న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీల్లోని క్రీమీలేయర్‌కు రిజర్వేషన్లు వర్తింపజేయకూడదన్న ఆలోచనను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శనివారం చెప్పారు. ఈ అంశంపై ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న భాగాన్ని తొలగించాలని, ఇందుకోసం పార్లమెంట్‌లో చట్టం తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. క్రీమీలేయర్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేయొద్దని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలిస్తున్నామని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్‌ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఒక విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు తీర్పులో న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్.గవాయ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. క్రీమీలేయర్‌కు రిజర్వేషన్లు నిరాకరించాలని ఆయన సూచించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో అస్పృశ్యత ఉన్నంతకాలం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని మల్లికార్జున ఖర్గే తేలి్చచెప్పారు. రిజర్వేషన్ల అమలు కోసం పోరాడుతామని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల విధానానికి ముగింపు పలికేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment