్లు కడిగి పాదాభివందనం చేసి ‘అన్నా.. ఎలా మంచి మాటలు మాట్లాడాలి. రాజకీయాలు చేయాలి?’ అని నేర్చుకోండి. ఇన్నాళ్లూ తెలంగాణ దోచుకోబడ్డది కాబట్టి కేసీఆర్ నాలుగు మాటలన్నా తప్పులేదు. కానీ, ఆయన నీతిగా మాట్లాడారు. చచ్చిపోయే వరకూ నంది ముట్టుకోను! మీరు ఒక్క నందికే ఆంధ్రవాళ్లని నాన్‌లోకల్స్ అని పడేశారే! ఏం మాట్లాడాలి మీ గురించి? లోకేశ్‌బాబుని నా ముందు కూర్చోబెట్టండి. ‘యస్.. పోసాని నేను చెప్పింది కరెక్టే’ అంటే నేను చెంపలేసుకుని వెళ్లిపోతా. ఈ అవార్డు తీసుకోవాలంటే సిగ్గేస్తోంది. నేను షూటింగ్లో ఉండగా ‘టెంపర్’ సినిమాకి నాకు నంది అవార్డు వచ్చిందని ఫోన్లు వచ్చాయి. ఇంటికెళ్లి టీవీ చూస్తుంటే ఇవి ‘కమ్మ అవార్డులు. కమ్మవారు పంచుకున్నారు’ అంటున్నారంతా. ఈ నంది అవార్డు నాకొద్దు. ఈ అవార్డుని నేను వినమ్రంగా తిరస్కరిస్తున్నా. ఇలాంటి నీచమైన పద్ధతుల్లో అవార్డు తీసుకునే ఖర్మ నాకు పట్టలేదు. అటువంటి సంస్కారం నాకు లేదు. ఈ నంది ఇప్పుడొద్దు. ఈ అవార్డులన్నీ రద్దు చేయండి. చంద్రబాబుగారు అన్నట్టు ఐఆర్‌వీసీ పద్ధతుల్లో అవార్డులివ్వమనండి. అప్పుడు నాకు అవార్డు రాకున్నా ఆయన కాళ్లకి దండం పెట్టి వచ్చేస్తా. ఈ అవార్డులతో చాలామంది అన్యాయం అయిపోయామని అంటున్నారు. రద్దు చేయండి. చేస్తే తప్పేంటి? దానికెందుకు అహంకారం? ఎందుకు రద్దు చేయరు? అప్పటిదాకా నాకు ఈ నంది వద్దు. ఈ అవార్డులను రద్దు చేయకపోతే ఇప్పుడు కాదు.. నేను చచ్చిపోయేవరకూ నంది ముట్టుకోను. తప్పుదిద్దుకుంటారా? అప్పుడు నాకు రాకపోయినా పర్లేదు. నంది ఆపేస్తానంటే మీ సొంత సొమ్మా? నంది ఆపేస్తానంటే ఇది మీ సొంత సొమ్మా? మీ డబ్బులతో అవార్డులు పెట్టుకోండి. లోకేశ్‌బాబు బంగారు నంది పెట్టుకోండి. కమ్మవాళ్లకే ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. మీకు నచ్చినవాళ్లకు ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. నిజాయితీగా ఇవ్వదలచుకుంటే మాపై ఇన్ని నిందలు వేయవు. తెలుగు రోహింగ్యాలను చేయవు. మమ్మల్ని నాన్‌లోకల్ చేసి కొట్టించాలనుకున్నావా? కలహాలు రేపాలనుకున్నావా? ప్రాంతీయ దొరభిమానం పెట్టదలచుకున్నావా? ఈ నందులకీ ప్రాంతీయ తత్వానికి ఏంటి సంబంధం? హైదరాబాద్‌లో ఉన్న నీ ఇళ్లకు పన్ను గుంటూరులో కడతా వా? ‘విమర్శిస్తే మూడేళ్లు నందులివ్వం’ అంటూ ఓ పిచ్చి స్టేట్మెంట్. మీ అబ్బ సొమ్మా? ఏం స్టేట్మెంట్ అది? మీదాకా వస్తే లోకల్.. నాన్ లోకలా? ఏంటి.. విమర్శలు తీసుకోరా? చంద్రబాబుగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ప్రభుత్వాన్ని విమర్శించారు. విమర్శించాడని ఆయన్ని రాజకీయాలనుంచి వెళ్లగొట్టారా? అవినీతి, అక్రమాలు జరిగాయనే కదా ఆయన విమర్శించారు. అందుకని ఆయన్ని కొట్టారా? నాన్‌లోకల్ అని చెప్పి చిత్తూరు పంపించారా? మేం కూడా మిమ్మల్ని నమ్మబట్టే కదా ముఖ్యమంత్రి అయ్యారు. మరి మాదాకా వచ్చేసరికి లోకల్, నాన్‌లోకల్ అనడమెందుకు? అవార్డులు ఆపేస్తారని మీడియానే రాసిందా? అవార్డులు ఆపేస్తామని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ప్రభుత్వ వర్గాలు చెప్పాయంటూ వార్త రాశారు కదా? మరి ఇది దొంగచాటుగా రాశారా? తెలుగుదేశానికి అనుకూలంగా ఇలాంటి వార్తలు మీడియానే రాసిందా? ‘ప్రభుత్వం ఆగ్రహం’ అంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వకుండానే పేపర్లో రాశారా? చెప్పండి? ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటే ఎవరు? వాళ్లని రమ్మనండి. నాది తప్పు అని నిరూపిస్తే వాళ్ల కాళ్లకి దండం పెట్టుకుని చెంపలేసుకుని వెళ్లిపోతా. పోనీ.. అవార్డులు ఆపేస్తామనే మాట ఎవరన్నారో? వారి పేర్లు చెప్పమనండి. ఇంత ఘోరమైన ప్రకటన ఎవరిచ్చారో వారి పేర్లు మీడియా చెప్పొచ్చుగా? కామెంట్ చేయడానికి ఆధార్ కార్డు కావాలా? వారంతా ఎన్.ఆర్.ఏ.(నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్) అనే మాట లోకేశ్ ఎందుకన్నారు? ఆంధ్రాలో ఓటు లేకుంటే విమర్శించకూడదా? సమాజానికి ఎవరైతే నష్టం కలిగిస్తారో వారి గురించి ఎవరైనా కామెంట్ చేస్తారు. కామెంట్ చేయడానికి ఆధార్ కార్డు కావాలా? అంటే ఆధార్ కార్డు.. ఐడీ కార్డుంటే ఏమైనా చేయొచ్చా? హత్యలు కూడా చేయొ చ్చా? అవి లేకపోతే నోరు మూసుకుని కూర్చోవాలా? మీరు గొప్పోళ్లా? మేమా? తెలంగాణ రాష్ట్రం విడిపోక ముందే తెలుగుదేశం నాయకులంతా పరిగెత్తుకుంటూ అమరావతి వెళ్లారు పొలాలు, స్థలాలు కొందామని. రాజధాని ఎక్కడొస్తుందా అని తెలిసి భూములు ఎకరాలకెకరాలు కొనేశారు. ఆంధ్రాని మొత్తం మీరు దొబ్బి తినేశారు. మేం పిచ్చినా కొడుకుల్లా ఇక్కడే ఉంటూ మీడియా ముందు కూర్చుని రెండు మాటలంటున్నాం. మీరా గొప్పోళ్లు? మేమా? విమర్శిస్తే తెలుగు రోహింగ్యాలు చేస్తారా? అమరావతి చుట్టుపక్కల పోసాని పొలాలున్నాయో? టీడీపీ కార్యకర్తలు, ఇంకా ఎవరెవరి భూములున్నాయో లెక్కలేయండి తెలుస్తుంది. అప్పుడూ అంతే.. హైటెక్‌సిటీ అనగానే సగం మందికిపైగా తెలుగుదేశం నాయకులు మాదాపూర్‌లో భూములు కొనేశారు. మేం ఎవరం? అడుక్కునేవాళ్లమా? మాట్లాడే హక్కు కూడా లేదా? నేను అనలేదు. టీవీలో చూశా. 12మంది జ్యూరీలో 10 మంది కమ్మవాళ్లుంటే ఎవరికైనా డౌట్ రాదా? ప్రభుత్వం వారు మీరు కమ్మోళ్లా? అన్నప్పుడు ‘అవును సార్’ అంటాం. ‘అయితే మీరు అప్పర్ క్లాస్.. మీకేం అవసరం లేదు’ అంటారు. ‘సార్.. మాకు అన్నం లేదు’ అంటే, ‘నువ్వు అప్పర్ క్లాస్ వాడివి కదా నీకెందుకయ్యా అన్నం’ అని నన్ను చిన్నప్పుడు అన్నవాళ్లూ ఉన్నారు. మా నాన్న కూలీ. 50 రూపాయలు అప్పు పుట్టక ఆత్మహత్య చేసుకున్నారు. అది వేరే విషయం. అవి కూడా మేం మాట్లాడలేదే? ఓన్లీ నందుల గురించి, తప్పుల గురించి మాట్లాడాం. విజయవాడ వెళ్లొచ్చో లేదో.. క్లారిటీ ఇవ్వండి! అన్నీ వద్దు. ఒక్క ‘బి.ఎన్. రెడ్డి’ అవార్డు గురించి మాట్లాడదాం. ఈ అవార్డులొచ్చిన వారి సినిమాలు, దర్శకుడు ముత్యాల సుబ్బయ్యగారి సినిమాలు పక్కనపెట్టండి. సామాజిక స్పృహ, సందేశం ఉండాలంటారు కదా. సుబ్బయ్యగారి ‘కలికాలం’ ఎంత మంచి సినిమా. ఆ చిత్రం చూసి, దర్శకులు కె.విశ్వనాథ్‌గారు ‘ఈ కథ నావద్దకు వచ్చిందయ్యా.. నేను చేయలేకపోయా. సుబ్బయ్యగారు బాగా తీశారు’ అన్నారు. సగటు మనిషి, అమ్మాయి కాపురం, అరుణకిరణం, అన్న, పవిత్రబంధం, పెళ్లి చేసుకుందాం, స్నేహితులు.. వంటి మహిళా సాధికారత ఉన్న గొప్ప సినిమాలు సుబ్బయ్యగారు తీస్తే.. ఇలాంటి రెండు గొప్ప సినిమాలైనా బి.ఎన్.రెడ్డి అవార్డు వచ్చినవాళ్లు తీశారా? సుబ్బయ్య ఆ అవార్డుకి పనికిరాడంటే ‘నేను అజ్ఞానిని. పిచ్చికుక్కలాగా ఏదో వాగేశా. క్షమించండి’ అంటా. ఈ డౌట్లు జనాలకి వచ్చాయి. అడిగారు కూడా. నాకు నంది రాకుండా మాట్లాడుంటే ‘వీడికి నంది అవార్డు రాలేదు. జీవితంలో రాదు కూడా. పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. అందుకే తిడుతున్నాడు’ అంటా రు. నేను ఏ పార్టీవాణ్ణీ కాదు. నంది రావడంతో మాట్లాడే హక్కు వచ్చింది. ప్రభుత్వ వర్గాలను పిలిపించండి. నాది తప్పని నోరు మూయించండి. అప్పుడు నేను ‘ఇవి గొప్ప నంది అవార్డులు. ఇప్పుడే నా కళ్లు తెరుచుకున్నాయి. కుల పిచ్చే లేదు వీళ్లకి. అన్నీ న్యాయంగా ఇచ్చారు’ అని మెడలో బోర్డు వేసుకుని తిరుగుతా. న్యాయంగా ఇచ్చారని లోకేశ్‌బాబు అంటున్నారు కదా! అవార్డులిచ్చినవాళ్లు నాన్ రెసిడెన్స్ కదా! నువ్వే వాళ్లతో అవార్డులిప్పించి ఇప్పుడెందుకు ఆ మాటెత్తావ్? అంటే నోరు మూయించాలనా? ఎన్నాళ్లు మూయిస్తావ్? రౌడీలతో ఎన్నాళ్లు కొట్టిస్తావ్? ప్రశ్నిస్తే ఎంతమందిని చంపుతావ్? విజయవాడ Ðð ళ్లొచ్చో? లేదో ఓ క్లారిటీ ఇవ్వండి. ఇక్కడే కేసీఆర్‌గారి వద్ద పడుంటా. లోకేశ్ వంటి మంత్రి ఉండటం మా ఖర్మ నందుల గురించి విమర్శిస్తే జవాబు చెప్పాలి. ఇది న్యాయం కాదు. అన్యాయమని చెబుతున్నా. అందరూ తెలుగువాళ్లే. పరిపాలనాపరంగా విడిపోయారంతే. మరి తెలుగోళ్ల మధ్య ‘నాన్ రెసిడెన్స్’ అని ఎందుకు పెడుతున్నావ్? నీలాంటి వాడు ఏరినప్పుడు మిగతావాళ్లు కూడా ఏరతారు కదా? వీడు కమ్మోడు.. కాపోడు.. మాల.. మాదిగ.. బ్రాహ్మణ.. అంటూ జనాలు ఏరతారు. నీ విజ్ఞత ఏది? నంది అవార్డులకీ నాన్ రెసిడెన్స్‌కి సంబంధం ఉందా? లోకేశ్వంటి మంత్రి ఉండటం మా ఖర్మ. నీకు మాట్లాడటం రాదు. ఎలా మాట్లాడాలో నేర్చుకో. నేర్చుకోకుండా ప్రజల మీదనే తిరగబడుతున్నావా? నీకు ఓటు వేయనివాడు.. తెలుగుదేశం కానివాడు దుర్మార్గుడా? ఇది ప్రజాస్వామ్యం. దీని దెబ్బకి పెద్ద పెద్దవాళ్లే చంకనాకిపోయారు. ఆఫ్ట్రాల్ నువ్వెంత? నేనెంత? అధికారం ఎన్నాళ్లుంటది? ప్రజాస్వామ్యం, ప్రజలు, ఈ దేశం శాశ్వతం. భారతదేశం జిందాబాద్.. రాజకీయ వ్యవస్థ జిందాబాద్.. ప్రజాస్వామ్యం జిందాబాద్.. అవినీతి డౌన్ డౌన్.. అది నీకుందో లేదో గుండెపై చేయి వేసుకో.. సమాధానం దొరుకుతుంది. లోపం సరిదిద్దుకోరా? చంద్రబాబుగారి స్టేట్మెంట్లు చూస్తే తెలుస్తోంది. ఈ నంది అవార్డులు మేం నిజాయితీగా ఇచ్చాం అని ఎక్కడా అనడం లేదు. ఇవి అలా చేసుంటే బాగుండేది. ఐఆర్‌వీసీ పద్ధతుల్లో ఇచ్చుంటే బాగుండేదేమో? అన్నారు. అంటే అర్థమేంటి? రచ్చ జరిగిందనేగా లోపల. మరో మంచి మాట కూడా అన్నారు. ఏముంది నంది అవార్డుల్లో.. జ్యూరీ సభ్యులు బాగా చూసుకుంటారని పెట్టాం. వాళ్లు ఇచ్చిందాన్ని మేం ఏం చేయగలం? అన్నారు. అంటే లోపం జరిగిందనేగా? (అంటే చంద్రబాబు తప్పు ఒప్పుకున్నట్టేగా!) ఆ లోపం సరిదిద్దుకోరా? ఇవే ప్రభుత్వాలు పరీక్షలు పెడతాయి. పేపర్ లీకైతే ఎన్నిసార్లు పరీక్షలు రద్దు చేయలేదు. అలాగే ఇప్పుడు ప్రకటించిన నంది అవార్డులను రద్దు చేయాలి కదా? ఎందుకు చేయరు? విద్యార్థుల పట్ల ఒక నిజాయితీ.. సినిమా పరిశ్రమ పట్ల మరో నిజాయితీనా? ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఇది అక్రమ ఎన్నిక అంటే డిస్క్వాలిఫై అయిన ఎమ్మెల్యేలు, హుందాగా రాజీనామా చేసినవారూ ఉన్నారు కదా? -
'కళాకారులకు లోకేష్ క్షమాపణ చెప్పాలి'
సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై ఎన్నడూ లేనంతగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. విమర్శలపై స్పందించిన మంత్రి లోకేష్ నంది అవార్డుల వివాదం మరింత ముదిరితే అవార్డులను రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించారు. నాన్ రెసిడెన్షియల్స్, రేషన్ కార్డు, ఆధార్ కార్డులు లేనివారని అవార్డులపై మాట్లాడుతున్నారన్నారు. కాగా లోకేష్ వ్యాఖ్యలను ఏపీసీసీ తప్పుబట్టింది. లోకేష్ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం డిమాండ్ చేశారు. నంది అవార్డులకు కులం ఆపాదించవద్దంటూనే.. కళాకారులకు ప్రాంతాలు ఆపాదించే పనికి లోకేష్ పూనుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం నియమించిన కమిటీలోని సభ్యులను రేషన్ కార్డు, ఆధార్ కార్డులు చూసి నియమించారా? రెసిడెన్షియల్ చూసే నటులకు అవార్డులు ఇచ్చారా? ఎక్కువ నంది అవార్డులు వచ్చిన బాలకృష్ణ రెసిడెన్స్ ఎక్కడ ఉంది? అనే ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ప్రమేయంతో నంది అవార్డుల ఎంపిక జరిగిందనే ఆరోపణలు వచ్చినందున వెంటనే ప్రకటించిన అవార్డులను రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. -
పోసాని వ్యాఖ్యలకు బన్నీవాసు మద్దతు
నంది అవార్డుల వివాదాన్ని తెరమీదకు వచ్చింది బన్నీ వాసు ఫేస్ బుక్ పోస్ట్ తోనే.. ఇటీవల ప్రకటించిన అవార్డుల విషయంలో మెగా ఫ్యామిలీకి అన్యాయం జరిగిదంటూ బన్నీ వాసు స్పందించిన తరువాతే ఇంత వివాదం రాజుకుంది. నంది అవార్డుల వివాదం మరింత ముదిరితే అవార్డులను రద్దు చేస్తామంటూ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించటంపై పోసాని కృష్ణమురళి విరుచుకుపడ్డారు. తాజాగా బన్నీవాసు మరోసారి ఈ వివాదం పై స్పందించారు. పోసాని వ్యాఖ్యలు మద్దతు పలుకుతూ 'మనం ఏపీలో పుట్టాం.. ఏపీలో పెరిగాం.. ఏపీలోనే చదువుకున్నాం.. అమెరికాలో కాదు. మనం ఏపీ వాళ్లమని రుజువు చేసువాల్సిన అవసరం లేదు' అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. -
అవార్డులను విమర్శించాలంటే ఆధార్ కావాలా ?
-
నారా లోకేశ్ పై విరుచుకుపడ్డ పోసాని
‘నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తాం’.. ‘ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నరు’ అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి హైదరాబాద్‌లో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నారా లోకేశ్‌పై పోసాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా.. విమర్శించకూడదా.?..లోకేశ్... చదువుకున్నావా.. బుద్ది, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా... మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టటం లేదా..? ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు కదా?. మరి మీరు అక్కడ రాజకీయం ఎలా చేస్తారు' అంటూ ప్రశ్నించారు. నీ లాంటి నాయకులు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఉండి ఉంటే మేం నాశనం అయ్యే వాళ్లం. కేసీఆర్ ను చూసి ఎలా మాట్లాడాలో నేర్చుకోండి. లోకేశ్ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా?. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా?. అప్పుడు చంద్రబాబును ఎవరైనా నాన్ లోకల్ అన్నారా? నంది అవార్డులు విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా?. 2014 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. అప్పటివరకు, ఆ తర్వాత కూడా ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు. ఆస్తులు పెంచుకుంటూ ఏపీలో కూర్చొని ఏదైనా మాట్లాడొచ్చా? విమర్శించే వాళ్లు నాన్ లోకల్ అయితే జ్యూరీలో ఉన్న సభ్యుల మాట ఏంటి.. వారికి కూడా హైదరాబాద్ లోనే ఆధార్ కార్డులు ఉన్నాయి కదా, వారు కూడా ఇక్కడే ట్యాక్స్ లు కడుతున్నారు కదా మరి వారిని జ్యూరీలోకి ఎలా తీసుకున్నారు?. రాద్ధంతం చేస్తే నందులు తీసేస్తాం అన్నారు. మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎంత రాద్ధంతం జరిగింది మరి వారిని ఎందుకు తీసేయలేదు. భారత రత్న, పద్మ అవార్డుల విషయంలో కూడా చాలా సార్లు విమర్శలు వచ్చాయి అవి తీసేశారా? అని సూటిగా ప్రశ్నలు సంధించారు. టెంపర్ సినిమాకు తనకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డును తిరస్కరిస్తున్నట్లు పోసాని కృష్ణమురళి ఈ సందర్భంగా ప్రకటించారు. ‘ఈ అవార్డు అందుకోవటానికి నేను సిగ్గుపడుతున్నా.. అవార్డు తీసుకుంటే పోసాని కమ్మోడు కాబట్టే ఈ కమ్మ అవార్డు వాడికి ఇచ్చారు అంటారు. అందుకే ఈ అవార్డులను రద్దు చేయండి. చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఐవీఆర్ఎస్ పద్దతిలో మరోసారి విజేతలను ఎంపిక చేయండి. ’ అని పోసాని కోరారు. నంది అవార్డులను రద్దు చేయాలి -
ఏపీలో ఆధార్‌లేని వాళ్లు మాట్లాడతారా?
-
నంది అవార్డుల వివాదంపై స్పందించిన బాబు
-
‘నంది’తో పరువుపోయింది
సాక్షి, అమరావతి: నంది అవార్డుల ప్రకటనతో పరువు పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం ఇంత రచ్చ అవుతుందని తాను అనుకోలేదని, ఇంత రాద్ధాంతం జరుగుతుందనుకుంటే ఇలా చేసే వాడిని కాదని అన్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన తర్వాత జరిగిన టీడీపీ వ్యూహ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నంది అవార్డుల ప్రకటన తీవ్ర వివాదాస్పదంగా మారి అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. టీడీపీ నేతల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అవార్డులు ప్రకటించి తప్పు చేశామని చంద్రబాబు చెప్పారు. ఇంత వ్యతిరేకత వస్తుందని ఊహించి ఉంటే ఐవీఆర్ఎస్ సర్వే చేయించి అభిప్రాయాలు సేకరించేవారమని తెలిపారు. జ్యూరీ ఎంపిక చేసిన వారికే అవార్డులు ఇచ్చామన్నారు. ఏపీలో ఆధార్‌లేని వాళ్లు మాట్లాడతారా?: లోకేశ్ ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్, ఓటర్ కార్డు లేని వారు నంది అవార్డులపై మాట్లాడుతున్నారని మంత్రి లోకేశ్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై తన తండ్రి, సీఎం చంద్రబాబు చాలా బాధపడ్డారని తెలిపారు. సోమవారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో ముచ్చటించారు. -
రచ్చ అవుతుందని అనుకోలేదు
సాక్షి, అమరావతి: నంది అవార్డుల వ్యవహారం ఇలా రచ్చ అవుతుందని అనుకోలేదని సీఎం చంద్రబాబు వాపోయారు. సోమవారం జరిగిన స్ట్రాటజీ కమిటీ సమావేశంలో నంది అవార్డుల వివాదం చర్చకు వచ్చింది. ఇంత వివాదం అవుతుందని తెలిస్తే ఐవీఆర్ఎస్(ఇంటారాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సర్వే)తో అవార్డులకు ఎంపిక చేసే వాళ్లమని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి అంశానికి కులం రంగు పులమడం సరికాదన్న చంద్రబాబు.. జ్యూరీ సభ్యుల నిర్ణయం మేరకే నంది అవార్డులు ప్రకటించామని చెప్పుకొచ్చారు. పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికీ సీరియస్‌గా ఉండటం లేదని చంద్రబాబు మండిపడ్డారు. అంశాలవారీగా మాట్లాడాలని క్లాస్ తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులపై సమీక్ష పోలవరం ప్రాజెక్టు పనులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. గడిచిన వారం రోజుల్లో 26 వేల క్యూబిక్ మీటర్ల తవ్వకం, స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్‌కు సంబంధించి 10,891 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 4 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తికాగా, మరో 12.04 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు చేపట్టాల్సి వుందని వెల్లడించారు. 384 ఆర్మ్ గిర్డర్ల ఫ్యాబ్రికేషన్ పూర్తయిందని, 20 హారిజంటల్ గిర్డర్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. రాష్ట్రంలో సుమారు 7 వేల చెక్ డ్యాంలు ఇంకా నిర్మించాల్సిన అవసరం వుందని లెక్క తేల్చారు. ప్రాజెక్టులు నిర్మించడం ఎంత ముఖ్యమో, నీటి నిర్వహణ అంతే ముఖ్యమని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన నిర్మాణ సంస్థ ట్రాన్స్ట్రాయ్కు తాము వ్యతిరేకం కాదని, ప్రాజెక్టు నిర్మాణం త్వరగా పూర్తికావాలనేదే తమ ఉద్దేశమని కేంద్ర మంత్రి గడ్కరీకి వివరించినట్టు చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టులో భాగమైన దిగువ కాఫర్ డ్యాం నిర్మాణం పనులు ప్రారంభించడానికి సిద్ధంగా వున్నట్టు ముఖ్యమంత్రితో సీఈ రమేష్ అన్నారు. -
ఆధార్‌కార్డులేని మీరా విమర్శించేది: లోకేశ్
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వివాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఏపీలో ఆధార్ కార్డు, ఓటరు కార్డులేని వారే హైదరాబాద్‌లో కూర్చొని నంది అవార్డులపై విమర్శలు చేస్తున్నారని లోకేశ్ అన్నారు. హైదరాబాద్ నుంచి విమానాల్లో వచ్చిపోయేవాళ్లు.. స్థానికత లేనివాళ్లే నంది అవార్డులను విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. మూడు సంవత్సరాలకుగాను ఏపీ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటిస్తే.. లేనిపోని విమర్శలు చేస్తున్నారని, ఒకరిద్దరు మాత్రమే ఇలా విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. నంది అవార్డుల ఎంపిక పారదర్శకంగా జరిగిందని చెప్పుకొచ్చారు. అవార్డులు ఇవ్వని వారిని ఏమీ అనరా అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నించారు. నంది అవార్డుల్లో అధికార టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి, ఒక సామాజిక వర్గానికి పెద్ద పీట వేయడం తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. నంది అవార్డులు ప్రకటించిన తీరుపై తెలుగు సినీ ప్రముఖులు పలువురు బాహాటంగా తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డులు ప్రకటించిన తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో నంది అవార్డుల ఎంపికను ప్రశ్నించిన వారిని ఉద్దేశించి లోకేశ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. అసలు ఆధార్ కార్డుకు నంది అవార్డులకు సంబంధం లేదు. ఆధార్ కార్డు ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి సంబంధించినది కాదు. అది దేశానికి సంబంధించినది. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డుకు నంది అవార్డులకు ముడిపెట్టి.. లోకేశ్ విమర్శలు చేయడంపై విస్మయం వ్యక్తం అవుతోంది. మీడియా సమావేశంలో విలేకరులు సైతం ఇదే ప్రశ్న లేవనెత్తినా లోకేశ్ స్పందించలేదు. -
జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి
‘‘జీవితారాజశేఖర్గారంటే నాకు గౌరవం. ఆవిడ ‘నంది’ అవార్డుల ప్రకటన అవగానే బయటికొచ్చి ‘చంద్రబాబునాయుడుగారు రాకింగ్.. తెలుగుదేశం రాకింగ్’ అన్నారు. ‘మీరు తెలుగుదేశంలో చేరబోతున్నారా? అని కొందరు అడిగితే.. వాళ్లు చేరమంటే ఎందుకు చేరను? అని ఆమె అన్నట్టుగా కొన్ని పేపర్లలో నేను చదివాను. ఇది చదివాక ఆమెపై నాకు విశ్వసనీయత పోయింది. అది పోయినప్పుడు మనం వాళ్ల మాటలని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదనిపిస్తోంది’’ అని దర్శకుడు గుణశేఖర్ అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నంది అవార్డులపై తన అభిప్రాయాలను చెప్పారు. వర్మగారిని నిందించడం తగదు దర్శకులు రామ్‌గోపాల్‌వర్మగారి మీద మరో దర్శకుడు మద్దినేని రమేశ్‌గారు చేసిన ఆరోపణలు, ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు సాటి దర్శకుడిగా బాధ కలిగించాయి. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన ఎందుకంత తీవ్ర పదజాలంతో వాడకూడని భాష వాడాల్సి వచ్చిందన్నదే నా బాధ. దాసరి నారాయణరావుగారి తర్వాత యువ దర్శకులందరికీ మంచి గుర్తింపు తీసుకొచ్చారు వర్మ. ఆయనే మాకు స్ఫూర్తి అని ఈ రోజుకి కూడా కొత్త దర్శకులు చెప్పుకుంటున్నారు. అలాంటి ఆయన్ను తీవ్ర పదజాలంతో మాట్లాడటం తగదు. దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని రమేశ్‌గారిని కోరుతున్నా. వర్మగారి మాటలు వ్యంగ్య బాణాల్లాంటివి. ఆయన మాటల్ని ఎవరూ సీరియస్‌గా తీసుకోరు. కానీ, మద్దినేని రమేశ్‌గారు ఎందుకు తీసుకున్నారో అర్థం కావడం లేదు. ఆయన వ్యంగ్య మాటల నుంచి కొన్ని రియలైజ్ అవ్వాలి, మరికొన్ని నవ్వి ఊరుకోవాలి తప్పితే ఇలా మాట్లాడకూడదు. ఆ మధ్య ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’ సినిమాలోని ఓ పాటలో ఆయన్ని ఆయనే విమర్శించుకుని మమ్మల్నీ తీవ్రంగా విమర్శించడంతో మేం నవ్వుకున్నాం. నా గురించి ఏం రాశారా? అని బోయపాటి శ్రీను తెలుసుకుని మరీ నవ్వుకున్నారట. వర్మలా ప్రశ్నించే వ్యక్తిని మనమెప్పుడూ దూషించకూడదు. మనం వాళ్లకీ, వీళ్లకీ భయపడుతుంటాం. కానీ, ఆయన కల్మషం లేకుండా మాట్లాడేస్తుంటారు. అలాంటి వ్యక్తిని ఇక మాట్లాడకుండా చేయకూడదు. ఆయన లాంటోళ్లు మాట్లాడితే మంచిది. ఆర్కే లక్ష్మణ్‌గారు, కార్టూనిస్ట్ శ్రీధర్‌గారు, దర్శకుడు బాలాగారు.. వారివన్నీ వ్యంగ్యాస్త్రాలు. అవి హాని కలిగించేవి కావు. వాళ్ల ధోరణిలో సమాజాన్ని చూస్తుంటారు. మహామహులు దాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్నారు. నా వెనక శక్తులేం లేవు! నిన్న, మొన్న చాలామంది అన్నారు. అస్సలు ఈ గుణశేఖర్ ఎవడు? ‘రుద్రమదేవి’ సినిమా రిలీజ్ అయి రెండు మూడేళ్లయింది. ఇప్పుడు మళ్లీ ట్యాక్స్ మినహాయింపు, నాకు అన్యాయం జరిగిందని అంటాడేంటి? అసలు తను దరఖాస్తు సరిగ్గా చేయలేదు. రిలీజ్ అయ్యాక చేశాడు. ముందే చేసుంటే పన్ను మినహాయింపు మా తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకివ్వదు? తప్పంతా ఆయనలోనే పెట్టుకుని ఇప్పుడు మాట్లాడుతున్నాడంటే ఆయన వెనక ఏమైనా శక్తులున్నాయా? అంటున్నారు. నా వెనుక శక్తులేమీ లేవు నేనొక్కడినే. జ్యూరీ సభ్యులు టి.ప్రసన్నకుమార్‌గారు ఓ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘రుద్రమదేవి’ విడుదలయ్యాక దరఖాస్తు చేశారని. నేను రిలీజ్‌కి ముందే అప్లై చేశాను. 2015 అక్టోబర్ 9న రిలీజ్. 7వ తేదీ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ ఉంటే తప్ప పన్ను మినహాయింపుకు దరఖాస్తు చేసుకోలేం. అక్టోబర్ 8న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు దరఖాస్తు చేశా. వాళ్లు ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించింది. కానీ, ఏపీ స్పందించలేదు. 12న చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లంగారు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి ఒక నోటీస్ కూడా పంపించారు. నాకూ ఒక సీసీ పంపించారు. పన్ను మినహాయింపు కోసం ఒక స్క్రీనింగ్ కమిటీ వేసి పరిశీలించ మని ఆ నోటీస్‌లో ఉంది. కానీ, హైదరాబాద్ నుంచి ఆఫీసు విజయవాడకి సర్దుతున్నాం ఒక నెల ఆగమన్నారు. ఆ తర్వాత ఫైళ్లన్నీ సర్దుతున్నాం మరో నెల పడుతుందంటూ కాలయాపన చేశారు. మూణ్నెల్ల తర్వాత ఫైల్ క్లోజ్ చేయమని మాకు పైనుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. షాక్ అయి, నేను దరఖాస్తు చేసిన, చీఫ్ సెక్రటరీగారు ఇచ్చిన కాపీలతో వైజాగ్ వెళ్లి మంత్రి అయ్యన్న పాత్రుడిని కలిశా. అజయ్ కల్లంగారిచ్చిన నోటీస్ చూసి, ‘ఆదేశాలున్నా ఎందుకు కమిటీ వేయలేదు. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుందాం. నేను అమరావతికి వెళ్లినప్పుడు చెబుతాను నువ్వు కూడా రా’ అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి నాకు కాల్ రాలేదు. నేనే ఫోన్ చేస్తే, లిఫ్ట్ చేయలేదు. మెసేజ్ పెట్టినా స్పందించకపోవడంతో వదిలే శా. ఆ తర్వాత మంత్రి గంటా శ్రీనివాసరావుగారిని కలిశా. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చేందుకు అత్యవసరంగా కేబినెట్ మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలోనే ‘రుద్రమదేవి’ సినిమా విషయాన్ని ప్రస్తావిస్తా అన్నారు. ఆ తర్వాత ఆయన్నుంచి కూడా రెస్పాన్స్ లేదు. దాదాపు 70–80 కోట్లతో ‘రుద్రమదేవి’ లాంటి చారిత్రాత్మక సినిమా నిర్మించాను కాబట్టి, ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇస్తే, మంచి సపోర్ట్ అవుతుందని భావించా. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది కదా.. ఏపీ కూడా ఇస్తే నాకు సపోర్ట్ అవుతుందనే ఉద్దేశ్యంతో నా వైపు నుంచి ఎటువంటి తప్పిదం లేకుండా దరఖాస్తు చేశా. నాకు సమాధానం రాలేదు కాబట్టే చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా లేఖ రాశా. ఆయన్ని విమర్శించలేదు. నాకు జరిగిన అన్యాయాన్ని వివరించా. ఆ నిబంధన తీసేయాలి నంది అవార్డుల విషయానికొస్తే ప్రతి సంవత్సరం విమర్శలుంటాయి. రానివాళ్లు అసంతృప్తి వెళ్లబుచ్చడం కరెక్టే. కానీ, ఈ ఏడాది.. మా అసంతృప్తిని వెళ్లగక్కడానికి కూడా వీలు లేకుండా ఓ నియమం పెట్టారు. అవార్డు రాకుంటే బహిరంగంగా విమర్శించకూడదనీ, అలా చేస్తే మరో మూడేళ్లు వారు దరఖాస్తు చేసుకోవడానికి కుదరదని దరఖాస్తులో పేర్కొనడం కరెక్ట్ కాదు. అందువల్ల బయటకి వచ్చి మాట్లాడాలంటే భయమేస్తోంది. మాలాంటి వాళ్లకి ఇప్పుడూ అవార్డులు రాక.. తర్వాత మరో మూడేళ్లు అవార్డులు రాకుంటే ఎలా సార్? అని అప్కమింVŠ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ నాతో అన్నారు. అడిగే హక్కు మాకు ఉంటుంది. ప్రతి సంవత్సరం విమర్శలు వస్తుంటాయి. నేను అవార్డు పొందినప్పుడు కూడా ఎవరో ఒక్కరు విమర్శించినవాళ్లే. ఎవరూ కూడా ఒక స్థాయికి మించి విమర్శించరు. ఓ స్థాయికి మించి విమర్శిస్తే సుమోటాగా స్వీకరించి చర్యలు తీసుకోవచ్చు. నాకు రాలేదు, ఎందుకు రాలేదు? అని ఎవరి హద్దులో వారు అడగొచ్చు. అది తప్పుకాదు? మెసేజ్ కనిపించలేదా? ‘రుద్రమదేవి’ సినిమా విడుదలైంది 2015లో. ఆ సంవత్సరం జ్యూరీ చైర్మన్ జీవితాగారు. మా విమర్శలను కొందరు మీడియా మిత్రులు ఆమె వద్ద ప్రస్తావించగా.. ఆవిడ స్పందించారు. ఉత్తమ చిత్రం విభాగంలో ‘బాహుబలి’తో ‘రుద్రమదేవి’ అన్ని విభాగాల్లో పోటీ పడలేకపోయింది. అందువల్ల ‘బాహుబలి’కి ఇచ్చాం అన్నారామె. పోటీ పడ్డప్పుడు ఉత్తమ చిత్రంగా రాకపోతే ఆ పోటీ పడ్డ సినిమా రన్నరప్ కింద అవుతుంది. ద్వితీయ ఉత్తమ చిత్రం అవుతుంది కదా అని కొందరంటే.. జ్యూరీ కన్సిడర్ చేయడానికి కూడా చాలా గట్టి పోటీ ఉందని చెప్పారట. అంటే.. జ్యూరీలో ఉన్న సినిమాలకి కూడా మీరు తీసిన చారిత్రాత్మక చిత్రం పోటీ పడలేకపోయిందా? సార్ అని కొందరు నాతో అన్నారు. దర్శకత్వం విభాగంలో పోటీ పడలేదంటే డైరెక్టర్‌గా రాదు. టోటల్ సినిమాలో సమాజానికి మేలు చేసే ఒక మెసేజ్ ఉంది అనుకున్నప్పుడు కచ్చితంగా ఉత్తమ మూడు చిత్రాల విభాగంలో ఏదో ఒకటి ఇస్తారు. దీనికంటే వేరే సినిమాలు గొప్ప మెసేజ్ ఇస్తున్నాయంటే కనీసం జ్యూరీ కింద ఇస్తారు. మరి ‘రుద్రమదేవి’ కంటే మిగతా సినిమాల్లో ఏం సందేశం కనిపించిందో తెలియడం లేదు. జ్యూరీ బాధ్యతగా వ్యవహరించాలి. ఎక్కువ మంది సినిమావాళ్లనే పెడుతున్నారు. అది కరెక్ట్ కాదు. రాజకీయ లబ్ధి పొందేవారు అస్సలు ఉండకూడదు. అవార్డులు ప్రకటించి బయటికొచ్చి ఓ ప్రభుత్వాన్ని జీవితగారు మెచ్చుకున్నారంటే.. ఏదో రాజకీయ లబ్ధి ఆశించే అనుకుంటారు. రాజకీయ ప్రయోజనాల కోసం కళాభిమానుల కష్టాన్ని పణంగా పెట్టొద్దని విన్నవించుకుంటున్నా.అల్లు అర్జున్ విషయంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అప్లై చేశారని చెప్పారు. సహాయ నటుడిగానే దరఖాస్తు చేశా. సహాయ నటుడిగానే అప్లయ్ చేసినా, ఎస్వీ రంగారావు పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇచ్చాం అన్నారు. మేం ఏ కేటగిరీకి దరఖాస్తు చేశామో దాన్ని వారు మార్చడానికి లేదు. రంగారావుగారి పేరు మీద ఉంది కదా అని క్యారెక్టర్ ఆర్టిస్టు అవార్డు ఇచ్చామంటే సహాయ నటుడి అవార్డుని తగ్గించినట్లవుతుంది కదా? ఇప్పుడు చాలామంది జాతీయ అవార్డులని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. జాతీయ అవార్డు గైడ్‌లైన్స్ వేరు.. నంది అవార్డు గైడ్‌లైన్స్ వేరు. మనకి మన ప్రాంతీయత, సంస్కృతిపైన ఆధారపడి ఉంటాయి. అలా ‘రుద్రమదేవి’ విషయానికొస్తే.. కొన్నింటిలో వాళ్లకి కన్వీనెంట్‌గా ఉన్నవి జాతీయ అవార్డులతో కంపేర్ చేసుకుంటున్నారు. కన్వీనెంట్‌గా లేనివి మనది వేరు కదా అంటున్నారు. ‘రుద్రమదేవి’కి జాతీయ అవార్డులో ఉత్తమ ప్రాంతీయ చిత్రం రానందుకు నాకు ఏమాత్రం అసంతృప్తి లేదు. ‘కంచె’ సినిమాకి ఇచ్చారు. ఆ సినిమా నా దృష్టిలో ‘రుద్రమదేవి’ కంటే గొప్ప సందేశం ఇచ్చిన సినిమా. అది కుల వ్యవస్థ మీద పోరాడే, ప్రశ్నించే సినిమా. ‘కంచె’కి అవార్డు రావడంతో తొలుత షాక్ అయ్యా. కథ విన్నాక కరెక్టే అనిపించింది. ‘రుద్రమదేవి’లో తెలుగువారు మరచిపోతున్న చరిత్రను చూపించా. దర్శకత్వమో, మరొకటో నాసిరకంగా కనిపించి ఉండవచ్చు. కానీ, సినిమా ఇచ్చిన సందేశం అందలేదా? అందువల్ల నేను అప్సెట్ అయ్యానే కానీ, ఉత్తమ దర్శకుడి అవార్డు రాలేదనే బాధ లేదు. ‘బాహుబలి’ బెటర్ సినిమానే. రాజమౌళికి అవార్డు ఇచ్చినందకు హ్యాపీ. కానీ, ‘రుద్రమ దేవి’లో సందేశం లేదా? సాటి మహిళ జ్యూరీలో ఉండి కూడా మహిళా సాధికారత మీద తీసిన సినిమాకి న్యాయం జరగలేదంటే ఏమనాలి? ఇండియా కాదు. ప్రపంచ వ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అన్నది మేల్ డామినేషన్. అలాంటిది 70–80 కోట్లు పెట్టి ఓ మహిళ మీద సినిమా తీశాడే. చెడగొట్టాడే. అయినా వీడి సందేశం బాగుందే. ప్రయత్నాన్ని చిన్నగా తట్టి ప్రోత్సహిద్దామనుకుంటే నాకు లక్షలు వచ్చేయవు కదా? పన్ను మినహాయింపు గురించి నేనిప్పుడు మాట్లాడింది కూడా అది తిరిగి ఇచ్చేస్తారని కాదు. అది సమాధి అయిపోయింది. కానీ, నాకు జరిగిన అన్యాయం అందరికీ తెలియాలి. -
మాటలతో కాదు, చేతలతో.. ‘నంది’వివాదంపై బాలకృష్ణ
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. సమిష్టికృషితోనే ’లెజెండ్’ సినిమా విజయవంతమైందని ఆయన అన్నారు. ’లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు వచ్చాయి. ఈ సినిమాకు అవార్డుల పంట పండింది. సమిష్టికృషితోనే ఇది సాధ్యమైంది’ అని చెప్పారు. అవార్డుల పంట కురిపించినందుకు నంది అవార్డుల కమిటీ జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. నంది అవార్డులు గెలుచుకున్న ఇతర సినిమాల నటీనటులకు, చిత్ర యూనిట్లకు ఆయన అభినందనలు తెలిపారు. నంది అవార్డులపై వస్తున్న విమర్శలపైనా బాలకృష్ణ స్పందించారు. లెజెండ్ అనేది మామూలు టైటిల్ కాదని, ఈ టైటిల్ పెట్టినప్పుడు వివాదాలు వచ్చాయని అన్నారు. తమ సినిమా మాటలతో కాదు చేతలతో నిరూపించిందని చెప్పుకొచ్చారు. నంది అవార్డుల వివాదంపై విలేకరులు ప్రశ్నించగా..‘లెజెండ్ అనేది మామలూ టైటిల్ కాదు.. అది పెట్టినప్పుడే.. తెలుసు మీకు లెజెండ్ గురించి ఎలాంటి కాంట్రవర్సీలు ఉన్నాయో.. మాటలతో కాదు చేతలతో చూపించింది మా లెజెండ్ సినిమా’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు బావమరిది అయిన బాలకృష్ణకు, టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి నంది అవార్డులు ప్రకటించడంపై సోషల్ మీడియాలో, టాలీవుడ్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. -
నంది అవార్డులపై జీవిత ఘాటు వ్యాఖ్యలు
నంది అవార్డులు ఇప్పుడు టాలీవుడ్లో హాట్‌టాపిక్. అవార్డుల ఎంపికలు సరిగ్గా లేవంటూ టాలీవుడ్లో నిరసన గళం వినిపిస్తోంది. వీటిపై రామ్‌గోపాల్ వర్మ నంది అవార్డు కమిటీకి ఆస్కార్ ఇవ్వాలంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించగా, అవి నంది అవార్డులు కాదు సైకిల్ అవార్డులు అంటూ బండ్ల గణేష్ ఎద్దేవా చేశారు. బన్నీవాసులతో పాటు పలువురు ప్రముఖులు సైతం విమర్శల గళం ఎక్కుపెట్టారు. తాజాగా జీవితా రాజశేఖర్ నంది అవార్డులపై ఘాటుగా స్పందించారు. 2015 నంది అవార్డుల జ్యూరీకి చైర్మన్ గా ఉన్నారు. అవార్డుల జాబితాను మూడు నెలల పాటు కసరత్తు చేసి విజేతలను ఎంపిక చేస్తారని అన్నారు. జ్యూరీ సభ్యుల శ్రమని పాజిటివ్‌గా తీసుకోకుండా పరిశ్రమ పరువుని తీస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపికలో పలు అంశాలను పరిగణలోకి తీసుకుంటారన్నారు. జ్యూరీ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలియని వారికి మాట్లాడే అర్హత లేదంటూ జీవిత ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎంపిక ప్రక్రియ గురించి మెగా ఫ్యామిలీలో ఏ ఒక్కరూ స్పందించలేదని, వారికి లేని బాధ, బయటి వారికి ఎందుకంటూ జీవిత ప్రశ్నించారు. -
బెడిసికొట్టిన చంద్రబాబు ప్లాన్ !
-
ఇష్టమొచ్చినట్లు అవార్డులిస్తే సినిమాలు తీయడమెందుకు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించిన విధానం, జ్యూరీ తంతు చూస్తుంటే వార్ వన్‌సైడ్ అన్నట్లే కనిపిస్తోంది. మంచి సినిమాలకు అన్యాయం జరిగిందనే బాధ కలిగింది. మూడేళ్ల అవార్డులు ప్రకటించిన తీరు చూస్తుంటే ముందుగా ఎంపిక చేసిన సినిమాల లిస్టును ముఖ్యమంత్రికి సమర్పించినట్లు అర్థమవుతోంది’’ అని నిర్మాత చంటి అడ్డాల విమర్శించారు. ఇంకా మాట్లాడుతూ –‘‘మనం’ వంటి కుటుంబ కథాచిత్రం, ‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక సినిమా, ‘రేసుగుర్రం’ లాంటి కమర్షియల్ సినిమాతో పాటు ఎన్నో హిట్ సినిమాలున్నాయి. అవార్డు తీసుకునే అర్హత వీటిలో దేనికీ లేదా? ‘సెలక్షన్ కమిటీ మన చేతిలో ఉంది కదా’ అని ఇష్టమొచ్చిన సినిమాలను ఎంపిక చేసి అవార్డులిచ్చేస్తే సినిమాలు తీయడమెందుకు? అవార్డుల ఎంపిక సమయంలో జ్యూరీలో తెలిసిన వ్యక్తిగానీ, ప్రభుత్వ పరిచయాలుగానీ, రెకమెండేషన్‌గానీ ఉండాలా? అనిపిస్తోంది. ఇకపైనా ఇలాగే కొనసాగితే నంది అవార్డు వృథా అనుకోవచ్చు. అప్పట్లో నేను చేసిన ‘ప్రేమ’ (2002) సినిమాకి నంది అవార్డు వచ్చిందని కెమెరామేన్ ఎస్. గోపాల్‌రెడ్డి ఫోన్లో చెప్పారు. కానీ, మరుసటి రోజు ఆ లిస్టులో మా సినిమా లేదు. రికమెండేషన్ ఉందని మరో సినిమాకి ఇచ్చారు. ఇక్కడ వ్యక్తిగత కాంపౌండ్లు ఉండకూడదు. ఉన్నది ఒక్కటే... అదీ సినిమా కాంపౌండ్’’ అన్నారు. -
వర్మకు మహేశ్ కత్తి మద్దతు
సాక్షి, హైదరాబాద్: నంది అవార్డుల ఎంపికపై సెటైరిక్‌గా స్పందించడంతో ఆగ్రహానికి గురైన అవార్డ్ కమిటీ మెంబర్ మద్దినేని రమేష్ బాబు బూతు పురాణాన్ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు సినీ విమర్శకుడు మహేష్ కత్తి మద్దతు తెలిపారు. ‘ప్రజాస్వామిక విలువలు లేని జ్యూరీ సభ్యులు సరైన నిర్ణయాలు తీసుకుంటారని ఎవరు నమ్మాలి? ఫ్యూడల్, పితృస్వామిక, కుల భూయిష్టమైన భావజాలం కలిగినవాళ్ళు ప్రజాస్వామిక నిర్ణయం తీసుకోగలరా అనే ఒక విజ్ఞత కలిగిన ప్రశ్న ఆర్జీవీది. దీనికి సమాధానం ఉందా!?! అని కత్తి మహేశ్ శుక్రవారం తన ఫేస్బుక్ పేజీలో పోస్టు చేశాడు. ఇంతకీ రామ్ గోపాల్ వర్మ ప్రశ్నేంటంటే..? ‘ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుంది.....అలాగే నేను నంది అవార్డులు ఇచ్చిన వైనంపై స్పందించాను. అని దీనికి అవార్డ్ కమిటీ మెంబర్ మద్దినేని రమేష్ బాబు తనపై బూతు పదజాలంతో ఘాటుగా స్పందించారు. నన్ను తిట్టినందుకు నాకేం బాధ లేదు....... కానీ ఇలాంటి వ్యక్తులని అవార్డ్ కమిటీలో ఎన్నుకున్నందుకు ప్రభుత్వం మీద బాధగా ఉంది. ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు.......... అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్తితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలి. అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేశాడు. -
ఎమోషనల్ అయిన వర్మ.. ఏం చేశాడో చూస్కోండి
సాక్షి, సినిమా : దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మరోసారి తన శైలిని ప్రదర్శించారు. నవంబర్ 20న ఉదయం 10 గం. 30 ని. అన్నపూర్ణ స్టూడియోలో నాగార్జునతో తీయబోయే కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుందంటూ ఫేస్ బుక్‌లో ఓ సందేశం ఉంచారు. శివ ఓపెనింగ్ రోజు తన తండ్రి, నాగ్ తండ్రి నాగేశ్వరరావు హాజరయ్యారని.. కానీ, ఇప్పుడు కొత్త చిత్రం కోసం తన తల్లి, నాగ్ సోదరుడు అక్కినేని వెంకట్, మరో నిర్మాత యార్లగడ్డ సురేంద్ర హాజరవుతారన్నారు. ఆపై ప్రతీ 3 దశాబ్దాలకోకసారి తానూ ఎమోషనల్, సెంటిమెంట్ అవుతానని చెప్పారు. ఇక ఆ తర్వాతే అసలు వ్యవహారం మొదలైంది. నంది అవార్డుల ప్రకటనపై తన అసంతృప్తిని వెల్లగక్కిన వర్మ ఓ వీడియోను పోస్ట్ చేశాడు. కాసేపటికి నంది అవార్డులపై సెటైరిక్‌గా నంది విగ్రహం పాడిన పాట... అంటూ చేసిన ఓ పోస్ట్ హిల్లేరియస్‌గా పేలింది. ఎన్టీఆర్.. ఏఎన్నార్ ప్రధాన పాత్రలో వచ్చిన చాణక్య చంద్రగుప్త సినిమాలోని ఒకటా.. రెండా... తొమ్మిది... మరి ఒకతే తకతై చిన్నది... అని సినారె రాసిన పాట సాహిత్యాన్ని వర్మ టోటల్ గా మార్చిపడేశాడు. ఒకటా.. రెండా... తొమ్మిది... మరి ఒకటే నేనూ నందిని... అంటూ కొత్త వర్షన్ రూపొందించాడు. సైకిల్, కమ్మది, పచ్చ జెండా వంటి కొన్ని పదాలను వాడి నంది అవార్డుల కమిటీ, దాని వెనుక పెద్ద తలకాయలను ఏకీపడేశాడు. అవార్డుల విషయంలో అంతా మా ఇష్టమని కమిటీ సభ్యులు(రాజబాబు, పద్మనాభం, రావుగోపాలరావు...) అంటుంటే, నందిగా జయ మాలిని తన గోడును చెప్పుకోవటం... ప్రస్తుతం ఈ వర్మ వర్షన్ సాంగ్ వైరల్ అవుతోంది.. దానిని మీరూ ఓ లుక్కేయండి. -
‘నంది అవార్డులకు కావాల్సిన వారి ఎంపిక’
సాక్షి, మడకశిర: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదం ఇప్పుడే ఆగేట్లు కనిపంచడం లేదు. ఈ నంది అవార్డులపై తాజాగా పీసీసీ చీఫ్ ఎన్. రఘువీరారెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డుల ఎంపికలో పారదర్శకత పాటించలేదని పీసీసీ చీఫ్ విమర్శించారు. ఆయన శుక్రవారం తన స్వగ్రామమైన నీలకంఠపురంలో విలేకరులతో మాట్లాడుతూ.. నంది అవార్డుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండటం తగదన్నారు. ప్రభుత్వం నంది అవార్డులకు కావాల్సిన వారిని ఎంపిక చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. కమీషన్ల కోసమే పోలవరం ప్రాజెక్టు పనులను ప్రభుత్వం సాగదీస్తోందని విమర్శించారు. పోలవరం పనుల్లో వేగవంతం లేదని ఆయన అన్నారు. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం తప్పిదం వల్లే బోటు ప్రమాదం జరిగిందని విమర్శించారు. ఈ ప్రమాద సంఘటనపై ప్రజలను దృష్టి మళ్లించేందుకు పోలవరం ప్రాజెక్టు వద్దకు మంత్రులు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధులను తీసుకెల్లి షుటింగ్ తరహాలో ప్రభుత్వం వ్యవహరించదన్నారు. ఈ నంది అవార్డులపై ఇప్పటికే చాలా మంది తమ అభిప్రాయాలను తెలిపిన విషయం తెలిసిందే. కొంత మంది ప్రభుత్వ పెద్దలు బహిరంగంగానే ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. కొందరు అయితే సోషల్ మీడియా ద్వారా అవార్డులపై చెలరేగిపోతున్నారు. దర్శకత నిర్మాత గుణశేఖర్ ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వాన్ని, నంది అవార్డుల జ్యూరీపై విమర్శలు చేశారు. ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రతి విషయంపై స్పందించే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఫెస్బుక్ ద్వారా నంది అవార్డులపై తీవ్ర విమర్శలు చేశారు. -
నంది వివాదం: దర్శకుడు మద్దినేని సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: నంది అవార్డుల సందర్బంగా చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యంగా నంది అవార్డుల ఎంపికపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మతో పాటు ఇతరులపైనా తాజాగా మరో దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నంది అవార్డుల జ్యూరీకి ఆస్కార్ ఇవ్వాలన్న రాంగోపాల్ వర్మపై జ్యూరీ సభ్యుడు, దర్శకుడు మద్దినేని రమేష్ బాబు కౌంటర్ ఎటాక్ చేశారు. అంతేకాదు మీడియా సమావేశం ద్వారా నంది అవార్డులపై నిరసన వ్యక్తం చేసిన ఇతర దర్శక నిర్మాతలపై కూడా సెటైర్లు వేశారు. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తన ఆగ్రహాన్ని ప్రకటించారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. మద్దినేని రమేష్ బాబు ఫేస్బుక్ పోస్ట్ ఇలా ఉంది..యథాతథంగా.. నంది అవార్డ్స్ కమిటీలకు అవార్డ్స్ ఇవ్వాలన్న దర్శకుడా... తెలుగులో సినిమా తీయనని పారిపోయి ముంబై వెళ్ళి అక్కడ మాఫీయాకి జడిసి మళ్లీ తెలుగులో సినిమా తీసిన నువ్వా మాట్లాడేది ... నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నువ్వు నంది తీసుకున్నప్పుడు నీకు అప్పటి కమిటీ మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదా ... ఈ సమాజం మీద నాకు భాద్యత లేదని కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదని ప్రకటించిననీకు నంది అవార్డ్స్ మీ మాత్రం భాద్యత గౌరవం వచ్చాయా.. తెలుగుజాతి ఖర్మ ... నిజాయితీగా పనిచేసిన మా 2016కమిటీ గురించి మాత్ర్లడీతవె ఒప్పుకోం...దేశంలో ఇన్నిరకాల జడ్యాలు పెడదోరనులు వ్యత్యాసాలు అంటరానితరాలు వుంటేకనపడవు కోట్లుకు కోట్లు నిర్మాతల సొమ్ముతింటూ వాళ్లను కనీసం మనుషులుగా గుర్తించని లకుటుంబాలకు వీధొక భానిస బఫూన్ ప్రయివేట్ సెక్యూరిటీ లేకపోతే బయటకు వెళ్లలేని బతుకు నీదొ అ్ ఇంకోసారి నంది కమిటీల గురించి మాట్లాడితే ఖబద్దార్.. బక్కగాల్లకీ బలుసుగాల్లాకీ బలుపుగాల్లకీ బఫూన్గాల్లకీ ఇక్కడెవడూ బయపడెవారు లేరు ... ఖబడ్దార్.. మీ తోక వూపుడు పిల్లల దగ్గర చుపండి పులుల దగ్గర కాదు. రమేష్ పోస్ట్‌పై వర్మ మరోసారి ఘాటుగా స్పందించారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. ఇలాంటి వ్యక్తులు జ్యూరీలో వుండటం బాధాకరమన్నారు. ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు.......... అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్తితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలంటూ ఫేస్బుక్ పోస్ట్‌లో ప్రశ్నించారు. -
‘రేసుగుర్రం’ రేసులో లేదా?
2014, 2015, 2016 సంవత్సరాలకుగాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డులు ప్రకటించడం, ఎంపిక పారదర్శకంగా జరగలేదని విమర్శలు రావడం తెలిసిందే. ఈ విషయమై నిర్మాతలు కె. వెంకటేశ్వరరావు, నల్లమలుపు బుజ్జి, దర్శకుడు గుణశేఖర్ గురువారం మీడియాతో మాట్లాడారు. మెగాఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ లేదు – నిర్మాత కె. వెంకటేశ్వరరావు అల్లు అర్జున్ హీరోగా నేను, నల్లమలుపు బుజ్జి 2014లో నిర్మించిన ‘రేసుగుర్రం’ ఎంత హిట్ అయిందో.. ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో తెలిసిందే. ఈ సినిమాకు బెస్ట్ యాక్టర్‌గా అల్లు అర్జున్ సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. బెస్ట్ కొరియోగ్రాఫర్, ‘సినిమా చూపిస్త మామ...’ సాంగ్‌కు బెస్ట్ సింగర్ అవార్డులనూ సైమా ఇచ్చింది. అంత మంచి సినిమాకు నంది అవార్డు రాకపోవడం అన్యాయం. ఏపీ ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నంది అవార్డులు ఇచ్చిందో అర్థం కావడం లేదు. మంచి జ్యూరీ మెంబర్స్‌ని నియమించి, సినిమాను ఒకటికి నాలుగు సార్లు చూడాలి. 24 క్రా‹ఫ్ట్స్ పరిశీలించి, బాగున్న దానికి అవార్డులు ఇస్తే మాలాంటి నిర్మాతలకు ఆనందంగా ఉంటుంది. నంది అవార్డులు మాకే రావాలని కాదు. బెస్ట్ మూవీకి రావాలన్నదే మా అభిప్రాయం. అవార్డుల కోసమే అయితే ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ‘నంది అవార్డుల కోసం రోడ్డు మీద పడకండి’ అని నిర్మాత సి.కల్యాణ్ అనడం తప్పు. ఆయన తీసిన సూపర్ హిట్ సినిమాకు అవార్డు రాకపోతే ఆ బాధ తెలుస్తుంది. ‘రుద్రమదేవి’ సినిమాకు సరైన అవార్డులు రాలేదు. నాగేశ్వరరావుగారు నటించిన ‘మనం’ చిత్రానికి కూడా అవార్డు ఇవ్వకపోవ డాన్ని అన్యాయంగానే భావిస్తున్నాం. ‘రుద్రమదేవి’, ‘మనం’, ‘బాహుబలి’ వంటి చరిత్రలో నిలిచిపోయే సినిమా లకు సరైన అవార్డులు రాలేదు. కమిటీ మెంబర్లు ఇంకా బాగా ఆలోచిస్తే మిగతా సినిమాలకీ మంచి అవార్డులు వచ్చేవి. మంచి సినిమాలకు అవార్డుల కోసం లాబీయింగ్ చేయాల్సిన అవసరం లేదు. జ్యూరీ మెంబర్స్‌ని తప్పుపట్టడం లేదు. మాకు అర్హత ఉన్నా అవార్డులు రాలేదని చెబుతున్నాం. ఇందులో మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. కడుపు మండి వచ్చాను! – నల్లమలుపు బుజ్జి మంచి విజయం సాధించిన ‘రేసుగుర్రం’ సినిమాను పక్కన పెట్టి ఏవేవో సినిమాలకు అవార్డులు ఇచ్చారు. నంది అవార్డుల కమిటీ, ప్రభుత్వం సినిమాల ఎంపికలో వన్‌సైడెడ్‌గా ఆలోచించారు. వాళ్ల ఇష్టం వచ్చిన వాళ్లకు ఇచ్చారు. కొంతమంది నిర్మాతలు పిచ్చిగా మాట్లాడుతున్నారు. నా కెరీర్లో 24క్రాఫ్ట్స్‌లో సూపర్‌గా తీసిన సినిమా ‘రేసుగుర్రం’. కంటి తుడుపు అవార్డులు ఇచ్చారు. అవార్డులను పంచుకున్నారా? ఏపీ ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నా. ప్రజలు మెచ్చిన సినిమాలను ప్రభుత్వం గుర్తించి అవార్డులు ఇస్తే ఇంకా మంచి సినిమాలు తీయాలని నిర్మాతలకు అనిపిస్తుంది. జ్యూరీ మెంబర్స్ కూడా ఆలోచించుకోండి. ఎప్పుడూ ప్రెస్‌మీట్‌కి రాని నేను... కడుపు మండి వచ్చాను. పబ్లిసిటీ కోసం కాదు. ‘రేసుగుర్రం’ సినిమాలో అల్లు అర్జున్ బాగా నటించారు. హీరో సినిమాను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు సడన్‌గా ఒక కమెడియన్ వచ్చి కాసేపు స్క్రీన్ మీద ఉంటే సినిమా మొత్తం మారిపోతుందా? అవార్డుల ఎంపిక కమ్మ లాబీయింగ్లా ఉంది. ఏంటిది? అని ప్రశ్నించడానికే ఈ ప్రెస్‌మీట్. ఎవరి మీదా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. నా సినిమాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నాను. క్యాస్ట్ గురించి తేవడం కరెక్ట్ కాదు కదా? అన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘మొత్తం అవార్డులు చూస్తే ఆ విషయం తెలుస్తుంది సార్’ అన్నారు. అవార్డుల ఎంపిక సరైన ప్రామాణిక అంశాలతోనే జరిగిందా? అన్న ప్రశ్నకు.. ‘మొత్తం దొంగ అవార్డులే అన్నారు. మరి, ఆ అవార్డుల కోసం ఎందుకు అడుగుతున్నారనే ప్రశ్నకు.. సినిమా ఉంది కాబట్టే అడుగుతున్నాం. ‘బాహుబలి’ సినిమాకి ఉత్తమ నటుడిగా ప్రభాస్‌కు ఎందుకు అవార్డు రాలేదు? గుణశేఖర్ ‘రుద్రమదేవి’ సినిమాకు అర్హత లేదా? ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకి పన్ను మినహాయింపు ఇచ్చుకుంటారు. కానీ, ‘రుద్రమదేవి’కి ఇవ్వరు. మాకు వాళ్ల మీద వ్యతిరేకత ఏముంటుంది? గవర్నమెంట్ ఎవరిదో అందరికీ తెలుసు’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ... అల్లు అర్జున్ సినిమా షూట్లో బిజీగా ఉన్నారు. ఆయనకు ఈ ప్రెస్‌మీట్ గురించి తెలియదు. ‘మనం’కు అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ, సరైన అవార్డు రాలేదు’ అన్నారు. పునర్జన్మల కథలకు నంది అవార్డులు ఇవ్వరు కదా? అన్న ప్రశ్నకు... ‘ఈగ’కు నేషనల్ అవార్డు, నంది అవార్డు ఇచ్చారు కదా. కనీసం జరిగిన తప్పులను సరిదిద్దుకోండి. మా ఆవేదన జ్యూరీ సభ్యులకు తెలియాలనుకున్నాం. ఈ ప్రెస్‌మీట్‌తో సాధించేది ఏమీ లేదు. టీడీపీ ప్రభుత్వం అని కాదు.. ఏ ప్రభుత్వం ఉన్నా అన్యాయం అన్యాయమే. నేను సినిమా వాడిని. సినిమాల గురించి చెప్తున్నాను. జ్యూరీ చేసిన తప్పులను చెప్తున్నాను. ప్రభుత్వం చేసిన తప్పులను చెప్తున్నాను. మాకు జరిగిన అన్యాయం ఇంకొకరికి జరగకూడదు అని చెప్తున్నాం. నేను క్యాస్ట్‌ల గురించి మాట్లాడటం లేదు. లాబీయింగ్ జరిగింది. మాకు లాబీయింగ్ చేయడం చేతకాదు’ అన్నారు. అప్పుడు నన్నూ విమర్శించారు – గుణశేఖర్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు అమరావతి ప్రారంభోత్సవం సమయంలో... ‘‘రుద్రమదేవి మూలాలు ఉన్న అమరావతి శంకుస్థాపన నా చేతుల మీదగా జరగడం ఆనందంగా ఉంది’’ అన్నారు. అలా రుద్రమదేవి గొప్పతనాన్ని చెప్పిన ఏపీ ప్రభుత్వం ఆమె జీవితం ఆధారంగా తీసిన సినిమాకి పన్ను మినహాయింపు, అవార్డులు ఇవ్వలేదని గుణశేఖర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇదేదో అవార్డులు రాని సంఘం కాదు. మేం గ్రూప్ కట్టలేదు. బుధవారం ఓ ప్రముఖ టీవీ చానెల్లో డిబేట్ జరుగుతున్నప్పుడు గౌరవ జ్యూరీ సభ్యులు ఒక ఇష్యూని లేవనెత్తారు. దాని గురించి ప్రస్తావించాలని వచ్చా. అందులో ఒక జ్యూరీ మెంబర్ని.. అల్లు అర్జున్‌కు క్యారెక్టర్ అవార్డు ఇచ్చారని ప్రశ్నించినప్పుడు... ‘కావాలని ఇవ్వలేదు. ఆ డైరెక్టర్ ఆ విభాగంలో ఆప్లై చేశారు కాబట్టే ఇచ్చాం’ అన్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆప్లై చేశారా? అని చాలా మంది ఫోన్లు చేసి అడిగారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆప్లై చేశానన్నది వాస్తవం కాదు. ఇదే గోనగన్నారెడ్డి పాత్రకు సపోర్టింగ్ ఆర్టిస్టుగానే సైమా, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాం. ఒక్క ఏపీ ప్రభుత్వమే అల్లు అర్జున్‌లాంటి హీరోను క్యారెక్టర్ ఆర్టిస్టు అని చెప్పింది. దానిని గౌరవంగా తీసుకోవాలా..? లేక అవార్డు వచ్చినందుకు (ఏస్వీ రంగారావు అవార్డు) ఆనందపడాలో అర్థం కావడం లేదు. ప్రూఫ్‌తో సహా వచ్చాను. సహాయ నటుడు విభాగంలోనే అల్లు అర్జున్ పేరు రాశా. ‘రుద్రమదేవి’ తెలంగాణకు చెందిన చిత్రం కాబట్టి పన్ను మినహాయింపు, అవార్డు ఇవ్వలేదని కొందరన్నారు. రుద్రమదేవి జాతీయ నాయకురాలు. రెండు రాష్ట్రాలకు ఒకేసారి ఒకే విధంగా ‘రుద్రమదేవి’ చిత్రానికి పన్ను మినహాయింపు కోసం ప్రయత్నించాను. తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రభుత్వం కూడా స్పందిస్తుందనుకున్నా. సమాచార లోపం లేకుండా మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుగార్ల చేత ముఖ్యమంత్రికి విన్నవించుకున్నాను. బహిరంగంగా విమర్శించకుండా లేఖ రాశాను. ఆ లేఖకు స్పందన లేదు. నేనో పెద్ద నిర్మాతను కాననా? నంది అవార్డుల ఎంపికలో ‘టామీ’ సినిమాకు ఇచ్చిన స్థాయి ‘రుద్రమదేవి’కి లేదా? జ్యూరీ మెంబర్స్‌ని మెప్పించలేకపోయిందా? ‘మీరు పన్ను మినహాయింపుకు ఓ ప్రశ్న అడిగారు. జవాబు ఇప్పుడు వచ్చింది. అవార్డులు రాకపోవడమే జవాబు’ అని నెటిజన్లు అంటున్నారు. ఏస్వీరంగారావుగారి అవార్డును తక్కువ చేసి మాట్లాడటం లేదు. కేటగిరీల స్థాయి గురించి మాట్లాడను. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రకాశ్‌రాజ్‌కు ఆప్లై చేశాను. బన్నీ ఆ కేటగిరీకి కరెక్ట్ కాదు. ఆప్లికేషన్ ప్రింట్లో ఈ అవార్డులపై మీడియా ముఖంగా అభ్యంతరం చెప్పినవారు మూడేళ్లు అవార్డులకు అర్హులు కారని నియమనిబంధనలతో కూడిన ఒక బుక్ ఉంది. అంతకు ముందు లేదు. ఇప్పుడే పెట్టారు. ఇలా అవార్డులు ఇవ్వడానికే ఆ నిబంధన పెట్టారనిపిస్తోంది. నంది అవార్డులు నాకు వ్యక్తిగతంగా ఎనిమిది వచ్చాయి. నేను తీసిన 12 సినిమాల సాంకేతిక నిపుణులకు, ఆర్టిస్టు లకు దాదాపు 30 నంది అవార్డులు వచ్చాయి. ‘ఒక్కడు’ సినిమాకి 8 అవార్డులు వచ్చినప్పుడు నన్ను విమర్శించారు.అవార్డుల ఎంపికలో మంచి ప్రమాణాలను పాటించాలని కోరుతున్నాను. అనుకూలంగా ఉన్నవారికే అవార్డులు– నిర్మాత మల్కాపురం శివకుమార్ నంది అవార్డులు పచ్చపార్టీ తమ కార్యకర్తలకు కండువాలను కప్పినట్లుగా ఉంది. అవార్డుకు అర్హత ఉన్న చిత్రాలను విస్మరించి తమకు అనుకూలంగా ఉన్నవారికే ప్రకటించింది. 2015లో సరికొత్త కాన్సెప్ట్‌తో నేను నిర్మించిన ‘సూర్య వర్సెస్ సూర్య’ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇలాంటి కాన్సెప్ట్‌తో హాలీవుడ్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. హాలీవుడ్ వాళ్లకు ఇన్స్పిరేషన్గా నిలిచిన తెలుగు సినిమా నంది అవార్డు కమిటీకి కనిపించలేదా? ఈ అవార్డులు ప్రభుత్వం తరపున కాకుండా పార్టీ తరపున ఇస్తే బాగుండేది. -
రుద్రమదేవికి ‘నంది’ రావాల్సింది
సాక్షి, హైదరాబాద్: సంస్కృతి, విలువలు, మానవీయతకు అద్దంపట్టిన చిత్రాలకు గతంలో నంది అవార్డులు ఇచ్చేవారని ప్రముఖ సినీ దర్శక నటుడు ఆర్.నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. కానీ, ఇప్పుడు అవార్డులు అంటే, ఓటు బ్యాంకు రాజకీయాలుగా మారాయని అన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ సినిమాను వరంగల్ జిల్లా ఏనుమాముల మార్కెట్లో చిత్రీకరించేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి హరీశ్ రావును కోరేందుకు గురువారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆ సినిమాలో నారాయణమూర్తి నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈసారి అవార్డుల్లో రుద్రమదేవి సినిమాకు నంది అవార్డు రావాల్సింది. రుద్రమదేవి లాంటి మహనీయురాలి జీవితాన్ని సెల్యులాయిడ్కు ఎక్కించడం అంత తేలిక కాదు. అలాంటి సినిమాను గుర్తించాల్సింది. బాహుబలి సినిమా సాంకేతికంగా, వాణిజ్యపరంగా తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అందుకు ఆ సినీమా దర్శకుడు రాజమౌళికి సెల్యూట్. కానీ, బాహుబలికి జాతీయ ఉత్తమ అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయింది. ఆ సినిమా చరిత్ర కాదు, సందేశాత్మకం కాదు. అది పూర్తిగా కమర్షియల్ సినిమా. ఇప్పుడు కమర్షియల్ సినిమాలకు అవార్డులు ఇవ్వడం ఆనవాయితీగా మారింది’అని నారాయణమూర్తి పేర్కొన్నారు. -
నంది అవార్డులపై వర్మ సటైరికల్ కామెంట్
నంది అవార్డులపై డేరింగ్ డైరెక్టర్, రామ్‌గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. అవార్డులు ప్రకటించినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రామ్‌గోపాల్ వర్మ మాత్రం ఇప్పటి వరకూ వీటిపై స్పందించలేదు. నెట్‌జన్లు, వర్మ అభిమానులు మాత్రం ఆయన స్టేట్మెంట్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏదైనా విషయాన్నికుండ బద్దలు కొట్టినట్లే మాట్లాడే వర్మ నంది అవార్డులపై కూడా తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందించారు. అవార్డులపై వర్మ ఏమన్నారో ఆయన మాటల్లోనే ' అబ్బో అబ్బో అబ్బో!!! ఇప్పుడే నంది అవార్డ్స్ లిస్ట్ మొత్తం చూసా...వామ్మో మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రార్డినరీ సూపర్ డూపర్ సెలక్షన్.. నాకు తెలిసి ఇలా ఏమాత్రం 1% పక్షపాతం లేకుండా కేవలం మెరిట్ మీద మాత్రమే అవార్డ్స్ ఇఛ్చిన కమిటీ మొత్తం ప్రపంచంలోనే ఉండి ఉండదు.. ఇంత అద్భుతమైన నిజాయతీ గల నంది అవార్డు కమిటీకి ఖఛ్చితంగా ఆస్కార్ అవార్డు ఇవ్వాలి .. వావ్ నంది అవార్డ్స్ కమిటి మెంబర్లూ ఐ వాంట్ టు టచ్ ఆల్ యువర్ ఫీట్' అంటూ కమిటీ సభ్యులపై సటైర్లు వేశారు. -
తమకు అనుకూలమైన వారికే అవార్డ్స్ ఇచ్చారా?
-
అవార్డులపై మూర్తిగారి ఆవేదన
సాక్షి, హైదరాబాద్ : గతంలో సంస్కృతి, విలువలకు పట్టం కట్టేవారు. కానీ, ఇప్పుడు అవార్డులంటే ఓటు బ్యాంకు రాజకీయాల్లా మారాయి అని సీనియర్ నటుడు, దర్శక నిర్మాత ఆర్ నారాయణ మూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ మార్కెట్ యార్డ్ లో తన కొత్త సినిమా షూటింగ్ అనుమతి కోసం ఆయన గురువారం అసెంబ్లీకి వచ్చారు. ఈ సందర్భంగా నంది అవార్డులు-విమర్శలపై మీడియా ఆయన్ను ప్రశ్నించింది. రుద్రమదేవి చిత్రానికి అవార్డు రావాల్సింది. సిపాయిల తిరుగుబాటులో భారతదేశానికి ఝాన్సీ లక్ష్మీబాయ్ పాత్ర ఎలాంటిదో.. తెలుగు జాతికి రుద్రమదేవి అలాంటిది. అయినా ఈ మధ్య కమర్షియల్ చిత్రాలకు అవార్డులు ఇవ్వటం ఆనవాయితీగా మారిందని ఆయన అన్నారు. చారిత్రక నేపథ్యంల, కుటుంబ చిత్రాలను కూడా ఆదరించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా, వినోదపరంగా బాహుబలి చిత్రం తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్లిందన్న ఆయన... అందుకు ఆ చిత్ర దర్శకుడు రాజమౌళికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అన్నారు. కానీ, ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చినప్పుడే అవార్డులపై నమ్మకం పోయిందని నారాయణమూర్తి తెలిపారు. -
అవార్డులపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై నిప్పు రాజుకుంటోంది. అవార్డుల ఎంపికలో పారదర్శకత లేదని సోషల్ మీడియా నెట్జన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు సైతం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం బన్నీవాసు అవార్డుల జాబితాను విమర్శించగా, తాజాగా మరో మెగా అభిమాని బండ్ల గణేష్ సైతం అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన అవార్డులు పారదర్శకంగా లేవని తీవ్ర ఆరోపణలు చేశారు. సగటు సినీ అభిమానులు ఈ అవార్డుల గురించే మాట్లాడుకుంటున్నారని, అవార్డుల జాబితాలో మెగా హీరోలకు అన్యాయం జరిగిందని అన్నారు. ఇచ్చినవి నంది అవార్డులు కాదని, సైకిల్ అవార్డులంటూ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, జ్యూరీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఉత్తమ నటుడి అవార్డు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. కంటితుడుపు చర్యగా చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ఇచ్చారని ఆరోపించారు. మగధీర సమయంలోనూ ఇలానే చేశారని గణేష్ ఆరోపించారు. 2016 అవార్డుల కమిటీలో అల్లు అరవింద్ జ్యూరీ సభ్యుడిగా ఉన్నా మెగా హీరోలకు అవార్డులు ఇవ్వాలని ఏనాడు అడగలేదని అన్నారు. తను టీడీపీ వ్యతిరేకిని కాదని, తనకు ఏపార్టీతో సంబంధం లేదని తనకు అన్యాయం అనిపిస్తే వెంటనే ప్రశ్నిస్తాన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయనిపిస్తే వెనక్కి తీసుకుంటానని అన్నారు. -
'లెజెండ్'కు 9అవార్డులు వస్తాయని నిరూపిస్తారా!
సాక్షి, హైదరాబాద్ : హింసాత్మక ప్రవృత్తితో కూడిన మూవీలు చేసే దర్శకుడు బోయపాటి శీనుకు బీఎన్ రెడ్డి అవార్డు ఇవ్వడం దారుణమని చిరంజీవి రాష్ట్ర యువత అధికార ప్రతినిధి నాగేంద్ర అన్నారు. సుప్రసిద్ధ వ్యక్తి బీఎన్ రెడ్డి ఎన్నో విలువలతో కూడిన సినిమాలు తీశారు. ఇక్కడ బోయపాటికి బీఎన్ రెడ్డి గురించి తెలుసా. బోయపాటి ఏం చేశారని, ఆయన సినిమాలలో ఏం చూపించారని బీఎన్ రెడ్డి అవార్డు ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదంపై ఆయన మాట్లాడారు. 'మెగా హీరోలకు, వారి సినిమాలకు అవార్డులు ఇవ్వలేదని మేం చెప్పడం లేదు. అవార్డులు కావాలని అడగలేదు. కానీ, అసలు లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు వస్తాయని ఎవరైనా నిరూపించగలరా. ప్రజా క్షేత్రంలోకి వచ్చి ఒపినియన్ పోల్ లాంటిది పెడితే.. ఆ సినిమాకు ఎన్ని అవార్డులొస్తాయన్న వాస్తవం బయటపడుతుంది. మనం సినిమా ఎంతో మంచి మూవీ. అందులో ఎన్నో విలువలున్నాయి. ఉత్తమ చిత్రం సహా పలు విభాగాల్లో అవార్డులు రావాల్సిన మనం మూవీకి కేవలం 'ద్వితీయ ఉత్తమ చిత్రం' అవార్డుతోనే సరిపెట్టారు. చివరిశ్వాస ఉన్నంతవరకూ నటిస్తానని చెప్పిన మహానటుడి చివరి చిత్రం 'మనం'. మనం చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వకపోవడం మహానటుడు ఏఎన్నార్ ను అవమానించడమే అవుతుంది. రుద్రమదేవి కోసం నటి అనుష్క ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. తెలుగువాడి చరిత్రను తెలియజెప్పే ఆ మూవీకి సరైన గుర్తింపు దక్కలేదు. 'రుద్రమదేవి'లో నటనకుగానూ ఉత్తమ నటి అవార్డు అందుకోవాల్సిన అనుష్కకు 'సైజ్ జీరో'కు గానూ ఇవ్వడంలో అర్థం లేదు. ఎన్నో మంచి చిత్రాలు తీసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు బీఎన్‌రెడ్డి పురస్కారం ఇచ్చారు. ఎందుకంటే ఆయన మూవీలకూ సరైన గుర్తింపు ఇవ్వకపోవడమే అందుకు ప్రధాన కారణమని' నాగేంద్ర అభిప్రాయపడ్డారు. మరోవైపు గుణశేఖర్, నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. స్టార్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వడం అల్లు అర్జున్ను అవమానించమేనని గుణశేఖర్ పేర్కొన్నారు. 'అవార్డుల ఎంపికలో అవకతవకలను ప్రశ్నిస్తే మూడేళ్లు నిషేధిస్తారట. ఏపిలో గుత్తాధిపత్యం నడుస్తోందంటూ' ఆవేదన వ్యక్తం చేశారు. 'నంది అవార్డుల ఎంపికలో ఒక వర్గానికి అనుకూలంగా లాబీయింగ్ జరిగింది. ఉత్తమ నటుడు అవార్డును ప్రభాస్ కు ఎందుకివ్వలేదు..? రుద్రమదేవి సినిమాకు ఎందుకు అన్యాయం చేశారని' నిర్మాత బుజ్జి ప్రశ్నించారు. -
అవార్డులపై నమ్మకం పోతుంది : కత్తి మహేష్
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితా విషయంపై సినీ విమర్శకుడు మహేశ్ కత్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజంగా ప్రతిభకు తగ్గట్లు అవార్డులు ఇచ్చారా ఆయన ప్రశ్నించారు. అవార్డులు ఇచ్చేవాడు మనవాడయితే ఎలాంటి సినిమా తీసినా పర్వాలేదేమో అంటూ ఇండస్ట్రీకి చెందిన వారితో పాటు నెటిజన్లు ఏపీ ప్రభుత్వం సోమవారం ప్రకటించిన నంది అవార్డుల ఎంపికను విమర్శిస్తున్నారు. ఆ సినిమాలకు పలానా కేటగిరీలో ఎందుకు అవార్డులు ఇచ్చారన్నదానిపై కనీసం రెండు పేరాగ్రాఫ్ సమాచారం ఇవ్వాలన్నారు మూవీ క్రిటిక్ మహేశ్ కత్తి. అప్పుడైతే అవార్డు పలానా సినిమాకు ఎందుకిచ్చారో అర్థమవుతుందని, లేని పక్షంలో ఇండస్ట్రీతో పాటు ప్రజల్లోనూ అవార్డులపై నమ్మకం పోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వాస్తవం చెప్పాలంటే.. ఎవడే సుబ్రమణ్యం సూపర్ మూవీ. కానీ సామాజిక అంశాలున్న ఆ మూవీకి ఏ అవార్డు ఇచ్చారో చూడండి. ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు లాంటి కీలక అవార్డులు రావాల్సిన మూవీకి ద్వితీయ ఉత్తమ చిత్రం, తొలి చిత్ర దర్శకుడు అంటూ ఏదో ఇవ్వాలంటూ నామమాత్రంగా అవార్డులు ఇచ్చారని పేర్కొన్నారు. లెజెండ్ మూవీకి తొమ్మిది అవార్డులిచ్చారు. అన్ని అవార్డులు ఎందుకిచ్చారో ఏపీ ప్రభుత్వం విశ్లేషించుకోవాలి. ఉత్తమ చిత్రం అవార్డు రావాల్సిన 'మనం' మూవీకి ద్వితీయ ఉత్తమ చిత్రం అవార్డుతో సరిపెట్టారు. అవార్డులు ఇస్తున్నామంటే ఎన్నో ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని అవార్డ్ జ్యూరీ సభ్యులు, ప్రభుత్వం, ఇతరత్రా యంత్రాంగం గుర్తించాలి. ఇక్కడ అవార్డులు వచ్చిన ఏ మూవీకి జాతీయ, ఇతర సినీ అవార్డుల్లో అవార్డులు రావడం లేదన్న విషయాన్ని గుర్తించాలన్నారు. మూడేళ్లకోసారి అవార్డులు ఇవ్వడం కంటే ప్రతి ఏడాది సంబంధిత అవార్డులు ఇస్తే ప్రేక్షకులకు ఓ అవగాహన వస్తుందన్నారు. -
'అల్లు అర్జున్ ను అవమానించారు'
నంది అవార్డులపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సినీ ప్రముకులు, అభిమానులు అవార్డుల ఎంపిక న్యాయంగా జరగలేదని విమర్శిస్తుండగా, దర్శకుడు గుణశేఖర్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను స్వీయ దర్శకత్వంలో నిర్మించిన రుద్రమదేవి సినిమాకు ఆశించిన స్థాయిలో అవార్డులు రాకపోవటంపై ఇప్పటికే స్పందించిన గుణశేఖర్, తాజాగా అల్లు అర్జున్ కు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వటం పై మాట్లాడారు. కావాలనే అల్లు అర్జున్ ను అవమానించారన్న గుణశేఖర్, స్టార్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వటం తప్పన్నారు. రుద్రమదేవి జాతీయ నాయకురాలు, ఆమెను కేవలం తెలంగాణ ప్రాంతానికే పరిమితం చేయడం సరికాదన్నారు. 'అవార్డుల ఎంపికలో అవకతవకలను ప్రశ్నిస్తే మూడేళ్లు నిషేధిస్తారట' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపిలో గుత్తాధిపత్యం నడుస్తోందని తెలిపారు. ఈ విషయంపై స్పదించిన నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అవార్డుల ఎంపికలో ఒక వర్గానికి అనుకూలంగా లాబీయింగ్ జరిగిందన్నారు. ఉత్తమ నటుడు అవార్డును ప్రభాస్ కు ఎందుకివ్వలేదు..? రుద్రమదేవి సినిమాకు ఎందుకు అన్యాయం చేశారు..? అని ప్రశ్నించారు. -
నంది అవార్డులపై వివాదాలు
-
నంది అవార్డులు... విమర్శలు–వివాదాలు!
వడ్డించేవాడు మనవాడయితే బంతిలో ఎక్కడ కూర్చున్నా పర్వాలేదని తెలుగులో ఓ సామెత! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల జాబితా విషయంలో కొందరు ఈ సామెతనే గుర్తు చేసుకుంటున్నారు. ‘అవార్డులు ఇచ్చేవాడు మనవాడయితే ఎలాంటి సినిమా తీసినా పర్వాలేదేమో!’ అంటున్నారు కొందరు నెటిజన్లు. సోమవారం ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో కొందరు బాహాటంగానే విమర్శించారు. ‘రుద్రమదేవి’ తీసినందుకు క్షమించండి: గుణశేఖర్ ‘మా సిన్మాకి పన్ను మినహాయింపు ఎందుకివ్వలేదని ప్రశ్నించడమే నేను చేసిన తప్పా?’ అనడుగుతున్నారు ‘రుద్రమదేవి’ దర్శక–నిర్మాత గుణశేఖర్. ‘‘మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ‘రుద్రమదేవి’ మూడు ఉత్తమ చిత్రాల్లో ఏదో ఒకదానికి ఎందుకు ఎంపిక కాలేకపోయింది? కనీసం జ్యూరీ గుర్తింపుకి కూడా నోచుకోలేకపోయింది. మరచి పోయిన తెలుగు జాతి చరిత్రని వీడెవడో వెతికి, సినిమా తీసి గుర్తు చేశాడు. మళ్లీ ఇప్పుడు అవార్డులు ఇచ్చి గుర్తు చేయడం ఎందుకు అనుకున్నారా? ఇలాంటి చిత్రాన్ని ప్రోత్సహిస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళతాయని భావించారా? అదే అయితే... ‘రుద్రమదేవి’ లాంటి చిత్రాన్ని నిర్మించినందుకు నన్ను క్షమించండి’’ అని గుణశేఖర్ పేర్కొన్నారు. మెగా హీరోలందరూ నటన నేర్చుకోవాలి: ‘బన్నీ’ వాసు మెగా ఫ్యామిలీ సన్నిహితుడు, గీతా ఆర్ట్స్‌లో పలు చిత్రాలకు సహనిర్మాతగా వ్యవహరించిన ‘బన్నీ’ వాసు నంది అవార్డులు ప్రకటన వచ్చిన తర్వాత ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాలు సాధించడానికి, మెగా హీరోలందరూ టీడీపీ ప్రభుత్వం దగ్గర నటనలో మెళకువలు నేర్చుకోవాలి’ అని ఫేస్బుక్లో కామెంట్ చేశారు. అనంతరం ‘‘ఏదో సినిమాకు అవార్డు వచ్చిందనో? మాకు రాలేదనో? కామెంట్ చేయలేదు. 2014లో ‘రేసుగుర్రం’ ఎంత ప్రజాదరణ పొందిందో... అందరికీ తెలిసిందే. ఉత్తమ చిత్రంతో పాటు చాలా కేటగిరీలు ఉన్నాయి. ‘రేసుగుర్రం’ను దేనికీ కన్సిడర్ చేయకపోవడంతో అప్సెట్ అయ్యా. 2012లో ‘గబ్బర్‌సింగ్’ విషయంలోనూ ఇలాంటి అన్యాయమే చేశారు. ఒకవేళ... ఈ రెండూ కమర్షియల్ సినిమాలని పక్కన పెడితే, ఇప్పుడు అవార్డులకు ఎంపిక చేసినవాటిలో 75 శాతం కమర్షియల్ సినిమాలే ఉన్నాయి కదా? వాటికి ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మా రెండు సినిమాలను ఎందుకు పక్కన పెట్టారు? తెలియడం లేదు’’ అని ‘బన్నీ’ వాసు పేర్కొన్నారు. మారుతి కామెడీ దర్శకుడు మారుతి మంగళవారం ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అందులో నటుడు ఉత్తేజ్ ‘ఉత్తమ అత్త, మేనత్త, అమ్మ, అక్క, చెల్లి, అత్యుత్తమ చెల్లి’ అవార్డులను ప్రకటిస్తుంటారు. ఉత్తమ సవతుల్లో అయితే వన్, టు, త్రీ అవార్డులు ఉంటాయి. ఇదంతా చూస్తున్న వ్యక్తి (నటుడు– రచయిత హర్షవర్ధన్) ‘ఒరేయ్! ఈ అవార్డ్స్ మన కోసం ఎరేంజ్ చేసినవేనా!’ అనడిగితే? పక్కన ఉన్న వ్యక్తి (నటుడు గుండు హనుమంతురావు) ‘ఇండస్ట్రీలో బాలాజీకి ఉన్న పరిచయస్తులకు ఏర్పాటు చేసినవి’ అంటాడు. ఈ వీడియో ఓ సీరియల్‌కి సంబంధించినది. నంది అవార్డులను ఉద్దేశించే సెటైరికల్‌గా మారుతి పోస్ట్ చేశారని పలువురి నెటిజన్ల ఫీలింగ్! లెజెండ్‌కు ఎక్కువ అవార్డులు రావడం ఆనందాన్నిచ్చింది : బాలకృష్ణ ‘లెజెండ్’ సినిమాకు ఎక్కువ అవార్డులు రావడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. బుధవారం అమరావతి అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 2014, 2015, 2016 సంవత్సరాలకు అవార్డులు గెలుచుకున్నవారికి అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్, రఘుపతి వెంకయ్య, బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి–చక్రపాణి అవార్డుల ఎంపికకు మంచి స్పందన వచ్చిందన్నారు. -
అవార్డు అందుకునే స్థాయి ఇంకా నీకు రాలేదురా..!
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నంది అవార్డులపై ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నంది అవార్డుల జాబితా అంత ఇదీగా లేదని, అవార్డుల జ్యూరీలో సీనియర్ నటుడు గిరిబాబు ఉన్నా.. ఎందుకలా జరిగిందో తెలియడం లేదని ఆయన అన్నారు. నంది అవార్డుల విషయంలో 'సాక్షి' టీవీతో ఆయన మాట్లాడారు. 'లౌక్యం' సినిమాకుగాను ఉత్తమ హాస్యనటుడు అవార్డు తనకు వస్తుందని అనుకున్నామని, కానీ రాలేదని అన్నారు. 'అవార్డు అందుకునే స్థాయి ఇంకా నీకు రాలేదురా అని అన్నారేమో కమిటీ వాళ్లు అని సరిపెట్టుకున్నాన'ని చెప్పారు. ఏ సంవత్సరం అవార్డులు ఆ సంవత్సరం ఇస్తే ఆ సినిమా సత్తా ఏంటో తెలుస్తుందని, గ్యాప్ ఉండటం సరికాదని అభిప్రాయపడ్డారు. కొని తెచ్చుకున్న అవార్డులు బయటకు వెళ్లినప్పుడు వెక్కిరిస్తాయని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో అన్నట్టు గుర్తుచేశారు. మీ యాక్టింగ్ బాగుంటుంది, మాకు నచ్చింది.. అవార్డులది ఏముందని ప్రేక్షకులు తనతో అంటూ ఉంటారని, మంచి నటులకు ఎందుకు అవార్డులు రావడం లేదన్న భావన ప్రజల్లో కూడా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. -
నంది అవార్డ్సా.. నందమూరి అవార్డ్సా..!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నంది అవార్డులు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. 2014, 15, 16 సంవత్సరాలకుగాను ఉత్తమ చిత్రాలకు ఏపీ సర్కారు మంగళవారం సాయంత్రం నంది అవార్డులు ప్రకటించింది. ఈ మూడు సంవత్సరాలకు లెజెండ్, బాహుబలి, పెళ్లి చూపులు ఉత్తమ సినిమాలుగా, బాలకృష్ణ, మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఈ మేరకు ఏపీ సర్కారు ప్రకటించిన నంది అవార్డుల విషయంలో ఇటు టాలీవుడ్‌లోనూ, అటు సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీ సర్కారు రాజకీయంగా తమవారికే నందులు పంచిందని విమర్శలు వినిపిస్తున్నాయి. మెగా కుటుంబానికి అవమానం..! ముఖ్యంగా నంది అవార్డుల విషయంలో మెగా హీరోలకు అన్యాయం జరిగిందనే వాదన వినిపిస్తోంది. నంది అవార్డుల్లో మెగా హీరోలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు. అదీకాక రుద్రమదేవి సినిమాలో 'గోనగన్నారెడ్డి' పాత్ర పోషించిన అల్లు అర్జున్‌కి 'బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్' నటుడిగా నంది అవార్డు ప్రకటించడం పుండు మీద కారం చల్లినట్టు అయింది. ఒక స్టార్ హీరోగా రాణిస్తున్న యువ నటుడిని 'క్యారెక్టర్ ఆర్టిస్ట్'కు పరిమితం చేసి అవార్డు ఇవ్వడం ఏమిటి? అన్న వాదన వినిపిస్తోంది. అల్లు అర్జున్‌కు 'బెస్ట్ సోపోర్టింగ్ యాక్టర్' అవార్డు ఇస్తే న్యాయం జరిగి ఉండేదని, కానీ అందుకు భిన్నంగా అవార్డు ప్రకటించి అవమానించారని ఆగ్రహం వ్యక్తమవుతోంది. బన్నీ వాసు ఫైర్..! మెగా కుటుంబ అభిమాని.. గీతా ఆర్ట్స్ కో ప్రొడ్యూసర్ మేనేజర్ బన్నీ వాసు నంది అవార్డులపై సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. "టీడీపీ ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు నటన నేర్చుకోవాలి. నంది అవార్డులు రావాలంటే.. తక్షణం చంద్రబాబు సర్కారు వద్ద శిక్షణ పొందాలి. నంది అవార్డుల్లో మెగా ఫ్యామిలీకి తీవ్ర అన్యాయం జరిగింది. అల్లు అర్జున్‌కి ఉత్తమ క్యారెక్టర్ నటుడు అవార్డు ఇచ్చి అవమానించారు' అని బన్నీవాసు కామెంట్ చేశారు. మెగా అభిమానుల్లో ఉన్న ఆగ్రహాన్ని ఈ వ్యాఖ్యలు చాటుతున్నాయి. 'లెజెండ్' సినిమాకు 9 నందులా? బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'లెజెండ్' సినిమాకు నంది అవార్డుల్లో పెద్దపీట దక్కింది. ఈ సినిమాకు ఏకంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ విలన్ ఇలా తొమ్మిది నంది అవార్డులు దక్కాయి. అయితే, మాస్ మసాల కమర్షియల్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఇన్ని నంది అవార్డులు రావడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా నంది అవార్డుల జ్యూరీలో బాలకృష్ణ సభ్యుడిగా ఉన్న నేపథ్యంలో ఇలా అవార్డులు రావడం విమర్శలకు తావిస్తోంది. ఏపీ సర్కారు ప్రకటించింది నంది అవార్డులా? నందమూరి అవార్డులా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. గతంలోనూ 'నరసింహానాయుడు', 'శ్రీరామరాజ్యం' సినిమాలకుగాను బాలకృష్ణకు నంది అవార్డులు వచ్చినప్పుడు ఇదేవిధంగా విమర్శలు వచ్చాయి. 'మనం'కు అన్యాయం..! తెలుగు సినీ దిగ్గజం, లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా 'మనం'. ఈ సినిమాలో మూడు తరాల అక్కినేని నటులు నటించారు. చక్కని కుటుంబ కథా చిత్రంగా, వినూత్నమైన స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిన ఈ సినిమాను కాదని తెరపై రక్తపాతం పారించిన 'లెజెండ్' సినిమాకు ఉత్తమ చిత్రంగా నంది అవార్డు ప్రకటించడంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు తీవ్రమైన వ్యాఖ్యలతో ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఏఎన్నార్ నటించిన చివరి సినిమాకు ఇదా ఏపీ సర్కారు ఇచ్చే గౌరవం అని విమర్శిస్తున్నారు. ఈ సినిమాకు ఉత్తమ ద్వితీయ చిత్రంగా అవార్డు ఇచ్చి సరిపుచ్చడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇందుకు నిరసనగా 'మనం' సినిమాకుగాను తనకు దక్కిన 'ఉత్తమ సహాయ నటుడు' అవార్డును బహిష్కరించాలని, ఈ అవార్డును నాగచైతన్య తీసుకోవద్దని అభిమానులు సూచిస్తున్నారు. 'రుద్రమదేవి'ని పట్టించుకోలేదు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి.. ఎంతో శ్రమించి తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక అయిన 'రుద్రమదేవి' సినిమాను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. అయితే ఈ సినిమాకు వినోద పన్ను మినహాయింపు ఇస్తామని చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పిందని ఆ మధ్య గుణశేఖర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో 'రుద్రమదేవి' సినిమా నంది అవార్డుల్లో విస్మరణకు గురికావడం గమనార్హం అని చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇక, ఊపిరి, భలేభలే మగాడివోయ్ వంటి సినిమాలను అస్సలు గుర్తించకపోవడం, వరుసగా బ్లాక్‌బస్టర్ హిట్ మ్యూజిక్ అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్‌ను విస్మరించడం కూడా విమర్శలకు తావిస్తోంది. నంది అవార్డులు ప్రకటించిన తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రతిష్టాత్మకమైన నంది అవార్డులను రాజకీయ కోణంలో ఏపీ సర్కారు పంపిణీ చేసిందని నెటిజన్లు విమర్శిస్తున్నారు. "మేఘసందేశం" లాంటి క్లాసిక్ కు 9 నంది అవార్డులు, "లెజెండ్" లాంటి మాస్ ఎంటర్టైనర్ కు 9 నంది అవార్డులు. హతవిధీ!!! pic.twitter.com/jrHeGXojiF — GNR (@rao_goka) 15 November 2017 -
'టీడీపీ ప్రభుత్వాన్ని చూసి నటన నేర్చుకోవాలి'
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన నంది అవార్డుల ఎంపికపై మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు. 2014, 15, 16 సంవత్సరాలకు గాను అవార్డులు ప్రకటించగా కేవలం ఒక్క అల్లు అర్జున్ కు అది కూడా ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కేటగిరిలో అవార్డు ప్రకటించటంపై విమర్శలు వస్తున్నాయి. చిరంజీవికి రఘుపతి వెంకయ్య అవార్డు ప్రకటించినా.. ఇతర హీరోలను పరిగణలోకి తీసుకోకపోవటం విమర్శలకు కారణమవుతోంది. మెగాఫ్యామిలీకి సన్నిహితుడు, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో సహ నిర్మాతగా వ్యవహరించే బన్నీవాసు, అవార్డుల ఎపింకపై సెటైర్లు వేశారు. టీడీపీ ప్రభుత్వాన్ని చూసి మెగా హీరోలు నటన నేర్చుకోవాలి. నంది అవార్డులు రావాలంటే తక్షణం చంద్రబాబు సర్కార్ వద్ద శిక్షణ తీసుకోవాలి అంటూ ఘాటుగా కామెంట్ చేశారు. అవార్డు ప్రకటించిన మూడేళ్ల సమయంలో మెగా హీరోలు నటించిన పదిహేనుకుపైగా సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి వీటిలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఎవడు, ధృవ, గోవిందుడు అందరివాడేలే.. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు సినిమాలు కమర్షియల్ గాను ఘనవిజయాలు సాధించాయి. కానీ ఈ సినిమాలకు గాను ఆ హీరోలకు ఏ అవార్డులు దక్కలేదు. గతంలోనూ నంది అవార్డుల ఎంపిక వివాదాస్పదమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అధికార పార్టీ వ్యక్తులకు, జ్యూరీ సభ్యుల అనుయాయులకు మాత్రం అవార్డులు దక్కుతాయన్న అపవాదు ఎప్పటి నుంచో ఉంది. మరి ఈ విమర్శలపై నంది అవార్డుల జ్యూరీ, టీడీపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. -
మూడేళ్ల నందులు
-
నంది అవార్డ్స్ విజేతల అభిప్రాయాలు
మాటల్లో చెప్పలేని ఆనందం 2014వ సంవత్సరానికిగాను రఘుపతి వెంకయ్య అవార్డుకు నన్ను ఎంపిక చేశారు. అంత గొప్ప అవార్డు రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. రఘుపతి వెంకయ్య పేరు మీద అవార్డు నెలకొల్పడమే చాలా గొప్ప విషయం. ఆ అవార్డు నన్ను వరించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. అంతే కాకుండా 2015వ సంవత్సరానికి ప్రకటించిన అవార్డుల్లో ‘బాహుబలి’ తన సత్తా ఏంటో నిరూపించుకున్నందుకు ఇంకా ఆనందంగా ఉంది. – నటుడు కృష్ణంరాజు ఈ అవార్డును గుండెల్లో దాచుకుంటా దక్షిణ భారతదేశంలో మూడు కేలండర్లు చూసిన ఏకైక చిత్రం ‘లెజెండ్’. బాలకృష్ణగారి కెరీర్లోనే ఇదొక మైలురాయి. ‘లెజెండ్’కు వచ్చిన మొత్తం తొమ్మిది అవార్డులు సినిమాకి దక్కిన గౌరవంగా భావిస్తున్నా. నా కెరీర్లోనే మొదటిసారి అందుకుంటున్న నంది ఇది. ఈ అవార్డును గుండెల్లో దాచుకుంటా. నాకు మాత్రమే కాకుండా ఉత్తమ హీరోగా అవార్డు అందుకోనున్న బాలకృష్ణగారికి, ఉత్తమ విలన్‌గా సెలక్ట్ అయిన జగపతిబాబుగారికి, మా సినిమాకి, మాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. – దర్శకుడు బోయపాటి శ్రీను వెరీ స్పెషల్ ‘‘ఉత్తమ చిత్రం ‘పెళ్ళిచూపులు’కి, ఉత్తమ నటిగా నాకు ప్రతిష్టాత్మక నంది అవార్డులు రావడం సో హ్యాపీ అండ్ స్పెషల్. అందులోనూ నా తొలి నంది కావడంతో ఇంకా స్పెషల్. ‘పెళ్ళిచూపులు’ సినిమా, అందులో నేను చేసిన ‘చిత్ర’ పాత్ర ఎప్పుడూ నా మనసుకు దగ్గరగానే ఉంటాయి. నాకు మంచి పాత్ర ఇచ్చిన మా దర్శకుడు తరుణ్ భాస్కర్‌కి, ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. సినిమా విడుదలైన ఏడాది తర్వాత కూడా సక్సెస్ కంటిన్యూ అవుతుంటే గొప్పగా అనిపిస్తోంది. – నటి రితూ వర్మ అవార్డు వస్తుందని నమ్మాను డైరెక్టర్‌గా నా ఫస్ట్ మూవీకే అవార్డు రావడం వెరీ హ్యాపీ. నాగార్జునగారు ‘వెరీ హ్యాపీ ఫర్ యు’ అని అభినందించారు. నిజానికి నందికి అప్లై చేస్తున్నప్పుడే అవార్డు వస్తుందని నమ్మాను. ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు నంది జ్యూరీ కూడా గుర్తించింది. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గానే కాకుండా మా సినిమాకి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్‌కి కూడా అవార్డు వచ్చింది. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. – దర్శకుడు కల్యాణ్ కృష్ణ రచ్చ గెలిచి.. ఇంట గెలిచా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. ముందు నేషనల్ అవార్డ్ రూపంలో రచ్చ గెలిచాను. ఇంట గెలుస్తానో లేదో వేచి చూశాను. ‘శతమానం భవతి’ లాంటి మంచి సినిమా తీసినందుకు జనాలు అందలం ఎక్కించారు. జనాలు గుర్తించారని ఆనందపడ్డాను. ఇప్పుడు జనాలు ఎన్నుకున్న ప్రభుత్వాలు గుర్తించాయి. తెలుగు వారి సంప్రదాయాలు, అనుబంధాలను గుర్తు చేసిన సినిమాకు రివార్డులతో పాటు అవార్డులు రావటం ఆనందంగా ఉంది. నిర్మాత ‘దిల్’ రాజుగారికి, శర్వానంద్, ప్రకాశ్‌రాజ్, జయసుధగార్లకు కృతజ్ఞతలు. – దర్శకుడు వేగేశ్న సతీశ్ హీరోగా ఫస్ట్ మూవీ అట్టర్ ఫ్లాప్.. విలన్‌గా అవార్డు ఏం చెప్పాలో తెలియడంలేదు. హీరోగా నా ఫస్ట్ మూవీ అట్టర్ ఫ్లాప్. విలన్‌గా ఫస్ట్ మూవీకి నంది అవార్డు వచ్చింది. మా ఇంటికొచ్చిన ఎనిమిదో నంది ఇది. విలన్‌గా నంది వచ్చింది కాబట్టి, అలానే కంటిన్యూ అవుతాననుకుంటున్నారేమో. అన్ని రకాల పాత్రలూ చేస్తానండోయ్. – నటుడు జగపతిబాబు స్వీట్ మెమరీ ఈ మూడేళ్లల్లో నేను చేసిన సినిమాల్లో రెండు సినిమాలు మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్గా అవార్డు దక్కించుకోవడం ఆనందంగా ఉంది. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’, ‘శతమానం భవతి’ రెండూ మంచి చిత్రాలు. నాలుగో నంది అందుకోబోతున్నా. ‘మళ్ళీ మళ్ళీ..’లో ఇంపార్టెంట్ సీన్స్‌ని వైజాగ్ బీచ్ దగ్గర తీయడం ఓ మంచి మెమరీ. ‘శతమానం భవతి’ రాజమండ్రి షెడ్యూల్ ఓ స్వీట్ మెమరీ. ఆ సమయంలో నేను ‘అయ్యప్ప మాల’లో ఉన్నాను. – నటుడు శర్వానంద్ మూడు అవార్డులు మా ఇంటికొచ్చాయి సెకండ్ బెస్ట్ ఫీచర్ పిలిం, బెస్ట్ ఫస్ట్ ఫిలిం డైరెక్టర్, విజయ్ దేవరకొండకు స్పెషల్ జ్యూరీ.. మొత్తం మూడు అవార్డులు మా ‘ఎవడే సుబమ్రణ్యం’కి దక్కాయి. అవార్డులు వచ్చిన విషయాన్ని నాన్నగారు ఫోన్ చేసి చెబితేనే మాకు తెలిసింది. ఆయన చూడని అవార్డులు లేవు. కానీ, ఇప్పుడు పిల్లలు సాధిస్తుంటే ఆయనకు ఆనందంగా ఉంటుంది కదా. – నిర్మాత స్వప్నాదత్ ముందు ‘సాక్షి’ అవార్డు... ఇప్పుడు నంది నంది అవార్డుల్లో మైత్రీ మూవీస్ పేరు ఇంత మార్మోగడానికి కారణం ఒక వ్యక్తి. ఆయనే వన్ అండ్ ఓన్లీ కొరటాల శివగారు. మా ‘శ్రీమంతుడు’ మహేశ్‌బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక, ‘జనతా..’ హీరో ఎన్టీఆర్ సూపర్బ్. మా ‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’లకు రచయితగా రామజోగయ్య శాస్త్రి అవార్డు అందుకోబోతున్నారు. అలాగే ఇతర కేటగిరీల్లోనూ అవార్డులకు ఎంపిక కావడం ఆనందంగా ఉంది. ‘శ్రీమంతుడు’కి ఫస్ట్ అవార్డు ఇచ్చింది ‘సాక్షి ఎక్స్‌లెన్స్ అవార్డ్స్’. ప్రేక్షకుల రివార్డులు కాకుండా అవార్డులు దక్కడం ఆనందంగా ఉంది. – నిర్మాతలు రవిశంకర్, నవీన్, మోహన్ అవార్డు ఎంతో కిక్ ఇస్తుంది నాకిది తొలి నంది అవార్డు. నా మొదటి సినిమా ‘కృష్ణమ్ వందే జగద్గురుమ్’కి మంచి పేరొచ్చింది. ఆ సినిమా తర్వాత కొంచెం గ్యాప్ వచ్చినా ‘మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు’ తర్వాత నా జర్నీ నాన్‌స్టాప్‌గా సాగుతోంది. ఏ సినిమాతో నా ప్రయాణం నిరంతరాయంగా సాగుతోందో అదే చిత్రానికి నంది అవార్డు వచ్చింది. అవార్డు ఎంతో కిక్ ఇస్తుంది. అవార్డులు ఎన్నొచ్చినా ఇంకా ఇంకా రావాలి.. తీసుకోవాలని ఉంటుంది. ఒకరకంగా అది స్వార్థం. దానికి అంతే ఉండదు. ‘కృష్ణమ్ వందే..’కి క్రిష్ రచయితగా నాకు తొలి అవకాశం ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డానో... అంతటి ఆనందం అవార్డు వచ్చినప్పుడు పొందుతున్నా. – రచయిత సాయిమాధవ్ బుర్రా గురువుగారు చెప్పిన జోస్యం నిజమైంది భగవంతుడు ఇవ్వదలుచుకుంటే ఎంతైనా ఇస్తాడు. ఈ మాట ఎందుకంటున్నానంటే రచయితగా నా మనసుకు నచ్చిన రెండు పాటలకు అవార్డులు రావటం నా ఆనందాన్ని ద్విగుణీకృతం చేసిందనే చెప్పుకోవాలి. నందులు దక్కిన వార్త తెలిసినప్పుడు ఈ అవార్డులకు కారణమైన ఇద్దరి ఎదురుగా నేను కూర్చుని ‘భరత్ అనే నేను’ సినిమాకి చెన్నైలో పని చేస్తున్నా. ఆ ఇద్దరు ఎవరో కాదు... చిత్రదర్శకులు కొరటాల శివ, సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్. ‘శ్రీమంతుడు’ చిత్రంలోని ‘పోరా శ్రీమంతుడా...’, ‘జనతా గ్యారేజ్’లోని ‘ప్రణామం ప్రణామం..’ పాటలకు కచ్చితంగా అవార్డులు వస్తాయని మా గురువుగారు ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారు ముందుగానే జోస్యం చెప్పారు. ఎంతో సంతోషమైన రోజుగా నాకు గుర్తుండిపోతుంది. – గీత రచయిత రామజోగయ్య శాస్త్రి కథనే నమ్మి సినిమా తీస్తా.. ప్రామిస్ మా చిత్రంలో పెద్ద స్టార్లు లేరు, భారీ బడ్జెట్టూ లేదు. కథపై నమ్మకంతో ‘పెళ్ళిచూపులు’ తీశాం. మంచి కథ, కథనంతో రూపొందిన చిత్రాల్ని ఆదరించే ప్రేక్షకులకు నా థ్యాంక్స్. ప్రేక్షకాదరణ, వాళ్ల మద్దతు లేకుండా మేం ఏమీ చేయలేం. ఎప్పుడైనా అంతిమ తీర్పు ప్రేక్షకులదే. వాళ్లు వంద రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని సినిమా చూడకపోతే... మేము ఎన్ని సినిమాలు తీసినా ప్రయోజనం ఏముంటుంది? అందువల్ల, భవిష్యత్తులోనూ కథను నమ్మే సినిమాలు తీస్తా.. ప్రామిస్. – నిర్మాత రాజ్ కందుకూరి అవార్డు వస్తే కష్టాన్ని మరచిపోతాం మా లైఫ్‌లో ఓ మైలురాయి వంటి సినిమా ‘లెజెండ్’. ఫైట్ మాస్టర్లుగా మాకు చాలా శాటిస్ఫ్యాక్షన్ ఇచ్చిన సినిమా. దర్శకుడు బోయపాటిగారు మంచి కథను అందించారు. కథకు అనుగుణంగా బాలయ్యబాబుగారి ఇమేజ్ను దృష్టిలో పెట్టుకుని ఫైట్స్ డిజైన్ చేశాం. వాళ్లిద్దరికీ థ్యాంక్స్. మాకొచ్చిన ఆరో నంది అవార్డు ఇది. ఫైట్ మాస్టర్ల వర్క్ ఎంతో రిస్క్, కష్టంతో కూడుకున్నది. ఇటువంటి అవార్డులు వచ్చినప్పుడు మా కష్టాన్ని మర్చిపోతాం. వుయ్ ఆర్ సో హ్యాపీ. – ఫైట్ మాస్టర్లు రామ్–లక్ష్మణ్ చాలా సంతోషంగా ఉంది ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎన్టీఆర్ జాతీయ అవార్డు (2016) సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు వచ్చింది. ఆయనకు శుభాకాంక్షలు. ఇదే అవార్డుతో నన్ను కూడా (2014) గౌరవించినందుకు ఏపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు. నా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి మీరు (తెలుగు) అందిస్తున్న సపోర్ట్‌కు రుణపడి ఉంటాను. చాలా సంతోషంగా ఉంది. కృతజ్ఞతలు. – నటుడు కమల్‌హాసన్ నా హీరోలు విజేతలు కావడం ఆనందం ఉత్తమ నటుడు విభాగంలో విజేతలుగా నిలిచిన మహేశ్‌బాబు, ఎన్టీఆర్లకు... నంది పురస్కార విజేతలందరికీ అభినందనలు. రామజోగయ్య శాస్త్రికి రెండు పురస్కారాలు రావడం హ్యాపీగా ఉంది. నిజంగా... ఆయన రాసిన గొప్ప సాహిత్యానికి, అర్హతకు తగిన గుర్తింపు ఇది. ‘మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్’ (కొరటాల దర్శకత్వం వహించినవి) సినిమాలను ప్రశంసించిన నంది కమిటీకి కృతజ్ఞతలు. నేను తీసిన మూడు సినిమాల్లో హీరోలు (ప్రభాస్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్) నంది పురస్కారాల్లో విజేతలుగా నిలవడం సంతోషంగా.. గర్వంగా ఉంది. – దర్శకుడు కొరటాల శివ మూడు నందులకు మరో రెండు తోడు ‘మనలో ఒకడు’ సినిమా తృతీయ ఉత్తమ చిత్రంగా నంది అవార్డుకి ఎంపిక అవడం ఒక నటుడిగా, దర్శకునిగా చాలా సంతోషంగా ఉంది. ‘బ్రోకర్’ సినిమా నచ్చిన ప్రతి ఒక్కరికీ ‘మనలో ఒకడు’ చిత్రం నచ్చుతుంది. మా సినిమా విడుదల టైమ్‌లో నోట్ల రద్దు వల్ల ప్రేక్షకులకి సరిగ్గా రీచ్ కాలేదు. ఈ అవార్డుతో ఇప్పుడు వారికి ఇంకా బాగా రీచ్ అవుతుందనుకుంటున్నా. ఇప్పటికే ఇంట్లో మూడు నందులున్నాయి. మరో రెండు నందులు రానున్నాయి. అవార్డులొచ్చినా.. రాకున్నా సినిమా పట్ల నేనెప్పుడూ బాధ్యతాయుతంగానే ఉంటానే కానీ బాధ్యతారహిత్యంగా ఉండను. ఇకపైనా బాధ్యతగానే పనిచేస్తా. – ఆర్పీ పట్నాయక్ అవార్డు ఊహించలేదు నంది వస్తుందని అసలు ఊహించలేదు. వెరీ హ్యాపీ! అవార్డులు మన బాధ్యతను పెంచుతాయి. కుటుంబ సభ్యులు, మా ‘కార్తికేయ’ టీమ్, ఇండస్ట్రీలో స్నేహితులు సంతోషంతో ఫోన్లు చేస్తుంటే... మనకు నంది అవార్డు వచ్చిందనే దానికన్నా ఇంకా ఎక్కువ సంతోషంగా ఉంది. సమష్టి కృషి ఫలితమే ‘కార్తికేయ’. ఈ సందర్భంగా మా టీమ్ అందరికీ థ్యాంక్స్. వాళ్లకు నేనెప్పుడూ రుణపడి ఉంటాను. – దర్శకుడు చందూ మొండేటి పేరు.. అవార్డూ దక్కడం ఆనందం నాకు నచ్చింది నేను చేస్తున్నాను. ప్రతి స్త్రీ తను అనుకుంటున్నట్లుగా తను జీవించాలి. నేనలానే జీవిస్తాను. నా డ్రీమ్స్‌ని నెరవేర్చుకోవడానికి కృషి చేస్తా. ప్రతి అవార్డు ఇంకొంచెం ఎక్కువ పని చేయడానికి ఉత్సాహాన్నిస్తుంది. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు వచ్చినప్పుడు చేసిన కష్టం మరచిపోతాం. ‘చందమామ కథలు’లో లీసా స్మిత్ క్యారెక్టర్ గురించి దర్శకుడు ప్రవీణ్ సత్తారు చెప్పి, ఈ పాత్ర మీరు చేయకపోతే సినిమా చేయనన్నారు. ఆ పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అవార్డు కూడా దక్కినందుకు ఆనందంగా ఉంది. – నటి మంచు లక్ష్మీప్రసన్న -
లెజెండ్‌కు క్లాప్స్.. బాహుబలికి సాహో.. నచ్చిన పెళ్లి చూపులు
2014 నంది అవార్డు విజేతలు ఉత్తమ చిత్రం : లెజెండ్ ద్వితీయ ఉత్తమ చిత్రం : మనం తృతీయ ఉత్తమ చిత్రం : హితుడు ఉత్తమ దర్శకుడు : బోయపాటి శ్రీను (లెజెండ్) ఉత్తమ నటుడు : నందమూరి బాలకృష్ణ (లెజెండ్) ఉత్తమ నటి : అంజలి (గీతాంజలి) ఉత్తమ విలన్ : జగపతిబాబు (లెజెండ్) ఉత్తమ సహాయ నటుడు : అక్కినేని నాగచైతన్య (మనం) ఉత్తమ సహాయ నటి : లక్ష్మీమంచు (చందమామ కథలు) ఉత్తమ హాస్య నటుడు : బ్రహ్మానందం (రేసుగుర్రం) ఉత్తమ బాలనటుడు : గౌతమ్ కృష్ణ (1 నేనొక్కడినే) ఉత్తమ బాలనటి : అనూహ్య (ఆత్రేయ) ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : చందు మొండేటి (కార్తికేయ) ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్ : ఏయస్ రవికుమార్ చౌదరి (పిల్లా నువ్వులేని జీవితం) ఉత్తమ కథా రచయిత : కృష్ణవంశీ (గోవిందుడు అందరివాడేలే) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్ (అలా ఎలా) ఉత్తమ గాయకుడు : విజయ్ ఏసుదాసు (లెజెండ్) ఉత్తమ గాయని : కేయస్ చిత్ర (ముకుంద) ఉత్తమ కళాదర్శకుడు : విజయకృష్ణ ఉత్తమ కొరియోగ్రాఫర్ : ప్రేమ్‌రక్షిత్ (ఆగడు) ఉత్తమ ఆడియో గ్రాఫర్ : ఇ. రాధకృష్ణ (కేరింత) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : ఉద్దండు (ఓరి దేవుడోయ్) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : కృష్ణ (శనిదేవుడు) ఉత్తమ మాటల రచయిత : ఎమ్. రత్నం (లెజెండ్) ఉత్తమ గేయ రచయిత : చైతన్య ప్రసాద్ (బ్రోకర్ 2) ఉత్తమ సంగీత దర్శకుడు : అనూప్ రూబెన్స్ (మనం) ఉత్తమ ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర్రావు (లెజెండ్) ఉత్తమ ఫైట్స్ : రామ్‌లక్ష్మణ్ (లెజెండ్) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : రవిశంకర్. పి (రేసుగుర్రం) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిమేల్ : చిన్మయి (మనం) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : రఘునాథ్ (లెజెండ్) ఉత్తమ సినీ విమర్శకుడు : పులగం చిన్నారాయణ స్పెషల్ జ్యూరీ అవార్డు : సుద్దాల అశోక్ తేజ 2015 నంది అవార్డు విజేతలు ఉత్తమ చిత్రం : బాహుబలి ద్వితీయ ఉత్తమ చిత్రం : ఎవడే సుబ్రమణ్యం తృతీయ ఉత్తమ చిత్రం : నేను శైలజ ఉత్తమ దర్శకుడు : రాజమౌళి (బాహుబలి) ఉత్తమ నటుడు : మహేశ్‌బాబు (శ్రీమంతుడు) ఉత్తమ నటి : అనుష్క (సైజ్ జీరో) ఉత్తమ విలన్ : రానా (బాహుబలి) ఉత్తమ సహాయ నటుడు : పోసాని కృష్ణమురళి (టెంపర్) ఉత్తమ సహాయ నటి : రమ్యకృష్ణ (బాహుబలి) ఉత్తమ హాస్య నటుడు : ‘వెన్నెల’ కిశోర్ (భలే భలే మగాడివోయ్) ఉత్తమ బాలనటుడు : మాస్టర్ ఎన్టీఆర్ (దాన వీర శూర కర్ణ) ఉత్తమ బాలనటి : బేబీ కారుణ్య (దాన వీర శూర కర్ణ) తొలి చిత్ర దర్శకుడు : నాగ అశ్విన్ (ఎవడే సుబ్రమణ్యం) ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ : కిశోర్ తిరుమల (నేను శైలజ) ఉత్తమ కథా రచయిత : క్రిష్ జాగర్లమూడి (కంచె) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : జ్ఞానశేఖర్ (కంచె, మళ్ళీ మళ్ళీ ఇది...) ఉత్తమ గాయకుడు : కీరవాణి (జటా..జటా – బాహుబలి) గాయని : చిన్మయి (గతమా.. గతమా) ఉత్తమ కళాదర్శకుడు : సాబు శిరిల్ (బాహుబలి) ఉత్తమ కొరియోగ్రాఫర్ : ప్రేమ్ రక్షిత్ (బాహుబలి) ఉత్తమ ఆడియో గ్రాఫర్ : పీఎమ్ సతీష్ (బాహుబలి) ఉత్తమ కాస్ట్యూమ్స్ : రమా రాజమౌళి, ప్రశాంతి (బాహుబలి) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : ఆర్. మాధవరావు (దాన వీర శూర కర్ణ) ఉత్తమ మాటల రచయిత : బుర్రాసాయి మాధవ్ (మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు) ఉత్తమ గేయ రచయిత : రామజోగయ్య శాస్త్రి (పోరా శ్రీమంతుడా..) ఉత్తమ సంగీత దర్శకుడు : ఎమ్.ఎమ్. కీరవాణి (బాహుబలి) ఉత్తమ ఎడిటర్ : ఎన్. నవీన్ (లేడీస్ అండ్ జెంటిల్మెన్) ఉత్తమ ఫైట్స్ : పీటర్ హెయిన్స్ (బాహుబలి) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : రవిశంకర్ (కట్టప్ప–సత్యరాజ్–బాహుబలి) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిమేల్ : సౌమ్య (రుద్రమదేవి–అనుష్క) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఎస్.శ్రీనివాస్ మోహన్ (బాహుబలి) ఎస్వీ రంగారావు పురస్కారం : అల్లుఅర్జున్ (రుద్రమదేవి) ఉత్తమ సినీ విమర్శకుడు : డా. కంపెల్ల రవిచంద్రన్ స్పెషల్ జ్యూరీ అవార్డు : పీసీ రెడ్డి 2016 నంది అవార్డు విజేతలు ఉత్తమ చిత్రం : పెళ్ళిచూపులు ద్వితీయ ఉత్తమ చిత్రం : అర్ధనారి తృతీయ ఉత్తమ చిత్రం : మనలో ఒకడు ఉత్తమ దర్శకుడు : సతీశ్ వేగేశ్న (శతమానం భవతి) ఉత్తమ నటుడు : జూనియర్ ఎన్టీఆర్ (నాన్నకు ప్రేమతో) ఉత్తమ నటి : రితూ వర్మ (పెళ్ళిచూపులు) ఉత్తమ విలన్ : ఆది పినిశెట్టి (సరైనోడు) ఉత్తమ సహాయ నటుడు : మోహన్‌లాల్ (జనతా గ్యారేజ్) ఉత్తమ సహాయ నటి : జయసుధ (శతమానం భవతి) ఉత్తమ హాస్య నటుడు : సప్తగిరి (ఎక్స్‌ప్రెస్ రాజా) ఉత్తమ హాస్యనటి : ప్రగతి (కళ్యాణ వైభోగమే) ఉత్తమ బాలనటుడు : మైఖేల్ గాంధి (సుప్రీమ్) ఉత్తమ బాలనటి : రైనా రావ్ (మనమంతా) ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు : కల్యాణ్‌కృష్ణ కురసాల (సోగ్గాడే చిన్నినాయనా) ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్ : రవికాంత్ పేరెపు, అడివి శేష్ (క్షణం) ఉత్తమ కథా రచయిత : కొరటాల శివ (జనతా గ్యారేజ్) ఉత్తమ సినిమాటోగ్రాఫర్ : సమీర్‌రెడ్డి (శతమానం భవతి) ఉత్తమ గాయకుడు : ‘వందేమాతరం’ శ్రీనివాస్ (దండకారణ్యం) ఉత్తమ గాయని : చిన్మయి (కళ్యాణవైభోగమే) ఉత్తమ కళాదర్శకుడు : ఎ.ఎస్. ప్రకాశ్ (జనతా గ్యారేజ్) ఉత్తమ కొరియోగ్రాఫర్ : రాజు సుందరం (జనతా గ్యారేజ్) ఉత్తమ ఆడియో గ్రాఫర్ : ఇ. రాధాకృష్ణ (సరైనోడు) ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ : వి. తిరుమలేశ్వర రావ్ (శ్రీ చిలుకూరి బాలాజి) ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : రంజిత్ (అర్ధనారి) ఉత్తమ మాటల రచయిత : అవసరాల శ్రీనివాస్ (జ్యో అచ్యుతానంద) ఉత్తమ గేయ రచయిత : రామజోగయ్య శాస్త్రి (ప్రణామం ప్రణామం) ఉత్తమ సంగీత దర్శకుడు : మిక్కీ జె. మేయర్ (అ ఆ) ఉత్తమ ఎడిటర్ : నవీన్ నూలి (నాన్నకు ప్రేమతో) ఉత్తమ ఫైట్స్ : వెంకట్ (సుప్రీమ్) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ మేల్ : వాసు (అర్ధనారి) ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఫిమేల్ : లిప్సికా (ఎక్కిడికి పోతావు చిన్నవాడా) ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ : ఫైర్ప్లైయ్ (సోగ్గాడే చిన్నినాయనా) తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం: పసిడితెర (పులగం చిన్నారాయణ) స్పెషల్ జ్యూరీ అవార్డు : నాని (జెంటిల్మన్) కాంస్య నంది : చంద్రశేఖర్ ఏలేటి (మనమంతా) కాంస్య నంది : సాగర్ కె.చంద్ర (అప్పట్లో ఒకడుండేవాడు) స్పెషల్ జ్యూరీ అవార్డు : పరుచూరి బ్రదర్స్ ఎన్టీఆర్ జాతీయ అవార్డు ► 2014 - కమల్‌హాసన్ ► 2015 - కె. రాఘవేంద్రరావు ► 2016 - రజనీకాంత్ బీఎన్‌రెడ్డి పురస్కారం ► 2014 - ఎస్.ఎస్.రాజమౌళి ► 2015 - త్రివిక్రమ్ శ్రీనివాస్ ► 2016 -బోయపాటి శ్రీను నాగిరెడ్డి–చక్రపాణి అవార్డు ► 2014 - ఆర్. నారాయణమూర్తి ► 2015 -ఎం.ఎం. కీరవాణి ► 2016 - కె.ఎస్. రామారావు రఘుపతి వెంకయ్య అవార్డు ► 2014 - కృష్ణంరాజు ► 2015 - ఈశ్వర్ ► 2016 - చిరంజీవి ఎస్వీ రంగారావు అవార్డు (బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్) ► 2014 - రాజేంద్రప్రసాద్ (టామీ) ► 2015 - అల్లు అర్జున్ (రుద్రమదేవి) ► 2016 ► నరేశ్ (శతమానం భవతి)