న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్ల ఫలాలు వర్తింపజేయకూడదని, క్రీమీ లేయర్‌ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాదటిని అమలు చేయొద్దంటూ వినతి పత్రం సమరి్పంచారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎవరికీ నష్టం జరగదని మోదీ హామీ ఇచ్చినట్టు అనంతరం వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment