సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేళ్లలో తెలంగాణకు రూ.రెండున్నర లక్షల కోట్లకు పైగా నిధులిచ్చిందని అమిత్‌షా చేసిన సవాల్‌ఫై మంత్రి కేటీఆర్ చర్చకు రావాలి లేదా క్షమాపణలు చెప్పి, పదవికి రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డా.ఎస్.ప్రకాష్‌రెడ్డి, కొల్లిమాధవి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్ డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వారు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అంటేనే టీఆర్‌ఎస్‌కు వణుకు మొదలైందన్నారు. శ్రీలంకలో అవినీతి వ ల్ల ప్రజల చేతికి చిప్ప వచ్చింద ని, రాష్ట్రంలోనూ అ వే పరిస్థితులు రాబోతున్నా యన్న బండిసంజయ్ విమర్శలకు జవాబివ్వలేక కేటీఆర్ అవాకులు, చెవాకులు పేలుతున్నారని అన్నారు.
చదవండి👉🏻 శెభాష్ శ్రీనివాస్.. అమిత్ షా అభినందన
ఎనిమిదేళ్ల కుటుంబ, అవినీతి పాలనకు టీఆర్‌ఎస్ తిలోదకాలు ఇవ్వకపోతే ప్రజల చేతిలో గుణ పాఠం తప్పదని హెచ్చరించారు. బీజేపీ సభలో లేవనెత్తిన అంశాలకు మంత్రులు సమాధానాలు ఇవ్వలేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మం డిపడ్డారు. మంత్రి హరీశ్‌రావు అమిత్ షాను ‘వలస పక్షి’ అని సంబోధించారని, కేటీఆర్, ఇతర మంత్రులు తమ భాషను మానుకోవాలని సూ చించారు. టీఆర్‌ఎస్ తీరును బట్టే తమ సభ ఎంత విజయవంతమైందో స్పష్టమౌతోందని అన్నారు.
చదవండి👇
బండి సంజయ్‌కు మోదీ ఫోన్.. ‘హౌ ఆర్యూ బండి..శభాష్’
పాలమూరు ఎత్తిపోతలపై ప్రభుత్వ నిర్లక్ష్యం
పాస్‌పుస్తకంలో ‘పాట్ ఖరాబ్’
Comments
Please login to add a commentAdd a comment