BC subplan
-
బీసీ బంధు పథకం ఎక్కడ?
సాక్షి, పెద్దపల్లి: దళితబంధు మాదిరిగానే బీసీలకు బీసీ బంధు పథకం ప్రారంభించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. బీసీబంధు ప్రారంభిస్తామని అసెంబ్లీలో సీఎం ఇచ్చిన హామీ ఎందుకు కార్యరూపం దాల్చడం లేదని ప్రశ్నించారు. హాథ్ సే హాథ్ జోడోయాత్రలో భాగంగా ఆయన చేపట్టిన పీపుల్స్‌మార్చ్ పాదయాత్ర పెద్దపల్లి నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో జరిగిన మీడియా సమావేశంలో భట్టి సీఎం కేసీఆర్‌కు రాసిన లేఖలోని అంశాలను వివరించారు. రాష్ట్రంలో 54 శాతానికి పైగా ఉన్న బీసీల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటం ఆడటం మానుకోవాలని, వారికి జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు చేసి సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 2023–24లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2.90లక్షల కోట్లుకాగా.. ఇందులో బీసీ సంక్షేమానికి కేవలం 5 శాతం నిధులు మాత్రమే కేటాయించారని తెలిపారు. చివరికి కేటాయించిన ఆ కొద్ది శాతం నిధులనూ పూర్తిస్థాయిలో ఖర్చు చేయటం లేదని విమర్శించారు. 2018–19లో కూడా బీసీల సంక్షేమానికి రూ.5,960 కోట్లు కేటాయించినా అందులో 63 శాతం కూడా ఖర్చు చేయలేదని గుర్తు చేశారు. సబ్సిడీ రుణాల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకుని ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారని తెలిపారు. సీఎం కళ్లు తెరిచి బీసీలు, ఎంబీసీలు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత ఏదీ..? బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్ధత తెస్తామని 2017లో అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్ ఇప్పటివరకు ఎందుకు చేయలేదని భట్టి ప్రశ్నించారు. బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తే మరో రూ.10 వేల కోట్లు అదనంగా సమాకూరేవన్నారు. 2017లో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసినా అలంకారప్రాయంగానే మిగిలిందన్నారు. ప్రతి బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు చూపుతున్నా.. ఫైనాన్స్ విభాగం ఆమోదం పొందింది నామమాత్రమేనని, అందులో ఖర్చు చేసింది చాలా తక్కువని ఆరోపించారు. 2018–19లో 75 శాతం, 20–22లో 100 శాతం నిధులు ఖర్చు చేయకుండా ఎంబీసీలను మోసగించిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు. 46 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని ఇచ్చిన జీవోలు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని, ఎంబీసీ జాబితాలో చేర్చాలని 15 కులాలవారు ప్రభుత్వానికి విన్నవించుకుని ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లను 18 శాతానికి కుదించారని, మంత్రివర్గంలో కేవలం ముగ్గురికి పదవులిచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. -
బీసీలకు భరోసా..
సాక్షి, అమరావతి: బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోన్.. అంటూ కొత్త నిర్వచనం ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి తన ప్రభుత్వం తొలి బడ్జెట్లోనే వారి అభ్యున్నతి, సంక్షేమానికి పెద్ద పీట వేశారు. బీసీ ఉప ప్రణాళికకు ఏకంగా రూ.15,061.64 కోట్లు కేటాయించారు. ఇంత పెద్ద మొత్తంలో బీసీలకు కేటాయింపులు చేయడం ఇదే తొలిసారి. ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో వైఎస్ జగన్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. అందులో బీసీలకు ఏటా రూ.15,000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.75,000 కోట్లు బీసీ ఉప ప్రణాళికకు కేటాయిస్తామని స్పష్టం చేశారు. అప్పుడు ఇచ్చిన మాట మేరకు ప్రస్తుత తొలి బడ్జెట్లోనే బీసీ ఉప ప్రణాళికకు రూ.15,061.64 కోట్లు కేటాయించారు. గత తెలుగుదేశం ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయం కోసం వినియోగించుకుంది తప్ప వారి అభ్యున్నతి, సంక్షేమం గురించి పట్టించుకోలేదు. కాగా, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించిన 2019–20 వార్షిక బడ్జెట్లో వెనుకబడిన తరగతుల సంక్షేమంపై స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ ప్రభుత్వం వెనుకబడిన తరగతులు సమగ్రాభివృద్ధిని సాధించేందుకు కట్టుబడి ఉందని చెప్పారు. ఇందుకోసం మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా రూ.15,061.64 కోట్లు కేటాయించిందని స్పష్టం చేశారు. బీసీ ఉప ప్రణాళికలో కేటాయించిన నిధులతో బీసీ వర్గాలు వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలను ప్రభుత్వం చేపడుతుంది. ఈ నిధులతో వెనుకబడిన వర్గాల నివాస ప్రాంతాలను అభివృద్ధి చేస్తారు. బీసీ కమిషన్‌ను మరింత సమర్థవంతంగా మార్చేందుకు పునర్ నిర్మించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని బడ్జెట్లో స్పష్టం చేసింది. ప్రమాదవశాత్తు మరణించిన బీసీ కులాలకు చెందిన వారికి వైఎస్సార్ బీమా ద్వారా రూ.5 లక్షల సాయం అందించనుంది. నాయీ బ్రాహ్మణులు, రజకులు, దర్జీలకు మంచి రోజులు ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.10,000 వరకు నాయీ బ్రాహ్మణులకు, రజకులకు ఆదాయ మద్ధతును ఇవ్వాలని నిర్ణయించినట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది. ఇందు వల్ల వారి యంత్రాలను ఆధునికీకరించుకుని, అధిక ఆదాయం ఆర్జించేందుకు దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో రూ.200 కోట్ల వ్యయంతో సుమారు 23,000 మంది నాయీ బ్రాహ్మణులకు, 1,92,000 మంది రజకులకు ప్రయోజనం చేకూర్చనున్నట్లు బడ్జెట్లో స్పష్టం చేసింది. దర్జీలకు ప్రతి సంవత్సరం 10 వేల రూపాయల చొప్పున ఆదాయ మద్దతును ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి స్పష్టం చేశారు. ఇందుకోసం ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. 29 బీసీ కులాల కార్పొరేషన్లకు రూ.3,964.05 కోట్లు ప్రస్తుతం అమల్లో ఉన్న బీసీ కులాలకు చెందిన 29 కార్పొరేషన్లకు ఈ బడ్జెట్లో బీసీ ఉప ప్రణాళికలో భాగంగా రూ.3964.05 కోట్లు కేటాయించారు. ఈ 29 కులాల వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, వీరి జీవనోపాధి కోసం వివిధ పథకాల కింద ఆర్థిక సాయం చేయనున్నారు. సబ్సిడీలతో పాటు ఆర్థిక సాయం అందించనున్నారు. చేనేత కుటుంబాలకు చేయూత చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేశారు. ప్రతి చేనేతకారుడి కుటుంబానికి రూ.24 వేల చొప్పున వైఎస్సార్ పేరుతో ఆర్థిక సాయం చేయనున్నారు. ఇందుకోసం బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. ఈ ఆర్థిక సాయం చేనేత కార్మికులు తమ పరికరాలను ఆధునికీకరించుకుని మర మగ్గాల ఉత్పత్తులతో పోటీపడేందుకు ఉపయోగపడనుంది. చేనేత కార్మికులు గౌరవప్రదమైన ఆదాయం ఆర్జించడానికి అవసరమైన మార్కెటింగ్ సహాయాన్ని ఇతర సబ్సిడీలను కూడా ప్రభుత్వం అందించాలని నిర్ణయించింది. వధువులకు వైఎస్సార్ పెళ్లి కానుక బీసీ గర్జన, మేనిఫెస్టోలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు తొలి బడ్జెట్లోనే బీసీ వర్గాలకు పెళ్లి కానుకను తీసుకువచ్చారు. వైఎస్సార్ పెళ్లి కానుక కింద రూ.300 కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద బీసీ కులాలకు చెందిన వధువులకు రూ. 50,000 చొప్పున వివాహ కానుక ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా 2019–20 ఆర్థిక సంవత్సరంలో 75 వేల మంది బీసీ వధువులు ప్రయోజనం పొందనున్నారు. కాగా.. 45 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు వచ్చే సంవత్సరం నుంచి వైఎస్సార్ చేయూత కింద ప్రయోజనాలు పొందనున్నారు. వీరికి నాలుగేళ్లలో నాలుగు విడతలుగా రూ.75 వేలు ఇవ్వనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు, ఇతర ఆర్థిక సంస్థలను సమీక్షించి ఈ ఏడాదిలోనే లబ్ధిదారులను గుర్తించేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు వలంటీర్ల సహాయంతో సంబంధిత కార్పొరేషన్ల ద్వారా అర్హులందరికీ దీనిని అమలు చేయాలని నిర్ణయించారు. బీసీ విద్యార్థులకు అన్ని విధాల అండ రాష్ట్రంలో 7.82 లక్షల మంది బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్లో రూ.2,218.14 కోట్లు కేటాయించారు. గతంలో ఎన్నడూ ఇంత పెద్ద మొత్తంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు నిధులు కేటాయించ లేదు. చదువుకునే వయసు పిల్లలందరూ విద్యా సంస్థల్లోనే ఉండాలనే లక్ష్యంతో జగనన్న అమ్మ ఒడి పథకం కింద బీసీ వర్గాల వారికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. ఈ పథకం కింద బీసీ వర్గాలకు చెందిన పిల్లలను బడికి పంపిస్తే వారి తల్లులకు ఏటా రూ.15,000 ఇచ్చేందుకు బీసీ ఉప ప్రణాళికలో రూ.1294.73 కోట్లు కేటాయించారు. ఆటో డ్రైవర్లకు రూ.400 కోట్లు ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా పలు జిల్లాల్లో ఆటో డ్రైవర్లు ఆయన్ను కలిసి వారి ఇబ్బందులను, ఆర్థికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. సొంతంగా ఆటో కలిగి నడుపుకుంటున్న డ్రైవర్లందరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే తన తొలి బడ్జెట్లోనే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అదించేందుకు ఏకంగా రూ.400 కోట్లు కేటాయించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బడ్జెట్లో కేటాయింపులు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని ఆటో డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక కార్పొరేషన్‌తో ప్రతి కులానికీ భరోసా మేనిఫెస్టోలో వాగ్దానం చేసినట్లుగా వెనుకబడిన తరగతుల్లోని కులాల కోసం ప్రభుత్వం 139 ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తుందని బడ్జెట్లో ప్రకటించారు. ఈ కార్పొరేషన్లు వివిధ బీసీ ఉప–సామాజిక వర్గాలకు చెందిన ప్రజల అభివృద్ధికి సహాయం అందిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రవేశపెట్టడానికి ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్లను సంస్కరించాక వైఎస్సార్ చేయూత పథకాన్ని ఈ కార్పొరేషన్ల ద్వారా వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభిస్తామని ప్రకటించింది. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ఇచ్చిన మాట మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల రాజకీయ అభ్యున్నతి కోసం దేవాలయాల ట్రస్ట్ బోర్డులు, మార్కెట్ యార్డ్ కమిటీలు, కార్పొరేషన్లు తదితర నామినేటెడ్ పోస్టుల విషయంలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చట్టం తీసుకురావని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వం నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టు పనుల్లో ఈ వర్గాల ఆర్థిక ఔన్నత్యం కోసం 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని బడ్జెట్ స్పష్టం చేసింది. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో బీసీల సంక్షేమం కోసం పేర్కొన్న భాగం. ఈ హామీలన్నింటినీ నెరవేర్చేందుకు బడ్జెట్లో తగినన్ని నిధులు కేటాయించారు. ► 7.82 లక్షల బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.2,218.14 కోట్లు ► ప్రతి చేనేత కార్మికుడి కుటుంబానికి అందించనున్న సాయం రూ.24,000 ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు -
వెనుకబడిన వర్గాలకు వెన్నుదన్ను..
సాక్షి, జగ్గంపేట/గోకవరం/కిర్లంపూడి/గండేపల్లి: టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒరిగిందేమీ లేదు. ఎన్నికలు సమీపించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు జనవరి 27న రాజమహేంద్రవరంలో జయహో బీసీ సదస్సు నిర్వహించి ఓట్ల కోసం బీసీల్లోని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని తాయితాలు ప్రకటించారు. అయితే వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రం బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీలపై తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో వివిధ వర్గాలను కలుసుకున్న ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ఆలోచన చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఏలూరులో జరిగిన బీసీ గర్జన సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకువస్తామని చెప్పారు. అలాగే నామినేషన్ పనుల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో 31 బీసీ కులాలు కేంద్ర పరిధిలోని ఓబీసీ జాబితాలో చేర్చడానికి కృషి చేస్తామన్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50 శాతం కొలవులకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని ప్రకటించడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఉపాధి అవకాశాలు మెరుగు నామినేటడ్ పదవుల్లో, కాంట్రాక్టు పనులు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. జగనన్న హామీ మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే మాకు మంచి అవకాశాలు లభిస్తాయి. – చింతల అనిల్, గోకవరం టీడీపీలో ఎస్సీలకు గుర్తింపు లేదు టీడీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు తగిన గుర్తింపు లేదు. ఎస్సీల అభివృద్ధి, సంక్షేమాన్ని ముఖ్యమంత్రి పూర్తిగా విస్మరించారు. జగనన్న సీఎం అయితేనే ఎస్సీలకు గౌరవం, ప్రాధాన్యం లభిస్తుంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పోస్టుల్లో రిజర్వేషన్ కల్పించడం అభినందనీయం. – మందపాటి సతీష్, గోకవరం జగన్ హామీతో బీసీల అభివృద్ధి జగన్ హామీతో బీసీలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతారు. ప్రైవేటు కాంట్రాక్టు పనులు, ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందడమే కాకుండా నామినేటడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం ద్వారా రాజకీయ ఎదుగుదలకు ఎంతో ఉపయోకరంగా ఉంటుంది. దీంతో బీసీల్లో జీవనశైలి మెరుగుపడుతుంది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేసి గెలిపిస్తాం. – కాజులూరి లక్ష్మీనారాయణ, కిర్లంపూడి బీసీల అభివృద్ధి ప్రైవేటు, కాంట్రాక్టు పనులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీలకు ప్రాధాన్యం కల్పించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం. బీసీల్లో ఉపాధి అవకాశాలు పెరిగి మెరుగైన జీవనం గడపవచ్చు. మా గురించి ఆలోచించే వైఎస్ జగన్‌కు ఓటు వేసి గెలిపిస్తాం. – తుమ్మల చిన్నబ్బు, గోకవరం తూర్పుకాపు సంఘం అధ్యక్షుడు సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించారు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను టీడీపీ ప్రభుత్వంలో దారి మళ్లించారు. నిధులను సక్రమంగా ఖర్చు చేయకుండా ఇతర అవసరాలకు ప్రభుత్వం మళ్లించడంతో చాలా నిధులు దుర్వినియోగమయ్యాయి. సబ్‌ప్లాన్ నిధులు దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు జగన్ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. – యనమల పాము, జగపతినగరం జీవనం మెరుగుపడుతుంది ప్రభుత్వానికి సంబంధించిన కాంట్రాక్టు పనుల్లో బీసీలకు అవకాశం కల్పించడంతో మా జీవనం మెరుగుపడుతుంది. ఆర్థిక ఎదుగుదలకు అవకాశం ఏర్పడుతుంది. జగన్మోహన్రెడ్డి మాట మీద మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఆయనకే మా మద్దతు. – చిట్టిమాని సత్యనారాయణ, జగ్గంపేట జగన్‌తోనే న్యాయం 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత ఏర్పడితేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరుగుతుంది. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తారని హామీ ఇచ్చారు. దీంతో ఎస్సీ, బీసీ కులాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – మూరా పెదవీర్రాజు, కిర్లంపూడి -
బీసీలను మోసగిస్తున్న కేసీఆర్: వీహెచ్
-
బీసీలను మోసగిస్తున్న కేసీఆర్: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్.. బీసీలను కల్లబొల్లి మాటలతో మోసం చేస్తున్నా రని మాజీ ఎంపీ వి.హనుమంతరావు విమర్శించారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. బర్లు, గొర్లు, బతుకమ్మ చీరలు అంటూ బీసీల దృష్టిని మళ్లిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నట్లుగానే రాష్ట్రంలోనూ ఇవ్వాలని డిమాండ్ చేశారు. క్రిమిలేయర్‌ను ఎత్తి వేయాలని, బీసీ సబ్‌ప్లాన్ అమలు చేయాలని వీహెచ్ కోరారు. -
‘తెలుగు రాష్ట్రాల్లో భారీగా అవినీతి’
-
‘తెలుగు రాష్ట్రాల్లో భారీగా అవినీతి’
హైదరాబాద్: రెవెన్యు మిగులు ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అవసరం లేకున్నా అప్పులు తెస్తున్నారని, అధికారం అంతా కేసీఆర్ కుటుంబం చేతుల్లో ఉందని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ హామీని అమలు చేయాలని.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టు అంచనాలను ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతోందని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అవినీతి జరుగుతోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. -
బీసీలను అణగదొక్కుతున్న ప్రభుత్వం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ గాంధీనగర్ : రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం బీసీలను అణగొక్కేం దుకు ప్రయత్నిస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌లో శనివారం మహాధర్నా నిర్వహించారు. మహేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పిన బీసీ డిక్లరేషన్, బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత వంటివి అటకెక్కించారని చెప్పారు. అగ్రవర్ణాలను, అర్హత లేని కులాలను బీసీ జాబితాలో చేరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు కార్పొరేషన్ ద్వారా రూ. 240 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం కేవలం 6 శాతం ఉన్న కాపులకు రూ. 1000 కోట్లు కేటాయించి వివక్ష చూపుతోందన్నారు. విదేశీ విద్యా పథకం లోనూ బీసీలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. ఈ పథకం కింద 500 మందిని విదేశాలకు పంపాల్సి ఉండగా కేవలం 13మంది బీసీ విద్యార్థులనే ఎంపిక చేశారన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన 145 మందిని ఎంపిక చేయడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. ఆదరణ పథకాన్ని అటకెక్కించారన్నారు. బీసీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత కల్పించాలని, బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నూకాలమ్మ, కామరాజ్ హరీష్, చెరుకూరి సత్య, బీసీ విద్యార్థులు పాల్గొన్నారు. -
'బీసీ సబ్‌ప్లాన్‌ను వెంటనే అమలు చేయాలి'
హైదరాబాద్: బీసీ సబ్‌ప్లాన్‌ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం గాంధీభవన్‌లో జ్యోతిరావుపూలే జయంతిని పురస్కరించుకుని ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఉత్తమ్, భట్టి విక్రమార్క, మధు యాష్కీ తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి భారీ కేటాయింపులు
బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ శాఖలకు పెరగనున్న నిధులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమ రంగానికి కేటాయింపులు పెరగనున్నాయి. దీనిపై కొంతకాలంగా సీఎం కేసీఆర్ మొదలుకొని కింద వరకు వివిధ స్థాయిల్లో సాగిన కసరత్తు కొలిక్కి వచ్చింది. ప్రస్తుత బడ్జెట్లో కంటే వచ్చే ఆర్థిక సంవత్సరంలో సంక్షేమ శాఖల కు అదనంగా 20శాతం నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. సంక్షేమ శాఖలు సమర్పించిన ప్రతిపాదనలు, ఆయా శాఖల మం త్రులు, కార్యదర్శులు, అధికారుల తర్జనభర్జనల అనంతరం సంక్షేమరంగానికి రూ.28 వేల కోట్ల వరకు బడ్జెట్ కేటాయించవచ్చని తెలుస్తోంది. ఎస్సీ అభివృద్ధి శాఖకు రూ.6వేల కోట్లు, ఎస్సీ ఉపప్రణాళిక కింద రూ.10వేల కోట్లు, గిరిజన సంక్షేమశాఖకు రూ.1,800 కోట్లు, ఎస్టీ ఉపప్రణాళిక కింద రూ.6,100 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.2,200 కోట్ల మేర ఆయా శాఖలు ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళిక కింద రూ.8,089 కోట్లు, ఎస్సీ శాఖకు రూ.4 వేల కోట్లు, షెడ్యూల్డ్ తెగల ఉపప్రణాళిక కింద 5,036 కోట్లు, ఎస్టీశాఖకు 1,142 కోట్లు, బీసీ సంక్షేమశాఖకు రూ. 2,020 కోట్లు కేటాయించారు. విడిగా బీసీ సబ్‌ప్లాన్ యోచన... వెనుకబడిన తరగతుల సంక్షేమానికి బడ్జెట్లో విడిగా ఉపప్రణాళిక కింద నిధులు కేటాయించాలని కొంతకాలంగా బీసీ సంఘా లు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నా యి. ప్రత్యేక ప్రతిపత్తితో బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అయితే, దీన్ని బీసీ సంక్షేమశాఖ బడ్జెట్లో కాకుండా విడిగా విధా న ప్రకటనగా తీసుకురావాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈక్రమంలో బడ్జెట్లో బీసీ సబ్‌ప్లాన్ ఉంటుందా లేదా అన్నది స్పష్టం కాలేదు. సంచార జాతుల సంక్షేమానికి ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.5కోట్లు కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. -
'నెల రోజుల్లో బీసీ కమిషన్ ఏర్పాటు'
సాక్షి, హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల (బీసీ) జాబితాలో ఏయే కులాలను చేర్చాలి, వేటిని తొలగించాలన్న విషయంలో ఓ నిర్ణయం తీసుకోవడానికి నెల రోజుల్లో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర మంత్రి జోగు రామన్న చెప్పారు. అసెంబ్లీలో సోమవారం తన చాంబర్‌కు వచ్చిన విలేకరులతో మంత్రి మాట్లాడారు. బీసీ ఉప ప్రణాళిక వల్ల న ష్టం జరుగుతుందని అధికారులు సూచిస్తున్నారని ఆయన తెలిపారు. వాస్తవానికి బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏ పద్దు కింద ఎంతెంత ఖర్చు పెడుతున్నారో పద్దుల వారీగా లెక్కలు తీయిస్తున్నామని చెప్పారు. ఆ వివరాలు అందాక, ఉప ప్రణాళిక అయితే బావుంటుందా, లేదా ప్రస్తుత పద్ధతిలోనే ఖర్చు పెట్టాలా అన్న విషయంలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బీసీల్లో కులాల చేరికలు, తొలగింపులకు కమిషన్ ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం జరిగిందని, నెల రోజుల్లో ఆ ప్రకటన వెలువడవచ్చని వివరించారు. ప్రభుత్వం బీసీలకు న్యాయం చేయడానికి కృషి చేస్తోందని, వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలవర్గాలకు రిజర్వేషన్లు అమలు చేయనుండడం వల్ల బీసీలకు ఎక్కువ అవకాశాలు దక్కుతాయని మంత్రి జోగు రామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. -
బీసీలకు భూములు కేటాయించాలి
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట), న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు భూములు కేటాయించాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కాకు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. బీసీ సబ్‌ప్లాన్ కోసం హైదరాబాద్‌లో బీజేపీ చేపట్టిన రెండు రోజుల దీక్షలో పాల్గొన్న ఆమె ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. సమాజంలో అత్యధిక శాతం ఉన్న బీసీల్లో అధిక సంఖ్యలో భూమి లేని నిరుపేదలున్నారన్నారు. బీసీల సంక్షేమం పట్ల ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించడలేదని పేర్కొన్నారు. బీసీ సబ్‌ప్లాన్ ఉద్యమాన్ని గ్రామీణస్థాయికి తీసుకెళ్లేందుకు తన వంతు కృషిచేస్తానన్నారు. రెండు రోజుల దీక్షలో జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, మిడతల రమేష్, మారుబోయిన శ్రీనివాసులు, బైనా సుధాకర్, దాసరి రాజేంద్ర, మూగ శ్రీనివాసులు, చింతగింజల సుబ్రహ్మణ్యం, షేక్ రెహమాన్, గుర్రం శ్రీనివాసులు పాల్గొన్నారు. -
సర్కారు మెడలు వంచైనా బీసీ సబ్‌ప్లాన్ సాధిస్తాం
సాక్షి, హైదరాబాద్: సర్కారు మెడలు వంచైనా బీసీ సబ్‌ప్లాన్‌ను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బీసీ సబ్‌ప్లాన్ సాధనకోసం హైదరాబాద్‌లో రెండ్రోజులపాటు చేపట్టిన మహాదీక్ష ముగింపు సందర్భంగా కిషన్‌రెడ్డి మంగళవారం ప్రసంగించారు. ఫీజు రీయింబర్స్మెంట్ తో బడుగులు ఉన్నత చదువులు అభ్యసిస్తుంటే కొందరికి కళ్లమంటగా ఉందంటూ అలాంటి వాళ్లేమైనా సొంత ఇంట్లోంచి డబ్బులు ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. ఎన్నివేల కోట్లు ఖర్చయినా పర్వాలేదని, విద్యార్థులందరికీ విద్య అందాలన్నారు. బీసీలు విడిగా ఉద్యమిస్తే సర్కారు కదలదని, అందువల్ల ఐక్యపోరాటం చేయాలని, అందుకు బీజేపీ అండగా ఉంటుందని హామీఇచ్చారు. కిషన్‌రెడ్డికి ఆర్.కృష్ణయ్య, దత్తాత్రేయ నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు. బీజేపీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణకు దత్తాత్రేయ, పార్టీ నేత లక్ష్మణ్‌కు ఆర్.కృష్ణయ్య నిమ్మరసం ఇచ్చారు. దీక్షకు బీసీ సంక్షేమసంఘం ఆర్.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడే కాంగ్రెస్‌కు బీసీలు గుర్తుకొస్తారని విమర్శించారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశం ఎప్పుడు జరిగినా వెంటనే బీసీ సబ్‌ప్లాన్ అమలుకు చట్టం తేవాలన్నారు. -
బీసీ సబ్‌ప్లాన్‌కు బీజేపీ మహాదీక్ష ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: స్వేచ్ఛా భారతంలోనూ బలహీనవర్గాలకు తీరని అన్యాయమే జరుగుతోందని, బీసీ సబ్ ప్లానే దీనికి పరిష్కారమంటూ బీజేపీ సోమవారమిక్కడ 48 గంటల మహాదీక్ష చేపట్టింది. ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీలకూ రాజ్యాంగ హక్కులు కల్పించాలని డిమాండ్ చేసింది. రాజ్యాధికారంలో భాగస్వామ్యం లేకపోవడం వల్లే బీసీలకు అన్యాయం జరుగుతోందని పేర్కొంది. తొలిరోజు దీక్షలో పార్టీ రాష్ట్ర నేతలతో పాటు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, శాసనసభాపక్ష నాయకుడు యెండల లక్ష్మీనారాయణ, పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నాయకత్వంలో చేపట్టిన ఈ మహాదీక్ష మంగళవారం కూడా కొనసాగుతుంది. ఈ సందర్భంగా పార్టీ నేతలు సీహెచ్ విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి, డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి, అరుణ జ్యోతి, టి.ఆచారీ, బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య సహా వివిధ కుల సంఘాల నాయకులు ప్రసంగించారు.