కాంగ్రెస్తోనే మైనార్టీ సంక్షేమం | uttam kumar reddy in ifthar dinner | Sakshi

కాంగ్రెస్తోనే మైనార్టీ సంక్షేమం

Published Sun, Jun 26 2016 12:19 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

కాంగ్రెస్తోనే మైనార్టీ సంక్షేమం - Sakshi

కాంగ్రెస్తోనే మైనార్టీ సంక్షేమం

ఇఫ్తార్ విందులో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జహీరాబాద్:  కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీ సంక్షేమం సాధ్యమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శనివారం రాత్రి జహీరాబాద్‌లోని ఫ్రెండ్స్ ఫంక్షన్‌హాల్‌లో ఎమ్మెల్యే జె.గీతారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షురాలు సునీతాలక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీలను ఉద్దేశించి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ముస్లిం మైనార్టీల భద్రత, సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ మైనార్టీల పక్షానే ఉందన్నారు. ముస్లిం మైనార్టీలకు కాంగ్రెస్ పార్టీ 4శాతం రిజర్వేషన్లు ఇచ్చిందని గుర్తు చేశారు.

తాము ఇచ్చిన రిజర్వేషన్ల మూలంగానే ముస్లిం మైనార్టీలు విద్య, ఉద్యోగాల్లో లబ్ధిపొందుతున్నారన్నారు.  ఎమ్మెల్సీ షబ్బీర్‌అలీ మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీతోనే మైనార్టీలకు మేలు జరుగుతుందన్నారు.  ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీలను ఎన్నడూ విస్మరించలేదన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. సమావేశంలో జహీరాబాద్ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు మేఘనారెడ్డి, తాలూకా అధ్యక్షుడు ఎం.డి.జాఫర్, మున్సిపల్ మాజీ ఛైర్మన్ మంకాల్ సుభాష్, ఆత్మ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కండెం నర్సింహులు, రామలింగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement