mps agitation
-
‘క్రీమీ లేయర్’పై బీజేపీ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్ల ఫలాలు వర్తింపజేయకూడదని, క్రీమీ లేయర్‌ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాదటిని అమలు చేయొద్దంటూ వినతి పత్రం సమరి్పంచారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎవరికీ నష్టం జరగదని మోదీ హామీ ఇచ్చినట్టు అనంతరం వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. -
షిండే వర్గంలో అసంతృప్తి.. 22 మంది ఎమ్మెల్యేలతో సహా..!
ముంబై: శివసేనను రెండుగా చీల్చి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఏక్నాథ్ షిండేకు ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు మొదలయ్యాయి. బీజేపీతో పొసగని తన ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలతో సహా 9 మంది ఎంపీలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ (యూబీటీ)కి చెందిన సామ్నా పత్రిక వెల్లడించింది. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలకు బీజేపీతో పొసగడంలేదని పేర్కొంది. షిండే వర్గంలోని కొంతమంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని యూబీటీ ఎంపీ వినాయక్ రౌత్ తెలిపారు. ఆ పార్టీ నుంచి బయటకు వస్తామని వారు తెలిపినట్లు చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్యంలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని చెప్పినట్లు వెల్లడించారు. బీజేపీ-షిండేకు చెందిన శివసేన భాగస్వామ్యంలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గజానన్ కీర్తికార్ బహిరంగంగానే బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సామ్నా తెలిపింది. బీజేపీ నుంచి అంతర్గతంగా వారు వివక్షను ఎదుర్కొంటునట్లు చెప్పారు. 'మేము 13 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. ఎన్డీయే భాగస్వామ్యంలో మా సమస్యలు పరిష్కారమయ్యేలా లేవు'అని గజానన్ కీర్తికార్ ఇదివరకే అన్నారు. అయితే ఈ పరిస్థితిని షిండే వర్గం తోసిపుచ్చుతోంది. #WATCH | "Can Vinayak Raut see the future? Does he know face-reading? He says anything. There is no fact to what he says. We are all satisfied. Under the leadership of CM Eknath Shinde, we are working well. Vinayak Raut keeps saying things like this, we don't pay attention to… pic.twitter.com/vMTbpc1kxI — ANI (@ANI) May 30, 2023 'వ్యక్తిగత గౌరవాన్ని డబ్బులతో కొనలేం. ఇది మరోసారి రుజువైంది. ఈ సారి 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం' అని షిండే నేతృత్వంలోని శివసేన నేతలు ఇప్పటికే చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్యంలోని షిండే వర్గానికి 22 సీట్లు ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేవని సామ్నా తెలిపింది. చదవండి:కిడ్నీ సమస్యతో కాంగ్రెస్ ఎంపీ కన్నుమూత.. తండ్రి చనిపోయిన మూడు రోజులకే! -
‘హోదా’పై పార్లమెంట్లో దుమారం
* ఉభయ సభల్లో ప్రస్తావించిన కాంగ్రెస్ * విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్‌కు వెంకయ్య ప్రశ్న * నాటి ప్రధాని హామీని గుర్తుచేసిన వైఎస్సార్సీపీ సభ్యుడు మేకపాటి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయం పార్లమెంటు ఉభయసభల్లో మంగళవారం దుమారం రేపింది. యూపీఏ ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఎన్డీయే పట్టించుకోవట్లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఉభయసభల్లో ఈ అంశాన్ని లేవనెత్తారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని రెండేళ్లవుతున్నా అమలు చేయకపోవడంపై నిలదీశారు. మీరా డిమాండ్ చేసేది: వెంకయ్య ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చేవిషయంలో అప్పట్లో సెలైంట్‌గా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు వయొలెంట్‌గా వ్యవహరిస్తోందని లోక్‌సభలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం తెచ్చిన విభజన చట్టం బిల్లులో ప్రత్యేక హోదా అంశం లేదన్నారు. అయితే వైఎస్సార్సీపీ సభ్యుడు మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ విభజన చట్టంపై రాజ్యసభలో చర్చ సందర్భంగా అప్పటి ప్రధాని ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని, అప్పట్లో కేబినెట్ కూడా తీర్మానించిందని గుర్తుచేశారు. దీంతో తాను కాంగ్రెస్ నోటీసుకు జవాబిస్తున్నానని వెంకయ్య ఆయనకు వివరించారు. ఏపీకి ప్రత్యేకహోదా పదేళ్లు కావాలని తాను డిమాండ్ చేసిన మాట వాస్తవమేనంటూ.. ఇచ్చిన హామీలపై ప్రభుత్వం వెనక్కితగ్గే ప్రసక్తే లేదన్నారు. అంతకుముందు కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల్ని రెండేళ్లవుతున్నా కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పందిస్తూ.. విభజన చట్టంలో పేర్కొన్న విధం గా తెలంగాణకిచ్చిన హామీల్ని అమలు చేయలేదని ఆరోపించారు. హైకోర్టు విభజన విషయంలో న్యాయశాఖ ప్రయత్నాలు చేస్తోందని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పారు. రాజ్యసభలో... ప్రత్యేక హోదా అంశాన్ని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్ లేవనెత్తారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య ప్రత్యేక హోదా పదేళ్లు ఉండాలని చెప్పారని గుర్తుచేస్తూ.. ఎప్పుడు కల్పిస్తారని ప్రశ్నించారు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జైట్లీ సైతం పదేళ్లు ఉండాలని చెప్పడాన్ని దిగ్విజయ్‌సింగ్(కాంగ్రెస్) గుర్తుచేశారు. రాజ్యసభలో ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం నెరవేర్చాలని జేడీ(యూ) సభ్యుడు శరద్ యాదవ్ కోరారు. ప్రత్యేక హోదా అంశం ఏపీది కాదని, రాజ్యసభకు చెందిన విషయమని కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. ప్రత్యేక హోదాకోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని, హామీల్ని కేంద్రం నెరవేర్చాలని కోరారు. జేడీ శీలం, రేణుకా చౌదరి, సుబ్బిరామిరెడ్డి, ఎంఏఖాన్, రాపోలు ఆనంద భాస్కర్ కూడా ఆయనతో ఏకీభవించారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని పట్టుపడుతూ కేవీపీ, రేణుక, శీలం, ఎంఏ ఖాన్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్, ఇప్పుడు రాజకీయలబ్ధికి ప్రయత్నిస్తోందని టీడీపీ సభ్యుడు సీఎం రమేష్ విమర్శించారు. ప్రతి అంశాన్నీ నెరవేరుస్తాం: జైట్లీ ఆర్థికమంత్రి జైట్లీ స్పందిస్తూ విభజన చట్టంలో పేర్కొన్న ప్రతి అంశాన్నీ నెరవేరుస్తామని హామీఇచ్చారు. ఏపీలో రెవెన్యూలోటు భర్తీకి సాయాన్ని అందిస్తున్నామని, ప్రతి పైసా చెల్లిస్తున్నామని, ఏపీకి సాయాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ప్రభుత్వ సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. -
'ప్రత్యేక హోదాపై తేలుస్తారా లేదా?'
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశం రాజ్యసభను కుదిపేసింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తూ వెంటనే ప్రకటన చేయాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు. పార్లమెంటు సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని విభజన సమయంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారని వారు గుర్తు చేశారు. రెండేళ్లయినా ప్రత్యేక హోదా కల్పించలేదని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ కు ఐదేళ్లు ప్రత్యేక హోదా అని తాము అంటే పదేళ్లు అని వెంకయ్యనాయుడు అన్నారని, దానిని అరుణ్ జైట్లీ కూడా సమర్థించారని కాంగ్రెస్ పార్టీ నేత ఆజాద్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో ఎదురుచూస్తున్నారని, వారి ఆశలపై నీళ్లు చల్లొద్దని కాంగ్రెస్ ఎంపీ రామచంద్ర రావు అన్నారు. ప్రత్యేక హోదాకు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కూడా మద్దతు తెలిపారని చెప్పారు.