దమ్ముంటే విచారణ జరిపించాలి.: వీహెచ్
హైదరాబాద్‌సిటీ: దిగ్విజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సీనియర్ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. ప్రభుత్వానికి దమ్ముంటే విచారణ జరిపించాలని ఆయన సవాల్ విసిరారు. విలేకరులతో మాట్లాడుతూ..దిగ్విజయ్ దిష్టిబొమ్మలు తగలబెట్టడం సరికాదని అన్నారు. ప్రభుత్వం మీది..చేతనైతే విచారణ జరిపించాలన్నారు. కేసీఆర్ ఓ నియంత అని అన్నారు. ముఖ్యమంత్రి బీసీలకు విలువివ్వడని, జ్యోతిరావ్ పూలే జయంతికి దండ కూడా వేయలేదని ఆరోపించారు. రైతుల బాధలు చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని తెలిపారు.
ఇది రైతు ప్రభుత్వం కాదని, దళారుల ప్రభుత్వమని మండిపడ్డారు. దీనికి ఖమ్మం మార్కెట్ యార్డు ఘటనే నిదర్శనమన్నారు. రైతులను తుమ్ముల గూండాలని అనడం బాధాకరమన్నారు. రైతులపై దేశద్రోహం కేసులు పెట్టడం దారుణమని విమర్శించారు. మిర్చీ రైతుల వద్దకు సీఎం ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. నర్సింహన్‌కు కొనసాగింపు ఎందుకు?అని సూటిగా అడిగారు. గవర్నర్ నర్సింహన్ ఉన్నంత వరకు రెండు రాష్ట్రాలకు న్యాయం జరగదని చెప్పారు. ఈ విషయంలో రాజ్‌నాథ్ సింగ్‌కు లేఖ రాస్తానని హనుమంతరావు తెలిపారు.