
‘తెలుగు రాష్ట్రాల్లో భారీగా అవినీతి’
హైదరాబాద్: రెవెన్యు మిగులు ఉన్న తెలంగాణను కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు. అవసరం లేకున్నా అప్పులు తెస్తున్నారని, అధికారం అంతా కేసీఆర్ కుటుంబం చేతుల్లో ఉందని విమర్శించారు. బీసీ సబ్ ప్లాన్ హామీని అమలు చేయాలని.. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ప్రాజెక్టులకు కాంగ్రెస్ ఎప్పుడూ వ్యతిరేకం కాదన్నారు. ప్రాజెక్టు అంచనాలను ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతోందని దుయ్యబట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా అవినీతి జరుగుతోందని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.