నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కార్-వీహెచ్
హైదరాబాద్: తెలంగాణ సర్కార్ నిరంకుశత్వంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ఆరోపించారు. మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోమవారం ధర్నచౌక్‌లో రెండు వర్గాలకు అనుమతినిచ్చి రెచ్చగోట్టే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ధర్నాచౌక్‌లో స్థానికులు కాకుండా టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసులు ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
స్థానికులు మాత్రం తమకు మానవతాదృక్పదంతో తాగటానికి మంచినీళ్లు ఇచ్చారని చెప్పారు. రెచ్చిపోతే చచ్చిపోతారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంటున్నారు జనాన్ని చంపడానికి ఉన్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌గారు సీఎం కేసీఆర్ ఆరోగ్యం గరించి వాకబు చేస్తాడు కాని రైతుల సమస్యల గురించి మాత్రం పట్టించుకోరని వెద్దేవా చేశారు. రైతులకు బేడీలు వేసింనందుకు నిరసనగా "రైతులు ఉగ్రవాదులా" అనే వాల్‌పోస్టర్‌ను వీహెచ్ ఈసందర్భంగా ఆవిష్కరించారు.