హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో భాగంగా 690 మంది విద్యార్థులపై నమోదైన కేసులు ఎత్తివేయాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశంపై చర్చించేందుకు బుధవారం ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయని నరసింహారెడ్డి పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైయారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం హైదరాబాద్ నగరంలో జరిగిన ఆందోళనల్లో వందలాది మంది విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడితే విద్యార్థులపై కేసులు ఎత్తివేస్తామంటూ గతంలో టీఆర్ఎస్ నాయకులు ప్రకటించారు. దీంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటమే కాకుండా ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. దాంతో విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.