SC ST Welfare Schemes
-
క్రీమీలేయర్ పేరిట చిచ్చు పెట్టొద్దు: ఖర్గే
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల్లోని క్రీమీలేయర్‌కు రిజర్వేషన్లు వర్తింపజేయకూడదన్న ఆలోచనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం చెప్పారు. ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న భాగాన్ని తొలగించాలని, ఇందుకోసం పార్లమెంట్లో చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. క్రీమీలేయర్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేయొద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్‌ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. క్రీమీలేయర్‌కు రిజర్వేషన్లు నిరాకరించాలని ఆయన సూచించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అస్పృశ్యత ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని మల్లికార్జున ఖర్గే తేలి్చచెప్పారు. రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విధానానికి ముగింపు పలికేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. -
‘క్రీమీ లేయర్’పై బీజేపీ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్ల ఫలాలు వర్తింపజేయకూడదని, క్రీమీ లేయర్‌ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాదటిని అమలు చేయొద్దంటూ వినతి పత్రం సమరి్పంచారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎవరికీ నష్టం జరగదని మోదీ హామీ ఇచ్చినట్టు అనంతరం వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. -
ఎస్సీల ఉపవర్గీకరణపై సుప్రీం జస్టీస్ మిత్తల్ కీలక వ్యాఖ్యలు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం (ఆగస్ట్1న) చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.ఈ తీర్పును వెలువరించే సమయంలో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ పంకజ్ మిత్తల్ 51 పేజీల ప్రత్యేక తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల విధానానికి తాజా పునఃపరిశీలన అవసరమని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల అభ్యున్నతికి కొత్త పద్ధతులు అవసరమని అన్నారు.రాజ్యాంగ పాలనలో కుల వ్యవస్థ లేదని, అణగారిన వర్గాలకు, అణగారిన ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశ్యంతో తీర్పును వెలువరించినట్లు చెప్పారు. దేశం కుల రహిత సమాజంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పైన పేర్కొన్నవర్గాలకు చెందిన వ్యక్తుల ప్రమోషన్, లేదా ఇతర ప్రయోజనాలు, ప్రత్యేకాధికారం వంటివి కులం ప్రాతిపదికన కాకుండా నివాసం స్థితి, ఆర్థిక కారకాలు, జీవన స్థితి,వృత్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న సౌకర్యాల ఆధారంగా ప్రమాణాలై ఉండాలని జస్టిస్ పంకజ్ మిత్తల్ తెలిపారు. -
FACT CHECK: బడుగులను ఏవగించుకునే బాబు రామోజీకి గొప్పోడు!
ఇంట్రో... మంచి మనిషికో మాట...మంచి గొడ్డుకో దెబ్బ ...అంటారు...రామోజీ దుర్మార్గపు రాతలపై ఎన్నిసార్లు వాస్తవాల హంటర్ ఝళిపించినా బజారుస్థాయి రాతలతో పత్రికను ఆసాంతం దిగజార్చుకుంటూనే పోతున్నారు...జగన్ ప్రభుత్వ వ్యతిరేకత అనే పూనకంలో కన్నూమిన్నూగాననంతగా తప్పుడు కథనాలను అచ్చేస్తున్నారు...విచక్షణాయుత పాత్రికేయానికి మంగళం పాడేసి దుష్ట పాత్రికేయం అంటే ఎలా ఉంటుందో పాఠకలోకానికి తన రాతల్లో చూపిస్తున్నారు...అన్నీ ఏకపక్ష కథనాలు... పవిత్ర పాత్రికేయ వస్త్రాన్ని తొలగించుకుని అక్షర దిగంబర నృత్యం చేస్తున్నట్లుగా ఉంది రామోజీ తీరు...ఈ కథనాలు ఎవరు చదివినా చదవకపోయినా బాబొక్కడు చదివితే చాలు తన జన్మ ధన్యమైపోతుందన్న మూర్ఖత్వంలో బొంకుల దిబ్బపై కూర్చుని బొంకుడు కథనాలను రాస్తున్నట్లుగా ఉంది...బడుగులను ఏవగించుకున్న బాబు రామోజీ దృష్టిలో గొప్పోడు..అయిదేళ్ల పాలనలో ఎస్సీ ఎస్టీ లకు అన్ని రంగాల్లోనూ అగ్రాసనం వేసిన జగన్ అంటే మంట...మంచి చేసిన జగన్ కన్నా జనాన్ని ముంచే బాబే రామోజీకి ఆదర్శం..ఈ వికృతధోరణిని నిలువెల్లా ఒంటబట్టించుకుని మంగళవారం ’నా..నా...నా..అని బాకా...చేసిందంతా ధోకా’ శీర్షికన జగన్ ప్రభుత్వంపై రాళ్లేస్తూ...ఓ తప్పుడు కథనాన్ని జనంపైకి వదిలారు...రామోజీ బుర్ర తక్కువ రాతలకు వాస్తవాల షాక్ ఇచ్చే సమాధానాలివి...సాక్షి, అమరావతిః చంద్రబాబుకు పదవీ ప్రయోజనం కోసం రామోజీ అబద్ధాల డోలు వాయించడం మానడం లేదు. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ధోకా ఇచ్చింది చంద్రబాబేనని తెలిసినా రామోజీ దుర్మార్గ రాతల ధోరణి మాత్రం మారడంలేదు. రాష్ట్రంలో దళిత, గిరిజనులకు విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నవరత్నాలతో వారి సంక్షేమానికి అధిక ప్రాధాన్యమివ్వడంలో దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలిపింది. ఎస్సీ, ఎస్టీలకు స్వయం ఉపాధితో పాటు అనేక విధాలుగా ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం పెద్ద మనస్సును చాటుకుంది. ఈ వాస్తవాన్ని దాచిపెట్టి దళిత, గిరిజనులకు సంక్షేమ పథకాలను రద్దు చేశారని, ఉపాధి అవకాశాలను దెబ్బతీశారనే తప్పుడు ప్రచారానికి ఈనాడు బరితెగించింది.పేదల అసైన్డ్ భూములను రాబందులా ఆక్రమించి ఫిలిం సిటీ కోట కట్టుకున్న రామోజీ నీతులు వల్లిస్తున్నారు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు దళితులను భయపెట్టి భూములను కాజేసినా రామోజీ కళ్లప్పగించి చూశారు. వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను అయినా ఇవ్వకపోయినా అది తప్పని ఏ రోజూ బాబుకు బుద్ధి చెప్పలేదు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరుతో బాబు అస్మదీయులకు కాంట్రాక్టులు కట్టబెట్టినా, ఎస్సీలకు దక్కాల్సిన కార్లు బినామీల పేరుతో టీడీపీ నేతలు దక్కించుకున్నా, ఈ ఎల్లో మీడియా పెద్దకు అక్షరం రాసేందుకు మనసొప్పలేదు.రామోజీ చేసిన ఆరోపణలు ఎంత నీచమైనవో చెప్పే వాస్తవాలివి... ఆరోపణః కొత్త వైద్య కళాశాలల్లో రిజర్వేషన్ల కోత వాస్తవంః కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కొత్తగా ఎంబీబీఎస్ సీట్లను సీఎం వైఎస్ జగన్ సాధించారు. 2023–24 విద్యా సంవత్సరంలో 5 వైద్య కళాశాలలు ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో ఒక్కసారిగా 319 కన్వీనర్ కోటా సీట్లు పెరిగాయి. వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే సీట్లు దక్కించుకుని లబ్ధిపొందారు. మీ బాబు అధికారంలో ఉండగా ఏనాడైనా ఈ విధంగా అట్టడుగు వర్గాల పిల్లలకు మెడికల్ సీట్లను తెచ్చిపెట్టి మేలు చేశాడా రామోజీ? ఆరోపణః అవన్నీ సంక్షోభ వసతి గృహాలు వాస్తవంః సంక్షోభంలో వసతి గృహాలు అంటూ ఈనాడు మరో వక్రీకరణకు దిగింది.వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే సోషల్ వెల్ఫేర్ స్కూళ్ల మరమ్మతుల కోసం ఇప్పటికే రూ. 64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్ వర్కుల కోసం మరో రూ.133.90 కోట్ల మొత్తాన్నీ వెచ్చించింది. ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి. దాదాపు రూ.318 కోట్లతో 177 స్కూళ్లలో నాడు–నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది, వసతి గృహాలను ఆధునికీకరించి మౌలిక వసతులు కల్పించింది. ఆరోపణః సివిల్స్‌లో శిక్షణకు విముఖత, పోటీలో నిలవకుండా కుట్ర వాస్తవంః నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి.పోటీ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ కోచింగ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతుల్లో స్టడీ సర్కిళ్లున్నాయి. ఒక్కో స్డడీ సర్కిల్లో ఒక్కో మాదిరిగా సివిల్స్, గ్రూప్స్, బ్యాంక్ టెస్ట్‌లకు శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వం విద్యోన్నతి పథకం కింద 9,775 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పంపగా , ఒక అభ్యర్థి మాత్రమే ఎంపికైనా రామోజీ ఏరోజూ రాయలేదు. ఆ పథకాన్ని సవరించి సివిల్స్ సర్వీస్ పరీక్షకు ఏపీ స్టడీ సర్కిళ్లలోనే ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు. ఇటీవలే జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ప్రకటించింది. మెయిన్స్‌కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించి అందిస్తోంది.పేద పిల్లలు ఉన్నత స్థానాలకు పోటీ పడి ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు అమెరికా వంటి సంపన్నదేశాలకు వెళ్లేందుకు ఊతమిస్తున్న సీఎం వైఎస్ జగన్‌పై రామోజీ విషం కక్కుతున్నారు. ఆరోపణః విదేశీ విద్యకు కొర్రీలు వాస్తవంః గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్యా పథకంలో జరిగిన లోపాలు, అవినీతి, అక్రమాలు విజిలెన్స్ విచారణలో వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి లోపాలు, అక్రమాలకు తావులేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని తెచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది.అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్లు, ట్యూషన్ ఫీజు 100 శాతం చెల్లించేలా పథకాన్ని సమర్థంగా మార్చి ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగిలిన వర్గాలకు రూ.కోటి లేదా అసలు ట్యూషన్ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తోంది. ఈ స్థాయిలో విదేశీ విద్య కోసం గత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగిందా? మరి ఈనాడు ఈ పథకంపై పదేపదే ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోందో రామోజీ పక్షపాత బుద్ధిని బట్టి ఇట్టే అర్థమవుతోంది.. ఆరోపణః స్వయం ఉపాధికి చెల్లు వాస్తవంః ఇస్త్రీ పెట్టె.. కత్తెర ఇచ్చి.. అదే స్వయం ఉపాధి పథకం అని గత టీడీపీ ప్రభుత్వం అర్భాటపు ప్రచారం చేసుకునేది. వాస్తవానికి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలుగా ఆదుకుని వారి జీవన ప్రమాణాలను పెంచేలా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది.టీడీపీ హయాంలో స్వయం ఉపాధి పథకం కింద 2,02,414 మందికి రూ.2,726 కోట్లు, ఎస్టీలు 39,906 మందికి రూ.284.8 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా ద్వారా 23,27,682 మంది ఎస్సీలకు రూ.9,697.99 కోట్లు. 4,78,716 మంది ఎస్టీలకు రూ.1,895.37 కోట్ల లబ్ధి చేకూరింది. చిన్న తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) ఏర్పాటుకు 6,256 మంది ఎస్సీలకు రూ.346.79 కోట్లు, 1,228 మంది ఎస్టీలకు రూ.65.90 కోట్లను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందించింది.స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో ఎస్సీ లబ్ధిదారులకు 2,300, ఎస్టీలకు 701 ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ డోర్ డెలివరీ కోసం అందించింది.ఎన్ఎస్ఎఫ్డీసీ ద్వారా స్వయం ఉపాధి పథకంలో రూ.63.20 కోట్లతో 1,038 యూనిట్లను అమలు చేసింది. ఆరోపణః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదు వాస్తవంః సాగుకు సెంటు భూమి ఇవ్వలేదని తప్పుడు రాతలు రాసిన ఈనాడు గత ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి ఎంతమేర భూమి సేకరించిందనే విషయాన్ని రాయలేకపోయింది. దీన్నిబట్టే ఈ పథకాన్ని టీడీపీ ఎత్తేసిందనే సంగతి ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది.దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలన్నింటినీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం మాఫీ చేసింది. ఆ భూములపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇది మైలు రాయిగా నిలిచిపోయింది. 22ఏ జాబితా నుంచి మినహాయింపుతో 14.223 దళిత మహిళలకు 16,213.51 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. అసైన్ భూముల క్రమబద్ధీకరణతో 3,57,805 మందికి 5,37,719 ఎకరాలపై హక్కులు దక్కాయి. అవసరమైనప్పుడు భూములను విక్రయించడానికి ఎస్సీ మహిళా లబ్ధిదారులకు ఈ ప్రభుత్వం పూర్తి హక్కులను కల్పించింది. ఎస్సీ మహిళా లబ్ధిదారులు బ్యాంకు రుణాలు, రైతు భరోసా, వైఎస్ఆర్ జలకళ, పంటలబీమా సాయాన్నీ పొందే సౌలభ్యాన్నీ ఏర్పరిచింది.అసైన్డ్ భూముల డీనోటిఫికేషన్ తర్వాత, భూమి యజమానులు తమ భూములపై ఫ్రీహోల్డ్ హక్కులు పొందుతారు. పట్టా భూములతో సమానంగా తమ భూములను విక్రయించుకునే అవకాశాన్ని ప్రస్తుత ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వాల కంటే అత్యధికంగా ఎస్టీలకు ఏకంగా 2.47 లక్షల ఎకరాలకు పైగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసిన సీఎం జగన్ దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమినీ కొనుగోలు చేయలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు ’ కార్యక్రమంలో దళితులకు, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 31.19 లక్షలకు పైగా ఇళ్లపట్టాలు ఇస్తే , అందులో 6,36,732 మంది లబ్ధిదారులు దళిత వర్గాలకు చెందిన అక్క చెల్లెమ్మలే (మొత్తం లబ్ధిదారుల్లో 20.7 శాతం).ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది. వారి కోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు (మొత్తం లబ్ధిదారుల్లో 6 శాతం) ఉన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇంతటి లబ్ధి ఈ వర్గాలకు దక్కడం ఇదే ప్రథమం. ఇంత భారీస్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వం అండగా నిలబడలేదు. ఆరోపణః బెస్ట్ ఎవైలబుల్ స్కూల్స్‌కు గండి వాస్తవంః ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని నిర్వీర్యం చేసినట్టు ఈనాడు మరో వక్రీకరణకూ దిగింది. వాస్తవానికి కనీస ప్రమాణాలు పాటించని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీమును గత బాబు ప్రభుత్వం అమలు చేసింది.ఇప్పుడు ఆ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో చదువులు అందుతున్నాయి. అత్యుత్తమంగా తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. బైలింగ్యువల్ టెక్ట్స్బెక్స్, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ ఆధునాతనంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే 15 వేల స్కూళ్లలో పనులు జరిగాయి. టోఫెల్ లాంటి కోర్సులనూ ప్రభుత్వం ఈ పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో ఎస్సీ చెందిన 8,84,131 మంది తల్లులకు రూ.15వేల చొప్పున రూ.5,335.70 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం అందించింది.2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లులకు అమ్మ ఒడి ద్వారా రూ.1,714.76 కోట్లు సమకూర్చింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5,06,390 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.834.96 కోట్లు జమ చేసింది. 83,04 మంది ఎస్టీలకు రూ.135.౬౬ కోట్లను జమచేసింది. జగనన్న విద్యాదీవెన ద్వారా రూ.5,93,926 మంది ఎస్సీ విద్యార్థులకు రూ.2,409.76 కోట్లను అందించింది. 1,22,495 ఎస్టీ విద్యార్థులకు రూ.383.43 కోట్లను సమకూర్చింది. ఈ పథకాల నిధులన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికీ చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అయ్యాయి. ఆరోపణః కేంద్ర సాయానికి మోకాలడ్డు వాస్తవంః ఎస్సీ, ఎస్టీలను ఉద్ధరించడంలో దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసింది.ఇదే సమయంలో ఎస్సీ, ఎస్టీలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, సాయాన్ని రాబట్టడంలో గత టీడీపీ ప్రభుత్వానికంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం గణనీయమైన కృషి చేసింది. ఎస్సీ కాంపొనెంట్ అమలులో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చిన జాబితాలో దేశంలోని 20 రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన నివేదికలోను స్పష్టం చేసింది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ ద్వారా మొత్తం 37.64 లక్షల మందికి మేలు జరిగితే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 35.92 లక్షల మందికి లబ్ధి చేకూరడం గొప్ప రికార్డు.ఈ కోవలోనే గిరి బిడ్డలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారినీ సమాదరిస్తోంది. జిల్లాల విభజనతో గిరిజనులకు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం రెండు జిల్లాలను ఏర్పాటు చేయడం విశేషం. ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు సమస్యలు ఉంటాయి కాబట్టి ఒకే కమిషన్‌గా ఉన్న దాన్ని వేర్వేరుగా ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం వారికి దన్నుగా నిలవడం గొప్ప విషయం. ----- సంక్షేమానికి ఇలా... -టీడీపీ హయాంలో ఎస్సీలు 21,43,853 మందికి రూ..8844 కోట్లు, ఎస్టీలు 9,17,488 మందికి రూ.2,611.3 కోట్లను వెచ్చించింది.-వైఎస్సార్సీపీ ప్రభుత్వం డీబీటీ ద్వారా ఎస్సీలు 1,37,72.539 మందికి రూ.45,412.12 కోట్లు, ఎస్టీలు 37,90,517 మందికి రూ.13,389.21 కోట్ల మొత్తాన్ని నేరుగా బటన్ నొక్కి వారి ఖాతాలకే జమ చేశారు. నాన్ డీబీటీ ద్వారా 69,91,349 మంది ఎస్సీలకు రూ.23,468.91 కోట్లు, ఎస్టీలు 22,71,105 మందికి రూ.5,963.43 కోట్ల లబ్ధిని ఈ ప్రభుత్వం చేకూర్చింది. ఈ ప్రభుత్వంలోనే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మొత్తంగా ఎస్సీలు 2,07,63,888 మందికి రూ.68,881.04 కోట్లు, ఎస్టీలు 60,61,622 మందికి రూ.19,352.64 కోట్ల లబ్ధిని అందించింది. -
రిజర్వ్డ్ కేటగిరీల ఉప వర్గీకరణ చెల్లుబాటుపై విచారణ నేడు
రిజర్వ్డ్ కేటగిరీల మధ్య ఉప వర్గీకరణ చెల్లుబాటుకు సంబంధించిన పిటిషన్లను నేడు భారత ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సుప్రీం కోర్టులో విచారించనుంది. బెంచ్‌లో న్యాయమూర్తులుగా బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ, సందీప్ మెహతా ఉన్నారు. తమిళనాడుకు చెందిన అరుంథతియార్ కమ్యూనిటీ తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, న్యాయవాది జి బాలాజీ సహా దేశవ్యాప్తంగా పలు రిజర్వ్డ్ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు ఈ కేసుకు హాజరవుతున్నారు. ఈ ఉప వర్గీకరణ కేసు 2020 నాటిది. జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గతంలో బలహీనమైన వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర జాబితాలోని షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగలను రాష్ట్రాలు వారీగా ఉప వర్గీకరించవచ్చని పేర్కొంది. అయితే ఈ బెంచ్ తీసుకున్న అభిప్రాయం 2004లో ఈవీ ఛిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉంది. ఈ తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఏకపక్షంగా షెడ్యూల్డ్ కులాల సభ్యుల తరగతిలో ఒక తరగతిని చేర్చడానికి అనుమతించడం అనేది రాష్ట్రపతి పరిధిలో ఉంటుంది. ఈ కేసులో కోఆర్డినేట్ బెంచ్‌ల విరుద్ధమైన అభిప్రాయాలను ఈ ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు పంపారు. ఈ నేపధ్యంలో విచారణ అనంతరం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలలో ఉప-వర్గీకరణను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర శాసనసభలు సమర్థవంతంగా ఉన్నాయో లేదో అనేది కోర్టు నిర్ణయించనుంది. -
దళితుల సంక్షేమం, సాధికారతపై చర్చకు సిద్ధమా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీల సంక్షేమానికి, రాజకీయ సాధికారతకు నాలుగేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేస్తున్నదో.., అంతకుముందు చంద్రబాబు సర్కార్ ఏం చేసిందో చర్చకు సిద్ధమా అని టీడీపీ నేతలకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సవాల్ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వేదిక, సమయం మీరే చెప్పండి. మీ ఆరోపణలకు సమాధానం చెప్పడానికి వైఎస్సార్సీపీలో ఉన్న ప్రతి ఒక్క మాదిగ ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు’ అని తేల్చిచెప్పారు. దళితులను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వారంతా క్షమాపణలు చెప్పి చర్చకు రావాలని సూచించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ దళితులను అవహేళన చేసిన చంద్రబాబుకు డప్పు కొట్టడానికి సిగ్గులేదా అని ఆ పార్టీ నేతలను నిలదీశారు. దళిత మహిళను బూటుకాలితో తొక్కిన అచ్చెన్నాయుడిని చెప్పుతో కొట్టి మాట్లాడాలని హితవు పలి కారు. దళితులను చంద్రబాబు అడగడుగునా అవమానిస్తే.. సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకుంటున్నారని గుర్తు చేశారు. మంత్రి సురేష్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే.. దళిత ద్రోహులు చంద్రబాబు, టీడీపీ నేతలే అసలు దళిత ద్రోహులు చంద్రబాబు, టీడీపీ నేతలే. ఇప్పటికిప్పుడు కులాల సమావేశాలను చంద్రబాబు నిర్వహించడానికి ప్రధాన కారణం ఎన్నికలే. వాడుకొని వదిలేయడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. దళిత ద్రోహులంతా నేడు సీఎం వైఎస్ జగన్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. చదవండి: Instagram Reels: రీల్స్ మోజులో బావిపైకి ఎక్కి... వైఎస్ జగన్ వచ్చాకే డప్పు కళాకారులు, చర్మకారులకు న్యాయం 2019 జనవరి.. అంటే.. ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు నెలకు రూ.1500 చొప్పున డప్పు కళాకారులకు పింఛన్ ఇచ్చారు. అది కూడా 6,600 మందికి మాత్రమే మూడు నెలలే ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక పింఛన్‌ను సీఎం జగన్ రూ.3000కు పెంచారు. 2019–20లో 31 వేల మంది ,2020–21లో 43 వేల మందికి, 2021–22లో 49 వేల మంది, 2022–23లో 56 వేల మందికి పింఛన్ అందిస్తున్నాం. టీడీపీ హయాంలో మూడు నెలల్లో కేవలం రూ.30 కోట్లు ఇస్తే.. మేం ఏటా దాదాపు రూ.150 కోట్లు డప్పు కళాకారులకు పింఛన్‌గా ఇస్తున్నాం. చర్మకారులకు పింఛన్‌ను చంద్రబాబు 2018 నవంబర్‌లో ప్రవేశపెట్టారు. రూ. 1000 చొప్పున 6 వేల మందికి ఇవ్వాలని జీవో నెంబర్ 191 ఇచ్చారు. ఇది కూడా ఎన్నికలకు మూడు నెలలు ముందు అమలు చేసి మూన్నాళ్ల ముచ్చట చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్మకారుల పింఛన్ రూ. 2 వేలు చేశాం. 2019–20లో 21 వేల మందికి, 2020–21లో 31,280 మందికి, 2021–22లో 35 వేల మందికి, 2022–23లో 40 వేల మందికి, 2023–24లో 41 వేల మందికి ఇస్తున్నాం. ప్రస్తుతం చర్మకారులు రూ. 2,750 పింఛన్ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో ఇది కూడా రూ.3 వేలు అవుతుంది. ఇప్పటి వరకు డప్పు కళాకారులకు రూ.600 కోట్లు, చర్మకారులకు రూ. 350 కోట్లు పింఛన్ కోసం ఇచ్చాం. అంటే.. టీడీపీ ఇచ్చిన దానికి మేం పదిరెట్లు ఎక్కువ ఇచ్చాం. దళితులకు రాజకీయ సాధికారత వైఎస్ జగన్‌తోనే సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మాదిగ సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, రాజకీయంగా సాధికారిత కల్పిస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ముగ్గుర్ని ఎస్పీ కమిషన్ మెంబర్లుగా నియమించారు. నాలుగు మున్సిపాలిటీలకు చైర్పర్సన్లుగా మాదిగలకు అవకాశవిుచ్చారు. గుంటూరు జడ్పీ చైర్పర్సన్ పదవి క్రిస్టినాకు ఇచ్చారు. డీసీఎంఎస్ చైర్పర్సన్లుగా మరో ఇద్దరు మాదిగలకు ఇచ్చారు. మరో ఇద్దరు జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్లు, డిప్యూటీ మేయర్లు ఇద్దరు, 46 మంది జెడ్పీటీసీలు, 55 మంది ఎంపీపీలు, 13 మంది మున్సిపల్ వైస్ చైర్మన్లు కూడా మాదిగ సామాజిక వర్గం వారే. హెచ్ఆర్సీ సభ్యునిగా అత్యున్నత స్థాయి పదవిలో గొట్టిపోతుల శ్రీనివాసరావును నియమించారు. మంత్రివర్గంలో నాతో పాటు తానేటి వనితను ఎంపిక చేశారు. ఇద్దరు ఎమ్మెల్సీలు మొండితోక అరుణ్‌కుమార్, బొమ్మి ఇజ్రాయేల్‌లను నియామకం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదటిసారిగా మాదిగ సామాజికవర్గానికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం ఇచ్చిన ఘనత జగన్‌గారిదే. అవకాశం ఉన్న ప్రతి చోటా దళితులకు ఇవ్వాలనే తపన వైఎస్ జగన్‌ది. దామాషాకు మించి.. దళితులకు వాటా 28 పైచిలుకు సంక్షేమ పథకాల ద్వారా రూ. 2 లక్షల కోట్లకు పైగా నేరుగా పేదల ఖాతాల్లో సీఎం వైఎస్ జగన్ జమ చేశారు. వీటిలో దళితుల వాటా పెద్దది. ఎస్సీల్లోని 37 ఉపకులాలు అన్నీ కలిసి మెలిసి అన్నదమ్ముల్లా ఉండాలని అనుకుంటుంటే చంద్రబాబుకి నచ్చడంలేదు. ఆయన మాటలను మాదిగలెవరూ నమ్మరు. ఈ పచ్చ తోడేళ్ల గుంపులో దళితులెవ్వరూ భాగస్వామ్యం కావద్దని మంత్రి సురేష్ చెప్పారు. చదవండి: డిగ్రీ చేస్తే జాక్‌పాట్.. ఐటీ కంపెనీల క్యూ.. -
సకల శక్తుల సాధన సబ్‌ప్లాన్
2013లో ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా.. సబ్‌ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై అసెంబ్లీలో మొదట గళం విప్పింది వైఎస్సార్ అనే వాస్తవాన్ని విస్మరించడానికి లేదు. 2001లో ప్రతిపక్ష నాయకులైన వైఎస్సార్ సబ్ ప్లాన్ గురించి ప్రస్తావించడం వల్లనే ఆ అంశం రాజకీయ ఎజెండాలోకి చేరి, చివరికి చట్టం రూపం దాల్చింది. ఇప్పుడీ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని; దాన్ని మరో ఇరవై ఎళ్ళు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆర్డినెన్స్ జారీకి చొరవ చూపడం ముదావహం. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ‘‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టా నికి 2023 జనవరి 23తో పదేళ్ళ కాలపరిమితి ముగియనున్నందున, ఆ చట్టం లక్ష్యాలు ఇంకా నెరవేరాల్సి ఉన్నందున, ఆ చట్టాన్ని మరో ఇరవై సంవత్సరాలు పొడిగిస్తున్నాం’’ అంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జనవరి 22న ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. శాసన సభ, శాసనమండలి సమావేశాలు ఆ సమయానికి జరగటం లేనందువల్ల ఈ ఆర్డినెన్స్ అవసరమైందని కూడా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. మరికొన్ని అవసరమైన మార్పులను సైతం ఇందులో పేర్కొన్నారు. వీటితో పాటు, చట్టం పేరును ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం’ అనడానికి బదులుగా ‘ఆంధ్ర ప్రదేశ్ ఎస్సీ కాంపోనెంట్, ఎస్టీ కాంపోనెంట్ చట్టం’గా మార్చారు. గతంలో ఉన్న విధంగా బడ్జెట్లో ప్లాన్, నాన్ ప్లాన్ లేనందువల్ల ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తున్న భాగాన్ని సబ్‌ప్లాన్‌కు బదులుగా కాంపోనెంట్గా పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కాలపరిమితి ముగిసే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని, దళిత సంఘాల, సంస్థల అభ్యర్థనలను కూడా పరి గణనలోనికి తీసుకొని చట్టం కాలపరిమితిని మరో ఇరవై సంవత్స రాలు పొడిగించాలని నిర్ణయించినందుకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి అభినందనీయులు. ఈ చట్టం పట్ల, అదే విధంగా రాజ్యాంగం పట్ల ఆయన తన గౌరవాన్ని ఆచరణాత్మకంగా వ్యక్తం చేయడం ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టం– 2013’ రూపొందడం వెనుక చారిత్రక నేపథ్యం, రాజ్యాంగ రక్షణ, ఉద్యమ సందర్భాలు ఉన్నాయి. ప్రభుత్వపరంగా ఎటువంటి నిర్ణయాలు జరగాలన్నా, ప్రగతిశీల చట్టాలు అమలులోకి రావాలన్నా ప్రజల కోర్కెలు, ఉద్యమాలతో పాటు, రాజకీయ పార్టీల, సంస్థల అంగీకారం, రాజ్యాంగపరమైన ఆమోదం తప్పనిసరి. అలాంటి అన్ని రకాల మద్దతులను కూడగట్టిన చట్టాలలో సబ్‌ప్లాన్ చట్టం ఒకటి. మొట్టమొదటి నుంచి ఇప్పటి వరకు సబ్‌ప్లాన్ ఉద్యమంతో, చట్టం రూపకల్పనతో పాటు, దాని అమలు విషయంలో భాVýæమున్న వారిలో నేనూ ఒకరిని. సబ్‌ప్లాన్ అమలు కోసం జరిగిన యత్నాలలో భాగంగా సబ్‌ప్లాన్ నిధుల దారి మళ్ళింపు, అమలులో లోపాలపై నేను రాసిన వార్తాకథనం 2001 మార్చి 29న ఒక దినపత్రికలో అచ్చయింది. అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఆ వార్తాకథనాన్ని ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అసెంబ్లీలో స్వయంగా పేపర్ని చూపించి మరీ ప్రభుత్వాన్ని నిలదీసిన సందర్భాన్ని చరిత్ర మరువదు. శాసనసభలో ఆనాడు వైఎస్ ప్రస్తావించడంతో అది రాజకీయ ఎజెండాలోకి చేరింది. సబ్‌ప్లాన్ అవసరం, దాని అమలు తీరుతెన్నులపై మొదట గళం విప్పింది వైఎస్ఆర్ అనే వాస్తవాన్ని ఎన్నటికీ విస్మరించడానికి లేదు. 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ‘సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్’ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ని కలిసి సమర్థంగా సబ్‌ప్లాన్ అమలుచేయాలని అభ్యర్థించాం. ఒకవైపు ప్రభుత్వంతో ఈ విషయమై సంప్రదిస్తూనే, రెండోవైపు సబ్‌ప్లాన్ విషయంలో చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలోనే 2007లో సీపీఎం నాయకత్వంలోని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో సబ్‌ప్లాన్ అమలు కోసం అప్పటి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి. రాఘవులు నేతృత్వంలో అక్టోబర్‌లో నిరాహార దీక్షలు జరిగాయి. ఆ సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్పందించి, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలు కోసం నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయడానికి అంగీకరించారు. ఆ తర్వాత నోడల్ ఏజెన్సీతో పాటు సబ్ ప్లాన్ చట్టం కోసం విశాలమైన ఉద్యమం జరిగింది. దాదాపు 150కి పైగా సంఘాలతో ఏర్పాటైన ఐక్యకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 2012 మార్చిలో 72 గంటల దీక్ష జరిగింది. ఇందులో కేవీపీఎస్, డీబీఎఫ్, సీడీఎస్, ఎస్సీ, ఎస్టీ ఆఫీసర్స్ ఫోరం, దళిత, ఆది వాసీ, సంఘాలతో పాటు సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్ ఆర్సీపీ, సీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ పార్టీలు తమ మద్దతును తెలియజేశాయి. వీటన్నింటితో పాటు, అధికార కాంగ్రెస్ పార్టీలోని ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఉద్యమానికి మద్దతు తెలిపారు. దీనితో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2012 డిసెంబర్ 2న చట్టం అసెంబ్లీ ఆమోదం పొందింది. గెజిట్‌లో జనవరి 23 నుంచి అమలులోకి వచ్చింది. ఈ ఉద్యమ ప్రస్థానంలో చాలామంది వ్యక్తులతో పాటు సంస్థలూ పాల్గొన్నాయి. ఆ వివరాలన్నీ ఇక్కడ ప్రస్తావించడం సాధ్యం కాదు. అయితే చట్టం ఏర్పడిన నేపథ్యం అర్థం కావడానికే ఈ ప్రాథమిక విషయాల ప్రస్తావన. సబ్‌ప్లాన్ అనే ఒక అంశం రూపొందడానికి చారిత్రక నేపథ్యం ఉంది. ఈరోజు షెడ్యూల్డ్ కులాలుగా పిలువబడుతున్న అంటరాని కులాల సామాజిక, విద్య అభివృద్ధి కోసం ప్రత్యేక పాఠశాలలు, పథకాలు ఉండాలని మొదట మాట్లాడిన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు ఫూలే. బ్రిటిష్ ప్రభుత్వం 1882లో ఏర్పాటు చేసిన హంటర్ కమిషన్‌కు ఆయన ఇచ్చిన విజ్ఞాపనలో అంటరాని కులాలైన మహర్, మాంగ్, మాతంగ్లకు ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయా లని కోరారు. భారతదేశంలో ఇది మొట్టమొదటి ఆలోచన. ఆ తర్వాత సాహూ మహారాజ్, శాయాజీరావు గైక్వాడ్‌లు రిజర్వేషన్లు మొదలు పెట్టారు. అనంతర కాలంలో భారతదేశ చిత్రపటం మీదకి వచ్చిన బాబాసాహెబ్ అంబేడ్కర్ 1927లో బొంబాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న సమయంలో కౌన్సిల్లో మాట్లాడుతూ, అణగారిన వర్గాలైన అంటరాని కులాల పిల్లల విద్యాభివృద్ధికి ప్రత్యేక హాస్టల్స్ నిర్మించాలని ప్రతిపాదించారు. నేటి మన రెసిడెన్షియల్ పాఠశాలల వ్యవస్థకు అదే పునాది. అలాగే 1932 సెప్టెంబర్ 24న గాంధీ–అంబేడ్కర్ల మధ్య కుదిరిన పూనా ఒడంబడికలోని 9వ అంశంలో అంటరాని కులాల విద్యార్థుల విద్య కోసం ప్రతి రాష్ట్రం, కేంద్రం కళాశాల నిధులను కేటాయించాలని ఉంది. ఇది ఒక రకంగా మొట్టమొదటి బడ్జెట్ ప్రస్తావన. 1944లో బాబాసాహెబ్ అంబేడ్కర్ బ్రిటిష్ ఇండియా ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు, విదేశీ విద్య ప్రోత్సాహం, ఉద్యోగాల రిజర్వే షన్లు సాధించారు. వీటన్నింటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని 1950 జనవరి 26వ తేదీన అమలులోకి వచ్చిన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 46ను చేర్చి ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల, తెగల అభివృద్ది కోసం సత్వరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అయితే ప్రప్రథమ ప్రధాని నెహ్రూ కాలంలో ఇటువైపు అడుగులు పడలేదు. 1970 తర్వాత అప్పటి ప్రధాని ఆనాటి రాజకీయ, ఉద్యమ ప్రభావాలతో 1974 ఎస్సీ సబ్‌ప్లాన్‌ను, 1980లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్‌ను ప్రారంభించారు. 2006లో ఎస్సీ కాంపోనెంట్ ప్లాన్‌ను ఎస్సీ సబ్ ప్లాన్‌గా మార్చారు. అయితే ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి. 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైఎస్.రాజశేఖర్ రెడ్డి లేవ నెత్తేంత వరకు దీని గురించిన అవగాహన ఎవ్వరికీ లేదనడంలో సందేహం అక్కర్లేదు. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చట్టం ఏర్పడిన తర్వాత కర్ణాటకలో, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో ఇటువంటి చట్టాలు అమలులోకి వచ్చాయి. పంజాబ్ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో.. ఈ ఏడాదితో కాల పరిమితి తీరిన ‘ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ చట్టాన్ని మరో ఇరవై ఏళ్లు పొడిగిస్తూ ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహర్రెడ్డి ఆర్డినెన్స్‌కు చొరవ చూపారు. దళితుల, ఆదివాసుల అభివృద్ధికి... ప్రత్యేకించి నివాస, మౌలిక సదుపాయాల, విద్యావకాశాల మెరుగు కోసం, ఆర్థికాభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలను చేపట్టడం ద్వారా వారు ప్రగతి సాధించడానికి ఈ చట్టం పొడిగింపు ఉపకరిస్తుంది. ఈ ఉన్నత లక్ష్యసాధనలో మరిన్ని ముందడుగులు పడాలని ఆశిద్దాం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్: 81063 22077 -
రామోజీ .. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?
తాడేపల్లి: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను ప్రభుత్వం పొడిగించడం శుభ పరిణామమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత జూపూడి ప్రభాకర్ స్పష్టం చేశారు. అదే సమయంలో సబ్ ప్లాన్‌పై ఈనాడు బొజ్జ రాక్షసుడు అసత్యాలు రాస్తున్నాడని రామోజీరావును ఉద్దేశించి తీవ్రంగా మండిపడ్డారు జూపూడి. సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు రామోజీకి లేదని, చంద్రబాబు హయాంలో దళితులకు ఏం చేశారో రామోజీ చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు హయాంలో సబ్ ప్లాన్ నిధులను కూడా ఖర్చు చేయలేదుని, చంద్రబాబు అరాచకాలను రామోజీ ఎందుకు ప్రశ్నించలేదని జూపూడి నిలదీశారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై రామోజీ చర్చకు సిద్ధమా అని జూపూడి చాలెంజ్ చేశారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌పై కేంద్ర గణాంకాల్లో ఏపీకి తొలిస్థానం దక్కిందనే విషయం గ్రహాంచాలని యెల్లో మీడియాకు చురకలంటించారు. -
ప్రతి జిల్లాకు 4 స్టడీ సర్కిళ్లు.. కేసీఆర్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం ఒక్కో వర్గానికి ఒకటి చొప్పున 33 జిల్లాల్లో జిల్లాకు 4 చొప్పున మొత్తం 132 స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, గ్రూప్–1 వంటి కేంద్ర, రాష్ట్ర సర్వీసుల ఉద్యోగార్థులకు శిక్షణనిచ్చేందుకు ‘ఆల్ ఇండియా సర్వీసెస్ స్టడీ సర్కిల్ ఆఫ్ తెలంగాణ స్టేట్’ను అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని కోరారు. నాలుగు వర్గాలకు నాలుగు ఆల్ ఇండియా స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో బడుగు, బలహీనవర్గాలకు విద్యా, ఉపాధి సంబంధిత అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయా వర్గాల విద్యార్థినీ విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యనందించడం, పోటీ పరీక్షలకు శిక్షణనివ్వడం, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం, గురుకుల పాఠశాలలను జూనియర్ కళాశాలలుగా ఉన్నతీకరించడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అందుబాటులో జాతీయ స్థాయి నోటిఫికేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు కేవలం పోటీ పరీక్షల శిక్షణా కేంద్రాలుగానే కాకుండా, యువతకు ఉద్యోగం, ఉపాధిని అందించే భరోసా కేంద్రాలుగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో విడుదలయ్యే ఉద్యోగాల నోటిఫికేషన్లను స్టడీ సర్కిళ్లలో అందుబాటులో ఉంచాలని, అందుకు అనుగుణంగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. చదువుకు తగ్గ ఉద్యోగ, ఉపాధి సమాచారాన్ని, మార్గదర్శకత్వాన్ని అందించే కేంద్రాలుగా స్టడీ సర్కిళ్లను తీర్చిదిద్దాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ఉద్యోగాల కోసమే కాకుండా ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లో కూడా ఉద్యోగ శిక్షణను అందించాలన్నారు. అద్భుతమైన భూమికను పోషించాలి ‘స్టడీ సర్కిళ్లు క్యాంపస్ రిక్రూట్మెంట్ కేంద్రాలుగా మారాలి. ఎంప్లాయ్మెంట్ అవెన్యూలుగా వాటిని తీర్చిదిద్దాలి. కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా అందివచ్చే ఉద్యోగాలను అందిపుచ్చుకునే విధంగా యువతను తీర్చిదిద్దాలి. ఒక ప్రతిభావంతమైన స్టడీ సర్కిల్ ఎలా ఉండాలో విధివిధానాలను అధికారులు రూపొందించాలి. ఇందుకు సమర్ధవంతులైన అధికారులను నియమించాలి. ఐటీఐ, పాలిటెక్నిక్, ఫార్మా, కెమికల్, ఇండస్ట్రీ, డిఫెన్స్, రైల్వే, బ్యాంకింగ్, నర్సింగ్, అగ్రికల్చర్ తదితర కోర్సులను పూర్తి చేసుకున్న తెలంగాణ యువతీ యువకులకు దేశవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధిని కల్పించే అద్భుతమైన భూమికను స్టడీ సర్కిళ్లు పోషించాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు అనే కోణంలోనే కాకుండా ప్రైవేట్ రంగాలలో కూడా ఉపాధిని అందించగలిగే కేంద్రాలుగా మారాలి. శిక్షణ పొందుతున్న అర్హులైన అభ్యర్థులకు స్టడీ సర్కిళ్లలో భోజన వసతులు ఏర్పాటు చేయాలి. ప్రతి స్టడీ సర్కిల్లో కంప్యూటర్లు, అత్యాధునిక సాంకేతిక మౌలిక వసతులను కల్పించాలి. ఆయా జిల్లాల్లో ఆయా వర్గాల జనాభా నిష్పత్తిని అనుసరించి ప్రవేశాలు కల్పించే దిశగా విధివిధానాలు రూపొందించాలి. విద్యార్థులకు కల్పించినట్టుగానే విద్యార్థినులకు కూడా ప్రత్యేక వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలి’ అని సీఎం ఆదేశించారు. అన్ని గురుకులాల్లో ఇంటర్మీడియెట్ పదో తరగతి వరకు విద్యనందిస్తున్న రాష్ట్రంలోని అన్ని గురుకుల పాఠశాలలతో పాటు కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో సైతం ఇంటర్మీడియెట్ విద్యను, కోర్సులను ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ప్రవేశపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక విద్యనుంచి ఉన్నతవిద్య వరకు పునాది వేస్తున్నట్టే, విద్యార్థి దశలో కీలకమైన మలుపుగా భావించే ఇంటర్మీడియెట్ విద్య వరకు కూడా ప్రభుత్వమే పునాది వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు ప్రత్యేక శ్రద్ధ కనబరిచే ఉన్నతాధికారిని నియమించాలని ఆదేశించారు. ప్రతి సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులవుతున్న విద్యార్థులు ఎంతమంది? పదో తరగతి అనంతరం వారు ఎంచుకుంటున్న మార్గాలు తదితర అంశాలపై సమగ్ర నివేదికను అందించాలని కోరారు. గురుకులాల్లో ఆధునిక కోర్సులు రాష్ట్రంలో ప్రస్తుతమున్న గురుకుల డిగ్రీ కళాశాలలకు అదనంగా మరో 15 మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలను ఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. రాబోయే విద్యా సంవత్సరంలో వీటిని 17కు పెంచి మిగతా అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయాలని, మొత్తంగా జిల్లాకో డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాల చొప్పున 33 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో బీసీ వర్గాల జనాభా అధికంగా ఉందని, వారి జనాభా దామాషా ప్రకారం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను పెంచాలన్నారు. సాంప్రదాయ కోర్సులను కాకుండా నేటి పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగావకాశాలను కల్పించే ఆధునిక డిగ్రీ కోర్సులను రూపొందించాలని సూచించారు. అలాగే ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున 33 జిల్లాల్లో మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాలను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. -
నవరత్నాలతో ప్రతీ ఎస్సీ కుటుంబానికి లబ్ధి.. అసెంబ్లీలో మంత్రి విశ్వరూప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతీ ఎస్సీ కుటుంబానికి నవ రత్నాల ద్వారా లబ్ధి చేకూరుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమంపై స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి అద్భుతమైన పథకం. ఏడాదికి రూ.15వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని మంత్రి తెలిపారు. చదవండి: తమాషా చేస్తున్నావా?.. డ్యూటీ అంటే లెక్కలేదా? వైఎస్సార్ చేయూత ద్వారా ఐదేళ్లలో రూ.75 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం. 5 లక్షల మంది లబ్ధిదారులకు వైఎస్సార్ చేయూతతో లబ్ధి చేకూరుతుంది. ఎస్సీ,ఎస్టీ అత్యాచారాల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశాం. ప్రస్తుతం రాష్ట్రంలో 1070 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. విద్యార్థుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. దాదాపు లక్ష మంది ఎస్సీ విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించామని మంత్రి తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత ‘వెలుగు’
సాక్షి, విజయనగరం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేవే. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిర్వహించిన సుదీర్ఘ పాదయాత్రలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల మేరకు అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ చేయూత, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, వైఎస్సార్ ఆరోగ్య ఆసరా లాంటి అనేక ప్రజారంజక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ కుటుబాలకు ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వారి ఇళ్లలో విద్యుత్ వెలుగులు నింపింది. లబ్దిదారుల కళ్లలో ఆనందం జిల్లాలో 90 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు నిరుపేదలే. నెలకు రూ.200 లోపు విద్యుత్ వినియోగించే ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆయా కుటుంబాలు ఎంతగానో ఆనందిస్తున్నాయి. గతంలో ఆయా కుటుంబాల్లో చాలామందికి విద్యుత్ సౌకర్యం ఉండేదికాదు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేకపోవడంతో విద్యుత్ కనెక్షన్ పెట్టుకునేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తుండడంతో ఆ సౌకర్యాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090 జిల్లాలో ఎస్సీ, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 85,090 ఉన్నాయి. వాటిలో ఎస్సీ విద్యుత్ కనెక్షన్లు 48,635, ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు 36,455 ఉన్నాయి. ఏప్రిల్ నెల నుంచి జూలై నెల వరకు ఎస్సీ, ఎస్టీల ఉచిత విద్యుత్‌కు సంబంధించి విద్యుత్‌శాఖకు ప్రభుత్వం రూ.6.11 కోట్లు సబ్సిడీ కింద చెల్లించింది. చదవండి :మహిళల జీవితాల్లో ‘వైఎస్సార్ చేయూత’ వెలుగులు -
‘ఆత్మగౌరవంతో బతకాలనుకున్న వాళ్లు మద్దతు తెలపండి’
సాక్షి, హైదరాబాద్: దళిత బంధు పథకాన్ని రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభా పక్షనేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక జరుగనున్న హుజురాబాద్‌కు మాత్రమే ఈ పథకాన్ని పరిమితం చేయకుండా, రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన వారందరికీ వర్తింపజేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన దళిత గిరిజన ఆత్మగౌరవ సభలన్నీ విజయవంతం అవుతున్నాయన్న ఆయన... ఆత్మగౌరవంతో బతకాలనుకునే ప్రతీ ఒక్కరు తమకు మద్దతు తెలపాలని కోరారు. ‘‘స్వపరిపాలన- ఆత్మగౌవరంతో బతకాలని, వనరులు అందరికీ అందాలని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. ఏ లక్ష్యాల కోసం రాష్ట్రం ఏర్పాటు చేశారో అవి నెరవేరడం లేదు. తెలంగాణలో అత్యంత వెనకబడిన వర్గాలను తలెత్తుకునేలా చేయాలి. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను ఏడేళ్లుగా కేసీఆర్ సర్కారు ఖర్చు పెట్టడం లేదు. నిధులు ఖర్చు కాకపోతే.. క్యారీపార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. కానీ, అది కూడా జరగడం లేదు. దళిత, గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని నిలదీయడానికి కాంగ్రెస్ నాంది పలికింది’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. చదవండి: కష్టపడండి... ఇంటికొచ్చి బీఫారం ఇస్తా -
ఎస్సీ, ఎస్టీలకు ఎలక్ట్రిక్ వాహనాలు
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన యువతను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘టి ప్రైడ్’పథకం కింద ఎలక్ట్రిక్ కార్లను సబ్సిడీ ధరలపై ఇవ్వాలని నిర్ణయించింది. ఈ పథకం కింద తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 500 మంది ఎస్సీ, ఎస్టీ యువతకు ఈ వాహనాలను అందజేసి, ఆ తర్వాత విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ యువతకు ఎలక్ట్రిక్ కార్లపై సబ్సిడీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఇటీవల రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)ను ప్రభుత్వం ఆదేశించింది. టీఎస్ ప్రైడ్ మార్గదర్శకాల ప్రకారం.. పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు చేపట్టే ఎస్సీ, ఎస్టీ యువతకు 35 శాతం సబ్సిడీని అందజేస్తారు. అయితే కార్లపై 60 శాతం వరకు సబ్సిడీ ఇచ్చేలా టీఎస్ రెడ్కో మార్గదర్శకాలు సిద్ధం చేస్తోంది. ‘ఎలక్ట్రిక్ వాహన పాలసీ’లో భాగంగా రాష్ట్రంలో కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు వంద శాతం రిజిస్ట్రేషన్ చార్జీలు, రోడ్డు టాక్స్‌ల నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ అవసరాలకు ఎలక్ట్రిక్ వాహనాలు.. ప్రస్తుతం సర్కార్ యంత్రాంగం వాడుతున్న పెట్రోలు, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను దశల వారీగా ప్రవేశ పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇంధన పొదుపు, పునరుద్ధరణీయ ఇంధన వనరుల ప్రాజెక్టులను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ బాధ్యతను టీఎస్ రెడ్కోకు అప్పగించింది. ఈ మేరకు ముంబైకి చెందిన మెజెంటా అనే ఈవీ సొల్యూషన్స్ సంస్థతో టీఎస్ రెడ్కో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశ పెట్టడంతో పాటు చార్జింగ్, ఇతర వసతులను కూడా మెజంటా కల్పించనుంది. తద్వారా రవాణాపై వెచ్చిస్తున్న మొత్తం గణనీయంగా తగ్గుతుందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. 600 ఈవీ చార్జింగ్ స్టేషన్లు... తెలంగాణ ఎలక్ట్రిక్ వాహన పాలసీలో భాగంగా పెరగనున్న వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని వచ్చే మూడేళ్లలో 600 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ఏటా 200 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు టీఎస్ రెడ్కోను నోడల్ ఏజెన్సీగా నియమించింది. చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అనువైన స్థలాలు గుర్తించాల్సిందిగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, విద్యుత్ పంపిణీ సంస్థలు, ఆర్టీసీ, రైల్వే, ఎయిర్‌పోర్టు అథారిటీకి టీఎస్ రెడ్కో గత నెలలో లేఖలు రాసింది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో 70 ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఫేమ్) పథకం రెండో దశ కింద కేంద్ర పరిశ్రమల శాఖ రాష్ట్రంలో మరో 138 ఈవీ పబ్లిక్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును ప్రతిపాదించింది. వీటిలో 118 హైదారాబాద్‌లో, కరీంనగర్, వరంగల్ పట్టణాల్లో పదేసి చొప్పున ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా, రాష్ట్రంలో 2016లో 25 ఎలక్ట్రిక్ వాహనాలు ఉండగా, ప్రస్తుతం 10 వేలకు చేరాయి. -
ఇక నుంచి వారు పారిశ్రామికులు
-
ఇది దేవుడిచ్చిన వరం
దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇది నా అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నా. స్టాంప్ డ్యూటీ రద్దు.. విద్యుత్ చార్జీల్లో, రుణాలపై వడ్డీలో, భూ కేటాయింపుల్లో, స్టేట్ జీఎస్టీలో రాయితీ ఇస్తున్నాం. క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంటింగ్ రిజిస్ట్రేషన్ రాయితీ వంటి అనేక ప్రోత్సాహకాలు ఈ కొత్త విధానంలో తీసుకొచ్చాం. వీటన్నింటి వల్ల ఎస్సీ, ఎస్టీలు ఎవ్వరికీ తీసిపోని విధంగా పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతారు. –సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోవాలని, ఎవ్వరికీ తీసిపోని విధంగా పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షించారు. ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తి ప్రోత్సాహం ఇచ్చేందుకు 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం రూపొందించామని చెప్పారు. ఇందులో భాగంగా సోమవారం ఆయన ‘జగనన్న–వైఎస్సార్ బడుగు వికాసం’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలు ఎవరైనా పరిశ్రమ పెట్టాలనుకుంటే.. ఏం చేయాలి? ఎవరిని కలవాలి? వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎప్పుడూ, ఎక్కడా జరగని విధంగా కోటి రూపాయల వరకు ప్రోత్సాహక మొత్తం (ఇన్సెంటివ్) ఇస్తున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా తయారు చేసేందుకు కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకు వస్తున్నామన్నారు. ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ సెల్స్ (సదుపాయాల కల్పన) కూడా ఏర్పాటు చేశామని, వారిలో నైపుణ్యం పెంచేలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు రూపొందించామని వివరించారు. ఏపీఐఐసీ భూ కేటాయింపుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు కచ్చితంగా ఇవ్వాలని నిర్ణయించామని, ఇది ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు ఊతం ఇస్తుందన్నారు. ఈ చొరవ వల్ల ఎస్సీ, ఎస్టీల నుంచి కొత్త పారిశ్రామిక వేత్తలు తయారు కావాలని పిలుపునిచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. నవరత్నాలతో ఆదుకుంటున్నాం – పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలతో పాటు, అగ్రవర్ణాల్లోని పేదలందరికీ మంచి జరగాలని, వారి కాళ్ల మీద వారు నిలబడాలని, వారి జీవితాలు సంపూర్ణంగా మార్చాలన్న ఉద్దేశంతో అడుగులు వేశాం. – పేదలకు అమ్మ ఒడి పథకం తీసుకున్నా, రైతు భరోసా, ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు.. ఇలా ఏ పథకం తీసుకున్నా పేదలకు పెద్దపీట వేస్తున్నాం. 30 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు అక్క చెల్లెమ్మల పేరు మీదే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తున్నాం. – గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో దాదాపు 82 శాతం ఉద్యోగాలు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలకు దక్కాయి. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుల కోసం ఏ ఒక్కరూ అప్పులపాలు కాకుండా చూస్తున్నాం. వారి కాళ్ల మీద వారు నిలబడాలని.. – నాకు ఓటు వేయకపోయినా పర్వాలేదు.. అర్హులైతే చాలు, వారికి మంచి జరగాలనే ఉద్దేశంతో గ్రామ, వార్డు, వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశాం. – చేయూత, ఆసరా తదితర పథకాల ద్వారా పేదలు పారిశ్రామికంగా వారి కాళ్ల మీద వారు నిలబడాలనే దిశలో ఊతమిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నాం. మార్కెటింగ్‌లో ఇబ్బందులు పడకూడదని అమూల్, పీ అండ్‌జీ, రిలయన్స్, హిందుస్తాన్ లీవర్, ఐటీసీ వంటి పెద్ద పెద్ద సంస్థలను తీసుకు వచ్చాం. – నేటి విద్యార్థులు భావితరంతో పోటీ పడే విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశ పెడుతున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే ‘నాడు–నేడు’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని పలు కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ మంచి జరగాలని, మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. – ఈ కార్యక్రమంలో మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, పి.విశ్వరూప్, బాలినేని శ్రీనివాసరెడ్డి, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్కె రోజా, ఎంపీలు నందిగం సురేష్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేరుగు నాగార్జున, టీజేఆర్ సుధాకర్‌బాబు, కొండేటి చిట్టిబాబు, తలారి వెంకట్రావు, జొన్నలగడ్డ పద్మావతి, అలజంగి జోగారావు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవెన్, ఆ శాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం, పలువురు సీనియర్ అధికారులు, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం 2020–23 లో కీలక అంశాలు – 2020లో రీస్టార్ట్ ఒన్ కింద ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ.278 కోట్లను ఇన్సెంటివ్ రూపంలో ప్రభుత్వం చెల్లించింది. గతంలో ఏటా సగటున ఎస్సీలకు రూ.53 కోట్లు, ఎస్టీలకు రూ.15 కోట్లు మాత్రమే ఇచ్చేవారు. – ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కుల్లో 16.2 శాతం ఎస్సీలకు, 6 శాతం ఎస్టీలకు భూములు కేటాయిస్తారు. 25 శాతం చెల్లిస్తే భూములను అప్పగిస్తారు. మిగిలిన 75 శాతాన్ని 8 శాతం నామమాత్రపు వడ్డీతో 8 ఏళ్లలో చెల్లించవచ్చు. – 100 శాతం స్టాంపు డ్యూటీని, ట్రాన్స్ఫర్ డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. భూముల లీజు, షెడ్డు, భవనాలు, తనఖా తదితరాలపై 100 శాతం స్టాంపు డ్యూటీని రీయింబర్స్ చేస్తారు. – ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఇండస్ట్రియల్ పార్కుల్లో ఎంఎస్ఈల కోసం భూములను 50 శాతం రిబేటుపై (రూ.20 లక్షల వరకు) ఇస్తారు. – ల్యాండ్ కన్వెర్షన్ చార్జీల్లో 25 శాతం వరకు, గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఎంఎస్ఈలకు రిబేటు ఇస్తారు. – ఉత్పత్తి ప్రారంభమైన నాటి నుంచి తదుపరి 5 ఏళ్ల వరకు వాడుకున్న కరెంట్‌లో యూనిట్‌కు రూ.1.50 రీయింబర్స్ చేస్తారు. – ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 45 శాతం వరకు, గరిష్టంగా కోటి రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ లభిస్తుంది. – సర్వీసులు, రవాణా రంగాల్లో క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్లో 45 శాతం వరకు, గరిష్టంగా రూ.75 లక్షల వరకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ లభిస్తుంది. – ఉత్పత్తి ప్రారంభించిన ఎంఎస్ఈలకు ఐదేళ్లపాటు 3 శాతం నుంచి 9 శాతం వరకు వడ్డీ రాయితీ లభిస్తుంది. నెట్ ఎస్జీఎస్టీలో 100 శాతం రీయింబర్స్ లభిస్తుంది. మధ్యతరహా పరిశ్రమలకు 75 శాతం, భారీ పరిశ్రమలకు 50 శాతం రీయింబర్స్మెంట్ అందుతుంది. – క్వాలిటీ సర్టిఫికేషన్, పేటెంట్ రిజిస్ట్రేషన్లకు అయ్యే ఖర్చులో ఎంఎస్ఈలకు రూ.3 లక్షల వరకు ప్రభుత్వం భరిస్తుంది. కొత్తగా మైక్రో యూనిట్లు ఏర్పాటు చేయదలచుకునే వారికి సీడ్ కేపిటల్ అసిస్టెన్స్ కింద మెషినరీ ఖర్చులో 25 శాతం అందుతుంది. -
‘ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము చేయరు’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పారిశ్రామిక విధానం ప్రారంభించడం ఆనందదాయకమని వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. ఈ అవకాశాన్ని దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సీఎం కావడం దళితుల అదృష్టమని అన్నారు. ఆయన లాంటి ముఖ్యమంత్రిని ఈ దేశంలో ఎక్కడా చూడలేదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశించిన మార్పును సీఎం జగన్ ఆచరిస్తున్నారని ప్రశంసించారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా ఉండకూడదని, పెద్ద పారిశ్రామిక వేత్తలగా చూడాలని సీఎం అనడం తమకు చాలా గర్వంగా ఉందన్నారు. చదవండి: రైతులకు శుభవార్త: రూ. 113.11 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ‘ఎస్సీ, ఎస్టీల ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం జగనన్న వైఎస్సార్ బడుగు వికాసానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోకూడదనే ఈ నిర్ణయం. ఎస్సీ, ఎస్టీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ఈ రోజు మేము ధైర్యంగా ప్రరిశ్రమల స్థాపనలో ముందుకువెళతాము. స్కిల్ డెవలప్మెంట్తో ఎన్నో సౌకర్యాలు దీనిలో ఉన్నాయి. మొత్తం రాయతీలతో, ఇండస్ట్రీయల్ పార్క్‌లో మాకు ప్రత్యేక కేటాయింపులు చేయడం శుభపరిణామం. అందుకే మేమంతా ముఖ్యమంత్రిని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాజకీయ వ్యవస్థలో జగన్ ఆలోచన ఓ కలికితురాయి. రాజకీయాల్లో దళితులను దూరంగా పెట్టిన వారు ఇప్పుడు మళ్లీ వారిని మోసం చేసేందుకు వస్తున్నారు. సాయం చేయడం చేతకాని వారు సంక్షేమ పథకాలు దళితులకు అందకుండా చేయాలని కుట్ర చేస్తున్నారు.’ అని మ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. చదవండి: ఏపీ: మద్యం ప్రియులకు మరో షాక్ పండుగ రోజు సీఎం వైఎస్ జగన్ దళితులకు నిజంగా ఓ వరం ఇచ్చారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. అందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపపారు. అదే విధంగా ‘ఇదొక శుభపరిణామం. ఈ పాలసీని చూస్తే దళితులకు ఎంతో మేలు జరుగుతుంది. గతంలో ఎస్సీ, ఎస్టీల ఇంసెంటివ్‌లు బకాయిలు పెట్టిన ఘనత చంద్రబాబుది. ఆ 1100 కోట్ల బకాయిలను చెల్లించిన ఘనత జగన్‌ది. జగన్ వల్ల మా బతుకులు మారతాయని భావించిన వారి నమ్మకం నిజమైంది. ఏ ఒక్కరి నమ్మకాన్ని సీఎం జగన్ వమ్ము కానివ్వరు.’ అని పార్వతీపురం ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. -
జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసానికి సీఎం జగన్ శ్రీకారం
-
ఇది నా అదృష్టం.. దేవుడిచ్చిన వరం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోయే కాలం పోయిందని, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగే సమయం ఆసన్నమైందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. వారిని ప్రోత్సహించేవిధంగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా ఎస్సీలకు 16.2 శాతం, ఎస్టీలకు 6శాతం మేర ఇండస్ట్రియల్ పార్కుల్లో భూములు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. పరిశ్రమ పెట్టాలనుకున్న వారు.. ఎలా ముందుకు వెళ్లాలి? ఎవరిని కలవాలి? అన్న అంశాలపై అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ‘‘జగనన్న వైఎస్సార్ బడుగు వికాసం’’ పేరిట రూపొందించిన సరికొత్త కార్యక్రమాన్ని సీఎం జగన్, తన క్యాంపు కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. (చదవండి: పోలవరానికి నిధులు రాబట్టండి) ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ప్రారంభించామని హర్షం వ్యక్తం చేశారు. ఇది తన అదృష్టంగా, దేవుడిచ్చిన వరంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో ఎప్పుడూ , ఎక్కడా జరగని విధంగా రూ. 1 కోటి రూపాయిల ఇన్సెంటివ్‌లు ఇస్తున్నాం. వారిలో నైపుణ్యాలను పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్, ఫెసిలిటేషన్‌కార్యక్రమాలను చేపడుతున్నాం. స్టాంపు డ్యూటీ, వడ్డీ రాయితీ, ఎస్జీఎస్టీల్లో రాయితీలు, క్వాలిటీ సర్టిఫికేషన్.. పేటెంట్ రుసుముల్లో రాయితీలు... ఇలా ఎన్నెన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభిస్తున్నాయి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలు, అలాగే అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా మంచి జరగాలి. వారి కాళ్లమీద వారు నిలబడాలనే ఉద్దేశంతో వారి జీవితాలను మార్చాలనే నవరత్నాలు సహా అనేక కార్యక్రమాలు చేపట్టాం. సచివాలయాల్లో కూడా 82శాతం ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దక్కాయి. పూర్తి ఫీజు రియింబర్స్ మెంట్ అమలుచేస్తున్నాం. అవినీతి లేకుండా, పక్షపాతం లేకుండా, కుల,మత, వర్గ, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికీ పథకాలు అందించేందుకు గ్రామ, వార్డు, వాలంటీర్ల వ్యవస్థను చేపట్టాం. ఆసరా, చేయూత లాంటి పథకాలను ప్రవేశపెట్టాం. (చదవండి: బీసీ కార్పొరేషన్లతో సామాజిక విప్లవం) అదే విధంగా మార్కెటింగ్‌లో ఇబ్బందులు పడకూడదని అమూల్‌ను, పీ అండ్‌జీని, రిలయన్స్‌లాంటి సంస్థలను తీసుకువచ్చాం. అంతేగాక చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రతి ప్రభుత్వ పాఠశాల రూపు రేఖలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో పేదల స్థితిగతులను పూర్తిగా మార్చాలని ఈ కార్యక్రమాలు చేపట్టాం. అందరికీ మంచి జరగాలని, అలాగే మరింత మంచి చేసే అవకాశాన్ని దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి భారీగా నిధులు
-
పక్కదారి పట్టిన సంక్షేమం
‘చట్టం ఎంత గొప్పదైనా అమలు చేసేవాడు చెడ్డవాడయితే చెడ్డ ఫలితాలు వస్తాయి. చట్టం ఎంత చెడ్డదయినా అమలు చేసేవాడు మంచివాడయితే మంచి ఫలితాలు వస్తాయి’ అని బాబాసాహెబ్ అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారు. దీనిలో మొదటి వాక్యానికి సరిపోయేలా చంద్రబాబు ఐదేళ్లపాటు ఈ రాష్ట్రాన్ని పాలించాడని ప్రజలు అంటున్నారు. దళిత గిరిజన సంక్షేమంను కనీసం పట్టించుకోకపోవడం వల్ల వారి అభివృద్ధి నిలిచిపోయింది. సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను దళిత, గిరిజనుల అభివృద్ధికి ఖర్చు చేయకుండా ఇతర పనులకు పాలకులు పక్కదారి పట్టించారన్న విమర్శలు ఆ వర్గాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. అంతే కాకుండా శాఖలవారీగా నిధులు వినియోగం గురించి సమాచారం కూడా అందుబాటులో లేకుండా ప్రభుత్వం చేసిందని ఆరోపణలున్నాయి. ఎస్సీ, ఎస్టీ కాలనీల పర్యవేక్షణ కోసం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టాలని ఆదేశాలున్నా వాటిని ఖర్చు పెట్టకుండా ఖర్చు చేశామని లెక్కలు చెప్పిన దుస్థితి ఉందని విమర్శిస్తున్నారు. సబ్‌ప్లాన్ ఉద్దేశ్యమిదీ... అందరికీ సమాన అభివృద్ధి జరగాలనే ఉద్దేశ్యంతో 1974–75 సంవత్సరంలో పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఎస్టీల కోసం గిరిజన ఉప ప్రణాళికను ఏర్పాటు చేశారు. 1979–80లో ఆరో పంచవర్ష ప్రణాళికలో ఎస్సీల కోసం స్పెషల్ కంపోనెంట్ ప్లాన్ ఏర్పాటు చేశారు. జనాభా ప్రాతిపదికన 16.2 శాతం ఉన్న ఎస్సీలు, 8.2 శాతం ఉన్న ఎస్టీలు మొత్తంగా కలసి బడ్జెట్లో కూడా 24.4 శాతం బడ్జెట్ కేటాయించాలని నిర్ణయించారు. నిధులు దారి మళ్లకుండా 2013 జనవరి 24వ తేదీన షెడ్యూల్డ్ కాస్టు సబ్‌ప్లాన్ అండ్ ట్రైబల్ సబ్‌ప్లాన్ ప్లానింగ్ ఆలోకేషన్, అండ్ యుటిలైజేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ యాక్టును ప్రవేశపెట్టారు. ఈ నిధులు పక్కదారి పట్టకుండా ఖర్చు చేయాలని, నిధులు ఖర్చు కాకపోతే తరువాత ఆర్థిక సంవత్సరానికి వాడుకునే సౌలభ్యాన్ని తీసుకువచ్చారు. శాసన సభ సాక్షిగా చేసిన ఈ చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం తూట్లు పొడిచింది. నిధులన్నీ పక్కదారే... ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం దళిత గిరిజనులను చిన్నచూపు చూసింది. సబ్‌ప్లాన్ నిధులను సంబంధం లేని పథకాలకు కేటాయించారు. రాజధాని నిర్మాణం కోసం, స్టేడియంల నిర్మాణాలు అంటూ ఆయా శాఖలకు మళ్లించారు. ఇక ప్రకృతి విపత్తులకు కూడా ఈ నిధులను కేటాయించారు. ఈ నిధులతో ప్యాసింజరు ఆటోలు ఇవ్వాల్సి ఉన్నా చెత్త తొలగించే ఆటోలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. భూములకు సంబంధించిన కొనుగోలు–పంపిణీ జరగలేదు. ప్రభుత్వం చేశామని చెప్తున్నా వాటికి సంబం«ధించిన వివరాల సమాచారం మాత్రం లేని పరిస్థితి. ఇక కృష్ణా, గోదావరి పుష్కరాలకు కూడా ఇవే నిధులు వాడారని, ప్రస్తుతం పసుపు–కుంకుమ పథకానికి కూడా ఈ నిధులనే ఉపయోగిస్తున్న పరిస్థితులు ఈ ప్రభుత్వంలో నెలకొన్నాయి. ప్రభుత్వంపై మండి పడుతున్న దళిత, గిరిజనులు తమకు కేటాయించిన నిధులను తమకు ఖర్చు చేయకుండా.. పక్కదారి పట్టించడం పట్ల దళిత గిరిజనులు మండిపడుతున్నారు. కనీసం 30 శాతం నిధులు కూడా ఖర్చు పెట్టని పరిస్థితి ఈ ఐదేళ్ల కాలంలో జరిగిందన్నారు. దళిత గిరిజన సంక్షేమం అంటే చంద్రబాబుకి చిన్నచూపు అని అందుకే తమ నిధులు తమకు ఇవ్వకుండా అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శిస్తున్నారు. దళిత గిరిజన సంక్షేమం అనేది లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఐదేళ్ల కాలంలో దళిత గిరిజనులు దగ్గాపడ్డారని వాపోతున్నారు. ► ఎస్టీలకు సంబంధించి జనాభా 27,40,133 ఉన్నారు. కేటాయింపులు ఇలా... సంవత్సరం నిధుల కేటాయింపులు 2014–15 1500.26 కోట్లు 2015–16 1904.48కోట్లు 2016–17 3099.96 కోట్లు 2017–18 3528.75 కోట్లు 2018–19 4176.60 కోట్లు మొత్తం 14,210.05 కోట్లు ఎస్సీలకు సంబంధించిన వివరాలు ఇవీ... ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 13 జిల్లాలు, 676 మండలాలున్నాయి. ఇందులో 84,45,399 మంది ఎస్సీలు ఉన్నారు. వీరికి సంబంధించి నిధులు కేటాయింపు ఇలా జరిగింది. సంవత్సరం నిధుల కేటాయింపులు 2014–15 4574.47 కోట్లు 2015–16 5880.62 కోట్లు 2016–17 8724.25 కోట్లు 2017–18 9847.13 కోట్లు 2018–19 11,228.10 కోట్లు మొత్తం 40,254.57 కోట్లు నిధుల పక్కదారి ఇలా సంవత్సరం ఎస్సీ, ఎస్టీ ప్లాన్ నిధులు ఖర్చుపెట్టిన నిధులు శాతం పక్కదారి 2014–15 రూ. 6074 కోట్లు రూ. 1518 కోట్లు సుమారు 25 శాతం రూ. 4556 కోట్లు 2015 – 16 రూ. 7784 కోట్లు రూ. 1556 కోట్లు 20 శాతం రూ. 6228 కోట్లు 2016–17 రూ.11823 కోట్లు రూ. 2354 కోట్లు 20 శాతం రూ. 9429 కోట్లు 2017–18 రూ. 13375 కోట్లు రూ. 3343 కోట్లు 25 శాతం రూ. 10032 కోట్లు 2017–19 రూ. 15404 కోట్లు రూ. 3080 కోట్లు 20 శాతం రూ. 12324 కోట్లు దళిత సంక్షేమంపై చిన్నచూపు ఈ ప్రభుత్వం దళిత సంక్షేమంపై చిన్న చూపు చూసింది. నిధులను పక్కదారి పట్టించింది. కనీసం 25 నుంచి 30 శాతం నిధులను మాత్రమే వినియోగించడం భాదాకరం. ఈ ప్రభుత్వం పైచర్యలు తీసుకోవాలి. - రామస్వామి, రీసెర్చ్ స్కాలర్ చట్టబద్ధత చేసినా పక్కదారి నిధుల వినియోగంపై చట్టబద్ధత కల్పించినా ప్రభుత్వాలు నిధులు పక్కదారి పట్టించడం దారుణం. ఈ ప్రభుత్వ హయాంలో గిరిజన దళిత సంక్షేమం మరుగున పడింది. - శ్రీమన్నారాయణ, న్యాయశాఖ స్కాలర్ -
వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్ను..
సాక్షి, జగ్గంపేట/గోకవరం/కిర్లంపూడి/గండేపల్లి: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒరిగిందేమీ లేదు. ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 27న రాజమహేంద్రవరంలో జయహో బీసీ సదస్సు నిర్వహించి ఓట్ల కోసం బీసీల్లోని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తాయితాలు ప్రకటించారు. అయితే వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీలపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో వివిధ వర్గాలను కలుసుకున్న ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ఆలోచన చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకువస్తామని చెప్పారు. అలాగే నామినేషన్ పనుల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 31 బీసీ కులాలు కేంద్ర పరిధిలోని ఓబీసీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50 శాతం కొలవులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉపాధి అవకాశాలు మెరుగు నామినేటడ్ పదవుల్లో, కాంట్రాక్టు పనులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. జగనన్న హామీ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మాకు మంచి అవకాశాలు లభిస్తాయి. – చింతల అనిల్, గోకవరం టీడీపీలో ఎస్సీలకు గుర్తింపు లేదు టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు తగిన గుర్తింపు లేదు. ఎస్సీల అభివృద్ధి, సంక్షేమాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించారు. జగనన్న సీఎం అయితేనే ఎస్సీలకు గౌరవం, ప్రాధాన్యం లభిస్తుంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించడం అభినందనీయం. – మందపాటి సతీష్, గోకవరం జగన్ హామీతో బీసీల అభివృద్ధి జగన్ హామీతో బీసీలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతారు. ప్రైవేటు కాంట్రాక్టు పనులు, ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా నామినేటడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం ద్వారా రాజకీయ ఎదుగుదలకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. దీంతో బీసీల్లో జీవనశైలి మెరుగుపడుతుంది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేసి గెలిపిస్తాం. – కాజులూరి లక్ష్మీనారాయణ, కిర్లంపూడి బీసీల అభివృద్ధి ప్రైవేటు, కాంట్రాక్టు పనులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. బీసీల్లో ఉపాధి అవకాశాలు పెరిగి మెరుగైన జీవనం గడపవచ్చు. మా గురించి ఆలోచించే వైఎస్ జగన్‌కు ఓటు వేసి గెలిపిస్తాం. – తుమ్మల చిన్నబ్బు, గోకవరం తూర్పుకాపు సంఘం అధ్యక్షుడు సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను టీడీపీ ప్రభుత్వంలో దారి మళ్లించారు. నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు ప్రభుత్వం మళ్లించడంతో చాలా నిధులు దుర్వినియోగమయ్యాయి. సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు జగన్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. – యనమల పాము, జగపతినగరం జీవనం మెరుగుపడుతుంది ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టు పనుల్లో బీసీలకు అవకాశం కల్పించడంతో మా జీవనం మెరుగుపడుతుంది. ఆర్థిక ఎదుగుదలకు అవకాశం ఏర్పడుతుంది. జగన్మోహన్రెడ్డి మాట మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఆయనకే మా మద్దతు. – చిట్టిమాని సత్యనారాయణ, జగ్గంపేట జగన్‌తోనే న్యాయం 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత ఏర్పడితేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తారని హామీ ఇచ్చారు. దీంతో ఎస్సీ, బీసీ కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – మూరా పెదవీర్రాజు, కిర్లంపూడి -
చంద్రబాబు దళిత వ్యతిరేకి
-
క్షణక్షణం.. భయం భయం
వారంతా నిరుపేదలు. షెడ్యూల్డు క్యాస్ట్ (ఎస్సీ), షెడ్యూల్డు తెగలు (ఎస్టీ)కు చెందిన వారు. ఇదివరకటి ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించింది. అప్పటి నుంచి వీరు విద్యుత్‌ను వినియోగించుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. ఎవరైతే ఉచితంగా కరెంటు పొందుతున్నారో.. వారందరూ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని గుర్తించి అనంతపురం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు నోటీసులు జారీ చేశారు. అధికారులు జరిమానాగా విధించిన కాంపౌండ్ ఫీజు, అసెస్మెంట్ మొత్తాన్ని చెల్లించాలని, లేకపోతే నాన్‌బెయిలబుల్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామని అందులో పేర్కొన్నారు. అనంతపురం, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో విద్యుత్ చౌర్యం కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. మొత్తం 1,841 మందిపై నాన్‌బెయిలబుల్ కేసుల నమోదుకు నోటీసులు జారీ చేశారు. రూ.14.27 లక్షల రికవరీ కోసం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు ఎస్సీ, ఎస్టీ కాలనీలకు వెళ్లి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నియోజకవర్గంలో అన్ని సామాజిక వర్గాల వారిపైన 4,167 విద్యుత్ చౌర్యం కేసులు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి కేసులు నమోదయ్యాయి. నోటీసులు అందుకున్న వారు అరెస్టుల భయంతో వణికిపోతున్నారు. కొందరైతే ఊళ్లు వదిలి ఎక్కడో తలదాచుకుంటున్నారు. మరికొందరైతే పోలీసులకు పట్టుబడి బతిమలాడుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీల పట్ల తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని నోటీసులు అందుకున్న వారు మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో ఎస్సీ, ఎస్టీలను అన్ని విధాలా ఆదుకుంటామని, వారి సంక్షేమానికి కృషి చేస్తామని ఇచ్చిన హామీలన్నీ ఉత్తివేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తక్షణమే నోటీసులు ఉపసంహరించుకుని, కేసులు ఎత్తివేసి.. తమకు ఉచిత విద్యుత్ అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు. టీడీపీ వచ్చాకే కష్టాలు టీడీపీ ప్రభుత్వం వచ్చాకే కరెంటు కేసులు పెడుతున్నారు. పోలీసులను ఇళ్లకు పంపి భయపెడుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా బిల్లు కట్టించుకోలేదు. కనీసం అధికారులు వచ్చి ఒత్తిడి చేసిందీ లేదు. ఆయన హయాంలో హాయిగా నిద్రపోయాం. ఇప్పుడు రికవరీ, కేసులు పేరిట పోలీసులు చేస్తున్న హడావుడితో క్షణక్షణం భయంభయంగా గడుపుతున్నాం. – సుజాతాబాయి, పాలవాయి తండా, కళ్యాణదుర్గం మండలం ఎస్సీ, ఎస్టీలను ఇబ్బందులు పెట్టొద్దు చంద్రబాబు ప్రభుత్వానికి ఎస్సీలు, ఎస్టీలంటే చిన్నచూపు. విద్యుత్ చౌర్యం కేసుల పేరుతో ఇళ్లకు వెళ్లి పోలీసుల ద్వారా భయపెడుతోంది. ఎస్సీ, ఎస్టీలతో ఓట్లు వేయించుకుని.. సంక్షేమానికి పాటుపడతామని హామీ ఇచ్చి.. ఇప్పుడు కేసుల పేరుతో ఇబ్బందులు పెట్టడం బాధాకరం. టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. బనాయించిన విద్యుత్ చౌర్యం కేసులు ఎత్తేసి, విధించిన రుసుం రద్దు చేయాలి. లేకపోతే ప్రభుత్వంపై పోరాటం చేస్తాం.– తిప్పేస్వామి నాయక్, జీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసులతో కంటిమీద కునుకు లేదు కరెంటు దొంగతనంగా వాడుకుంటున్నామంటూ ఎనిమిది నెలల కిందట మాపై కేసు నమోదు చేశారు. తొమ్మిది నూటా నలభై రూపాయలు కట్టించుకున్నారు. పోలీసులకు మళ్లా సపరేటుగా రూ.500 కట్టాను. వైఎస్సార్ ఉన్నప్పుడు ఏనాడూ ఇలాంటి కేసులు పెట్టలేదు. చంద్రబాబునాయుడు ప్రభుత్వం వచ్చాక మాపై కేసులు పెట్టి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు.– వసంతమ్మ,, ఎస్సీ, తూముకుంట ఉచిత విద్యుత్ అమలులో విఫలం ప్రతి ఇంటికీ విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు కేంద్రప్రభుత్వం ‘దీన్ దయాళ్’ పథకం ప్రవేశపెట్టింది. రూ.125 చెల్లిస్తే విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తారు. ఇందులో ఎస్సీ, ఎస్టీలకు అయితే వంద యూనిట్ల వరకు విద్యుత్ ఉచితం. 125 యూనిట్ల వరకు వినియోగిస్తే.. అదనంగా కాల్చిన 25 యూనిట్లకు మాత్రమే బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. 126 యూనిట్లకు మించితే పూర్తి బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ బృహత్తర పథకం గురించి ప్రచారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించి.. వారికి వర్తింపజేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఇప్పుడు వారినే విద్యుత్ చౌర్యం కింద నేరస్తులను చేస్తోంది. కళ్యాణదుర్గం మండలం పాలవాయి గ్రామంలో బుధవారం విద్యుత్ చౌర్య నిరోధక పోలీసులు రికవరీ కోసం వెళ్లారు. పోలీసుల పక్కన కనిపిస్తున్న మహిళ టీడీపీ కార్యకర్త తిమ్మరాజు భార్య సుశీలమ్మ. వీరికి కూడా విద్యుత్ చౌర్యం కేసు నమోదు చేసి పోలీసులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు. -
‘దళిత్’ రణనినాదంపై ఆంక్షలా?
ఈ దేశంలో వ్యక్తుల, లేదా సంస్థల పేర్లు సైతం పాలకుల ఆంక్షల సంకెళ్ళ మధ్య బందీ అవుతోన్న నిర్బంధ పరిస్థితులు మన కళ్ళెదుటే తాండవిస్తున్నాయి. నిజానికి ‘దళిత్’ అనే పదం ఏ ఒక్కరికీ నష్టం కలిగించే అంశం కాదు. లేదా ఎవరినీ కించపరిచేది అంతకన్నా కాదు. ఎవరైనా ఆ పదం వాడదలుచుకోకపోతే అది వారి ఇష్టం. దానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవరైతే అది తమ రణనినాదం అనుకుంటున్నారో అటువంటి వారిమీద ఆంక్షలు విధించడం ఫాసిస్ట్ చర్య తప్ప మరొకటి కాదు. అంటరాని కులాలు ఒక్కటిగా ఉండడం, ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడటం అధికారంలో ఉన్న శక్తులు సహించలేకపోతున్నాయి. నీ విశాలాకాశంలోని సూర్యచంద్రులని నాకి మ్మని అడగలేదు/ విస్తరిం చిన నీ ఆస్తులూ, నీ భూములూ నేనడగనేలేదు/ నీవు కట్టుకున్న విలాసవంతమైన భవనాలూ, ఆకాశ హార్మ్యాలూ నాకక్కర్లేదు/ నీ ఉత్సవాలనూ, పండుగ లనూ, నీ దేవుళ్ళని కూడా నేనేనాడూ ఆశించలేదు/ నీ కులాలూ, నీ జాతులూ నాకక్కర్లేదు సుమా!/ కనీసం నీ తల్లులూ, నీ చెల్లెళ్ళూ, నీ కూతుళ్ళనీ కన్నెత్తిసైతం చూడలేదు/నేనడిగిందొక్కటే.. నేను కోరుకున్నదీ అదొ క్కటే నా హక్కులు../అదే నన్ను నన్నుగా, ఒక మని షిగా చూసే నా జన్మహక్కునే నేనడుగుతున్నాను... మరాఠీ దళిత కవుల సంకలనం ‘పాయిజన్ బ్రెడ్’ లోని పంక్తులివి. దళిత పాంథర్స్ ఉద్యమ చైతన్య స్ఫూర్తి ఆధిపత్యంపై గురిపెట్టిన అక్షరశూలాలివి. సరిగ్గా నాలుగు దశాబ్దాల కిందట శతాబ్దాల అణచి వేతపై ధిక్కారాన్ని ప్రకటించిన ఒకే ఒక్క పదం ‘దళిత్’. కాలిధూళికన్నా హీనంగా చూడబడ్డ ఓ సమూహాన్ని సమీకరించి పెనుఉప్పెనై ఎగిసిపడేలా చేసిందీ ఆ పదమే. 1972లో ముంబాయిలో కొందరు దళిత యువకులు సంయుక్తంగా ‘దళిత్ పాంథర్స్’ అనే ఒక సంస్థను ఏర్పర్చుకున్నారు. ఆ తదుపరి సంవత్సరం 1973 ఆగస్టు 15వ తేదీన దాదాపు 200 మందికి పైగా యువకులు నల్లజెండాలు ఎగురవేసి నిరసన ప్రకటన చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సరిగ్గా 26 ఏళ్ళ తరువాత బూటకపు స్వాతంత్య్రం తమకు ఒరగబెట్టిందేమీలేదని భారత వినీలాకాశంలో నల్లజెండాలు ఎగురవేసారు. అనంతరం ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమం మహారాష్ట్ర మొత్తం విస్తరించింది. ఎందరో దళిత కవులనూ, రచయిత లనూ సృష్టించింది. ఆ తరువాత అంటరాని కులాల సమీకరణకూ, సంఘటిత పోరాటానికీ ‘దళిత్’ అనే పదం ఓ ప్రతిఘటనా సంకేతంగా మారింది. అనం తర కాలంలో ఆ పదమే సమానత్వ శక్తిగా అవతరిం చింది. దేశవ్యాప్తంగా ‘దళిత్ పాంథర్స్’ సంస్థ కూడా శాఖోపశాఖలుగా విస్తరించింది. వేయికిపైగా కులా లుగా విభజనకు గురైన అంటరాని వారిని ఏకం చేసింది. దేశం నలుమూలల నుంచి ఎవరు ఎక్కడ కలిసినా అంటరాని కులాల గుర్తింపు దళిత్ అనే మూడక్షరాల్లో సంపూర్ణంగా ఒదిగిపోయింది. మొట్టమొదటిగా దళిత్ అనే పదాన్ని వివక్షల నేపథ్యంలో జ్యోతీబా ఫూలే ఉపయోగించినట్టు పరి శోధకులు చెప్తున్నారు. కానీ సంఘం నిర్మాణానికి ఈ పేరును మొట్టమొదట వాడిన స్థలం హైదరాబాద్ కావడం విశేషం. 1947 జూలై 20 వతేదీన ‘దళిత్ జాతీయ సంఘ్’ పేరుతో ఒక సంఘాన్ని హైదరా బాద్‌లో ఏర్పాటు చేశారు. అప్పటి వరకు విడివడి ఉన్న ‘ఆదిహిందూ ఇండిపెండెంట్ లీగ్’, ‘అరుంధ తీయ మహాసభ’, ‘డిప్రెస్డ్ క్లాసెస్ కాంగ్రెస్’, ‘ఇండి పెండెంట్ షెడ్యూల్డ్ కాస్ట్ ఫెడరేషన్’, ‘హరిజన్ అసోసియేషన్’లు కలిసి ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘాల ప్రతినిధులందరూ హైదరాబాద్ స్వాతంత్య్ర సమరయోధుడు స్వామి రామానంద తీర్థ ఇంట్లో సమావేశమై హైదరాబాద్ దళిత నాయకుడు అరిగె రామస్వామి కన్వీనర్‌గా 15 మందితో ఒక కమిటీని కూడా ఏర్పర్చుకున్నారు. ఈ సంఘం ఏర్పాటు ఆనాటి అంటరాని కులాల సంఘ టితత్వానికి ఒక చిరునామాగా మారింది. సరిగ్గా ఇదేరకమైన ఐక్యత మహారాష్ట్రలోని దళిత యువకులకు అవసరమైంది. బాబాసాహెబ్ అంబేడ్కర్ మరణానంతరం ఏర్పడిన ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ దళితుల పక్షాన నిలబడి పోరాటం చేయకపోవడం మాత్రమే కాకుండా అస్తి త్వాన్ని సైతం కోల్పోయి ముక్కలు చెక్కలై దళితుల్లో నిరాశానిస్పృహలను నింపింది. అదే సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటరాని కులాలను నిర్ల క్ష్యం చేయడంతోపాటు ఇటీవలి కాలంలో దళితులపై గ్రామాల్లో పట్టణాల్లో జరుగుతున్న దాడులను ఏమాత్రం అరికట్టలేకపోయింది. దీంతో మరొక ఉద్యమ అవసరాన్ని దళిత యువతరం గుర్తించింది. ఒకవైపు దేశంలోని దళితుల జీవన పరిస్థితులు ఈ సంఘం ఆవిర్భావానికి ఒక కారణం అయితే, 1960 ప్రాంతంలో అమెరికాలో పెల్లుబికిన పౌరహక్కుల ఉద్యమం నేపథ్యంలో వచ్చిన ‘బ్లాక్ పాంథర్స్ పార్టీ’ ఇక్కడి ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమానికి తక్షణ ప్రేర ణగా నిలిచింది. ఒకరకంగా మహారాష్ట్రలోని ‘దళిత్ పాంథర్స్’ ఉద్యమ తరహాలోనే అనేక ప్రాంతాల్లో అనేక రూపాల్లో దళితుల్లో నిరసనజ్వాలలు పెల్లుబి కాయి. దేశంలో కూడా ఆనాడు వివిధ ప్రాంతాల్లో నక్సలైటు ఉద్యమం ఉవ్వెత్తున సాగుతోంది. ఈ ఉద్య మానికి ఆనాటి దళితుల్లో, ఆదివాసీల్లో ఉన్న అసం తృప్తే ప్రధాన కారణం. అదే కాలంలో 1960, 70 దశకాల్లో వచ్చిన మహత్తర ఉద్యమాల్లో ‘దళిత్ పాంథర్స్ ఉద్యమం’ కూడా దళితుల చైతన్యస్థా యిలో అనూహ్యమైన మార్పులు తెచ్చింది. గత కొంతకాలంగా ‘దళిత్’ అనే పదంమీద నిషేధం విధించడానికి కొంతమంది కారణాలను వెతుకుతున్నారు. ఇటీవల నాగ్‌పూర్ హైకోర్ట్ బెంచ్‌లో ఒక దళితుడి చేతనే ‘దళిత్’ అనే పదాన్ని వాడుకలో నుంచి తీసివేయాలంటూ పిటిషన్ వేయిం చారు. అంతటితో ఆగకుండా ‘దళిత్’ అనే పదాన్ని ప్రసార మాధ్యమాల్లో వాడకూడదనే ఉచిత సల హాను కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార శాఖ ఆదే శాల రూపంలో జారీ చేసింది. ఇది యాదృచ్ఛికమైన చర్యకాదు. ఈ పదానికున్న శక్తిని నిరోధించే లక్ష్యంతో కావాలనే దీని వాడకాన్ని అడ్డుకునే కుట్ర చేసారు. దేశంలోకి బ్రిటిష్ వారు రాకముందు ప్రజ లంతా కులాల పేరుతోనే ఉనికిలో ఉన్నారు. అంట రాని కులాలు కూడా వందల సంఖ్యలో విభజనకు గురై వివిధ పేర్లతో వాడుకలో ఉన్నాయి. 1911 జనాభా లెక్కల్లో ‘డిప్రెస్డ్ క్లాసెస్’గా తొలిసారిగా ఒకచోటికి చేర్చారు. ఆ తరువాత 1935 భారత చట్టం ఏర్పడిన తరువాత వాటిని ‘షెడ్యూల్డ్ కాస్ట్’గా మార్చారు. ఇప్పటికీ అదే పేరు రాజ్యాంగంలోనూ, ఇతర అధికారిక కార్యకలాపాల్లో కొనసాగుతూ వస్తోంది. ఇక్కడ ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు. ఇక్కడే ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. భారత స్వాతంత్య్రోద్యమ నాయకుడు గాంధీ కూడా అంటరాని కులాలకు ఒక పేరు పెట్టారు. అదే ‘హరిజన్’. ఆ పేరుని అంబేడ్కర్‌తో సహా అనేక మంది వ్యతిరేకించారు. 1970 తరువాత వచ్చిన దళిత చైతన్యం ఆ పేరును అధికార కార్య కలాపాల్లో వాడకూడదని డిమాండ్ చేసింది. దానితో ప్రభుత్వాలు తలొగ్గి హరిజన్ అనే పేరుని తొలగిస్తూ తీర్మానం చేయాల్సి వచ్చింది. ఇంతటితో హరిజన్ పద వాడకం చట్ట విరుద్ధంగా మారింది. ‘హరిజన్’ అంటే అవ్వ అయ్య లేని బిడ్డ అని అర్థం. తల్లి దండ్రులు లేకుండా దేవుడికి పుట్టినవాడని అర్థం. ఈ హరిజన్ అనే పేరుని అంటరాని కులాల వారికి ఇత రులు పెట్టారు. కానీ ‘దళిత్’ అనే పదం తమకు తాముగా, తమ ఆత్మగౌరవ పతాకగా, తమ అస్తి త్వానికి సంకేతంగా, తిరుగుబాటు నినాదంగా దళి తులు పెట్టుకున్నారు. భారత స్వాతంత్రోద్యమంలో ‘షాహీద్’ భగత్ సింగ్ ఇచ్చిన ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ నినాదం లాగా ‘దళిత్’ అనే పదానికి వీరంతా భయకంపితు లవుతున్నారనడానికి ఇదొక ఉదాహరణ. దళితో ద్యమ ఉప్పెనలో తమ ఉనికి ఎక్కడ కొట్టుకుపో తుందోనని బెంబేలెత్తి పోతున్నారు. అందువల్లనే ‘దళిత్’ అనే పదాన్ని ముందుగా అధికారిక కార్యకలా పాల్లో ఆ తర్వాత ప్రసార మాధ్యమాల్లో వాడకూడ దని ఆజ్ఞలు జారీ చేస్తున్నారు. ఇది ముమ్మాటికీ అప్ర జాస్వామికం. ఈ దేశంలో వ్యక్తుల, లేదా సంస్థల పేర్లు సైతం పాలకుల ఆంక్షల సంకెళ్ళ మధ్య బందీ అవుతోన్న నిర్బంధ పరిస్థితులు మన కళ్ళెదుటే తాండవిస్తున్నాయి. నిజానికి ‘దళిత్’ అనే పదం ఏ ఒక్కరికీ నష్టం కలిగించే అంశం కాదు. లేదా ఎవరినీ కించపరిచేది అంతకన్నా కాదు. ఎవరైనా ఆ పదం వాడదలుచుకోకపోతే అది వారి ఇష్టం. దానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. కానీ ఎవ రైతే అది తమ రణనినాదం అనుకుంటున్నారో అటు వంటి వారిమీద ఆంక్షలు విధించడం ఫాసిస్ట్ చర్య తప్ప మరొకటి కాదు. నిజానికి ‘దళిత్’ అనే పదం 1241 అంటరాని కులాలను ఒక్కతాటిపైకి తెచ్చిన బలీయమైన ఐక్య నినాదం. అంటరాని కులాలు ఒక్కటిగా ఉండడం ఆ శక్తి ప్రభుత్వానికీ ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలబడటం అధికారంలో ఉన్న శక్తులు సహించలేకపోతున్నాయి. కేరళ నుంచి కాశ్మీర్ వరకు మణిపూర్ నుంచి గుజరాత్ వరకు అంటరాని కులా లను సమైక్యపరిచే అంతులేని శక్తి కేవలం ఆ ఒక్క దళిత పదానికే ఉంది. ఇటీవల ఎస్సీ ఎస్టీ అత్యాచా రాల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశా లకు వ్యతిరేకంగా అంటరాని కులాలన్నింటినీ ఐక్యం చేసింది కేవలం దళిత పదమే. ఈ ఐక్యతాశక్తి దేశం లోని మరే సామాజిక వర్గానికీ లేదు. అందువల్ల ఈ ఐక్యతా నినాదాన్ని దెబ్బగొట్టే ప్రయత్నంలో భాగం గానే ‘దళిత్’ అనే పదంపై ప్రత్యక్ష, పరోక్ష నిషేధా లను విధిస్తున్నారు. అయితే, ఈ నిషేధాలకు దళిత శక్తి తలొగ్గే అవకాశం లేదు. దళితులు నడచివచ్చిన గత చరిత్రంతా రక్తసిక్తమే. ఎన్నో దాడులు, దమన కాండలు, అన్యాయాలూ, అణచివేతలూ అమానుషా లకు తిరుగుబాటుగా, ప్రతిఘటనగా వచ్చిందే దళిత నినాదం. భారతదేశంలోని వివక్షనూ, అణచివేతనూ, ఇలాంటివే కుట్రలనూ తూర్పారబట్టి, ఆధిపత్య భావ జాలాన్ని జల్లెడ బట్టి ఒక విముక్తి సిద్ధాంతాన్ని అంబే డ్కర్ దళితులకు అందించాడు. అందుకే దళితులు ఒంటరి కాదు. దళితులకు అందివచ్చిన పోరాట పతాకం జైభీం. అంబేడ్కర్ పేరుతో మారుమోగే ఈ నినాదం దేశంలోని దళితులందరినీ ఒక్కటి చేసింది. దళిత అస్తిత్వం, అంబేడ్కర్ తాత్విక సిద్ధాంతం, జైభీం నినాదం కోటానుకోట్ల దళిత ప్రజల హృద యాలనుంచి వేరు చేయడం అసాధ్యం అన్న సత్యాన్ని పాలకులు గ్రహించాలి. వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213 -
రిజర్వేషన్లపై మంత్రి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి : రిజర్వేషన్లపై ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్‌లుగా ఎస్సీ, ఎస్టీ ఎవరున్న పెత్తనమంతా నాయకులదే అని రిజర్వేషన్లను కించపరిచే విధంగా మాట్లాడారు. గడువు ముగిసిన సర్పంచ్‌లతో బుధవారం విశాఖపట్నంలో ఆయన సమావేశమై మాట్లాడారు. పంచాయతీలో రిజర్వేషన్ల అమలు మామూలు విషయమే అని అన్నారు. మంత్రి స్థాయిలో ఉండి ఇలా మాట్లాడం ఏంటని స్థానికులు ఆశ్చర్యపోయారు. ఎస్సీ, ఎస్టీలను కించపరిచే విధంగా మాట్లాడడం టీడీపీ ప్రభుత్వానికి ఇదేం తొలిసారి కాదు. గతంలో సీఎం చంద్రబాబు ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఎస్సీ, ఎస్టీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. నేటితో గ్రామపంచాయతీ సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.