లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ పలువురు సీనియర్ నేతల అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తనకు ఇవే చివరి ఎన్నికలంటూ మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ లోక్‌సభ స్థానం నుంచిపోటీకి దిగారు.
భవిష్యత్‌లో తాను పోటీ చేయబోనని, యువతకు రాజకీయాల్లో అవకాశం కల్పిస్తానని రాజ్‌నాథ్ తెలిపారు. పీపుల్స్ ఇన్‌సైట్, పోల్‌స్ట్రాట్ సంయుక్తంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ డేటా దిగ్విజయ్ సింగ్‌కు చేదు అనుభవం ఎదురుకానున్నదని చెబుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క లోక్‌సభ సీటు కూడా దక్కదని పీపుల్స్ ఇన్‌సైట్, పోల్‌స్ట్రాట్ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌లో 2019లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు మాత్రమే వచ్చింది. రాజ్‌గఢ్ సీటు బీజేపీ ఖాతాలో పడింది. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఈసారి కూడా ఈ సీటును బీజేపీ కైవసం చేసుకోనుంది.
దిగ్విజయ్ సింగ్‌పై బీజేపీ రోడ్మల్ నాగర్‌ను పోటీకి నిలబెట్టింది. 2014, 2019లలో రాజ్‌గఢ్ లోక్‌సభ ఎన్నికల్లో రోడ్మల్ విజయం సాధించారు. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఈసారి కూడా రోడ్మల్‌కే విజయ సంకేతాన్ని చూపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వెల్లడికానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment