తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి.. సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా)
ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని.. గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులని ప్రకటించామని, కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు.
(ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడి సెంటిమెంట్.. పాత భవనానికి రూ. 37 కోట్లు!)
Comments
Please login to add a commentAdd a comment