Gaddar
-
ప్రజా యుద్ధనౌక గద్దర్ లేకుండా ఏ ఉద్యమాలూ లేవు: హరీశ్‌రావు
-
‘ఉక్కు సత్యాగ్రహం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉక్కు సత్యాగ్రహంనటీనటులు: గద్దర్, సత్యారెడ్డి, ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల తదితరులుకథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం : పి. సత్యా రెడ్డిసంగీతం: శ్రీకోటిఎడిటర్: మేనగ శ్రీనువిడుదల తేది: నవంబర్ 29, 2024సత్యా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు సత్యారెడ్డి. ప్రజా నౌక గద్దర్ నటించిన చివరి చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(నవంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటన నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. అప్పుడు చాలా మంది నాయకులు, ఉద్యమకారులు ఆ ప్రైవేటీకరణ ఆపేందుకు కృషి చేశారు. ఆ సన్నివేశాలన్నీ ప్రజలకు తెలిసేలా చేయడానికి సత్యా రెడ్డి గారు ఓ సినిమా రూపంలో చిత్రీకరించడం జరిగింది. అప్పుడు వైజాగ్ లో జరిగిన సన్నివేశాలు, దానికి ఉద్యమకారులు ఎటువంటి సపోర్టు చేశారు? మల్టీ నేషనల్ కంపెనీలు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారు? దీనిలోకి గద్దర్ ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? చివరకు ఎవరి ప్రయత్నం ఫలించింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.విశ్లేషణయదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. చాలావరకు విశాఖపట్నంలో చాలా న్యాచురల్ లొకేషషన్లలో చేయడంవల్ల సినిమాకు ఒక ఒరిజినాలిటీ కనిపించింది. అంతేకాక ఈ సినిమాలో డైలాగులు విప్లవత్మకంగా ఉండటం సినిమాకు కలిసొచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో అక్కడ జరిగిన విప్లవాలను తెరపై చక్కగా చూపించారు. డబ్బింగ్ అలాగే కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండ అనిపించింది. కెమెరా అక్కడక్కడ స్థిరంగా లేనట్లు అనిపించినప్పటికీ సన్నివేశాలకు తగ్గట్లు నిజంగా విప్లవాలు జరుగుతున్నప్పుడు ఎలా అయితే మోసంతో ఉంటాయో ఈ చిత్ర సన్నివేశాలు కూడా అలాగే చాలా న్యాచురల్ గా అనిపించాయి. పల్సర్ ఝాన్సీ ఓ పోలీస్ ఆఫీసర్ గా అలాగే ఉద్యమకారునిగా తన పాత్రకు తన న్యాయం చేయడం జరిగింది. అలాగే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ తన పాత్ర మేరకు మంచి స్క్రీన్ తో ప్రేక్షకులను అలరించారు. అదేవిధంగా చిత్రంలో తదితర పాత్రలు పోషించిన నటీనటులు అంతా చాలా బాగా నటించారు.ఎవరెలా చేశారంటే..ఉద్యమకారుడి పాత్రలో సత్యారెడ్డి చక్కగా నటించాడు. తెరపై ఆయన నటన చూస్తే దాసరి నారాయణ గుర్తుకు వస్తాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అలాగే చిత్రానికి ప్రజానౌక గద్దర్ పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచారు. కొన్ని సన్నివేశాలలో సత్య రెడ్డితో కలిసి నటిస్తూ, అలాగే కొన్ని ఉద్యమ సన్నివేశాలలో పాల్గొంటూ చిత్రానికి వెన్నుముకగా నిలవడం జరిగింది. గద్దర్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. సినిమాకు ఆ సీన్స్ ప్లస్ అయ్యాయి. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
నెలాఖర్లో ఉక్కు సత్యాగ్రహం
సత్యా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. గద్దర్, ‘పల్సర్ బైక్’ ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎంవీవీ సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా సత్యా రెడ్డి మాట్లాడుతూ– ‘‘మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయాక కర్నూలు రాజధానిగా వచ్చినప్పుడు ఏం జరిగింది? విశాఖ స్టీల్ ప్లాట్‌ను మద్రాస్‌లో పెట్టాలని ఇందిరా గాంధీగారు అనుకున్నప్పుడు ఏం జరిగింది? అనే అంశాలతో గద్దర్‌గారు ఈ సినిమా కథను రాశారు. అలాగే నాలుగు పాటలు రాసి, కొన్ని కీలక సన్నివేశాల్లోనూ నటించారు. ఆయన చివరి చిత్రం ఇదే. ఈ సినిమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందన్న కారణంగా సెన్సార్ ఇబ్బందులు రావడం, గద్దర్‌గారి మరణం వంటి కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడింది. ఇప్పుడు సెన్సార్ పూర్తయింది. 300కు పైగా థియేటర్లలో ఈ నెల 29న సినిమాను రిలీజ్ చేయనున్నాం’’ అని అన్నారు. ఈ సినిమాకు సంగీతం: శ్రీ కోటి. -
బాట మార్చుకున్న మానవతావాది
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక శాంతి యుత పరివర్తన రావాల్సింది పోయి, ఎక్కడికక్కడ ఉద్యమాలు తలెత్తాయి. కేంద్రం, రాష్ట్రాల నుండి బ్రిటిష్ పాలకులు వైదొలిగారు. కానీ గ్రామీణ వ్యవస్థలు మారలేదు. భూమిపై ఉన్న హక్కులు రద్దు కాలేదు. దాంతో భూస్వాముల వర్గం అన్ని రంగా ల్లోనూ ఎదుగుతూ వచ్చింది. అంబేడ్కర్ భూమిని జాతీయం చేయాలన్నారు. ప్రజాస్వామ్యం ద్వారా సోషలిజాన్ని బహుళ పార్టీ వ్యవస్థలో సాధించడం ఎలాగో రోడ్ మ్యాప్ వేశారు. కానీ అది జరగలేదు. పర్యవ సానంగా ప్రజలు భూమి కోసం ఉద్యమ బాట పట్టారు. ప్రభు త్వాలు సమస్యను పరిష్కరించే బదులు బల ప్రయోగంతో అణిచి వేయాలని చూశాయి.రాజ్యాంగం మహోన్నత లక్ష్యా లతో రాయబడింది గానీ ప్రజలకు దాన్ని అందించలేదు, వివరించలేదు, చదివించలేదు. ఏదో రష్యాలో, చైనాలో గొప్పగా వుందట అని చెపితే జనం నమ్మారు. మార్క్సిజం సిద్ధాంతాలు చెప్తే బాగుందనుకున్నారు. ఆదర్శ సమాజం అనే భావన ఆకర్షించింది. ఆ బాటలో సాగిన గద్దర్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అంటరాని కులంలో పుట్టి, ప్రభుత్వ హాస్టల్లో ఉండి చదివి, బ్యాంకులో ఉద్యోగం చేసి, తాను నమ్మిన కళ కోసం, సాంస్కృతిక విప్లవం కోసం ఉద్యోగాన్ని వదిలి,దిగంతాలకు ఎదిగిన మహా కళాకారుడయ్యాడు. అరుదైన గాయకుడిగా, ప్రజా కవిగా విప్లవోద్యమానికి ఊపిరులు ఊదాడు. ప్రజా వాగ్గేయ కారుడిగా విశ్వ వ్యాప్తం అవుతూ వచ్చాడు. గద్దర్ ఆట, పాట, కాలి అందెల సవ్వడి జనాన్ని ఉర్రూతలూగించి వేలాదిమంది యువకులను ఉద్యమాల బాట పట్టించింది. భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విప్లవో ద్యమానికి ఊపిరులు ఊదిన గద్దర్ ఫలితాలు రాక, విస్తరణ కోల్పోయిన ఉద్యమ దశను కళ్లారా చూశాడు. ఆశలు అడియాసలై, ఆత్మావలోకం చేసుకొని ఉద్యమకారులు అజ్ఞా తంలో ఉండి సాధించేది శూన్యం అని గుర్తెరిగి ప్రజాస్వామ్యం వైపు పరివర్తన చెందాడు.అనుభవం నేర్పిన పాఠాలతో ఉద్యమాల బాట సాధించేది ఏమీలేదనీ, ప్రజాస్వామ్య బాటనే భేష్ అనీ భారత రాజ్యాంగాన్ని ఆలస్యంగా అధ్యయనం చేయడం ప్రారంభించాడు. అప్పటికి జరగరాని నష్టం జరిగిపోయింది. వేలాది మంది యువకులు నేలకొరిగారు. నడిచిన దారి తప్పు అని చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఇంకొక బాధ. ఈ రెండింటి మధ్య గద్దర్ చాలాకాలం నలిగి పోయాడు. ఈలోపు మలి తెలంగాణ ఉద్యమం రాజు కోవడంతో ఉవ్వెత్తున లేచాడు. చంద్రబాబు ప్రభుత్వ కాలంలో గద్దర్‌పై కాల్పులు జరిగాయి. 6 తూటాలు దిగాయి. అయినా తెలంగాణ కోసమే బతికినట్టయింది. ఆ మధ్య ఒక విలేఖరి ఇలా ప్రశ్నించాడు: ‘‘మీరు భారత రాజ్యాంగం, దాని మౌలిక లక్ష్యాలు చదవకుండా, రాజ్యాంగ ఆచరణతో సమాజంలో, జీవితాల్లో వచ్చిన మార్పులు పరిశీ లించకుండా మార్క్సిజం, మావో యిజం కరెక్టు అని ఎలా అనుకున్నారు? సాయుధ విప్లవంలో ఎందుకు చేరారు?’’ ‘‘రాజ్యాంగంలో ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయని మాకె వరూ చెప్పలేదు. సోషలిజం సాయుధ పోరాటంతోనే వస్తుందనుకున్నాం. భారత రాజ్యాంగం చదవకుండా విప్లవం చేయాలనుకోవడం తప్పే. సోషలిస్టు రష్యాలో, పీపుల్స్ చైనాలో ప్రజల హక్కులు, ప్రభుత్వ నిర్వహణ, న్యాయ వ్యవస్థ ఎలా ఉన్నాయో తెలుసుకోకుండా విప్లవం చేయాలనుకోవడం పొరపాటే. అందుకే ఇపుడు భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాల సాధన, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం’’ అని చెప్పాను. గద్దర్ ఆశయం ప్రజాస్వామ్య సోషలిజం సాధన.బౌద్ధం, అంబేడ్కరిజం, భారత రాజ్యాంగ మౌలిక లక్ష్యాల సాధన అంతిమ లక్ష్యం. అంటరానితనం, అసమానతలు, దోపిడీ, మనిషి పై మనిషి ఆధిపత్యం చేసే సంస్కృతి పోవడం గద్దర్‌తో పాటు మన లక్ష్యం కూడా కావాలి. అదే గద్దర్‌కు నిజమైన నివాళి.బి.ఎస్. రాములు వ్యాసకర్త తెలంగాణ బీసీ కమిషన్ తొలి చైర్మన్(నేడు గద్దర్ తొలి వర్ధంతి) -
టాలీవుడ్ తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో తమిళ రచయిత, ఉద్యమకారుడు శివశంకరికి.. సి.నారాయణరెడ్డి జాతీయ సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి టాలీవుడ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.(ఇదీ చదవండి: మూడున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు సినిమా)ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని.. గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులని ప్రకటించామని, కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు.(ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడి సెంటిమెంట్.. పాత భవనానికి రూ. 37 కోట్లు!) -
నందికాదు కానీ.. గద్దర్ అవార్డులు
గన్‌ఫౌండ్రి (హైదరాబాద్): వచ్చే ఏడాది గద్దర్ జయంతి రోజున ప్రభుత్వం తరపున కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు గద్దర్ పురస్కారాలు ప్రదానం చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ‘ఇటీవల సినీ ప్రముఖులు నన్ను కలిశారు. గత ప్రభుత్వాలు నంది అవార్డులు ఇచ్చాయని, వాటిని పునరుద్ధరించాలని అడిగారు. నంది అవార్డులు కాదుగానీ, మా ప్రభుత్వం గద్దర్ పేరిట అవార్డులు ఇస్తుంది..బాహుబలిలో శివగామి శాసనం మాదిరి ఈ వేదికగా చెబుతున్న ఈ ప్రకటనే శాసనం, జీఓ’అని సీఎం తెలిపారు. బుధవారం రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గద్దర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ఏర్పడాలన్న గద్దర్ మాటలే తమకు స్ఫూర్తి అన్నారు. సమాజాన్ని చైతన్యం చేసేందుకు గజ్జెకట్టి గళం విప్పిన గొప్పవ్యక్తి గద్దర్ అని కొనియాడారు. ఆయనతో మాట్లాడితే వెయ్యి ఏనుగుల బలం వచ్చిందని, ఆ బలంతోనే గడీల ఇనుప కంచెలను బద్ధలు కొట్టామని తెలిపారు. దళితుడిని సీఎంను చేస్తానని మాట ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని, ప్రజాప్రభుత్వంలో జ్యోతిరావుపూలే విగ్రహం కోసం ఎమ్మెల్సీ కవిత వచ్చి ఆ దళితుడికే వినతిపత్రం ఇచ్చిందన్నారు. ప్రజాప్రభుత్వంలో ఎవరైనా వచ్చి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహం ఏర్పాటు చేసే విషయమై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారని కొందరు కలలు కంటున్నారు ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ కొందరు కలలు కంటున్నారని రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అలాంటి ఆలోచన చేసేవారికి తెలంగాణ ప్రజలే ఘోరీ కడతారని స్పష్టం చేశారు. అది వారి ఒంటికి, ఇంటికి మంచిది కాదని హితవు పలికారు. ఇది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని, ఐదు సంవత్సరాల పాటు సుస్థిరమైన పాలన అందించే బాధ్యత తమపై ఉందన్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ గద్దర్‌ను అవమానించిన ప్రగతిభవన్ గేట్లను బద్ధలు కొట్టామని, దానిని ప్రజలకు అంకితం చేస్తూ ప్రజాభవన్‌గా మార్చామన్నారు. గద్దర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి, అందరం కలిసి నడుద్దామని, సామాజిక ప్రగతిశీలరాష్ట్రాన్ని నిర్మి ద్దామని పిలుపునిచ్చారు. అనంతరం ‘పాటకు జీవకణం’, ‘తరగని ఘని’పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, గద్దర్ సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణ్, కూతురు వెన్నెలఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, ప్రొఫెసర్ కంచె ఐలయ్యతోపాటు వివిధ సంఘాల ప్రతినిధులు, గద్దర్ అభిమానులు పాల్గొన్నారు. -
Gaddar Awards: నంది అవార్డు ఇక గద్దర్ అవార్డు
హైదరాబాద్, సాక్షి: కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా పేరు మారుస్తూ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించనుంది. ఇక నుంచి కవులు కళాకారులకు నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు ఇస్తాం అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్వయంగా తెలియజేశారు. బుధవారం(జనవరి 31) గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఇకపై గద్దరన్న పేరిట అవార్డులు ఇస్తాం. అర్హులైన కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఈ అవార్డులు ఇస్తాం. వచ్చే ఏడాది గద్దరన్న జయంతి నుంచి ఈ అవార్డుల ప్రదానం ఉంటుంది. త్వరలోనే జీవో రిలీజ్ చేస్తాం అని ప్రకటించారాయన. ‘‘నంది అవార్డులు పునరుద్ధరించాలని సినిమా వాళ్లు అడిగారు. నంది అవార్డులు కాదు.. మా ప్రభుత్వం కచ్చితంగా అవార్డులు ఇస్తుంది. గద్దర్ అవార్డుల పేరుతో పురస్కారాలు ఇస్తాం. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఇచ్చే అధికారిక అవార్డులకు గద్దర్ అవార్డు ఇస్తాం. ఇదే శాసనం.. నా మాటే జీవో’’ అని సీఎం రేవంత్ అన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక నుంచి ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహ ఏర్పాటునకు కృషి చేస్తామని రేవంత్ ప్రకటించారు. మరోవైపు తెల్లపూర్(సంగారెడ్డి) మున్సిపాలిటీలో గద్దర్ విగ్రహ(తొలి!) ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది. -
TS: గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణ ఉద్యమ గొంతుక.. ప్రజాయుద్ధ నౌక గద్దర్ విగ్రహ ఏర్పాటుకు లైన్ క్లియర్ అయ్యింది. తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో విగ్రహ ఏర్పాటు కోసం జాగా కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గత కొన్ని రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో గద్దర్ విగ్రహం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. ఆ వెంటనే గద్దర్ విగ్రహం ఏర్పాటు కోసం తెల్లాపూర్ మున్సిపాలిటీ ఒక తీర్మానాన్ని చేసింది. దానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథార్టీ(HMDA) ఆమోదించింది. ఈ క్రమంలోనే అవసరమైన స్థలాన్ని కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. విగ్రహ ఏర్పాటు కావల్సిన స్థలం హెచ్ఎండీఏ పరిధిలోకి రావటంతో అనుమతులకు కొంత జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం స్థలం కేటాయించటం పట్ల గద్దర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
గద్దర్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి భట్టి
-
అభ్యర్థులిద్దరూ సొంత బంధువులే..
హైదరాబాద్: కంటోన్మెంట్ బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఆసక్తికర సారూప్యత ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల దివంగత ప్రజాయుద్ధనౌక గద్దర్ కుమార్తె. వీరిద్దరూ కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ చేశారు. వీరిలో లాస్య ప్రాథమిక విద్య సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్‌లో చదవగా, వెన్నెల బొల్లారంలోని సెయింట్స్ ఆన్స్‌లో స్కూల్ విద్య పూర్తి చేశారు. లాస్య నందిత మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. వెన్నెల సైతం బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్స్‌లో డిగ్రీ చదివారు. అనంతరం ఉన్నత విద్య పూర్తి చేసి 2007 నుంచి 2012 వరకు మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అదే సమయంలో (2005–2009) లాస్య నందిత మల్లారెడ్డి కాలేజీలో ఇంజినీరింగ్ చదివారు. ఇక అభ్యర్థులిద్దరూ దూరపు బంధువులు కావడం గమనార్హం. – కంటోన్మెంట్ -
కాంగ్రెస్ నాకు టికెట్ ఇవ్వాల్సిందే.. గద్దర్ కూతురు వెన్నెల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని తెలిపారు. కాంగ్రెస్ అవకాశం ఇస్తే కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. కాగా, వెన్నెల శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నా పేరును పరిశీలిస్తోంది. టికెట్ విషయంలో చాలా మంది నన్ను అడుగుతున్నారు. అందుకే మీ అందరికీ క్లారిటీ ఇస్తున్నాను. కంటోన్మెంట్లో పుట్టి పెరిగాను. ఇక్కడి నుంచే ఎన్నికల్లో పోటీ చేస్తాను. గద్దర్ కూతురుగా మీ ముందుకు వస్తున్నాను. ఓట్ల విప్లవం రావాలని గద్దర్ అన్నారు. అందుకే చివరగా కాంగ్రెస్ పార్టీకి ఆయన మద్దతుగా నిలిచారు. గద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. కానీ, అకాల మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో గద్దర్ భార్య విమల గద్దర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలు మాకు టికెట్ ఇస్తామన్నారు. కానీ, ఇప్పుడు వారి నుంచి ఎలాంటి సమాచారం లేదు. అందుకే నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. నా కూతురు వెన్నెలకు టికెట్ ఇవ్వండి. వెన్నెలను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపిస్తారు అని అన్నారు. ఇదిలా ఉండగా, ప్రజా గాయకుడు గద్దర్ ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఇక, గద్దర్‌కు కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా మంచి అనుబంధమే ఉంది. కాంగ్రెస్‌ను ప్రజలు మళ్లీ గెలిపించాలని గద్దర్ పలు సందర్భాల్లో కూడా తెలిపారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో కవిత ధర్నాల సంగతేంటి.. బీఆర్ఎస్పై ఎంపీ లక్ష్మణ్ ఫైర్ -
సోనియా త్యాగంతోనే తెలంగాణ వచ్చింది
లక్డీకాపూల్ (హైదరాబా ద్): సోనియా గాంధీ త్యాగంతోనే ప్రత్యేక తెలంగాణ వచ్చిందని దివంగత ప్రజాగాయకుడు గద్దర్ సతీమణి విమల అన్నారు. ఆమె త్యాగనిరతి ఏంటో తనకు తెలుసని స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశాలలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సోనియా గాంధీ ఆదివారం గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఆరోగ్య కారణాల రీత్యా సోనియా తాను బస చేసిన తాజ్ కృష్ణా హోటల్‌కే విమలను పిలిపించుకున్నారు.ఆమెతో పాటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా గద్దర్ కుటుంబాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ.. ప్రజల హక్కుల కోసం గద్దర్ చేసిన పోరాటాలను కొనియాడారు. రాహుల్ స్పందిస్తూ.. గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని సోనియా, ప్రియాంకలకు చెప్పారు. ఆయన గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. అనంతరం విమల మీడియాతో మాట్లాడు తూ.. త్యాగమంటే ఏంటో సోనియాకు తెలు సు కాబట్టే ఆమెను కలవాలనుకున్నానని చెప్పారు. ఆ త్యాగం కేసీఆర్‌కు తెలియదని, ఆయన నిరాహార దీక్షలతో తెలంగాణ సిద్ధంగా లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుందని విమల స్పష్టం చేశారు. -
నెత్తురంటిన ఆ చేతులెవరివి బాబూ?
కొన్నేళ్ల పాటు మావోయిస్టుగా గడిపిన అజ్ఞాత జీవితం, విప్లవ గాయకుడిగా, గ్రామాల్లో, నగరాల్లో బహిరంగ ప్రదర్శనలు ఇచ్చిన జీవితం, దశాబ్దాలుగా ఎదుర్కొన్న రాజ్య నిర్బంధం అనేవి గద్దర్ పాటను దాదాపు ప్రతి ఇంటికీ మోసుకెళ్లాయి. భారత దేశవ్యాప్తంగా విశిష్టమైన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక చిహ్నంగా ఆయన ఉండిపోయారు. ప్రభుత్వ ఏజెన్సీలు 1997లో ఆయనపై బుల్లెట్లు పేల్చాయి. దాదాపు 25 ఏళ్లపాటు వెన్నెముకలో దిగిన బుల్లెట్‌తోనే ఆయన జీవించారు. అలాంటి జీవితం మానవ చరిత్రలో కనీవినీ ఎరుగం. ఆ సమయంలో రాష్ట్రపాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతులకు నెత్తురంటింది. శ్మశానంలో ఉన్న గద్దర్ దేహంలోని బుల్లెట్ దీనికి శతాబ్దాలపాటు సాక్షీభూతంగా నిలుస్తుంది. 2023 ఆగస్ట్ 6న ప్రజాగాయకుడు గద్దర్ అనూహ్య మరణం, కడసారి చూడడానికి తరలి వచ్చిన వేలాది ప్రజల మధ్య బౌద్ధ ఆచారాలతో జరిగిన ఆయన ఖననం... భారతీయ కమ్యూనిస్టులకు కొత్త దారి చూపాయి. గద్దర్ కమ్యూనిస్టు విప్లవ గాయకుడిగా, పాటల రచయితగా, కళాకారుడిగా సుపరిచితుడు. కొన్నేళ్ల పాటు మావోయిస్టుగా గడిపిన అజ్ఞాత జీవితం, విప్లవ గాయకుడిగా, గ్రామాల్లో, నగరాల్లో బహిరంగ ప్రదర్శ నలు ఇచ్చిన జీవితం, దశాబ్దాలుగా ఎదుర్కొన్న రాజ్య నిర్బంధం అనేవి గద్దర్ పాటను దాదాపు ప్రతి ఇంటికీ మోసుకెళ్లాయి. ప్రభుత్వ ఏజెన్సీలు 1997లో ఆయనపై బుల్లెట్లు పేల్చాయి. ఆ సమయంలో రాష్ట్రపాలకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు చేతులకు నెత్తురంటింది. శ్మశానంలో ఉన్న గద్దర్ దేహంలోని బుల్లెట్ దీనికి శతాబ్దాల పాటు సాక్షీభూతంగా నిలుస్తుంది. గద్దర్ దేహాన్ని దహనం చేసివుంటే, అది గుర్తించలేని బూడిదగా మారిపోయేది. సజీవమైన చారిత్రక సాక్ష్యం మిగిలి ఉండేది కాదు. మావోయిస్టుగా జీవించినప్పటికీ, బౌద్ధ అంత్యక్రియల ద్వారా బౌద్ధ అంబేడ్కరిస్టుగా మరణించిన ఆయన, శాంతికి ప్రతినిధిగా, 25 సంవత్సరాల పాటు గాయపడిన దేహ బాధితుడిగా మనకు మిగిలిపోయారు. దాదాపు 25 ఏళ్లపాటు వెన్నెముకలో దిగిన బుల్లెట్‌తో ఆయన జీవించారు. అలాంటి జీవితం మానవ చరిత్రలో కనీవినీ ఎరుగం. శరీరంలోని పలు అవయవాల్లో ఆరు బుల్లెట్లు దూరిన స్థితితో ఆయన మనగలిగారు. శరీరంలో ఆరు బుల్లెట్లు దూరినప్పటికీ బతికి, చివరి వరకూ శరీరంలో ఒక బుల్లెట్‌తో జీవించినట్టు యుద్ధంలో పోరాడిన ఏ సైనికుడి గురించీ మనకు తెలీదు. ఆ రకంగా మానవ చరిత్రలోనే గద్దర్ ఒక విశిష్ట వ్యక్తి. అలాంటి జీవితం ఆయన్ని అపార ప్రజాదరణ, ప్రేమాదరణలు కలిగిన మనిషిగా మార్చింది. 2014లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన జరగడానికి ముందున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గద్దర్ పాడిన పాటలు, చేసిన ప్రదర్శనలు ఆయనకు ఎంతోమంది అభిమానులను సాధించిపెట్టాయి. ఆకలి, దోపిడీల నుంచి మానవ విముక్తి లక్ష్యం పట్ల ఆయన వహించిన నిబద్ధత... ఆయన్ని బాధామయ జీవితంలో గడిపేలా చేసింది. అనంతరం 1996 నుంచి 2014 వరకు ప్రత్యేక రాష్ట్రంకోసం జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఆయన వహించిన పాత్ర వల్ల ఆంధ్రా ప్రజలు ఆయన పట్ల అయిష్టత ప్రదర్శించి ఉండవచ్చు. అయితే, ఒక రచయితగా, కళాకారుడిగా గద్దర్ భారత దేశవ్యాప్తంగా విశిష్టమైన రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక చిహ్నంగా ఉండిపోయారు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు పార్టీ ముందు అనేక తీవ్రమైన సైద్ధాంతిక అంశాలను లేవనెత్తి, 2012లో ఆ పార్టీ నుంచి విడి పోయారు. మార్క్స్, లెనిన్, మావోతోపాటు భారతీయ పరిస్థితులకు అనుగుణంగా మహాత్మా పూలే, అంబేడ్కర్లను కూడా గుర్తించడం ద్వారా మావోయిస్టు పార్టీ కులానికీ, వర్గానికీ వ్యతిరేకంగా పోరాడాల్సి ఉందని గద్దర్ ప్రతిపాదించారు. భారతదేశంలో కులం ప్రతికూల పాత్ర గురించి పాటలు రాయడం, వేదికల మీద ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. దాంతో మావోయిస్టు పార్టీ గద్దర్ పనిని పార్టీ వ్యతిరేకమైనదిగా పరిగణించడమే కాదు... ఆయన అవగాహనను మార్క్సిజం కాదని ముద్రవేసి, ఆయన ప్రతిపాదనలను తిరస్కరించి, 2010లో షోకాజ్ నోటీసు ఇచ్చింది. విప్లవ పార్టీ తనను బహిష్కరించడం ఖాయమని గ్రహించిన గద్దర్ 2012లో మావోయిస్టు పార్టీకి రాజీనామా చేశారు. అయితే భారతీయ కుల–వర్గ దోపిడీకి అనుగు ణంగా తన పార్టీ పంథాను మార్చడానికి గద్దర్ చేసిన ప్రయత్నం విస్మరణకు గురి కాకూడదు. అంబేడ్కరైట్ నవయాన బౌద్ధమతం పట్ల తన ఆధ్యాత్మిక సామా జిక విధేయతను గద్దర్ బహిరంగంగా ప్రకటించారు. దళితుల, మహిళల అణచివేతపై అనేక పాటలు రాశారు. అతను ఒక యాంత్రిక మార్క్సిస్ట్, బౌద్ధ లేదా అంబేడ్కరైట్ కాదు. అత్యంత సున్నితత్వం కలిగిన మానవుడు. భారతదేశంలోని కమ్యూనిస్టు నాయకులు వర్గపోరాటంతోపాటు సామాజిక సంస్కరణలను అవసరమైన అంశంగా ఎన్నడూ అంగీకరించలేదన్న విషయం అందరికీ తెలిసిందే. భారతీయ సాంఘిక సంస్క రణలో ఆధ్యాత్మిక సంస్కరణతో పాటు శ్రమకు గౌరవం, పురుషులతో స్త్రీల సమానత్వం కూడా భాగమై ఉన్నాయి. దానికి అంతిమ రూపం ఏదంటే కుల అసమానతలను, మహిళల అసమానతలను నిర్మూలించడం. అయితే, భారతీయ కమ్యూనిస్టులు ఆధ్యాత్మిక పరంగా తమను తాము నాస్తికులుగా ప్రకటించుకున్నారు. పైగా, ఆర్థిక నియతి వాదులుగా (ఆర్థికమే అన్నింటినీ నిర్దేశిస్తుంది అనే వాదం) వారు వర్గ ప్రశ్నలపైనే ప్రాథమికంగా దృష్టి పెట్టారు. కానీ వాస్తవానికి వారిలో ఎక్కువ మంది హిందువులుగానే మరణిస్తున్నారు. రోజువారీ జీవితంలో వారి నాస్తికత్వం ఎలాంటి సామాజిక సంస్కరణకు సంబంధించినదిగా లేదు. గద్దర్ తన మరణంతో వారికి ఒక పెద్ద సామాజిక, ఆధ్యాత్మిక సంస్కరణ కార్యక్రమాన్ని అందించారు. అంబేడ్కర్ ఇలా అన్నారు: ‘‘నేను అంటరాని వ్యక్తిని అనే కళంకంతో జన్మించిన దురదృష్టవంతుడిని. అయితే, ఇది నా తప్పు కాదు. కానీ నేను హిందువుగా మరణించను, ఎందుకంటే ఇది నా చేతుల్లో ఉంది.’’ ఇలా ప్రకటించిన తర్వాతే ఆయన బౌద్ధుడు అయ్యారు, బౌద్ధుడిగా మరణించారు. గద్దర్ అంటరాని వ్యక్తిగా జన్మించారు. అది ఆయన చేతుల్లో లేనిది. అనేక సాయుధ దళాలను కలిగి ఉన్న కమ్యూనిస్ట్ విప్లవ పార్టీలో పనిచేశారు. ఆయన వారి ప్రజా యుద్ధ నౌక. అయితే మరణ సమయంలో తన చేతుల్లో ఉన్న అధికారాన్ని ఉపయోగించి శాంతి సందేశంతో బౌద్ధుడిగా మరణించిన అంబేడ్కర్ జీవన సారాంశాన్ని గద్దర్ గ్రహించారు. తాను జీవితాంతం సమర్థించిన తుపాకులు ఆ అంటరానితనం నుండి విముక్తి చేయలేదు. అందువల్లనే గద్దర్ బౌద్ధుడయ్యారు, అంటరానితనం నుండి విముక్తి పొందారు. ముఖ్యంగా, బూటకపు ఎన్కౌంటర్లలో చిత్రహింసలు పెట్టి, వంద లాది మృతదేహాలను తగులబెట్టిన ఆ రాజ్య వ్యవస్థకు వ్యతి రేకంగా పోరాడిన వ్యక్తిగా, తన శరీరాన్ని, బుల్లెట్‌ని దహనం చేసేస్తే ఆ తర్వాత తనను హింసించినట్లు ఎటువంటి ఆధారాలు మిగిలి ఉండ వని గద్దర్ గ్రహించారు. ఆ మృతదేహాలను ఖననం చేసినట్లయితే, దశాబ్దాల తర్వాత కూడా వాటిని వెలికితీసి మళ్లీ పరీక్షించవచ్చు. అందువల్ల గద్దర్ తన శరీరంలోని బుల్లెట్‌తో పాటు ఖననం చేయడానికే ప్రాధాన్యత ఇచ్చారు. 1997లో చంద్రబాబు నాయుడి క్రూర పాలనకు నిదర్శనంగా ఆయన వెన్నులో బుల్లెట్ అలాగే ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, చంద్రబాబు కబ్జా చేసిన పార్టీకి ఆయన మామ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టారు. అదే సమయంలో గద్దర్ తెలుగు నేల అందించిన అత్యంత శక్తిమంతమైన తెలుగు రచయిత, గాయకుడు, సంభాషణకర్త. గద్దర్ నివసించిన బస్తీలో మహాబోధి విద్యాలయం పేరుతో ఆయన స్థాపించిన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుల్లెట్‌తోపాటు ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. చంద్రబాబు ఆ సమాధి వద్దకు వెళ్లి, సాష్టాంగ నమస్కారం చేసి, తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1997 ఏప్రిల్ 6న ఏమి జరిగిందో కనీసం ఇప్పుడైనా నిజం చెప్పినట్లయితే, దేశం మొత్తం చంద్రబాబుని క్షమిస్తుంది. అలా పశ్చాత్తాపం ప్రకటించిన తర్వాత చంద్రబాబు తన జీవితాంతం కచ్చి తంగా మనిషిగా జీవించగలరు. కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
గద్దర్ భార్య విమలకు ప్రధాని మోదీ లేఖ
ఇటీవల మరణించిన ప్రజాకవి గద్దర్ భార్య గుమ్మడి విమలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. గద్దర్ మృతి తెలుసుకొని తానెంతో బాధపడ్డానని తెలిపారు. తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్ కుటుంబానికి మోదీ సానుభూతిని తెలియజేశారు. సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను గద్దర్ పాటలు, రచనలు ప్రతిబింబిస్తాయని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు. గద్దర్ కుటుంబ సభ్యుల దు:ఖాన్ని మాటల్లో చెప్పలేనని, శ్రేయోభిలాషులకు, బంధువులకు దీనిని తట్టుకునే శక్తిని ప్రసాదించమని కోరకుంటున్నానని మోదీ తెలిపారు. చివరిగా లేఖలో ఓంశాంతి అని పేర్కొన్నారు. కాగా ఈ నెల 6వ తేదీన గద్దర్ మృతి చెందిన విషయం తెలిసిందే. గత నెల జూలై 20వ తేదీన గుండెపోటుతో బేగంపేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరిన గద్దర్‌కు గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. అయితే గద్దర్‌కు ఊపిరితిత్తులు, యూరినరీ ఇన్ ఫెక్షన్ కారణంగా మృతి చెందినట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 7వ తేదీన గద్దర్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు. ఆయన అంతిమ యాత్రను చూసేందుకు కూడా జనాలు భారీగా తరలివచ్చారు. చదవండి: అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు.. -
ట్యాంక్ బండ్‌పై గద్దర్ విగ్రహం పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై పెట్టాలని వైఎస్సా ర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం అల్వాల్ భూదేవి నగర్‌లోని గద్దర్ నివాసానికి వెళ్లిన ఆమె ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, సమాధి వద్ద నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెల్పిన షర్మిల... ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ముద్రించాల్సిన అవసరం ఉందని, గద్దర్ సొంత ఊరు తూప్రాన్‌లో ఆయన పేరిట స్మారక భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు. గద్దర్ చేత కంటతడి పెట్టించిన కేసీఆర్, ఆయ న కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పాలన్నా రు. 9 ఏళ్లలో ఒక్కసారి కూడా గద్దర్‌కి కేసీఅర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. ఆయన విష యంలో కేసీఆర్ ఒక నియంతలా వ్యవహరించారన్నారు. ప్రగతి భవన్ దగ్గర రోజంతా ఎదురు చూసినా లోపలకు పిలవకపోవడంతో.. ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్నది అని గద్దర్ కన్నీళ్లు పెట్టుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వైఎస్సార్ అంటే గద్దర్‌కి చాలా ప్రేమ అని, నాతో చాలాసార్లు వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారన్నారు. -
మేమొచ్చాక నందికి బదులుగా గద్దర్ అవార్డులు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు అందజేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టిస్తామని వెల్లడించారు. శనివారం ఇక్కడ బోయిన్‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగిన కాంగ్రెస్ ప్రచార కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, బీజేపీల గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పార్టీ పరిస్థితి ఏంటో మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను అడిగితే చెబుతారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఎంపీల్లో సగం మంది బయటి నుంచి వచ్చిన వాళ్లేనని, వారికి నమస్తే... సదావత్సలే అంటే ఏంటో కూడా తెలియదని అన్నారు. రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు ఈటల రాజేందర్, రాజగోపాల్‌రెడ్డిలకు దీని గురించి తెలుసా అని ప్రశ్నించారు. తననుద్దేశించి తెలంగాణకు పట్టిన వ్యాధిగా అభివర్ణించిన మంత్రి కేటీఆర్‌కు వ్యాధికి, వ్యాధులకు తేడా తెలియదని అన్నారు. తాను ఉద్యమం చేస్తున్నప్పుడు ఆయన అమెరికాలో ఉన్నారని చెప్పారు. తెలంగాణకు కాంగ్రెస్, టీడీపీలు మోసం చేశాయని అంటున్నారని, ఆ రెండు పార్టీల్లో కేసీఆర్ ఉన్నారని, తెలంగాణకు ఏ అన్యాయం ఎప్పుడు జరిగినా కేసీఆరే ప్రత్యక్ష ద్రోహి అని విమర్శించారు. తన పార్టీ పేరులోని తెలంగాణ పదం తీసేసి ఆ పేరును హత్య చేసిన కేసీఆర్ తెలంగాణవాది ఎలా అవుతారని ప్రశ్నించారు. సెస్టెంబర్ 17న కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తామని, ఆ తర్వాత తాము ప్రజలకు ఏం చేస్తామో కూలంకషంగా వివరిస్తామని రేవంత్ చెప్పారు. -
సహజ వాగ్గేయకారుడు
జనం గుండెల నుంచి ప్రభవించిన సజీవ వాగ్గేయకారుడు గద్దర్. కవిత్వాన్ని పాటలో రంగరించి తత్వాన్ని బోధించిన మానవతా మూర్తి. ఆయన పాటల్లో పల్లె జీవన సంస్కృతీ వికాసం ఉంది. వేమన, పోతులూరి వీరబ్రహ్మం, కబీరు,సంత్ రవిదాసు సూక్తులు ఆయన పాటల్లో ప్రతిధ్వనిస్తుంటాయి. ఆయన ‘జననాట్యమండలి’ సృష్టికర్త. ఆయన నాలుక మీద ఆదిమ జాతుల స్వర విన్యాసం ఉంది. సముద్ర ఘోషను ఆయన ఊరిలోనికి మోసుకొచ్చాడు. అడవి వేదనలను రాజ్య ప్రసాదాల్లోకి ప్రవహింప చేశాడు. నేను విశాఖపట్నం జైల్లో ఉన్నప్పుడు నక్సలైట్ సెల్ నుంచి ‘సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా, నీవు సినబోయి కూచున్నవెందుకమ్మో ఎందుకమ్మా’ పాట అర్ధరాత్రి పాడాడు. అది నాలో పునరుత్తేజాన్ని తీసుకొచ్చింది. దళిత వీరుల చెవుల్లో విప్లవ స్వరాన్ని విని పించి సైనిక కవాతు చేయించిన సైన్యా ధ్యక్షుడు ఆయన. 1985లో కారంచేడు ఉద్యమంలో మమేకమై ‘దళిత పులులమ్మ, కారంచేడు భూస్వాములతో కలబడి నిల బడి పోరు చేసిన దళిత పులులమ్మ’ అని దళితులకు చైతన్యాన్నీ, ధైర్యాన్నీ, పోరాట శక్తినీ కల్పించిన దళిత వీరుడు ఆయన. ఆయన తండ్రి అంబేద్కర్ స్థాపించిన మిలింద విశ్వవిద్యాలయా నికి రాళ్లెత్తాడు. అంబేడ్కర్ కుల నిర్మూ లన ఉద్యమానికి గద్దర్ వెన్ను తట్టాడు. చేతిలో ఎర్ర జెండా ఉన్న ప్పుడు కూడా గుండెల్లో అంబేడ్కర్‌ని నింపుకున్నాడు. అందుకే ఆయన తన గమనంలో కుల నిర్మూలన వాదిగా ధ్వనిస్తూ వచ్చాడు. కులం మీద ఆయన గొడ్డలి వేటు వేశాడు. ‘దళిత పులులమ్మ’ పాటలో కథా కథన చాతుర్యాన్ని చూపాడు. గద్దర్ కారంచేడులో దళితులు చనిపోయిన ప్రదే శానికి వచ్చినప్పుడు ‘వీళ్ళు పోరాటంలో చనిపోయారు గాని, పిరికి వాళ్ళై చనిపోలేద’ని స్థానిక దళితులు చెప్పారు. అప్పుడు గద్దర్ ఈ పాట రాశాడు. ‘దళిత పులులమ్మా / కారంచేడు భూస్వాములతోనే / కలబడి నిలబడి పోరు చేసినా/ మాల సాయిబు వడ్డెర జాతికి మాదిగపల్లె తల్లిలాంటిది/ శరణుకోరిన శత్రువునైనా ప్రేమతో చూసే పేదలపల్లె/ మాదిగపల్లె పేరు వింటెరా/ బరిశె నెత్తుకొని పందె మాడితే ఊరి దొరలకు ఉచ్చబడతది/ కోటి బాధలతో మునిగి తేలినా అన్న మాటకు అటుఇటు గారు/ వడ్డీల మీద వడ్డీలు గట్టి – నడ్డి విరిగినా బుద్ధిమంతులు/ మట్టిలో మటై్ట మన్నులో మన్నై – పండించిన ప్రతి వడ్లగింజను/ బలిసిన దొరల గరిసెలు నింపి – పస్తులు పండే కష్ట జీవులు.’ ఈ పాట చరిత్రకు సాక్ష్యంగా నిలబడింది. దళితుల పోరాట పటిమకు అద్దం పడుతుంది. గద్దర్ దళిత బిడ్డ. ఆయన అంబే డ్కర్ బుర్రకథల ద్వారానే ముందుకు నడిచాడు. తరువాత జన నాట్యమండలి నిర్మించాడు. పీపుల్స్‌వార్‌కు అనుబంధంగా జన నాట్యమండలి కృషి చేసింది. జననాట్యమండలి ఆనాడు దళిత ఉద్యమానికి వ్యతిరేకంగా ఉంది. అది ఆనాడు దళిత ఉద్యమాన్ని హైజాక్ చేయాలని అనుకొంది. ఆ సందర్భంగా గద్దర్‌పై దళిత ఉద్యమ ప్రభావం పడింది. దాని ఫలితమే ఈ పాట. మొదటి సారిగా, జననాట్యమండలి పాటల్లో కులాధిపత్యం వర్గాధిప త్యాన్ని జోడించి పాడటం ప్రారంభమైంది గద్దర్‌తోనే! ఇది దళిత ఉద్యమ విజయం. ఈ పాటను 1985 సెప్టెంబర్ 1న ‘చలో చీరాల’ మహాసభలో గద్దర్ పాడాడు. ఈ పాట ఒక ఉజ్జ్వల జ్వలనాన్ని ప్రేక్షకుల్లో రూపొందించింది. సుమారు 3 లక్షల మంది దళితులు ‘దళిత మహాసభ’ ఆధ్వర్యంలో చీరాల హైస్కూలు గ్రౌండ్స్‌లో హాజరయ్యారు. ఈ వ్యాస రచయితే అధ్యక్షత వహించాడు. గద్దర్ నిజానికి ఒక తాత్త్వికుడు. నీకిష్టమైన పాటేదంటే ‘ఏలరో ఈ మాదిగ బతుకు’ అంటాడు. నిజానికి ఈ పాటలో ఈ దళిత కులాల జాతీయతను ఎలుగెత్తి చాటాడు గద్దర్: ‘ఏలరో ఈ మాదిగ బతుకు మొత్తుకుంటే దొరకదురా మెతుకు/ బంగారు పంటలిచ్చె భరత గడ్డమనది / గంగమ్మ ప్రవహించే పుణ్యభూమి మనది / గంగ యమున బ్రహ్మపుత్ర కృష్ణ పెన్నా కావేరి/ ఎన్నెన్నో జీవ నదులు ప్రవహించే జీవగడ్డ / మాల మాదిగలకే మంచినీళ్లు కరువాయే’ అని గద్దర్ సామా జిక తత్త్వాన్నీ, సామాజిక సమస్యనూ దళిత జాతీయ దృక్పథంతో అనేక పాటల్లో విశ్లేషిస్తాడు. దళిత ఉద్యమంలో పాటలు పాడే దళాలన్నీ అవి ఏ పేరుతో ఉన్నా గద్దర్, మాష్టార్జీ ప్రభావంతోనే పాటలు పాడుతూ వచ్చాయి. అందుకే దళిత ఉద్యమం మీద గద్దర్ ప్రభావం సాంస్కృతికంగా బలంగా ఉందనక తప్పదు. మనం ఎన్ని దృక్కోణాల నుంచి చూసినా ఆయన జాతి వైతాళికుడు. కుల మత భేదాలు లేని బౌద్ధ సిద్ధాంతగామి. ఆయన ఒక నశించని సామాజిక విప్లవ స్వరం. ఆయన పాట లతో లోకం మేల్కొంది. అందుకే ఆయన ఈ యుగం జాతి వైతాళికుడు. ఆయన పాటల బాటలో నడుద్దాం. కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నేత ‘ 98497 41695 -
మన ‘పాల్ రాబ్సన్’!
‘గద్దరమ్మ నోటికి దండం’ అనేవాళ్లు, ఇప్పుడు ‘గద్దర్’ నోటికి దండాలు పెట్టే రోజులొచ్చాయి! ఒక ఉద్యోగిగా సరి పెట్టుకుని, పెరుగుతున్న ధరలతోనే రాజీపడి బతుకు భారాన్ని చిరునవ్వుతో మోసుకుంటూ కాలక్షేపం చేయలేక, కళారంగాన్ని కదనరంగంగా మార్చిన విప్లవ కవితా ఉద్యమ వారసుడు, కవి, మధుర గాయకుడు అయిన గుమ్మడి విఠల్ రావు (గద్దర్) కాకతీయ మహాయుగానికి, తెలంగాణ విప్లవోద్యమానికి కారణమయిన తెలంగాణలో పుట్టి పెరిగిన వాడు. సామాజిక అసమానతలపైన, అన్యాయాలపైన అతని విమర్శ వ్యక్తిగతమైనది కాదు, వ్యవస్థాగతమైనది. నిత్య హత్యా సత్యమైన ఆస్తిహక్కుకు బద్ధవిరోధి. అది రద్దు కానంత వరకు ఈ కుల వ్యవస్థ, ఈ మత దురహంకార వర్గ సమాజం మారదనీ, మానవుడు మారడనీ నమ్ముతున్నవాడు. సరికొత్త బాణీలతో, సొంత గొంతుతో అట్టడుగు ప్రజల యాసలో, మాండలిక భాషలో కళారంగాన్ని విప్లవీకరించిన వ్యక్తిగా గద్దర్‌కు ఈ దేశంలోనే కాదు, ఖండాంతరాలలో కూడా పోలిక – నీగ్రో బానిసల బతుకులకు అర్థం చెప్పి వాళ్ళ బాధల గాథలే పల్లవిగా, అను పల్లవిగా, వీధి వీధినీ గానం చేసి అజ్ఞాత జీవితాలకూ, అస్థిరమైన ప్రవాస జీవితాలకూ నాద బ్రహ్మగా నిలిచిన పాల్ రాబ్సన్ ఒక్కడే! ఆ బానిసల గర్భశోకానికి శ్రుతిగా సంగీతం వెలయించిన పాల్ రాబ్సన్ 1950లలో ‘ఫిస్క్ జూబ్లీ గాయకుల’కు ప్రత్యక్ష వారసుడు. స్పానిష్ అంతర్ యుద్ధంలో సమర గీతాలు ఆలపించాడు. ఈ సమర కళాయాత్రను సహించలేని అమెరికా పాల కులు రాబ్సన్ నోరు నొక్కబోయారు. అతని గాన సభలను దేశ మంతటా నిషేధించారు. విదేశాలకు వెళ్ళకుండా పాస్‌పోర్ట్ నిరా కరించారు. అయినా జ్ఞాతంగానూ, అజ్ఞాతంగానూ దేశంలోనూ, దేశాంతరాలలోనూ ప్రభుత్వాలూ, అధికారులూ, సంస్థలూ, జీవన రంగంలో సర్వ విభాగాలకు చెందిన మేధావులూ రాబ్స న్ను తలకెత్తుకున్నారు. అలాంటివాడు మన గద్దర్. ‘ఫెస్క్ జూబ్లీ’ గాయకులకు రాబ్సన్ వారసుడైనట్లే, నూతన ఫక్కీలో శ్రీకాకుళ గిరిజనోద్య మానికి అక్షర రూపమిచ్చిన జముకుల కథకు జనకుడు, గాయ కుడూ అయిన పాణిగ్రాహి జానపద కళాసృష్టికీ ప్రత్యక్ష వార సుడు గద్దర్. పాణిగ్రాహి జముకుల కథలోని కథకుడైన చిన బాబు వయస్సు ఆనాటికి 14 ఏళ్ళే అయినా బుద్ధిలేని ప్రభుత్వం రైల్వే స్టేషన్లో జనం మధ్యనే అరెస్ట్ చేసి అర్ధరాత్రి అడవులలో ‘ఎన్కౌంటర్’ జరిపి ఆ ‘అభిమన్యుడి’ని పొట్టన పెట్టుకుంది! నాటి ఆంధ్ర కళారంగంలో విప్లవానికి అదే నాంది. రచ యితలను, కళాకారులను నిర్బంధించడం ఏ ప్రభుత్వ పతనా నికైనా తొలి మెట్టు అవుతుంది. అప్పుడు ఎవరికి వారే ఆలోచించుకుని కాంగో కవి ‘లెవెన్ ట్రీ’ అన్నట్టుగా ‘తన విముక్తికి తానే నడుం కడతాడు.’ కనుకనే శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంత కల్లోలానికి కలం, గళం సారథ్యం వహించిన పాణిగ్రాహి గానీ, తెలంగాణలో గిరిజన ప్రాంతాలలో దోపిడీ వ్యవస్థపై గజ్జె కట్టి గుండె చప్పుళ్ళు విన్పించిన గద్దర్ గానీ లక్షలాది జనాన్ని కదిలించారు. గద్దర్ బాణీ విప్లవ రచయితల సంఘానికి ‘పారాణి’గా అమరింది. ఆంధ్ర ప్రజా నాట్యమండలి చేతుల మీదుగా, ఒకనాటి సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలో పునరుద్ధరణ పొందిన ఎన్నో జానపద కళారూపాలు ఆనాటి వాతావరణాన్ని పుణికి పుచ్చుకోగా ఇటీవల పాణిగ్రాహి, గద్దర్ చేపట్టిన కళా రూపాలు సరికొత్త ఫక్కీలో తెలుగు భారతి నొసట వీర రస గంగాధర తిలకాలు దిద్దాయి! అందుకే తెలుగు బుర్రకథను రమ్యమైన కళాఖండంగా తీర్చిదిద్ది దేశాన్ని ఊపివేసిన నాజర్ కూడా పాణిగ్రాహి, గద్దర్ ప్రయోగాలను కళ్ళ కద్దుకున్నాడు. కథకు, వర్ణనకు, హాస్యా నికి, గంభీరతకు, రౌద్రానికి, కరుణకు, కాఠిన్యానికి, బీభత్సానికి, రమ్యతకు, సభ్యతకు – ఒకటేమిటి, నవరసాలకు మించిన నవ్య పోషణకు నగలు తొడిగే సామాన్యుని నాగరికతా సంస్కృతుల నట్టింటి మాణిక్యంగా గద్దర్ బృందం దిద్ది తీర్చినదే జన నాట్యమండలి! అమరవీరులను తలచుకుంటూ అతను రాసిన ‘పాదాపాదాల పరిపరి దండాలు’, ‘సిరిమల్లె చెట్టుకింద’, ‘లాల్ సలామ్’ పాటలు, ఖవాలీ,సంగీత నృత్య రూపకాలు మరపురాని కళాస్మృతులు. గద్దర్, వంగపండు ప్రసాద్ (విశాఖ బాణీలో) ‘జజ్జనక జనారే’ అనే పాట విన్నప్పుడు ఈ జోస్టాలే 'Rumba' పాట గుర్తుకొస్తుంది! గద్దర్ అంగోలా కవి అగస్తినో నేటో లాంటివాడు. గద్దర్ రాష్ట్ర సరి హద్దులు దాటి, దండకారణ్యంలో దూకి, రాముడికి బదులు పరశు రాముడై సంచరించి, మణిపూర్, అస్సాం ఉద్యమాల ఊపిరిని కూడా పొదుగుకొని, భాషల అక్షరాభ్యాసం చేసి హైదరాబాద్‌లో మళ్ళీ పొద్దుపొడుపై వాలాడు! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు – రచనా కాలం ఫిబ్రవరి 25, 1990 abkprasad2006@yahoo.co.in -
నా పాటకు గద్దర్ మామ ఏమన్నారంటే..
-
ఆట, పాట, మాటతో.. జన హృదయాలు గెలిచారు
చిక్కడపల్లి (హైదరాబాద్): గద్దర్ ఏ ఒక్క వర్గానికి, భావజాలానికి మాత్రమే పరిమితం కాలేదని, ఆయన పాట, మాట, ఆటతో జనహృదయాలను గెలిచారని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కొలకలూరి ఇనాక్ కొనియాడారు. చెప్పదలచుకున్న విషయాన్ని జన హృదయాలను తాకేటట్టు నేర్పుగా చెప్పగల గొప్ప వాగ్గేయకారుడు గద్దర్ అని ప్రశంసించారు. బుధవారం రాత్రి చిక్కడపల్లి త్యాగరాయ గానసభ నిర్వహణలో లలిత కళావేదికపై ప్రజా యుద్ధనౌక, ప్రజా వాగ్గేయకారుడు గద్దర్ సంతాప సభ జరిగింది. ఇనాక్ తనకు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. గద్దర్ సాహిత్యం సిలబస్‌గా పెట్టే ప్రయత్నంలో ఎదుర్కొంటున్న అనుభవాలు, గద్దర్‌లో విప్లవభావాలు, తెలంగాణ భావన, దళిత వర్గాల అభ్యుదయం పట్ల ఆలోచనలను పంచుకున్నారు. సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ జానపద గాయకుని స్థాయికి ఎదిగిన గద్దర్.. పాట ఉన్నంతకాలం నిలిచి ఉంటారని అన్నారు. గద్దర్‌లో భిన్న కోణాలు ఉన్నాయని బేవరేజెస్ పూర్వ చైర్మన్ దేవీప్రసాద్ పేర్కొన్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ శ్రీనివాస్‌గుప్తా ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా’అన్న గద్దర్ పాటను లయబద్ధంగా పాడి తనకు గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. అధ్యక్షత వహించిన గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి మాట్లాడుతూ, గద్దర్ గొప్ప కళాకారుడు అయినప్పటికీ అందరినీ ఆప్యాయంగా పలుకరించే మానవతామూర్తి అని ప్రశంసించారు. -
గుండె బరువుతో పాటకు సెలవు..
సాక్షి, సిటీబ్యూరో/అల్వాల్/ గన్‌పౌండ్రి: ప్రజా యుద్ధనౌక ఇక సెలవంటూ తరలివెళ్లింది. తన పదనునైన గళంతో, ఉర్రూతలూగించే పాటలతో అర్ధ శతాబ్దం పాటు యావత్ సమాజాన్ని ప్రభావితం చేసిన సాంస్కృతిక యోధుడు, ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం అల్వాల్ భూదేవినగర్‌లో ఆయన స్థాపించిన మహాబోధి పాఠశాలలో ముగిశాయి. వేలాదిమంది అభిమానులు, వివిధ పారీ్టలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, కవులు, కళాకారులు, ప్రజా సంఘాలకు చెందిన ప్రతినిధులు, వివిధ రంగాల ప్రముఖులు, కుటుంబసభ్యులు, బంధువులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో క్రియాశీలమైన భూమికను పోషించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన వంతు కృషి చేసిన గద్దర్ అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వం అధికార లాంఛనాలతో నిర్వహించింది. బౌద్ధమత సాంప్రదాయం ప్రకారం గద్దర్ తనయుడు సూర్య అంత్యక్రియల క్రతువును నిర్వహించారు. బౌద్ధమత గురువులు పంచశీల సూత్రాలను పఠించారు. అనంతరం గద్దర్ పార్థివదేహాన్ని సమాధి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవసూచకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ భూదేవినగర్‌లోని గద్దర్ నివాసానికి వచ్చి ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. గద్దర్ భార్య విమలను, కుటుంబసభ్యులను పరామర్శించారు. మంత్రులు మహమూద్ అలీ, హరీశ్‌రావు, తలసాని తదితరులు సీఎం వెంట ఉన్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు కూడా అల్వాల్‌లో గద్దర్ భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ, తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు దానం నాగేందర్, టి.రాజయ్య, జీవన్‌రెడ్డి, మంచు మోహన్‌బాబు, మనోజ్, అలీ, నాగబాబు, నిహారిక, పరుచూరి గోపాలకృష్ట, ఆర్.నారాయణమూర్తి, ప్రొఫెసర్ కోదండరాం, జయప్రకాశ్ నారాయణ, తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు, జూలకంటి రంగారెడ్డి, అనగాని సత్యప్రసాద్, జనార్ధన్, పరిటాల శ్రీరామ్, వివేక్, మోత్కుపల్లి నరసింహులు తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. భూదేవినగర్, వెంకటాపురం ప్రజలతో పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది తరలివచ్చి కన్నీటి నివాళులర్పించారు. అంత్యక్రియలకు ప్రముఖులు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎమ్మెల్యే సీతక్క, మధుయాష్కీ గౌడ్, వి.హనుమంతరావు, మల్లు రవి ,శ్రీధర్‌బాబు, మాభూమి చిత్ర దర్శకులు నర్సింగ్ రావు, ప్రముఖ సినీనటుడు ఆర్.నారాయణమూర్తి, తెలంగాణ ఉద్యమ నేత గాదె ఇన్నయ్య, జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్, విమలక్క, బీఆర్ఎస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, రసమయి బాలకిషన్, గోరటి వెంకన్న, బాల్క సుమన్, క్రాంతి, గెల్లు శ్రీనివాస్, పల్లె రవి, ఎమ్మార్పిఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, జర్నలిస్టు పాశం యాదగిరి, వేదకుమార్, తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. దారంతా జన ప్రభంజనం తెలుగు ప్రజల సాంస్కృతిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిన గద్దర్ అంతిమయాత్ర మహాజన ప్రభంజనాన్ని తలపించింది. ఎల్బీ స్టేడియం నుంచి అల్వాల్ వరకు రహదారులు జసందోహంతో పోటెత్తాయి. పోలీసుల గౌరవ వందనంతో అంతిమ యాత్ర ప్రారంభమైంది. అనారోగ్యంతో ఆదివారం కన్నుమూసిన గద్దర్ భౌతికకాయాన్ని ప్రజలు, అభిమానుల సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలో ఉంచిన సంగతి తెలిసిందే. కాగా మధ్యాహ్నం 12 గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర గన్‌పార్క్, ట్యాంక్‌బండ్ (అంబేడ్కర్ విగ్రహం), సికింద్రాబాద్ మీదుగా సాయంత్రం 4 గంటలకు అల్వాల్‌కు చేరుకుంది. వాహనానికి జై భీం జెండాలతో పాటు బుద్దుడి పంచశీల జెండాలను ఏర్పాటు చేశారు. గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద కళాకారులు పాటలతో శ్రద్ధాంజలి ఘటించారు. గద్దర్ పార్థివదేహాన్ని ఉంచిన వాహనానికి ముందు, వెనుక వేలాదిగా కదిలివచ్చిన అభిమానులు ‘అమర్ రహే గద్దర్’, ‘జోహార్ గద్దరన్న’ అంటూ ఇచ్చిన నినాదాలతో పరిసరాలు ప్రతిధ్వనించాయి. ఎల్బీ స్టేడియంలో ఘన నివాళులు ఎల్బీ స్టేడియంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు, సాధారణ ప్రజలు పెద్ద సంఖ్యలో గద్దర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రే, మాజీ మంత్రి జానారెడ్డి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తదితరులు శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రత్యేక వేదికలు.. కటౌట్లు గద్దర్‌ను చివరిసారి చూసేందుకు రోడ్డుకు ఇరువైపులా ప్రజలు బారులు తీరారు. ఎక్కడికక్కడ వాహనాన్ని నిలిపివేసి ఆయన భౌతికకాయానికి నమస్కరిస్తూ నివాళులర్పించారు. సికింద్రాబాద్, జేబీఎస్, కార్ఖానా, తిరుమలగిరి, తదితర ప్రాంతాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి తలసాని పాల్గొన్నారు. దారి పొడవునా అక్కడక్కడా పెద్ద ఎత్తున గద్దర్ కటౌట్లను ఏర్పాటు చేశారు. ప్రజా నాట్యమండలి, జన నాట్యమండలి, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యకు చెందిన కళాకారుల ఆట, పాటల నడుమ గద్దర్ అంతిమయాత్ర సాగింది. అంతిమయాత్రలో విషాదం సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ కన్నుమూత గద్దర్ అంతిమయాత్ర సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. వివిధ రంగాల ప్రముఖులతో పాటు అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలి రావడంతో అల్వాల్‌లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో చిక్కుకున్న సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ (63) తీవ్రమైన నీరసంతో జనంమధ్యలో పడిపోయారు. స్థానికులు వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కార్డియాక్ అరెస్టుతో చనిపోయినట్లు చెప్పారు. గద్దర్‌కు సన్నిహితుడైన జహీరుద్దీన్ ఆదివారం నుంచి ఆయన భౌతికకాయం వద్దే ఉన్నారు. సీఎం కేసీఆర్ సంతాపం సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన మరణం ఉర్దూ పత్రిక ప్రపంచానికి తీరనిలోటన్నారు. పత్రికా సంపాదకుడుగా తెలంగాణ ఉద్యమంలో అలీఖాన్ పోషించిన పాత్ర, ఆయన సేవలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన ఉర్దూ పత్రికారంగానికి ఎనలేని సేవలు చేశారన్నారు. జహీరుద్దీన్ కుటుంబసభ్యులకు కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. జహీరుద్దీన్ మృతి పట్ల కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, పొన్నాల లక్ష్మయ్య సంతాపం తెలిపారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఆకస్మిక మరణం పట్ల, మీడియా అకాడమీ చైర్మన్, అల్లం నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాతబస్తీ రాజకీయాల్లో ప్రముఖపాత్ర వహించి చెరగని ముద్ర వేశారని, దేశంలోని ఉర్దూ జర్నలిజానికి ఆయన మరణం తీరని లోటు అన్నారు. వ్యక్తిగతంగా జహీరుద్దీన్ అలీఖాన్‌తో తమ కుటుంబానికి మంచి సంబంధాలు ఉండేవని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గుర్తు చేసుకున్నారు. అతని కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కలి్పంచాలని భగవంతుడిని కోరారు. జహీరుద్దీన్ మృతిపై ఇంకా ఏఐఎంఎస్ఎస్ రాష్ట్ర ఇన్చార్జి సీహెచ్.ప్రమీల, ఏఐడీఎస్ఓ రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశ్‌రాజ్, ఏఐడీవైఓ హైదరాబాద్ జిల్లా కార్యదర్శి వై.నాగరాజు సంతాపం తెలిపారు. కలం.. గళం 24 గంటల్లోనే లోకాన్ని విడిచిన ఆప్తమిత్రులు ప్రజాయుద్ధనౌక గద్దర్, ‘సియాసత్’జహీరుద్దీన్ సాక్షి, హైదరాబాద్: అవును వారిద్దరూ ఆప్తమిత్రులు... ఎన్నో ఆలోచనలు..మరెన్నో చర్చలు..ఇద్దరూ సమాజ శ్రేయస్సుకు కృషి చేసిన వారే.. 24 గంటల వ్యవధిలోనే ఈ లోకాన్ని విడిచివెళ్లారు. వారిలో ఒకరు తన ఆటాపాటతో విప్లవ, తెలంగాణ ఉద్యమాలకు ఊపిరిలూదితే.. మరొకరు పత్రిక ద్వారా మైనారిటీ, బడుగు బలహీనవర్గాల పక్షాన నిలిచారు. వారే ప్రజాయుద్ధనౌక గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్‌రావు.. మరొకరు సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్. వారిద్దరూ సియాసత్ కార్యాలయంలో గంటల తరబడి చర్చల్లో మునిగితేలేవారు. గద్దర్ వారానికోసారైనా సియాసత్ కార్యాలయానికి వెళ్లడం అక్కడ సామాజిక, రాజకీయ అంశాలే కాకుండా ప్రజానీకం సమస్యలపై తరచు చర్చలు సాగించేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ వీరిద్దరూ కీలకభూమిక పోషించారు. సియాసత్ తరఫున నిర్వహించే సామాజిక కార్యక్రమాలకు సంబంధించి జహీరుద్దీన్అలీఖాన్ గద్దర్‌తో చర్చించేవారు. గద్దర్ మరణించిన వార్త తెలిసి జహీరుద్దీన్ చలించిపోయారు. ఎల్బీ స్టేడియం నుంచి గద్దర్ అంత్యక్రియలు జరిగే అల్వాల్‌లోని వెంకటాపూర్ వరకు పార్థివదేహం వెళ్లిన వాహనంలోనే ఆయన వెళ్లారు. అక్కడ దిగిన తర్వాత గద్దర్ భౌతికకాయాన్ని తీసుకెళుతున్న సమయంలో ఒక్కసారిగా జనం తోపులాట ఎక్కువ కావడం, ఆ మధ్యలోనే జహీరుద్దీన్ పడిపోవడం, తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. దగ్గర్లోని ఆస్పత్రికి ఆయన్ను తరలించినా.. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. అందరివాడు గద్దర్ అన్ని రంగాలు, వర్గాలతో సన్నిహితంగా మెలిగిన ప్రజాగాయకుడు సాక్షి, హైదరాబాద్: సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం..పీడిత వర్గాల తరఫున ప్రభుత్వాలను ప్రశ్నించిన గొంతు అది..పోలీసులు ఎక్కుపెట్టిన తుపాకులను సైతం లెక్క చేయక నిలబడి కొట్లాడిన గళం అది..అయినాసరే గద్దర్ అజాత శత్రువుగానే బతికారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడం అని ఎన్నోసార్లు తన విధానాన్ని సుస్పష్టం చేశారు. తన వ్యవహార శైలితో సమాజంలోని అన్ని వర్గాలకు దగ్గరయ్యారు. రాజకీయ పారీ్టలకతీతంగా ప్రముఖ నాయకులందరితోనూ సాన్నిహిత్యాన్ని సంపాదించారు. కళాకారుడిగా, రచయితగా సినీరంగంతోనూ ఆయన అనుబంధం కొనసాగింది. గద్దర్ మరణ వార్తతో అన్ని రంగాల ప్రముఖులు, సామాన్యుల నుంచి అన్ని వర్గాల వారు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇక సోమవారం జరిగిన గద్దర్ అంతిమయాత్ర ఆసాంతం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పట్టింది. 1972 నుంచి 2012 వరకు నాలుగు దశాబ్దాల విప్లవ ప్రస్థానంలో పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ గద్దర్ తన పాటలతో ఎన్నో ఉద్యమాలకు ఊపిరిలూదారు. ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాట గొంతుకగా నిలిచారు. నిక్కచ్చిగా మాట్లేడే తత్వమే గద్దర్‌కు ఎంతో మందిని దగ్గర చేసింది. మావోయిస్టు ఉద్యమాలకు దశాబ్దాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన అందించిన తోడ్పాటును గుర్తుచేస్తూ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఓ లేఖ విడుదల చేసింది. గద్దర్ మృతి తమను తీవ్రంగా బాధించిందని పేర్కొంది. మరోవైపు ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ఎన్నో సందర్భాల్లో ప్రశ్నించిన ప్రజాయుద్ధ నౌక అంత్యక్రియలు రాష్ట్ర ప్రభుత్వమే అధికార లాంఛనాలతో నిర్వహించింది. ఉద్యమ సమయంలో, అనేక ఎన్కౌంటర్ల సమయంలో పోలీసులతో ఎన్నో అంశాలపై కొట్లాడిన గద్దర్‌కు నివాళులర్పించేందుకు ఒకప్పటి ఎస్ఐబీ చీఫ్ సజ్జనార్ సైతం వచ్చారు. గద్దర్‌తో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. సినీ ప్రముఖులు సైతం సంతాపం తెలిపారు. ఆయన అభిమానులు, తోటి రచయితలు, అంతిమయాత్రలో పాదం కలిపారు. మావోయిస్టు ఉద్యమంతో దశాబ్దాలు గడిపిన గద్దర్‌కు చివరి గడియల్లో పోలీసు తుపాకులు గౌరవ వందనం సమర్పించడం.. ఆయన అందరివాడన్న దానికి మరో నిదర్శనంగా నిలిచింది. -
బాబు హయాంలో గద్దర్ హత్యకు కుట్ర..
సాక్షి, హైదరాబాద్: ప్రజా యుద్ధ నౌక గద్దర్‌పై గతంలో ఐదు రౌండ్లు కాల్పులు జరిగిన ఘటన వెనుక అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందన్న విషయం మరోమారు చర్చనీయాంశంగా మారింది. నాటి టీడీపీ ప్రభుత్వం ఎంతోమంది విప్లవకారులను క్రూరంగా హత్య చేయించిందన్న ఆరోపణలు ఉన్నాయి. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ బాహాటంగా ఈ విషయాలు పేర్కొనడం ఆ వాదనలకు మరింత బలం చేకూర్చినట్లయింది. ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా గద్దర్ మృతికి సంతాపంగా మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ సోమవారం ఓ లేఖను విడుదల చేశారు. అందులో గద్దర్‌తో మావోయిస్టు పార్టీ ఉద్యమానికి ఉన్న అనుబంధాన్ని ప్రస్తావిస్తూనే..ఆయనపై కాల్పులు జరపడం ద్వారా చేసిన హత్యాయత్నం గురించి స్పష్టంగా పేర్కొన్నారు. ‘చంద్రబాబు నేతృత్వంలో దోపిడీ పాలకవర్గ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండగా విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి విప్లవ ప్రతిఘాతుక శక్తులతో నల్లదండు ముఠాలను పోలీసుల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రజా సంఘాల్లో క్రియా శీలకంగా పనిచేస్తున్న అనేకమంది విప్లవ కారులను నల్లదండు ముఠాలతో క్రూరంగా హత్యలు చేయించారు. అందులో భాగంగా 1997లో గద్దర్‌పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి కాల్పులు జరిపారు. ఐదు తూటాలు శరీరంలోకి దూసుకెళ్లినా గద్దర్ ప్రాణాలతో బయటపడ్డారు..’అని వివరించారు. తనపై జరిగిన కాల్పులకు సంబంధించి విచారణ పూర్తి చేసి దోషులను గుర్తించాలంటూ గద్దర్ ఎన్నో ఏళ్లపాటు ప్రభుత్వాలకు వినతిపత్రాలు ఇస్తూ వచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఓసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చి పాత సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ కూడా.. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలోనే తనపై హత్యకు కుట్ర జరిగిందని గద్దర్ చెప్పారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఒక స్పెషల్ టీంను పెట్టి దోషులను అతి త్వరలో పట్టుకుంటామని ప్రకటించినా అది జరగలేదని తెలిపారు. అంతకు ముందు సైతం గద్దర్ పలు వేదికలపై, మీడియా ఇంటర్వ్యూల్లో తనపై కాల్పుల వెనుక చంద్రబాబునాయుడు ప్రభుత్వ కుట్ర ఉందని పేర్కొన్నారు. -
జవ సత్వాలున్న జన గళం
ప్రజా గాయకుడిగా, ప్రజా ఉద్యమ గేయ రచయితగా దశాబ్దాల పాటు శ్రామిక, ఉత్పాదక రంగాలలోని పీడితుల్ని, అధికార వర్గాల పీడనల్ని ప్రతిబింబించిన నెత్తుటి, నిలువెత్తు మట్టి మనిషి గద్దర్. ఆయన ఆలోచన, రచనలు... ఆధునాతనంగానూ, గ్రామీణంగానూ రెండు విధాలుగా సాగాయి. గద్దర్ అంబేడ్కరిజంలోకి మారాక కుల వ్యవస్థ, అంటరానితనాలకు వ్యతిరేకంగా అనేక జానపద గేయాలు రాశారు. స్త్రీ జీవితం, ఆమె పడుతున్న శ్రమ, మానవత్వాలపై లోతైన తాత్వికతతో పాటలు కూర్చారు. ఆయన భౌతికకాయం, అందులో మిగిలి ఉన్న తుపాకీ తూటా సహా ‘మహాబోధి’ప్రాంగణంలో ఖననం అయినప్పటికీ... విముక్తి పోరాటానికి ఆయన రాసిన పాటలు ఎప్పటికీ సజీవంగా జనంలో ఉండిపోతాయి. న్యాయం కోసం తనకు తానుగా ఒక ప్రజా గీతంగా, ఒక ప్రజాయుద్ధ నౌకగా అవతరించిన గద్దర్ (75) – గుమ్మడి విఠల్ – ఆగస్టు 6న కన్నుమూశారు. ప్రజా గాయకుడిగా, ప్రజా ఉద్యమ గేయ రచయితగా దశాబ్దాల పాటు శ్రామిక, ఉత్పాదక రంగాలలోని పీడితుల్ని, అధికార వర్గాల పీడనల్ని ప్రతిబింబించిన నెత్తుటి, నిలువెత్తు మట్టి మనిషి గద్దర్. ప్రజా గేయ రచయితగా ఎదుగుతున్న క్రమంలో 1970లలో గద్దర్ రాసిన పాట తెలుగునాట మోతెత్తిపోయింది. సిరిమల్లె సెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మా / నీవు సినబోయి గూసున్న వెందుకమ్మో ఎందుకమ్మా రాడికల్ విద్యార్థి ఉద్యమం వైపు మళ్లి, తర్వాత ఒక జాతీయ బ్యాంకులో క్లర్కుగా చేసి, కొంతకాలానికే ఆ ఉద్యోగాన్ని వదిలి, తిరిగి ఉద్యమంలోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత, నక్సలైట్ ఉద్యమంగా ప్రసిద్ధి చెందిన కమ్యూనిస్టు విప్లవోద్యమంలో పూర్తి సమయం గాయ కుడిగా మారారు. చిన్న చిన్న సభల్లో, కొన్నిసార్లు వీధుల్లో పాటలు పడుతూ, జనాన్ని సమీకరిస్తూ సీపీఐ–ఎంఎల్ (పీపుల్స్ వార్)లో అందరికీ తెలిసిన వ్యక్తి అయ్యారు. పీడిత వ్యవసాయ ఉత్పాదక రంగ ప్రజానీకం మీద; భూస్వాముల దోపిడీలు, దౌర్జన్యాల మీద తనదైన శైలిలో పాటలు రాసి, పాడి, భారతదేశ సాంస్కృతిక రంగాన్ని కదం తొక్కించారు. సాయుధ విప్లవం మాత్రమే ప్రస్తుత వ్యవస్థకు ప్రత్యా మ్నాయాన్ని నిర్మించగలదని చాలాకాలం పాటు నమ్మికతో ఉన్నారు. గద్దర్ అనే తన పేరును ఆయన అమెరికా గదర్ ఉద్యమం నుంచి తీసుకున్నారు. చివరికి ఆ పేరు మావోయిస్టు పోరాటాలకు భారతీయ చిహ్నంగా మారింది. 1997లో గద్దర్ అజ్ఞాతం నుంచి జన జీవన స్రవంతిలోకి వచ్చినప్పుడు ఆయనపై జరిగిన కాల్పులలో ఐదు తూటాలు ఆయన శరీరంలోకి దిగబడ్డాయి. వైద్యులు నాలుగు తూటా లను బయటికి తీయగలిగారు. మిగతా ఒక తూటా మొన్నటి రోజున ఆయన అంతిమ శ్వాస తీసుకునే వరకు పాతికేళ్లకు పైగా ఆయన శరీరం లోపలే ఉండిపోయింది. ధైర్యం, దృఢచిత్తం, వివేకం, వినయం... అదే సమయంలో చిన్న పిల్లవాడి మనస్తత్వం. ఇవీ గద్దర్‌లోని గుణాలు. క్రమంగా ఆయనకు తెలిసి వచ్చినదేమంటే... మావోయిస్టు విప్లవం ఎక్కడికీ దారి తీయడం లేదని. దాంతో దళిత ఉద్యమం వైపు మళ్లి, ప్రజాదరణ పొందే విధంగా పాటలు రాయడం, పాడటం మొదలుపెట్టాడు. 1985లో కారంచేడు కమ్మ భూస్వాములు ఎనిమిది మంది దళితులను దారుణంగా హత్య చేసినప్పుడు ఆయన రాసిన పాట ఇది: కారంచెడు భూస్వాముల మీద కలబడి నిలబడి పోరుచేసిన దళిత పులులమ్మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని యావత్ దళితులను ఏకం చేసేందుకు ఈ పాట ఆయుధంగా మారింది. అక్కడి నుంచి ఆయన అంటరాని తనం, అంబేడ్కరిజం, రాజ్యాంగవాదంపై పాటలు రాయడం ప్రారంభించారు. 1990లో మండల్ వ్యతిరేక ఉద్యమం దేశమంతటా వ్యాపించింది. సామాజిక న్యాయం, ప్రతిభ అన్నవి మండల్ అనుకూల,మండల్ వ్యతిరేక శక్తుల సైద్ధాంతిక లంగర్లు అయ్యాయి. కమ్యూనిస్టు విప్లవకారులు కూడా తమ అగ్రవర్ణ నాయకుల నేతృత్వంలో స్పష్టమైన వైఖరిని తీసుకోడానికి వెనుకంజ వేస్తున్నారు. ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ అప్పటి ఎడిటర్ అరుణ్‌శౌరీ మేధోపరమైన మండల్ వ్యతిరేక ఉద్య మానికి నాయకత్వం వహించారు. ఆ సమయంలో గద్దర్ రాసిన పాట మండల్ అనుకూల శక్తులకు ఆయుధంగా మారింది. అరుణ్శౌరిగో నీకు ఆకలి బాధేమెరుక నెయ్యి కాడ నువ్వుంటే పియ్యికాడ మేముంటం ఈ పాట చాలామంది అగ్రవర్ణ విప్లవకారులకు నచ్చలేదు. కానీ మండల్ రిజర్వేషన్లు అమలు చేయాలని పోరాడుతున్న ఓబీసీ/ ఎస్సీ/ ఎస్టీలకు స్ఫూర్తినిచ్చేందుకు గద్దర్ ఆ పాటను బహిరంగ సభలలో పాడుతూనే ఉన్నారు. 1990వ దశకం చివరిలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. మెల్లిగా గద్దర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి మూల శక్తిగా మారారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా... బలే.. బలే.. బలే... ఈ పాట తెలంగాణ ఉద్యమానికి ప్రతీకగా నిలిచింది. గద్దర్ ఎప్పుడూ టీఆర్ఎస్కు బహిరంగ మద్దతుదారు కానప్పటికీ మావోయి స్టుల మద్దతుతో సమాంతర రాడికల్ తెలంగాణ అనుకూల గ్రూపు లను నడిపించారు. ఈ క్రమంలో మావోయిస్టు భావజాలంతో గద్దర్ వ్యతిరేకించారు. వర్గపోరు మాత్రమే సరిపోదు, కులపోరాటాన్ని చేపట్టాలని భావించారు. అనేక విముక్తి బలాలను కలిగి ఉన్న భారత రాజ్యాంగాన్ని గుర్తించడం ప్రారంభించారు. భారత రాజ్యాంగం పట్ల, అంబేడ్కర్ పట్ల తమ దృక్పథాన్ని మార్చుకోవాలని మావోయిస్టులను ఒప్పించేందుకు పార్టీతో అంతర్గతపోరును సాగించారు. అయితే సహజంగానే వారు తమ పాత వర్గ పోరాట పంథాను మార్చుకోడానికి నిరాకరించారు. దాంతో పార్టీ నుంచి బయటికి వచ్చి నేటి భారత రాజ్యాంగాన్ని సమర్థించిన, సమర్థిస్తున్న అనేక ఇతర శక్తులతో కలిసి పని చేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విభిన్న రాజకీయ, సైద్ధాంతిక శక్తులతో సన్నిహితంగా మెలిగారు. అప్పటికే గద్దర్‌పై ఆయన మావోయిస్టుగా ఉన్నప్పటి కేసులు అనేకం ఉన్నాయి. ఆరోగ్యం కూడా క్షీణించడం మొదలైంది. ఆ సమయంలోనే కొంత కాలం గద్దర్, నేను... సీపీఎం మద్దతు ఉన్న బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్‌లో కలిసి పని చేశాం. మరోవైపు ఆయన కాంగ్రెస్‌తోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రసంగించిన కొన్ని బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఢిల్లీలో రాహుల్‌ను, సోనియాగాంధీని కలిశారు. గద్దర్ జీవితం వీరోచిత పోరాటాల అవిశ్రాంత గాథ. ఒక్క రెండు పాటలు తప్ప మిగతా ముఖ్యమైన పాటలన్నీ తనే రాసి, పాడినవి. గద్దర్ పాడటంతో ప్రాచుర్యం పొందిన ‘బండెనక బండి కట్టి’ పాట 1940లలో నిజాంకు, రజాకర్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా పోరాటంలో యాదగిరి రాసినది. రెండో పాట: ఈ ఊరు మనదిర, ఈ వాడ మనదిర / దొర ఏందిరో, వాని పీకుడేందిరో. ఈ పాటను మరో ప్రముఖ దళిత గాయకుడు, రచయిత గూడ అంజయ్య రాశారు. గద్దర్ తన గళంతో ఆ పాటను ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు ప్రతి పల్లెకు తీసుకెళ్లారు. గద్దర్ ఆలోచన, రచన... ఆధునాతనంగానూ, గ్రామీణంగానూ రెండు విధాలుగా సాగాయి. గద్దర్ అంబేడ్కరిజంలోకి మారాక కుల వ్యవస్థ, అంటరానితనాలకు వ్యతిరేకంగా అనేక జానపద గేయాలు రాశారు. స్త్రీ జీవితం, ఆమె పడుతున్న శ్రమ, మానవత్వాలపై లోతైన తాత్వికతతో పాటలు కూర్చారు. వంటపని, వీధుల పారిశుధ్యం,ఇంటిని శుభ్రంగా ఉంచే హింసాత్మక శ్రమలలోని నొప్పిని పాటలుగా మలిచారు. ఇంటికి చీపురు చేసే సేవలోని గొప్పతనంపై ఆయన రాసి, పాడిన పాట అత్యంత తాత్వికమైనది. అంబేడ్కర్ అడుగుజాడల్లో గద్దర్ తన పూర్వపు కమ్యూనిస్టు నాస్తికత్వాన్ని పక్కనపెట్టి సరైన బౌద్ధేయుడు అయ్యారు. గద్దర్ భౌతికకాయం, అందులో మిగిలి ఉన్న తూటా సహా ‘మహాబోధి’ (పేద పిల్లల కోసం ఆయనే స్థాపించిన పాఠశాల) ప్రాంగణంలో ఖననం అయినప్పటికీ, మానవ సమానత్వంపై ఆయన ప్రేమ, విముక్తి పోరాటానికి ఆయన రాసిన పాటలు ఎప్పటికీ సజీవంగా జనం జీవనంలో ఉండిపోతాయి. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
గద్దర్ తాతయ్యో.. వందానాలయ్యో..
గన్నేరువరం: ప్రజా గాయకుడు గద్దర్‌పై మండలంలోని చీమలకుంటపల్లెకు చెందిన ఐదో తరగతి చిన్నారి బామండ్ల అక్షర గద్దర్ తాతయ్య అంటూ పా ట రాసింది. గ్రామానికి చెందిన సీపీఐ(ఎంఎల్) నాయకుడు బామండ్ల రవీందర్‌కు గద్దర్‌తో అనుబంధం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కార్యక్రమాల్లో గద్దర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ క్రమంలో తన కూతురు అక్షర 2020జనవరిలో గద్దర్‌పై ప్రత్యేక పాట రాసినట్లు రవీందర్ తెలిపారు. గద్దర్ తాతయ్యో.. వందానాలయ్యో.. అంటూ ప్రత్యేకపాట రాసింది. కాగా హైదరాబాద్‌లో జరిగిన అంత్యక్రియల్లో రవీందర్ పాల్గొని నివాళి అర్పించారు. -
గద్దర్ అంత్యక్రియలు.. తరలివచ్చిన జనసంద్రం (ఫొటోలు)