minority welfare
-
మైనార్టీలు లేకుండా వైఎస్ఆర్సీపీ లేదు: సజ్జల
సాక్షి, అమరావతి: మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఏ ప్రభుత్వం చేయని సంక్షేమ పథకాలు సీఎం జగన్ అందిస్తున్నారన్నారు. తాడేపల్లిలో గురువారం ఏర్పాటు చేసిన మైనార్టీ సదస్సులో సజ్జల మాట్లాడుతూ.. డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం హామీలకు పరిమితమైందన్న సజ్జల ఇచ్చిన హామీలన్నీ సీఎం జగన్ అమలు చేశారని ప్రస్తావించారు. ముస్లిం మైనార్టీలకు ఆనాడు వైఎస్సార్ న్యాయ చేశారని.. ఇప్పుడు వైఎస్ జగన్ న్యాయం చేశారని గుర్తు చేశారు. అన్ని పథకాల్లోనూ మైనార్టీలకు ప్రాధాన్యతనిచ్చామని పేర్కొన్నారు. మైనార్టీ విద్యార్థులు చదువుకునే స్కూళ్లను అభివృద్ధిచేశారని చెప్పారు. మైనార్టీలు లేకుండా వైఎస్సార్సీపీ లేదని అన్నారు. చదవండి: కోటంరెడ్డి ఆరోపణలు.. పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ -
మైనారిటీ వెల్ఫేర్ లోన్స్ గురించి సీఎం కేసీఆర్‌కు జగ్గారెడ్డి లేఖ
-
అన్ని విధాలా మైనార్టీలకు న్యాయం చేస్తున్నాం: సీఎం జగన్
-
కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సీఎం జగన్ ఆదేశం
సాక్షి, అమరావతి: వక్ఫ్ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. వక్ఫ్ భూములపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని సూచించారు. మైనారిటీ సంక్షేమశాఖపై సీఎం వైఎస్ జగన్ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో భాగంగా.. భూముల చట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. ఉపాధి హామీ పథకం ద్వారా వీటి నిర్మాణం చేపట్టే అంశాన్ని పరిశీలించాలన్నారు.వైఎస్సార్ జగనన్న సమగ్ర భూ సర్వేతో పాటు.. వక్ఫ్ ఆస్తులను కూడా సర్వే చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కర్నూలులో వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, ఉన్నతాధికారులు హాజరయ్యారు. మైనార్టీలకూ సబ్ ప్లాన్ కోసం చర్యలు తీసుకోవాలి మైనార్టీలకు కొత్త శ్మశానవాటికల ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది ప్రాధాన్యతాంశంగా తీసుకుని వాటి నిర్మాణాలు చేపట్టాలని, ఇమామ్‌లు, మౌజమ్, పాస్లర్లకు సకాలంలో గౌరవ వేతనాలు చెల్లించాలని తెలిపారు. మైనార్టీలకూ సబ్ ప్లాన్ కోసం సంబంధించిన చర్యలు తీసుకోవాలని, మైనార్టీశాఖలో పెండింగ్ సమస్యలపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. మైనార్టీ విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటవుతున్న స్కిల్ డెవలప్మెంట్ సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. కర్నూలులో ఉర్దూ వర్శిటీ పనులను నాడు -నేడు తరహాలో చేపట్టాలని, ఉర్దూ అకాడమీని మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలని సీఎం అధికారుకు సూచించారు. విజయవాడ - గుంటూరు పరిసరాల్లో హజ్ హౌస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఉర్దూ అకాడమీ అభివృద్ధిపై ప్రణాళికలు సిద్ధి చేయాలని, షాదీఖానాల నిర్వహణను మైనార్టీశాఖకు బదిలీ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మైనార్టీశాఖలో ఖాళీ పోస్టుల నియామకాలను.. ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. విజయవాడ - గుంటూరు పరిసరాల్లో హజ్ హౌస్ నిర్మాణానికి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హజ్ కమిటీలు, వక్ఫ్ కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని, గుంటూరు జిల్లా గత ప్రభుత్వ హయాంలో అర్థాంతరంగా నిలిచిపోయిన క్రిస్టియన్ భవన్ పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారును ఆదేశించారు. -
మైనార్టీల సంక్షేమమే వైఎస్సార్సీపీ ధ్యేయం
సాక్షి, కర్నూలు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటుందని ఆ పార్టీ జిల్లా రీజినల్ కో–ఆర్డినేటర్ మేకపాటి గౌతంరెడ్డి, కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షులు బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. కర్నూలు పాతబస్తీలోని రాయల్ ఫంక్షన్ హాల్లో బుధవారం.. వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌతంరెడ్డి, బీవై రామయ్య, శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌కు పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా సహకరించాలని సూచించారు. చంద్రబాబు ప్రభుత్వం టార్గెట్లు విధించి..ప్రజలకు మద్యం తాపిస్తూ ప్రాణాలను హరిస్తోందన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి జరగలేదని.. అధికార పార్టీ నేతలు అక్రమమార్గంలో ఆర్థికంగా బలపడుతున్నారని విమర్శించారు. నమ్ముకున్న వారిని అమ్ముకుని పోయాడంటూ పార్టీ మారిన ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి గురించి ఎద్దేవా చేశారు. జన్మభూమిలో రేషన్ కార్డులు, పింఛన్లు, ఇళ్లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారన్నారు. దీంతో విసిగిపోయిన ప్రజలు అధికారులను నిలదీస్తున్నారన్నారు. కర్నూలు మండల పరిధిలోని పూడూరులో అధికారులను ఊర్లోకి కూడా రానీయలేదన్నారు. సాధ్యంకాని హామీలు గుప్పించడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, అన్ని వర్గాల ప్రజల మేలు కోసం నవరత్నాల వంటి పథకాలను రూపొందించారని తెలిపారు. డబ్బుతో రాజకీయం చేసే చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ప్రజలు వైఎస్ఆర్సీపీకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. నైతిక విలువలు కాపాడేందుకే వైఎస్సార్సీపీ ఆవిర్భవించిందని, ప్రజల కోసమే జగన్మోహన్రెడ్డి ఎండనకా, వాననకా పాదయాత్రలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రాజీనామా చేయించకుండానే 22 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్న టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విమర్శించారు. కర్నూలు సమన్వయకర్త హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. మైనారిటీలపై మానవత్వం చూపేది ఒక్క వైఎస్ఆర్ కుటుంబం మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరన్నారు. మైనార్టీలంతా వైఎస్సార్సీపీ పక్షమేనన్నారు. మైనారిటీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్‌ఖాదర్ మాట్లాడుతూ జాబు రావాలంటే బాబు పోవాలన్నారు. పార్టీ తల్లిలాంటిదని, గెలిపించిన పార్టీని వదలి మరో పార్టీలోకి చేరడం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్లు ఉందని విమర్శించారు. పత్తికొండ నేత, దివంగత చెరుకులపాడు నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల్లో నుంచే నాయకుడు పుడతాడన్నారు. అనంతరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.ఎ.రహ్మాన్, సంయుక్త కార్యదర్శి బి.జహీర్‌అహ్మద్‌ఖాన్, ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు సి.హెచ్.మద్దయ్య, జిల్లా నాయకురాలు విజయకుమారి మాట్లాడారు. కార్యక్రమంలో వివిధ శ్రేణుల నాయకులు టి.వి.రమణ, కటారి సురేశ్‌కుమార్, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, మహమ్మద్ తౌఫిక్, రాఘవేంద్రరెడ్డి, హరినాథ్‌రెడ్డి, ఆదిమోహన్‌రెడ్డి, సాంబశివారెడ్డి, మల్లికార్జున, జాన్, లతీఫ్, బోదేపాడు భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వం చెబుతున్నవన్నీ అబద్ధాలే!
మైనారిటీ సంక్షేమంపై మండలి లఘు చర్చలో కాంగ్రెస్ ఫైర్ ► చేసిన పనుల కన్నా ప్రభుత్వానికి ప్రచారం ఎక్కువైందన్న షబ్బీర్ అలీ ► మైనార్టీలకు కేటాయించిన బడ్జెట్లో 25 శాతమే ఖర్చు పెట్టారని వెల్లడి ► రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే 12% రిజర్వేషన్ బిల్లు: మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అల్ప సంఖ్యాక (మైనారిటీ) వర్గాల సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోందని కాంగ్రెస్ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమె త్తారు. ‘మైనారిటీల సంక్షేమం–ప్రభుత్వ కార్య క్రమాలు’ అంశంపై మంగళవారం శాసన మండలి లఘుచర్చ వాడీవేడిగా కొనసాగింది. ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ) మహమూద్ అలీ చర్చను ప్రారంభిస్తూ.. 20 ఏళ్ల సమైక్య పాలనలో మైనార్టీలకు అన్యాయం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ.1,204 కోట్లు కేటాయించిందన్నారు. విపక్ష నేత షబ్బీర్ స్పందిస్తూ.. కేటాయించిన వాటిలో ఇప్పటివరకు 25 శాతం నిధులనే ఖర్చు చేసిందని ఆరోపించారు. మరో రెండు నెలల్లో మిగిలిన నిధులన్నీ ఖర్చు చేయడం సాధ్యమే నా అని ప్రశ్నించారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల కోసం 1.60 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుకూ రుణం అందలే దన్నారు. వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికా రాలను కల్పిస్తామన్న ప్రభుత్వం, రెండున్న రేళ్లయినా హామీని నిలబెట్టుకోలేదన్నారు. మణికొండలో కబ్జా అయిన వక్ఫ్‌ల్యాండ్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఉర్దూ ద్వితీయ భాష హామీ ఏమైంది? రాష్ట్రంలో ఉర్దూను ద్వితీయ భాషగా చేస్తామ న్న ప్రభుత్వ హామీ నేటికీ అమలుకు నోచుకో లేదన్నారు. ఉర్దూ అకాడమీలో సిబ్బంది వేత నాలకు నిధులు మంజూరు చేయడం లేదన్నా రు. రాష్ట్రంలో ఇంతకు మునుపు 40 మైనారిటీ ఇంజనీరింగ్ కళాశాలలుండగా, రాష్ట్ర ప్రభుత్వ చర్యల పుణ్యమాని 18 కళాశాలలు మూత పడ్డాయన్నారు. అజ్మీర్ దర్గా వద్ద తెలంగాణ భవన్ నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇంతవరకు భూమిని ఎందుకు కొనుగోలు చేయలేదో చెప్పాలన్నారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చి 32 నెలలు దాటిందని, మైనార్టీలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని షబ్బీర్ అలీ విమర్శించారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగింపు: మహమూద్ అలీ రానున్న బడ్జెట్ సమావేశాల్లోనే ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడతామని మహమూద్ అలీ శాసన మండలిలో ప్రకటిం చారు. రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతా నికి మించరాదనే నిబంధనను సడలించేందుకు తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా (45/94) చట్టం తెస్తామన్నారు. ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపుతామన్నారు. రాష్ట్రంలో దళిత క్రిష్టియన్లకు ఎస్సీహోదాను కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చిందని చెప్పారు. క్రైస్తవులు చర్చిలను నిర్మించుకునేందుకు వీలుగా స్థానిక సంస్థల ద్వారానే అనుమతి పొందేలా ఉత్తర్వులు ఇచ్చామన్నారు. హైదరాబాద్‌లో క్రిస్టియన్ భవన్ నిర్మించేందుకు ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించిన సంగతిని ఆయన గుర్తుచేశారు. గతంలో 35 మంది ఉద్యోగులతో ఉన్న మైనారిటీ సంక్షేమ శాఖను బలోపేతం చేసే దిశగా 80 పోస్టులను ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిందన్నారు. మైనారిటీల కోసం ఈ ఏడాది 71 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. వచ్చే ఏడాది మరో 129 స్కూళ్లను ప్రారంభించబోతున్నామన్నారు. మొత్తం 200 పాఠశాలల్లో ఆడపిల్లలకు 100 పాఠశాలలను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆదేశాలే తప్ప నిధులివ్వట్లేదు: షబ్బీర్ అలీ ధ్వజం రైతులకు డబ్బులు చెల్లించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు ఆదేశాలివ్వడంతో సరిపుచ్చుతోంది కానీ నిధులు విడుదల చేయడం లేదని శాసనమండలిలో విపక్షనేత షబ్బీర్ అలీ ఆరోపించారు. రైతులకు ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మండలి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ‘రాష్ట్రంలో నేటికీ ఎక్కడో ఒకచోట రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది’ అని ఆయన విమర్శించారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకరరెడ్డి మాట్లాడుతూ ‘తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తోంది. సభలో కూడా రైతుల సమస్యలపై మంత్రులు ఇస్తున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవు. రైతులకు రుణాల మాఫీ, ఇన్ పుట్ సబ్సిడీ, విత్తనాల పంపిణీ సరిగా జరగడం లేదు’ అంటూ ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వం నకిలీ రైతు ప్రభుత్వంగా, కాంట్రాక్ట్‌ల ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. -
దుల్హన్ పథకానికి రూ.5 కోట్లు
– జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మస్తాన్‌వలి కర్నూలు(అర్బన్): నిరుపేద వర్గాలకు చెందిన ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పథకం ద్వారా 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లతో ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మస్తాన్‌వలి తెలిపారు. మంగళవారం స్థానిక బాలాజీ నగర్‌లోని మదీనా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ హైస్కూల్లో ఆల్‌మేవా సంయుక్త కార్యదర్శి షంషుద్దీన్ అధ్యక్షతన దుల్హన్ పథకం, ముస్లిం విద్యార్థులకు ఉపకార వేతనాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్‌వలి మాట్లాడుతు అర్హులైన ముస్లిం మైనారిటీలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలన్నారు. ఆల్‌మేవా సభ్యుడు ఎస్.అబ్దుల్భారీ మాట్లాడుతు మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు అందించనున్నట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9985302570 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందాలన్నారు. షంషుద్దీన్ మాట్లాడుతు ప్రతి ఒక్కరూ విద్యావంతులై సమాజాభివద్ధికి పాటు పడాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మౌలానా హఫీజ్ఉస్మాన్, ఎస్ఎండీ ఆయూబ్సాబీర్, అబ్దుల్‌సుభాన్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తోనే మైనార్టీ సంక్షేమం
ఇఫ్తార్ విందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జహీరాబాద్: కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీ సంక్షేమం సాధ్యమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి జహీరాబాద్‌లోని ఫ్రెండ్స్ ఫంక్షన్హాల్లో ఎమ్మెల్యే జె.గీతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలను ఉద్దేశించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ముస్లిం మైనార్టీల భద్రత, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షానే ఉందన్నారు. ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ 4శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు. తాము ఇచ్చిన రిజర్వేషన్ల మూలంగానే ముస్లిం మైనార్టీలు విద్య, ఉద్యోగాల్లో లబ్ధిపొందుతున్నారన్నారు. ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలకు మేలు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను ఎన్నడూ విస్మరించలేదన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘనారెడ్డి, తాలూకా అధ్యక్షుడు ఎం.డి.జాఫర్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మంకాల్ సుభాష్, ఆత్మ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కండెం నర్సింహులు, రామలింగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
