creamy layer status
-
‘క్రీమీ లేయర్’పై బీజేపీ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ క్రీమీ లేయర్‌కు రిజర్వేషన్ల ఫలాలు వర్తింపజేయకూడదని, క్రీమీ లేయర్‌ను గుర్తించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు విధానం రూపొందించాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై బీజేపీ ఎస్సీ, ఎస్టీ ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. వారంతా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. సుప్రీంకోర్టు ఆదేశాలపై అభ్యంతరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాదటిని అమలు చేయొద్దంటూ వినతి పత్రం సమరి్పంచారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎవరికీ నష్టం జరగదని మోదీ హామీ ఇచ్చినట్టు అనంతరం వారు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, సాధికారతకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ ఎక్స్‌లో పేర్కొన్నారు. -
ఉద్యోగుల పిల్లలకూ రిజర్వేషన్లా?
న్యూఢిల్లీ: ఉన్నతోద్యోగాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీల పిల్లలు, కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం వెనక హేతుబద్ధత ఏంటని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. క్రీమీలేయర్‌ను ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు వర్తింపజేయరని నిలదీసింది. ‘ పదోన్నతుల్లో రిజర్వేషన్ల వల్ల ఫలానా వ్యక్తి ఓ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయ్యాడునుకోండి. ఆయన కుటుంబ సభ్యులను దళితులుగా భావించి వారికీ పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనా? దాని వల్ల వారి సీనియారిటీ సైతం త్వరగా పెరుగుతుందిగా’ అని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. గురువారం రోజంతా జరిగిన విచారణకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పలువురు సీనియర్ లాయర్లు పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు కోటా అమలును సమర్థించారు. ఈ రిజర్వేషన్లు దాదాపుగా నిలిచిపోవడానికి కారణమైన 2006 నాటి ఎం.నాగరాజ్ కేసు తీర్పును సమీక్షించాలని కోరారు. కానీ, సీనియర్ లాయర్ శాంతిభూషణ్, మరో సీనియర్ లాయర్ రాజీవ్ ధావన్ ఈ కోటాను వ్యతిరేకించారు. రిజర్వేషన్ల వల్ల ఉద్యోగ అవకాశాల్లో సమానత్వపు హక్కు ఉల్లంఘనకు గురవుతోందని ఆరోపించారు. ‘ఒక వ్యక్తి క్లాస్–1 అధికారి అయితే, ఇక అతను ఎంతమాత్రం వెనకబడిన తరగతికి చెందడు. కానీ రాజకీయ పార్టీలు దళితులను ఓటుబ్యాంకుగానే పరిగణిస్తున్నాయి’ అని శాంతి భూషణ్ అన్నారు. త్రిపుర, బిహార్, మధ్యప్రదేశ్ లాయర్లు కోటాకు మద్దతుగా వాదించారు. -
వారికి క్రీమీలేయర్ వర్తించదు: కేంద్రం
న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ విధానం వర్తించదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ సామాజిక వర్గాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల్లోని ధనికులకు రిజర్వేషన్ అవసరం లేదని, వారికి కోటా ప్రయోజనాలు మినహాయించాలని ఎన్జీవో సమ్తా ఆందోళన్ సమితి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఆ సామాజిక వర్గంలోని ధనికుల వల్ల అసలైన లబ్ధిదారులకు ఫలాలు అందడంలేదని, ఎక్కువ మొత్తంలో ధనికులే లబ్ధి పొందుతున్నారని పిల్లో పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది. -
‘క్రీమీలేయర్’ మార్గదర్శకాలపై స్పష్టత
బీసీ సంక్షేమశాఖ సర్క్యులర్ జారీ సాక్షి, హైదరాబాద్: క్రీమీలేయర్‌పై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ స్పష్టతనిచ్చింది. ఒక వ్యక్తి బీసీ సంపన్నశ్రేణి(క్రిమీలేయర్) హోదాను అతని స్టేటస్‌తో సంబంధం లేకుండా తల్లితండ్రుల స్టేటస్‌ను బట్టి మాత్రమే నిర్ణయించాలని సూచించింది. ఎవరైనా గ్రూప్-1 స్థాయి ఉద్యోగానికి ఎంపికై, మళ్లీ గ్రూప్-1 స్థాయిలోనే మరో ఉద్యోగం కోసం గ్రూప్-1 పరీక్షలకు కాని, సివిల్ సర్వీస్ పరీక్షలకుగాని ప్రయత్నించినప్పుడు అతని స్టేటస్‌ను బట్టి క్రీమీలేయర్‌గా పరిగణించరాదని తెలిపింది. మహిళల విషయంలో ఆమె తల్లితండ్రుల స్టేటస్‌ను బట్టి క్రీమీలేయర్ హోదాను నిర్ణయించాలే తప్ప ఆమె భర్త స్టేటస్‌ను బట్టి కాదని వివరణ నిచ్చింది. ఉద్యోగులకు వారి జీతభత్యాలను బట్టి క్రీమీలేయర్ వర్తిస్తుందని అనుకోవడం సరికాదని, ఒక ఉద్యోగి తొలి నియామకపు స్టేటస్, ఆ కుటుంబానికి ఉన్న భూమి పరిమాణం, ప్రైవేట్ సేవలు లేదా వ్యాపారం లేదా వాణిజ్యరంగాల ద్వారా వచ్చే ఆదాయం, పట్టణాల్లో ఉన్న ఆస్తి ద్వారా వచ్చే ఆదాయం, సంపద పన్ను చట్టం ప్రకారం పన్ను చెల్లింపు(రూ.30 లక్షల ఆస్తి వరకు సంపదపన్ను మిన హాయింపు ఉంది) వంటి వాటిని విడివిడిగా పరిగణనలోకి తీసుకుని, వీటిలో ఏ కేటగిరి లోనూ క్రిమీలేయర్గా పరిగణించే వీలులేనపుడు అటువంటి వారి పిల్లలు సంపన్నశ్రేణి కిం దకు రారని తెలిపింది. వేర్వేరు కేటగిరిల కింద పొందే ఆదాయాన్ని కలిపి చూడవద్దని, ఆ విధంగా కలిపి చూపి క్రిమీలేయర్ స్టేటస్‌ను నిర్ణయించవద్దని స్పష్టం చేసింది. ఈ విషయాలకు అనుగుణంగా రైతులు, వ్యాపారులు, ఉద్యోగులకు తహసీల్దార్లు నిర్ణీతసమయంలోగా ఓబీసీ క్రీమీలేయర్ ధ్రువీకరణపత్రాలను జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ఇన్చార్జీ డెరైక్టర్ ఆలోక్‌కుమార్ జారీ చేసిన సర్క్యులర్‌ను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించారు.