మోదీ, బాబులకు పాలించే హక్కులేదు | Modi And Babu Have No Right To Rule | Sakshi
Sakshi News home page

మోదీ, బాబులకు పాలించే హక్కులేదు

Published Tue, Jul 31 2018 2:11 PM | Last Updated on Sat, Sep 15 2018 3:13 PM

Modi And Babu Have No Right To Rule - Sakshi

గద్దర్‌ పాటలకు స్టెప్పులేస్తున్న దృశ్యంపాటలు పాడుతున్న గద్దర్‌  

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) :  కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న మోదీ, చంద్రబాబులు ప్రజ లకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని, కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ పాలన సాగిస్తున్నారని ప్రజా గాయకుడు గద్దర్‌ మండిపడ్డారు. శ్రీకాకుళం నగరంలో ఆంధ్రప్రదేశ్‌ మహాసభ పిలుపుమేరకు దళిత ప్రజల మానవ హక్కుల మహాసభను సోమవారం ఎన్టీఆర్‌ మున్సిపల్‌ గ్రౌండ్‌లో కె.రఘునాథరావు అధ్యక్షతన నిర్వహించారు.

ముందుగా అంబేడ్కర్‌ కూడలి నుంచి వైఎస్సార్‌ కూడలి వరకు ర్యాలీగా వెళ్లారు. దీనికి పోలీసులు మధ్యలో ఆటంకం కలిగించడంతో స్వల్ప తగాదా జరిగింది. గద్దర్‌ కలుగజేసుకుని తగాదాను సద్దుమణిగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రజా గాయకుడు గద్దర్‌ తనదైన పాటలతో ఊర్రూతలూగించారు. 

కార్పొరేట్ల కోసమే పాలన..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 40 కోట్ల మంది దళితులు ఉన్నారని వారి ఆత్మగౌరవాన్ని, అభివృద్ధిని ఉన్నత వర్గాల వారు తొ క్కేయడం సరికాదన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగంలో దళితుల కోసం ఎన్నో చ ట్టాలను పొందుపరిచారని వాటన్నింటినీ కార్పొరేట్లు, ప్రభుత్వానికి అనుకూలంగా న్యాయవాదులు నిర్వీర్యం చేస్తున్నారన్నారు. పూర్వం నుంచి కులాల, మతాల, వృత్తుల వారీగా పనిచేస్తూ బతుకులు నెట్టుకొస్తున్న వారంతా అట్టడుగున ఉండిపోయారని తెలిపారు.

సమాజంలో క్రైస్తవులు, ముస్లింలు, దళితుల మీద, సామాజిక వ్య వస్థ మీద ఈ నాటికీ అగ్రకులస్తులు పెత్తనం చలాయిస్తున్నారని తెలిపారు. అంబేడ్కర్‌ పుట్టిన జాతిని, రాజ్యాంగాన్ని ఖూనీ చేయడం తగదన్నారు. దోపిడీ వర్గాల వారికి తగిన శిక్షలు పడాలని అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ నియమాలు పాటించకుండా న్యా యమూర్తులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టంపై ఈ ఏడాది మార్చి నెలలో సుప్రీంకోర్టు తీర్పు దళితులకు తీరని లోటన్నారు.

అత్యాచార చట్ట వ్యతిరేక తీర్పుపై దేశవ్యాప్తంగా నిరసనలు తెలి యజేస్తే పోలీసులు దాడి చేయించి 11మందిని చంపేయడం దారుణమన్నారు. మరణానికి కారకులపై నేటికీ శిక్ష వేయకుండా తాత్సారం చేస్తున్నారని అన్నారు. ఎస్సీ,ఎస్టీ అత్యాచార చట్టాన్ని సవరించకుండా ముందు ఉన్నట్లుగానే చేయాలం టే దళిత కులానికి చెందిన ఎంపీలంతా రాజీ నామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగంలో ఇచ్చిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్వీర్యం చేస్తూ అగ్రకులందారులు రిజర్వేషన్లను సైతం ఎత్తుకుపోతున్నారని ఆరోపించారు.

ధమాసా పాలనను తీసుకొచ్చేందుకు వామపక్షాలు నిర్ణయం సరికా దని దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. ఎన్నికల పెట్టుబడిదారీ వ్యవస్థను అంతమొందించిన నాడే సమాజంలో ప్రతి ఒక్క నిరుపేదకు న్యాయం జరుగుతుందన్నారు. హిందువులు రా మాయణం, క్రైస్తవులు బైబిల్, ముస్లింలు ఖురాన్‌ చదివినట్లుగానే సమాజంలో ప్రతి ఒక్క దళిత యువకుడు రాజ్యాంగాన్ని చదవాలని కోరారు. అప్పుడే అంబేడ్కర్‌ ఆశయ సాధన నెరవేరుతుం దన్నారు.

ఈ సందర్భంగా గద్దర్‌ ఆధ్వర్యంలో నిచ్చెనమెట్లు అనే నాటికను ప్రదర్శించి అన్ని వర్గాల ప్రజల సాధకబాదకాలను తెలియజేశా రు. దళిత మహాసభ బెంజిమెన్‌ మాట్లాడుతూ దే శంలో, రాష్ట్రంలో దళితులపై దాడులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని అందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా తాత్సారం చే యడం సరికాదన్నారు. దళితులకు న్యాయం చేసిననాడే అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగానికి విలువ ఇచ్చినట్లు అవుతుందన్నారు.

రాష్ట్రంలో చుం డూరు, గరగపర్రు, లక్ష్మింపేటలో జరిగిన సంఘటనలే దీనికి ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రైతుకూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.ఝాన్సీ, ఉపాధ్యక్షులు టి.అచ్చారావు, జిల్లా ప్రధానకార్యదర్శి తాండ్ర అరుణ, దళిత కూలీ రైతు సంఘం, విశాఖపట్నం ప్రధానకార్యదర్శి వై.ఎస్‌ ప్రసాద్, దళిత నాయుకులు ఏ.కామేశ్వరరావు, జి.కృష్ణ, ఎస్‌.రాజేష్, నూకరాజు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement