సాక్షి, జగ్గంపేట/గోకవరం/కిర్లంపూడి/గండేపల్లి: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒరిగిందేమీ లేదు. ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 27న రాజమహేంద్రవరంలో జయహో బీసీ సదస్సు నిర్వహించి ఓట్ల కోసం బీసీల్లోని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తాయితాలు ప్రకటించారు. అయితే వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీలపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు.
ప్రజాసంకల్పయాత్రలో వివిధ వర్గాలను కలుసుకున్న ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ఆలోచన చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకువస్తామని చెప్పారు. అలాగే నామినేషన్ పనుల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 31 బీసీ కులాలు కేంద్ర పరిధిలోని ఓబీసీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50 శాతం కొలవులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల్లో హర్షం వ్యక్తమవుతోంది.
ఉపాధి అవకాశాలు మెరుగు
నామినేటడ్ పదవుల్లో, కాంట్రాక్టు పనులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. జగనన్న హామీ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మాకు మంచి అవకాశాలు లభిస్తాయి.
– చింతల అనిల్, గోకవరం
టీడీపీలో ఎస్సీలకు గుర్తింపు లేదు
టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు తగిన గుర్తింపు లేదు. ఎస్సీల అభివృద్ధి, సంక్షేమాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించారు. జగనన్న సీఎం అయితేనే ఎస్సీలకు గౌరవం, ప్రాధాన్యం లభిస్తుంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించడం అభినందనీయం.
– మందపాటి సతీష్, గోకవరం
జగన్ హామీతో బీసీల అభివృద్ధి
జగన్ హామీతో బీసీలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతారు. ప్రైవేటు కాంట్రాక్టు పనులు, ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా నామినేటడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం ద్వారా రాజకీయ ఎదుగుదలకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. దీంతో బీసీల్లో జీవనశైలి మెరుగుపడుతుంది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేసి గెలిపిస్తాం.
– కాజులూరి లక్ష్మీనారాయణ, కిర్లంపూడి
బీసీల అభివృద్ధి
ప్రైవేటు, కాంట్రాక్టు పనులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. బీసీల్లో ఉపాధి అవకాశాలు పెరిగి మెరుగైన జీవనం గడపవచ్చు. మా గురించి ఆలోచించే వైఎస్ జగన్‌కు ఓటు వేసి గెలిపిస్తాం.
– తుమ్మల చిన్నబ్బు, గోకవరం తూర్పుకాపు సంఘం అధ్యక్షుడు
సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారు
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను టీడీపీ ప్రభుత్వంలో దారి మళ్లించారు. నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు ప్రభుత్వం మళ్లించడంతో చాలా నిధులు దుర్వినియోగమయ్యాయి. సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు జగన్ నిర్ణయం తీసుకుంటారని
ఆశిస్తున్నాం.
– యనమల పాము, జగపతినగరం
జీవనం మెరుగుపడుతుంది
ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టు పనుల్లో బీసీలకు అవకాశం కల్పించడంతో మా జీవనం మెరుగుపడుతుంది. ఆర్థిక ఎదుగుదలకు అవకాశం ఏర్పడుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి మాట మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఆయనకే మా మద్దతు.
– చిట్టిమాని సత్యనారాయణ, జగ్గంపేట
జగన్‌తోనే న్యాయం
50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత ఏర్పడితేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తారని హామీ ఇచ్చారు. దీంతో ఎస్సీ, బీసీ కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
– మూరా పెదవీర్రాజు, కిర్లంపూడి
Comments
Please login to add a commentAdd a comment