హైదరాబాద్‌లో జరిగిన అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ‘చదువుకోవాలి’ చిత్రానికి మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సినీవారం కార్యక్రమంలో ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ సినిమాను రూపొందించిన ఎం. వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి దేశరాజు లలిత, కో డైరెక్టర్ సాయిశ్వేతను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ తరఫున సత్కరించి, అభినందించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ– ‘‘చదువుకోవాలి’ వంటి సందేశాత్మక చిత్రం వల్ల సమాజంలో మంచి మార్పులు వస్తాయి.
పాత్రికేయునిగా అపార అనుభవం ఉన్న ఎం. వెంకటేశ్వరరావు సామాజిక బాధ్యతగా సినిమా తీయడం అభినందనీయం’’ అన్నారు. ‘‘సినిమా తీసి ఐదేళ్లవుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో చోట విద్యార్థుల కోసం ఇంకా ప్రదర్శించబడుతోంది. విద్యపై చెతన్యంతో తీసిన సినిమా కావడమే ఇందుకు కారణం. ఐదు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన మా చిత్రానికి ఏపీ నంది అవార్డుల్లో అన్యాయం చేశారు’’ అన్నారు దర్శక నిర్మాత ఎం.వెంకటేశ్వరరావు.
Comments
Please login to add a commentAdd a comment