మిషన్‌ భగీరథ అభినందనీయం | Congratulations to Mission Bhagiratha | Sakshi
Sakshi News home page

మిషన్‌ భగీరథ అభినందనీయం

Published Wed, May 10 2017 1:13 AM | Last Updated on Mon, Aug 20 2018 9:18 PM

మిషన్‌ భగీరథ అభినందనీయం - Sakshi

మిషన్‌ భగీరథ అభినందనీయం

- యూనిసెఫ్‌ లక్ష్యాలకు అనుగుణంగా సాగుతోంది
- రీసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్ల శిక్షణ కార్యక్రమంలో యునిసెఫ్‌ ప్రతినిధి నల్లీ
- సామాజిక, ఆర్థిక ప్రభావంపై బేస్‌లైన్‌ సర్వేకు సెస్‌ సన్నాహాలు  


సాక్షి, హైదరాబాద్‌: స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి అవసరమైన లక్ష్యాలను ప్రపంచ దేశాలన్నీ యునిసెఫ్‌ వేదికగా 2015లో నిర్దేశించుకున్నాయని, ఆ లక్ష్యాలలో అందరికీ సురక్షితమైన తాగునీరు అందించడం కూడా ఒకటని యూనిసెఫ్‌ ప్రతి నిధి ఎస్‌.ఆర్‌.నల్లీ అన్నారు. 2030 నాటికి ఈ లక్ష్యాలను సాధించాల్సి ఉండగా, ప్రపంచ లక్ష్యాలకు అనుగుణంగా 2017 లోనే పూర్తయ్యేలా తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌ ద్వారా ఒనగూరే సామాజిక, ఆర్థిక ఫలితాలను అంచనా వేసేందుకు సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌), యూనిసెఫ్‌ సంయుక్తంగా బేస్‌లైన్‌ సర్వేను నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి.

సర్వే నిమిత్తం రాష్ట్రవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి ఎంపిక చేసిన రీసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్లకు మంగళవారం సెస్‌ ఆడిటోరియంలో శిక్షణను ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎస్‌.ఆర్‌. నల్లీ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే తాగునీటి సంబంధి త సమావేశాల్లోనూ మిషన్‌ భగీరథను అన్ని రాష్ట్రాల ఉన్నతాధికారులు ప్రశంసిస్తు న్నారన్నారు. ఆర్‌డబ్లు్యఎస్‌ ఇంజనీర్‌ ఇన్‌ ఛీఫ్‌ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మిషన్‌ భగీరథను జాతీయ మోడల్‌గా ప్రధాని మోదీ పరిగణిస్తున్నారన్నారు. తెలంగాణ తాగునీటి ఎద్దడికి ‘మిషన్‌ భగీరథ’ శాశ్వత పరిష్కారంగా సీఎం కేసీఆర్‌ భావించారని చెప్పారు.  తెలంగాణలోని 24,248 ఆవాసా లకు సురక్షితమైన తాగునీటిని అందించే భగీరథ ప్రాజెక్ట్‌ను కేవలం మూడేళ్లలోనే (ఈ డిసెంబరు నాటికి) పూర్తి చేయబోతు న్నామని చెప్పారు. సెస్‌ డైరెక్టర్‌ ఎస్‌.గాలబ్‌ మాట్లాడుతూ మిషన్‌ భగీరథ తెలంగాణకి గర్వకారణమన్నారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నందారావుతో సెస్‌ ప్రొఫెసర్‌ రేవతి తదితరులు పాల్గొన్నారు.

బేస్‌లైన్‌ సర్వే చేసేది ఇలా..
ఈ నెల 14నుంచి ‘సెస్‌’ చేపట్టనున్న బేస్‌లైన్‌ సర్వే ప్రక్రియకు సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ మినహా రాష్ట్రంలోని 30 జిల్లాల్లోని 1500 గ్రామాలలో 12వేల కుటుంబాలను సర్వే చేయనున్నారు. ప్రతి గ్రామంలోనూ ఎనిమిది కుటుంబాల నుంచి సమాచారం సేకరిస్తారు. ప్రధానంగా సర్వేకు ఎంచుకున్న గ్రామాలలో ప్రస్తుతం తాగునీటి సదుపాయం, నీటి లభ్యత, దూరం, పరిమాణం, నాణ్యత, విశ్వసనీ యత, సుస్థిరత.. తదితర అంశాలపై వివరా లను సేకరించనున్నారు. అలాగే కొన్ని గ్రామాలలో విద్యా సంస్థలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, పరిశ్రమలలోనూ శాంపిల్‌ సర్వే నిర్వహిస్తారు. ఆయా గ్రామా లు, సంస్థలలో నీటి వినియోగం, పరిశుభ్రత కోసం పాటించే పద్ధతులను అధ్యయనం చేయనున్నారు. సర్వేకు వెళ్లే ప్రతి బృందం లోనూ ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలు (రీసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్లు)తో పాటు, సీనియర్‌ ఫ్యాకల్టీ ఒకరు బృందానికి నాయకత్వం వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement