న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ విధానం వర్తించదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆ సామాజిక వర్గాలు ఇంకా వెనుకబడే ఉన్నాయని పేర్కొంది. ఎస్సీ, ఎస్టీల్లోని ధనికులకు రిజర్వేషన్ అవసరం లేదని, వారికి కోటా ప్రయోజనాలు మినహాయించాలని ఎన్జీవో సమ్‌తా ఆందోళన్ సమితి సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది.
ఆ సామాజిక వర్గంలోని ధనికుల వల్ల అసలైన లబ్ధిదారులకు ఫలాలు అందడంలేదని, ఎక్కువ మొత్తంలో ధనికులే లబ్ధి పొందుతున్నారని పిల్‌లో పేర్కొంది. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషన్‌పై 4 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై రెండో వారానికి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment