టీఆర్‌ఎస్‌పై దూకుడే..
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిగ్విజయ్ హితవు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను, ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల అవి నీతిని సభలో ఎండగట్టాలని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సూచించారు. గురు వారం అసెంబ్లీ కమిటీ హాలులో కాంగ్రెస్ శాస నసభాపక్ష సమావేశం జరిగింది. సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన ఈ భేటీలో, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరిం చాల్సిన వ్యూహంపై దిగ్విజయ్ దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం.. సీఎం మాటలకు చేతలకు పొంతన లేదన్నది అన్ని వర్గాల ప్రజల్లోకి బాగా పోయిందన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల హామీలు, వాటి అమ లులో వైఫల్యం, కేసీఆర్ కుటుంబ అవినీతి తదితరా లపై సభలో దూకుడుగా పోరాడా లని సూచించారు.
మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిం దని, ఆ పథకంపై ప్రజల్లో టీఆర్‌ఎస్ కలిగిం చిన భ్రమలను తొలగించా లని భావన వ్యక్తమైంది. భగీరథపై సమ గ్రంగా అధ్యయనం చేసి ఆధారాలతో సహా సభలోనే ఎండ గట్టాలని సభ్యులు ప్రతిపాదిం చారు. సబ్‌ప్లాన్ నిధులు, బీసీలకు సబ్‌ప్లాన్, ఫీజు రీయింబర్స్ మెంట్ తదితరాలపై సభలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయిం చారు. అయితే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టా ల్సిన అవసరం లేదని నిర్ణయించారు. బడ్జెట్ పైనే ఓటింగుకు అవకాశమున్నప్పుడు కొత్తగా అవిశ్వాసం అవసరంలేదనే ఈ నిర్ణయం తీసు కున్నట్టు పార్టీ నేతలు వెల్లడించారు. భేటీలో ఆర్.సి.కుంతియా, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ పాల్గొన్నారు.
వైఫల్యాలపై ఎండగడతాం: టీఆర్‌ఎస్ వైఫల్యాలను సభలోనే ఎండ గట్టాలని నిర్ణయించినట్టు సీఎల్పీ కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. బడ్జెట్ సమావేశాల వ్యూహంపై చర్చించామన్నారు. ‘రీ డిజైన్ వల్లే ప్రాణహిత ప్రాజెక్టుకు జాతీయ హోదా కోల్పోయాం. నిర్వాసితులకు భూ సేకరణ చట్టం–2013 ప్రకారమే పరిహారమి వ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కార్పొరేషన్ల నుంచి సబ్సిడీని వెంటనే విడుదల చేయాలని పట్టుబడతాం. ధర్నాచౌక్‌ను తరలించాలన్న కుట్రపై పోరాడతాం. రైతులకు రుణమాఫీ చేయకుండామోసగించిన వైనం పైనా ఎండగడతాం’ అన్నారు.
సమస్యలపై పోరాడండి
ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో పోరాడాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిగ్విజయ్‌సింగ్ పిలుపునిచ్చారు. గాంధీభవన్‌లో గురువారం మైనారిటీ, గిరిజన, మహిళా సదస్సులో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో పోరాటాలను పెంచాలని సూచించారు. ఏప్రిల్ 9నుంచి 30వరకు గిరిజన పోరాటాలు చేయాలని నిర్ణయిం చామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ తెలిపారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో గిరిజన గర్జన, 13న దామరచర్లలో గిరిజనులతో బహిరంగసభ, 23న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో గిరిజన బహిరంగ సభ, ఏప్రిల్ 30న ఆదిలాబాద్‌లో గిరిజన సభ నిర్వహిస్తాం’’ అని ప్రకటించారు. యూపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలను విశ్వసించబోనని దిగ్విజయ్ అన్నారు.