అల్పసంఖ్యాక వర్గాల కేటాయింపులపై రగడ
స్పీకర్ పోడియంను చుట్టు ముట్టిన విపక్ష సభ్యులు.. సభ వాయిదా సాక్షి, హైదరాబాద్: అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయిం పులు, నిధుల వ్యయంపై సభ అట్టుడికింది. బుధవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అత్తర్ చాంద్‌బాషా, అంజాద్ బాషా, ఎస్వీ మోహన్‌రెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, మహమ్మద్ ముస్తఫా తదితరులు అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన నిధులు, విడుదల చేసినవి, ఖర్చు చేసిన వివరాలు ఇవ్వాలని కోరారు. దీనికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమాధానమిస్తూ.. 2014-15లో ఉపకార వేతనాలకు నిధులు ఖర్చు చేయలేదని, వివిధ పథకాల కింద రూ. 247 కోట్ల్ల బడ్జెట్ కేటాయిస్తే అంతకంటే ఎక్కువగా రూ.309 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. మంత్రి చూపించిన లెక్కలకూ వాస్తవ వ్యయానికీ పొంతన లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై అంజాద్ బాషా, చాంద్‌బాషా మాట్లాడుతుండగానే మైకు కట్‌చేశారు. అలా మైకులు కట్ చేయడమేంటని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ స్పీకర్‌ను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యులంతా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. అయినా స్పీకర్ స్పందించకుండా ప్రశ్నోత్తరాల సమయాన్ని కొనసాగించారు. తమకు అవకాశం ఇచ్చే వరకు కదిలేది లేదని సభ్యులు స్పష్టం చేయడంతో సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. పల్లె సవాలును అడ్డుకున్న యనమల: అంతకుముందు.. మంత్రి పల్లె మాట్లాడుతూ మైనార్టీ సంక్షేమంపై తాను చెప్పిన వివరణ తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్ విసిరారు. పల్లె సవాల్‌ను మంత్రి యనమల అడ్డుకున్నారు. దీంతో సవాల్ నుంచి ఎందుకు పారిపోతున్నారంటూ వైఎస్సార్సీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. -
ఆధిపత్య పోరు..!
మైనార్టీ సంక్షేమ శాఖలోకార్యదర్శి వర్సెస్ డెరైక్టర్ అధికార ఉత్తర ప్రత్యుత్తరాలపై మెమో జారీ చేసిన కార్యదర్శి తీవ్రంగా పరిగణించి ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాసిన డెరైక్టర్ ఉపముఖ్యమంత్రి జోక్యం చేసుకున్నా ఆగని వివాదం గాడి తప్పుతున్న మైనార్టీ సంక్షేమం సిటీబ్యూరో: రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం దేవుడెరుగు గానీ....శాఖ కార్యదర్శి , డెరైక్టర్ల మధ్య ఆధిపత్య పోరు పరిపాలన యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలు లక్ష్యానికి చేరుకోగా పోగా, వాటిపై అధికారుల్లో కనీసం జవాబు దారీతనం కరువైంది. కొంత కాలంగా ఇరువురి మధ్య రగులుతున్న అంతర్గత వివాదానికి ఇటీవల ఒక అధికారి సర్వీస్ పొడిగింపు ప్రతిపాదనల వ్యవహారం మరింత ఆజ్యం పోసినట్లయింది. ఈ నేపథ్యంలో మైనార్టీ సంక్షేమ విభాగాలపై డెరైక్టర్ అజమాయిషీ లేకుండా చేసేవిధంగా కార్యదర్శి మెమో జారీ చేయడం సంచలనం సృష్టించింది. దీనిని తీవ్రంగా పరిగణించిన డెరైక్టర్ ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖను రాయడం చర్చనీయాంశంగా తయారైంది. సాక్షాత్తు ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ జోక్యం చేసుకున్నా వివాదానికి తెర పడనట్లు తెలుస్తోంది. ప్రచ్ఛన్న యుద్దం.. మైనార్టీ సంక్షేమ శాఖపై ప్రత్యేకంగా మంత్రి ప్రాతినిధ్యం లేక పోవడం ఉన్నత స్థాయి అధికారుల మధ్య ఆధిపత్యం పోరుకు దారి తీసినట్లయింది. గత ఏడాది కాలంగా కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, డెరైక్టర్ ఎంజే అక్బర్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల కార్యదర్శి ‘‘ 2014 అక్టోబర్ 28న లేఖ నంబర్ 1501/2014-2 ద్వారా జారీ అయినా మెమో (మైనార్టీ సంక్షేమ విభాగాల ద్వారా ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలు, ఉత్తర ప్రత్యుత్తరాల అంశం)’ పై తిరిగి కార్లిఫికేషన్ ఇస్తూ అదే నంబర్‌తో మరో మెమో జారీ చేయడం కలకలం రేపింది. ఈ మెమోలో ‘ మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ శాఖాపరమైన అధిపతి. డెరైక్టర్ నిధుల పంపిణీ, పాలసీ సంబంధించిన అంశాలకు పరిమితం. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇండిపెండెంట్ సంస్థ. మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలో పనిచేస్తోంది. ఇతర కార్పొరేషన్ల మాదిరిగా ఇండిపెండెంట్‌గా కార్యకలాపాలు కొనసాగించాలి, అంటూ పేర్కొనడం మైనార్టీ విభాగాలపై డెరైక్టర్ ఆజమాయిషి లేకుండా చేసినట్లయింది. ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ... రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి జారీ చేసిన మెమోపై తీవ్రంగా స్పందించిన డెరైక్టర్ ఒక అడుగు ముందుకువేసి ప్రభుత్వానికి సుదీర్ఘ లేఖ రాశారు. ఈ నెల 9వ తేదిన లేటర్ నెంబర్ సీ /49సీఎండబ్ల్యు/ఎడిఎంఎన్/2016 ద్వారా గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోలు , మెమోలు, ఆదేశాలను కోడ్ చేస్తూ సుమారు ఏడు పేజీల సుద్ఘీ లేఖాస్త్రాన్ని సంధించడం శాఖలో సంచలనం సృష్టించింది. ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా 2014 అక్టోబర్ 28న జారీ చేసిన మెమోకు కార్లిఫికేషన్గా ఇటీవల జారీ అయినా మెమో భిన్నంగా ఉందని, ఇది పరిపాలన యంత్రాంగంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొనడం కారద్యర్శిపై ఎదురుదాడికి దిగినట్లయింది. వాస్తవంగా 2014లో మైనార్టీ సంక్షేమ శాఖ సహయ కార్యదర్శి ఒక మెమో జారీ చేస్తూ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, మైనార్టీ కిస్ట్రియన్(మైనార్టీ) కార్పొరేషన్లు ప్రభుత్వానికి పంపించే ప్రతిపాదనలు,అధికార ఉత్తర ప్రత్యుత్తరాలు డెరైక్టర్ ద్వారా సమర్పించాలని, నేరుగా సంబంధిత శాఖ కార్యదర్శి, ప్రభుత్వానికి పంపవద్దని సూచించిన విషయాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. అదే విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం మైనార్టీ కమిషనరేట్ (డెరైక్టరేట్) ఏర్పాటు నేపథ్యంలో జారీ చేసిన జీవో నంబర్ 37,161,130.345 లతో పాటు జారీ అయినా మెమోల్లో గల మైనార్టీ సంక్షే మ శాఖ డెరైక్టరేట్‌కు గల అధికారాలు, విభాగాల ద్వారా అమలయ్యే పథకాలపై పర్యవేక్షణ, తదితర అంశాలను డెరైక్టర్ లేఖలో వివరించారు. తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు తర్వాత కూడా జారీ కాబడిన మెమోలోని అంశాలను కోడ్ చేస్తూ... ఇటీవల కార్లిఫికేషన్ ఇచ్చిన మెమోను అనుసరించి తగిన పరిష్కా రం చూపాలని లేఖలో విజ్ఞప్తి చేయడం కార్యదర్శిని సవాల్ చేసినట్లయింది. దీంతో ఇరువురి మధ్య వివాదం మరింత పెరిగినట్లయింది. -
కోల్డ్‌స్టోరేజీలో కీలక ప్రతిపాదనలు
జీవోఎం నివేదికలు 3నెలలుగా సీఎం కార్యాలయంలోనే.. పెండింగ్‌లోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల కొత్త మార్గదర్శకాలు హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ రంగానికి సంబంధించిన కీలకమైన ప్రతిపాదనలన్నీ ‘కోల్డ్‌స్టోరేజీ’లో మూలుగుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల ద్వారా అమలుచేస్తున్న వివిధ పథకాల్లో పెద్ద ఎత్తున మార్పులు చేస్తున్నట్లు ప్రకటించినా... వాటిపై ఇంకా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. వీటితోపాటు పలు అభివృద్ధి పనులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం (జీవోఎం)సమర్పించిన ప్రతిపాదనలు 3 నెలలుగా సీఎం వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. ఎస్సీశాఖ బాధ్యతలను స్వయంగా చూసుకుంటున్న సీఎం కేసీఆర్.. ఆ శాఖకు సంబంధించిన ముఖ్యమైన ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోవడం లేదు. దీంతో పథకాలకోసం ఎదురుచూస్తున్న ప్రజలు నిరాశలో మునిగిపోతున్నారు. వెలువడని ఆదేశాలు: వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలుచేస్తున్న స్వయం ఉపాధి, ఆర్థిక స్వావలంబన పథకాలకు ఒకేవిధమైన ఆదాయ, వయోపరిమితిని ఖరారు చేయడం వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఆదేశాలే రాలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖల పరిధిలోని విద్యాసంస్థలు, హాస్టళ్లలో మార్పులు తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలవుతున్నా ఎటువంటి చలనం లేదు. సంక్షేమశాఖల పరిధిలోని ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ప్రవేశాలకు సంబంధించిన తాజా మార్గదర్శకాలు విడుదలే కాలేదు. ఇలా మరెన్నో ప్రతిపాదనలు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమశాఖలకు 2015-16లో అమలు చేయాల్సిన సబ్సిడీ విధానం, బ్యాంక్ లింకేజీ, ఆయా పథకాల నిబంధనలు, ఇంకా తీసుకురావాల్సిన మార్పులు, చేర్పులు, వ్యక్తిగత రుణ విభాగం కింద గరిష్ట రుణ పరిమితి రూ.10 లక్షలకు పెంపుతో పాటు రాయితీని రూ.5 లక్షలకు పెంచాలని మే 8న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల బృందం (జీవోఎం) సమావేశంలో నిర్ణయించారు. తర్వాత మే 14న ఆయా పథకాల్లో మార్పులు, మార్గదర్శకాల్లో చేపట్టాల్సిన సవరణలు, ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలు, సూచనలతో తుది అంచనాను ఉన్నతాధికారులు రూపొందించి, ప్రభుత్వానికి సమర్పించారు. అయినా ఇంకా కొత్త రాయితీ విధానం ఖరారు కాలేదు. ఇలా అనేక ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయాలు వెలువడడం లేదు. -
రాజధానిగా రాజమండ్రి అనుకూలం
కోటగుమ్మం (రాజమండ్రి, న్యూస్‌లైన్ : సీమాంధ్ర రాజధానిగా రాజ మండ్రి అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమండ్రి వేంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో ‘ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రాజమండ్రిని చేయాలి’ అనే అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం సదస్సు నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమండ్రికి రాజధానిగా ఉండగల అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విమానాశ్రయం, ఓఎన్జీసీ, ఆధునిక ఆస్పత్రులు, నీటి పారుదల సౌకర్యం ఉందన్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు గల ప్రాంతానికి మధ్యలో ఉందని తెలిపారు. మానవహక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రాజమండ్రిని రాజ దానిగా చేసేందుకు వందశాతం అనుకూలమైన వనరులున్నాయన్నారు. సామర్లకోట ప్రాంతం పారిశ్రామిక కారిడార్‌కు అనువైన దని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆరువేల ఎకరాలు వరకు భూములు ఉన్నాయన్నారు. శ్రీకృష్ణ కమిషన్ కూడా రాజమండ్రిని రాజధానిగా చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్టు తన నివేదికలో తెలిపిందని వివరించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి సీమాంధ్రకు రెండు హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసి, ఒకదానిని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలి. ఐఐటీలు, వైద్య విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలి. - కర్రి రామారెడ్డి, మానిసిక వైద్య నిపుణులు. ఉద్యోగావకాశాలు పెంచాలి సీమాంధ్రలోని 13 జిల్లాలోను అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలి. 950 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. దీనికి రోడ్డు మార్గం అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి. - గెద్దాడ హరిబాబు, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు