కోటగుమ్మం (రాజమండ్రి, న్యూస్‌లైన్ : సీమాంధ్ర రాజధానిగా రాజ మండ్రి అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమండ్రి వేంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో ‘ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రాజమండ్రిని చేయాలి’ అనే అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం సదస్సు నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమండ్రికి రాజధానిగా ఉండగల అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విమానాశ్రయం, ఓఎన్‌జీసీ, ఆధునిక ఆస్పత్రులు, నీటి పారుదల సౌకర్యం ఉందన్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు గల ప్రాంతానికి మధ్యలో ఉందని తెలిపారు. మానవహక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రాజమండ్రిని రాజ దానిగా చేసేందుకు వందశాతం అనుకూలమైన వనరులున్నాయన్నారు. సామర్లకోట ప్రాంతం పారిశ్రామిక కారిడార్‌కు అనువైన దని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆరువేల ఎకరాలు వరకు భూములు ఉన్నాయన్నారు. శ్రీకృష్ణ కమిషన్ కూడా రాజమండ్రిని రాజధానిగా చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్టు తన నివేదికలో తెలిపిందని వివరించారు.
హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి
సీమాంధ్రకు రెండు హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసి, ఒకదానిని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలి. ఐఐటీలు, వైద్య విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలి.
- కర్రి రామారెడ్డి, మానిసిక వైద్య నిపుణులు.
ఉద్యోగావకాశాలు పెంచాలి
సీమాంధ్రలోని 13 జిల్లాలోను అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలి. 950 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. దీనికి రోడ్డు మార్గం అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి.
- గెద్దాడ హరిబాబు, ఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు
రాజధానిగా రాజమండ్రి అనుకూలం
Published Sun, May 11 2014 12:18 AM | Last Updated on Sat, Sep 15 2018 3:13 PM
Advertisement
Advertisement