స్టార్‌ హీరో కుమారుడి సెంటిమెంట్‌.. పాత భవనానికి రూ. 37 కోట్లు! | Aryan Khan buys property in South Delhi Cost Of Rs 37 crore Rupees | Sakshi
Sakshi News home page

Aryan Khan: షారూఖ్‌ కుమారుడి సెంటిమెంట్‌.. రూ. 37 కోట్లతో పాత భవనం!

Published Mon, Jul 29 2024 7:26 PM | Last Updated on Mon, Jul 29 2024 8:09 PM

Aryan Khan buys property in South Delhi Cost Of Rs 37 crore Rupees

బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ చలనచిత్ర పరిశ్రమలో స్టార్‌ కిడ్‌గా గుర్తింపు ఉంది. తాజాగా ఢిల్లీలో భారీ మొత్తంలో ఆస్తులను ఆర్యన్‌ కొనుగోలు చేశాడని తెలుస్తోంది.  కొద్దిరోజుల క్రితం  సొంతంగా దుస్తుల బిజినెస్‌ ప్రారంభించిన ఆర్యన్‌ త్వరలో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇలా సంపాదన వేటను ఆయన ఎప్పుడో ప్రారంభించాడు. ఈ క్రమంలోనే  దేశ రాజధాని ఢిల్లీలో రెండు అంతస్తుల భవనాన్ని కొనుగోలు చేశారని తెలుస్తోంది.

బాలీవుడ్‌లో వస్తున్న వార్తల ప్రకారం  దక్షిణ ఢిల్లీలోని పంచశీల్ పార్క్‌లో రెండు అంతస్తుల భవనాన్ని రూ. 37 కోట్లు చెల్లించి ఆర్యన్ కొనుగోలు చేశాడు. అందుకు సంబంధించిన లావాదేవీలు మే 2024లో జరిగాయి. ఆ బంగ్లా ఆయన పేరుతో రిజిస్టర్ కూడా అయినట్లు నివేదించబడింది.

ముంబైలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌ ఢిల్లీలోని ఫ్లాట్‌ను ఎందుకు కొనుగోలు చేశాడో కూడా తెలిపారు. ఆయన అమ్మ గౌరీఖాన్‌ చిన్నతనంలో ఇక్కడే ఉండేవారని తెలుస్తోంది. షారుక్‌, గౌరీఖాన్‌ ముంబైకి షిఫ్ట్‌ కాక ముందు ఆ ఫ్లాట్‌లోనే జీవనం సాగించారని, అందుకే ఆ సెంటిమెంట్‌తో ఇప్పుడు ఆర్యన్‌ దానిని కొనుగోలు చేశాడు.  అయితే, ఇప్పటికే ఈ బిల్డింగ్‌లో వారి కుటుంబానికి చెందిన ఆస్తులున్నాయి. చాలా ఏళ్ల క్రితమే ఆ భవనంలో  బేస్‌మెంట్‌, మొదటి ఫ్లోర్‌ను ఆ కుటుంబం కొనుగోలు చేసింది. ఆ బిల్డింగ్‌ నుంచే తన తండ్రి జీవితం ప్రారంభం కావడంతో తాజాగా అక్కడ రెండు ఫ్లోర్లను ఆర్యన్‌ కొనుగోలు చేశాడు. అందుకోసం రూ. 37 కోట్లు ఆయన చెల్లించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement