దుల్హన్ పథకానికి రూ.5 కోట్లు
దుల్హన్ పథకానికి రూ.5 కోట్లు
Published Tue, Sep 27 2016 10:01 PM | Last Updated on Mon, Sep 4 2017 3:14 PM
– జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మస్తాన్‌వలి
కర్నూలు(అర్బన్): నిరుపేద వర్గాలకు చెందిన ముస్లిం మైనారిటీలకు దుల్హన్ పథకం ద్వారా 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.5 కోట్లతో ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మస్తాన్‌వలి తెలిపారు. మంగళవారం స్థానిక బాలాజీ నగర్‌లోని మదీనా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ హైస్కూల్‌లో ఆల్‌మేవా సంయుక్త కార్యదర్శి షంషుద్దీన్ అధ్యక్షతన దుల్హన్ పథకం, ముస్లిం విద్యార్థులకు ఉపకార వేతనాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మస్తాన్‌వలి మాట్లాడుతు అర్హులైన ముస్లిం మైనారిటీలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలన్నారు. ఆల్‌మేవా సభ్యుడు ఎస్.అబ్దుల్‌భారీ మాట్లాడుతు మౌలానా ఆజాద్ ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముస్లిం విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపకార వేతనాలు అందించనున్నట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థినీ, విద్యార్థులు ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9985302570 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం పొందాలన్నారు. షంషుద్దీన్ మాట్లాడుతు ప్రతి ఒక్కరూ విద్యావంతులై సమాజాభివద్ధికి పాటు పడాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం మౌలానా హఫీజ్‌ఉస్మాన్, ఎస్‌ఎండీ ఆయూబ్‌సాబీర్, అబ్దుల్‌సుభాన్, ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement