రిజర్వ్‌డ్ కేటగిరీల మధ్య ఉప వర్గీకరణ చెల్లుబాటుకు సంబంధించిన పిటిషన్లను నేడు భారత ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సుప్రీం కోర్టులో విచారించనుంది. బెంచ్‌లో న్యాయమూర్తులుగా బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ, సందీప్ మెహతా ఉన్నారు.
తమిళనాడుకు చెందిన అరుంథతియార్ కమ్యూనిటీ తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, న్యాయవాది జి బాలాజీ సహా దేశవ్యాప్తంగా పలు రిజర్వ్‌డ్ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు ఈ కేసుకు హాజరవుతున్నారు.
ఈ ఉప వర్గీకరణ కేసు 2020 నాటిది. జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గతంలో బలహీనమైన వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర జాబితాలోని షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగలను రాష్ట్రాలు వారీగా ఉప వర్గీకరించవచ్చని పేర్కొంది. అయితే ఈ బెంచ్ తీసుకున్న అభిప్రాయం 2004లో ఈవీ ఛిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉంది.
ఈ తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఏకపక్షంగా షెడ్యూల్డ్ కులాల సభ్యుల తరగతిలో ఒక తరగతిని చేర్చడానికి అనుమతించడం అనేది రాష్ట్రపతి పరిధిలో ఉంటుంది.
ఈ కేసులో కోఆర్డినేట్ బెంచ్‌ల విరుద్ధమైన అభిప్రాయాలను ఈ ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు పంపారు. ఈ నేపధ్యంలో విచారణ అనంతరం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలలో ఉప-వర్గీకరణను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర శాసనసభలు సమర్థవంతంగా ఉన్నాయో లేదో అనేది కోర్టు నిర్ణయించనుంది.
Comments
Please login to add a commentAdd a comment