sub
-
‘కాళేశ్వరం’లో 50 మందికిపైగా సబ్ కాంట్రాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్‌కాంట్రాక్టర్లు పాలుపంచుకున్నారని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గుర్తించింది. బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతి క లోపాలపై విచారణ తుది అంకానికి చేరుకుంది. దీంతో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించింది. బ రాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు జస్టిస్ పినా కి చంద్రఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బరాజ్‌ల పనులు దక్కించుకున్న నిర్మా ణ సంస్థలు చాలా పనులను నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించినట్టు కమిషన్ నిర్థారణకు వచ్చింది. గత ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత సమీప బంధువులకు చెందిన కంపెనీలు సైతం సబ్ కాంట్రాక్టులు పొందాయని గుర్తించినట్టు తెలిసింది. తొలుత జారీచేసిన పరిపాలనాపర అను మతుల ప్రకారం బరాజ్‌ల నిర్మాణానికి అంచనా వ్యయం ఎంత? ఆ తర్వాత ఎన్నిసార్లు పెంచారు? ఎంత పెంచారు? గడువులోగానే పనులు పూర్తి చేసినప్పుడు అంచనా వ్యయం పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సబ్ కాంట్రాక్టర్లకు ఏ పనులు కట్టబెట్టారు? వారికి ఎంత చెల్లించారు? ఈ వ్యవహారంలో అవకతవకలు ఏమైన జరిగాయా? వంటి అంశాలపై ఆరా తీస్తోంది. బరాజ్‌ల ఆర్థిక వ్యవహారాలపై మరింత లోతుగా విచారణ నిర్వహించడానికి ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను కమిషన్ కార్యాలయంలో నియమించాలని ప్రభుత్వా న్ని కోరింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌లో కమిషన్‌కు సహకరించడానికి తెలంగాణ(కాళేశ్వరం ప్రాజెక్టు), పశ్చిమబెంగాల్(జస్టిస్ ఘోష్ సొంత రాష్ట్రం)తో సంబంధం లేని సీనియర్ న్యాయవాదిని సైతం నియమించాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 పంప్‌హౌజ్‌ల పనులను నిర్వహించిన ఓ నిర్మాణ సంస్థకు సంబంధించిన వైస్‌ప్రెసిడెంట్‌తో సహా మరో ఇద్దరు ఉన్నత అధికారులను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ గురువారం తన కార్యాలయంలో విచారించింది.పంప్‌హౌజ్‌ల నిర్మాణ స్థలం ఎంపిక, డిజైన్లు తదితర అంశాలపై కమిషన్ వారిని ప్రశ్నించగా, ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం, అందించిన డిజైన్ల ప్రకారమే వాటిని నిర్మించినట్టు ఆ కంపె నీ ప్రతినిధులు బదులిచ్చినట్టు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల జారీతో సంబంధం ఉన్న వర్క్ అండ్ అకౌంట్స్ విభాగం డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మను సైతం కమిషన్ విచారించింది. విద్యుత్‌రంగ నిపుణుడు కె.రఘు ఈ నెల 15న, కేంద్ర జలశక్తిశాఖ మంత్రి మాజీ సలహాదారుడు వెదిరె శ్రీరాం ఈ నెల 16న కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వీరు అనుమతి కోరగా, కమిషన్ అందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేడు కమిషన్ ఎదుట రహస్య సాక్షి బరాజ్‌ల నిర్మాణంలో లోపాలను వ్యతిరేకిస్తూ తన ఉద్యోగాన్ని వదులుకున్న ఓ నిర్మాణ సంస్థలోని కీలక ఉద్యోగి శుక్రవారం కమిషన్ ముందు హాజరై తన వాదనలు వినిపించనున్నారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు అందించనున్నారు. ఆయన వివరాలను కమిషన్‌వర్గాలు గోప్యంగా ఉంచాయి. -
రిజర్వ్డ్ కేటగిరీల ఉప వర్గీకరణ చెల్లుబాటుపై విచారణ నేడు
రిజర్వ్డ్ కేటగిరీల మధ్య ఉప వర్గీకరణ చెల్లుబాటుకు సంబంధించిన పిటిషన్లను నేడు భారత ప్రధాన న్యాయమూర్తి డీ వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం సుప్రీం కోర్టులో విచారించనుంది. బెంచ్‌లో న్యాయమూర్తులుగా బిఆర్ గవాయ్, విక్రమ్ నాథ్, పంకజ్ మిథాల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ, సందీప్ మెహతా ఉన్నారు. తమిళనాడుకు చెందిన అరుంథతియార్ కమ్యూనిటీ తరపు సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, న్యాయవాది జి బాలాజీ సహా దేశవ్యాప్తంగా పలు రిజర్వ్డ్ కమ్యూనిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాదులు ఈ కేసుకు హాజరవుతున్నారు. ఈ ఉప వర్గీకరణ కేసు 2020 నాటిది. జస్టిస్ (రిటైర్డ్) అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ గతంలో బలహీనమైన వారికి ప్రాధాన్యత ఇవ్వడానికి కేంద్ర జాబితాలోని షెడ్యూల్డ్ కులాలు , షెడ్యూల్డ్ తెగలను రాష్ట్రాలు వారీగా ఉప వర్గీకరించవచ్చని పేర్కొంది. అయితే ఈ బెంచ్ తీసుకున్న అభిప్రాయం 2004లో ఈవీ ఛిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా ఉంది. ఈ తీర్పు ప్రకారం రాష్ట్రాలు ఏకపక్షంగా షెడ్యూల్డ్ కులాల సభ్యుల తరగతిలో ఒక తరగతిని చేర్చడానికి అనుమతించడం అనేది రాష్ట్రపతి పరిధిలో ఉంటుంది. ఈ కేసులో కోఆర్డినేట్ బెంచ్‌ల విరుద్ధమైన అభిప్రాయాలను ఈ ఏడుగురు న్యాయమూర్తుల బెంచ్‌కు పంపారు. ఈ నేపధ్యంలో విచారణ అనంతరం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాలలో ఉప-వర్గీకరణను ప్రవేశపెట్టడానికి రాష్ట్ర శాసనసభలు సమర్థవంతంగా ఉన్నాయో లేదో అనేది కోర్టు నిర్ణయించనుంది. -
కియా కా కమాల్... రికార్డు సృష్టిస్తోన్న ఆ మోడల్ కారు అమ్మకాలు
Kia Sub Compact SUV Car Sonet Sales: అతి తక్కువ కాలంలోనే ఆటోమొబైల్ మార్కెట్‌పై చెదరని ముద్ర వేసిన కియా.. తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఆ కంపెనీ నుంచి వస్తున్న ప్యాసింజర్ వెహికల్స్ ఒకదాని వెంట ఒకటిగా అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏడాదిలోనే కియా కంపెనీ కార్లు ఇండియన్ రోడ్లపై రివ్వుమని దూసుకుపోతున్నాయి. ఇప్పటికే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో సెల్టోస్ అమ్మకాలు అదుర్స్ అనే విధంగా ఉండగా ఇప్పుడు సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లోనూ అవే ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. గతేడాది సెప్టెంబరులో మార్కెట్లోకి వచ్చిన కియా సోనెట్ అమ్మకాల్లో అప్పుడే లక్ష మార్కును అధిగమించింది. ఈ మోడల్ రిలీజైన ఏడాదిలోగానే లక్షకు పైగా అమ్మకాలు జరుపుకుని రికార్డు సృష్టించింది. గడ్డు పరిస్థితులను ఎదుర్కొని వాస్తవానికి కరోనా ఫస్ట్ వేవ్ ముగిసన తర్వాత ఆటోమైబైల్ రంగం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంది. మార్కెట్ ఇంకా గాడిన పడకముందే 2020 సెప్టెంబరు 20న సొనెట్ మోడల్ని మార్కెట్లోకి తెచ్చింది కియా. ఆ కంపెనీ అంచనాలను సైతం తారు మారు చేస్తూ 12 నెలల వ్యవధిలోనే లక్ష కార్లు అమ్ముడయ్యాయి. కియా అమ్మకాల్లో ఒక్క సోనెట్ వాటానే 32 శాతానికి చేరుకుందని ఆ కంపెనీ మార్కెటింగ్ అండ్ సేల్స్ చీఫ్ , ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టియో జిన్ పార్క్ తెలిపారు. టెక్నాలజీ అండతో.. సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో మారుతి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300 వంటి ప్యాసింజర్ వెహికల్స్ నుంచి పోటీని తట్టుకుంటూ కియో సోనెట్ భారీగా అమ్మకాలు సాధించడం వెనుక టెక్నాలజీనే ప్రముఖ పాత్ర పోషించినట్టు మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఈ సెగ్మెంట్లో టెక్నాలజీలో సోనెట్ మెరుగ్గా ఉన్నట్టు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ స్టెబులిటీ కంట్రోల్ (ఈఎస్సీ), వెహికల్ స్టెబులిటీ మేనేజ్మెంట్ (వీఎస్ఎమ్), బ్రేక్ అసిస్ట్ (బీఏ), హిల్ అసిస్ట్ కంట్రోల్ (హెచ్ఏసీ), పెడల్ షిప్టర్స్, వాయిస్ కమాండ్ ఆపరేటెడ్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఈ కారుకు అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రారంభ ధర రూ. 6.79 లక్షలు కియా సోనెట్‌లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్‌తో వస్తోంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్లు అందిస్తోంది. ఈ కారు ప్రారంభం ధర రూ. 6.79 లక్షల నుంచి గరిష్టంగా రూ. 8.75 లక్షలు(షోరూమ్)గా ఉంది. గత సెప్టెంబరులో తొలి మోడల్ రిలీజ్ అవగా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ 2021 మేలో మార్కెట్లోకి వచ్చింది. మొత్తంగా 17 రంగుల్లో ఈ కారు లభిస్తోంది. చదవండి: సెడాన్ అమ్మకాల్లో ఆ కారుదే అగ్రస్థానం -
పెద్ద కార్ల రేట్లకు రెక్కలు
♦ 25 శాతానికి పెరగనున్న సెస్సు ♦ పెంపు ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం ♦ ఆందోళనలో కార్ల కంపెనీలు న్యూఢిల్లీ: గత నెల 1న వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) విధానం అమల్లోకి వచ్చినప్పట్నుంచీ ఖరీదైన లగ్జరీ కార్ల రేట్లు తాత్కాలికంగా కాస్త తగ్గినా.. తాజాగా మళ్లీ పెరగనున్నాయి. ఈ దిశగా పెద్దకార్లపై సెస్సును 25 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదముద్ర వేసింది. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం కార్లు అత్యధిక శ్లాబ్ రేటు 28 శాతం పరిధిలోకి రాగా, అదనంగా 1–15 శాతం దాకా సెస్సు ఉంటోంది. వస్తు, సేవల పన్నుల విధానం అమల్లోకి వచ్చాక గత విధానంలో కన్నా వాహనాలపై మొత్తం పన్ను భారం తగ్గడంతో .. ఆగస్టు 5న జరిగిన 20వ సమావేశంలో ఈ అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 8702, 8703 విభాగాల కిందకి వచ్చే వాహనాలపై గరిష్ట సెస్సును ప్రస్తుతమున్న 15 శాతం నుంచి 25 శాతానికి పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం తగు చట్ట సవరణలు చేయొచ్చంటూ కౌన్సిల్ సిఫార్సు చేసినట్లు ఆర్థిక శాఖ వివరించింది. అయితే పెంపు ఎప్పట్నుంచి విధించేదీ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయిస్తుందని పేర్కొంది. కార్లు, పొగాకు, బొగ్గు మొదలైన వాటిపై వసూలు చేసే సెస్సును .. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు వాటిల్లే ఆదాయనష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం ప్రభుత్వం వినియోగిస్తోంది. ఇందుకోసం గరిష్ట సెస్సు రేటును నిర్దేశించే ప్రత్యేక చట్టాన్నీ రూపొందించింది. తాజాగా సెస్సు రేటును సవరించాలంటే.. సదరు చట్టానికి సవరణలు చేయాల్సి ఉంటుంది. పెద్ద కార్లు, ఎస్‌యూవీలు.. 8702, 8703 హెడింగ్స్ కింద వర్గీకరించిన వాహనాల్లో మధ్య స్థాయి, పెద్ద కార్లు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు (ఎస్యూవీ), సంఖ్యాపరంగా పది మంది కన్నా ఎక్కువ.. 13 కన్నా తక్కువ మంది ప్రయాణించగలిగే వాహనాలు ఉన్నాయి. అలాగే 1500 సీసీ పైబడిన హైబ్రీడ్ కార్లు కూడా ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. చాలా మటుకు కార్లకు 28 శాతం గరిష్ట పన్ను పరిధిలో ఉన్నప్పటికీ, పెద్ద వాహనాలు, ఎస్‌యూవీలు, హైబ్రీడ్ కార్లు మొదలైన వాటికి అదనంగా మరో 15 శాతం సెస్సు ఉంటోంది. 4 మీటర్ల కన్నా తక్కువ పొడవు, 1200 సీసీ సామర్థ్యం గల చిన్న పెట్రోల్ కార్లపై సెస్సు 1 శాతంగా ఉండగా, అదే పొడవుతో 1500 సీసీ సామర్థ్య మున్న చిన్న డీజిల్ కార్లపై సెస్సు 3 శాతంగా ఉంటోంది. జీఎస్టీ అమల్లోకి రావడానికి ముందు... మోటారు వాహనాలపై గరిష్ట పన్ను 52–54.72 శాతం స్థాయిలో ఉండేది. సీఎస్టీ, ఆక్ట్రాయ్ మొదలైన వాటికి సంబంధించి మరో 2.5 శాతం దీనికి తోడయ్యేది. అయితే, జీఎస్టీ వచ్చిన తర్వాత మొత్తం పన్ను పరిమితి 43 శాతానికి తగ్గింది. దీంతో చాలా మటుకు కంపెనీలు తమ ఎస్‌యూవీల రేట్లను రూ. 1.1 లక్షల నుంచి రూ. 3 లక్షల దాకా తగ్గించాయి. అయితే, గత విధానం తరహాలోనే ఈ పరిమితిని కొనసాగించేందుకు ప్రస్తుతం గరిష్టంగా ఉన్న 28 శాతం జీఎస్టీకి మరో 25 శాతం సెస్సును జోడించాల్సిన అవసరం ఉందని జీఎస్టీ కౌన్సిల్ భావించి తాజా నిర్ణయం తీసుకుంది. ఇలాగైతే విస్తరణ ప్రణాళికలకు విఘాతం.. పెద్ద కార్లు, ఎస్‌యూవీలపై సెస్సు పెంపు ప్రతిపాదనపై వాహన తయారీ సంస్థలు తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. జీఎస్టీ తర్వాత చౌకగా మారిన పెద్ద కార్ల రేట్లు మళ్లీ పెరిగేలా సెస్సు విధించే ప్రతిపాదన పరిశ్రమ సెంటిమెంటును దెబ్బతీస్తుందని టయోటా కిర్లోస్కర్ మోటార్, మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ తదితర సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్పందనలు ఇలా... ‘దీన్ని బట్టి చూస్తుంటే ఆర్థిక వృద్ధికి ఆటోమొబైల్ రంగం తోడ్పాటుపై ప్రభుత్వం అంత ఆసక్తిగా లేదన్నట్లుగా సంకేతాలు కనిపిస్తున్నాయి‘ అని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ చెప్పారు. ‘లగ్జరీ కార్ల తయారీ దిగ్గజమైన మా కంపెనీ.. మేకిన్ ఇండియా కార్యక్రమం కింద తలపెట్టిన భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై ఇలాంటివి ప్రతికూల ప్రభావం చూపుతాయి‘ అని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ రోలాండ్ ఫోల్గర్ పేర్కొన్నారు. తప్పనిసరిగా తమ వ్యాపార ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాల్సి ఉందని ఆడి ఇండియా హెడ్ రాహిల్ అన్సారీ చెప్పారు. సెస్సు పెంపు నిర్ణయం కంపెనీలు, డీలర్లు, కస్టమర్లతో పాటు ఆటోమొబైల్ పరిశ్రమలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులపైనా ప్రతికూల ప్రభావం తప్పదన్నారు. తక్షణమే ఇలా సెస్సులను మార్చేస్తుండటం.. భారత్‌లో ఆటోమోటివ్ పరిశ్రమ వృద్ధికి విఘాతం కలిగిస్తుందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ అభిప్రాయపడ్డారు. -
సబ్ ట్రెజరీల్లో రేషనలైజేషన్
మారుతున్న పరిధులు ఇంతవరకూ విద్యాశాఖలో అమలు చేసిన రేషనలైజేషన్ ఇప్పుడు ట్రెజరీల పరమైంది. దీంతో సబ్ ట్రెజరీల పరిధిలోని మండలాలను మార్పు చేశారు. దీనివల్ల సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని, ప్రజలకు మరింత అందుబాటులోకి ట్రెజరీ సేవలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. రాయవరం (మండపేట): ఖజానా శాఖలో రేషనలైజేషన్ ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనికోసం జీఓ-65ను ప్రభుత్వం గత నెల 25న విడుదల చేసింది. దీని ప్రకారం జిల్లాలో ఉన్న సబ్‌ట్రెజరీల పరిధిలో ఉండే మండలాలను మార్పు చేశారు. కొన్ని సబ్‌ట్రెజరీల పరిధిలోని మండలాలను యధాతథంగా ఉంచగా, మరికొన్నింటిలోని మండలాలను సమీపంలోని సబ్‌ట్రెజరీలకు బదిలీ చేశారు. దీని వల్ల ఖజానా సేవలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తాయని, సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కొత్త జీఓ ప్రకారం డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ ఆఫీసర్ (డీడీవో)లు, గ్రామ పంచాయతీలు ఒక సబ్‌ట్రెజరీ పరిధిలోకి వస్తారు. జిల్లాలో కాకినాడ కేంద్ర సబ్ట్రెజరీతో కలిపి 20 సబ్‌ట్రెజరీలు ఉన్నాయి.............. సబ్‌ట్రెజరీల పరిధిలోని మండలాలను యధాతథంగా ఉంచి, మిగిలిన సబ్‌ట్రెజరీల పరిధిలోని మండలాలను మార్పు చేశారు. రేషనలైజేషన్ కారణంగా రాయవరం సబ్‌ట్రెజరీ కార్యాలయం రామచంద్రపురంలో కలుస్తుంది. ఇక్కడి సిబ్బందిని రావులపాలెం సబ్‌ట్రెజరీకి బదిలీ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాయవరం సబ్‌ట్రెజరీలో కేవలం రాయవరం మండలం మాత్రమే ఉంది. రాయవరం సబ్‌ట్రెజరీలో రాయవరం, అనపర్తి, బిక్కవోలు మండలాలు ఉండగా గతంలోనే అనపర్తి, బిక్కవోలు మండలాలకు అనపర్తిలో సబ్ట్రెజరీని ఏర్పాటు చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసమే.. పరిపాలనా సౌలభ్యం కోసమే సబ్‌ట్రెజరీల రేషనలైజేషన్ జరుగుతోంది. ఈ ప్రక్రియ త్వరలో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. మారుతున్న సబ్‌ట్రెజరీల స్వరూపంపై డీడీవోలు, గ్రామ పంచాయతీలకు సమాచారం ఇస్తున్నాం. వారి వద్ద నుంచి అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నాం. -పీవీ భోగారావు, జిల్లా ట్రెజరీ అధికారి, కాకినాడ -
అందుబాటులోకి ‘జియో ప్రైమ్’ ఆఫర్
ఈ నెల 31 వరకే గడువు హైదరాబాద్: రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన ‘జియో ప్రైమ్’ ఆఫర్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లు రూ.99ల వన్‌టైమ్ వార్షిక ఫీజుతో జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో సభ్యులుగా చేరి తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్స్‌లో అనువైన దాన్ని ఎంపిక చేసుకుని కంపెనీ అపరిమిత సేవలను ఏడాదిపాటు నిరంతరాయంగా పొందొచ్చు. కంపెనీ రూ.149, రూ.303, రూ.499 వంటి పలు రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ఆవిష్కరించింది. జియో కొత్త యూజర్లు, హ్యాపీ న్యూ ఇయర్ కస్టమర్లు ఇరువురు రూ.99 ఫీజుతో మైజియో యాప్ లేదా www.Jio.com అనే కంపెనీ వెబ్సైట్ ద్వారా జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు అప్‌గ్రేడ్ కావొచ్చు. అయితే జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కేవలం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. ప్రి–పెయిడ్, పోస్ట్–పెయిడ్, ప్రైమ్ యూజర్లు, నాన్–ప్రైమ్ కస్టమర్లు అందరూ ప్లాన్స్ వివరాల కోసం దగ్గరిలోని జియో స్టోర్ లేదా కంపెనీ అనుబంధ ఔట్‌లెట్స్‌కు వెళ్లొచ్చు. స్టోర్‌కు వెళ్లలేని వారు కంపెనీ వెబ్సైట్లో టారిఫ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక్కడే ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న కస్టమర్లకు, తీసుకోని యూజర్లకు లభించే సేవల మధ్య వ్యత్యాసాన్ని కూడా గమనించవచ్చు. -
ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వం తిలోదకాలు
కాగితాలపైనే ఘనమైన కేటాయింపులు జెడ్పీ ప్రతిపక్షనేత ప్రసన్నకుమార్ ధ్వజం కొత్తపేట : ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వం తిలోదకాలిస్తోందని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన కొత్తపేటలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.8,850 కోట్ల బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పటికి రూ.1,000 కోట్లు కూడా విడుదల చేయలేదని చెప్పారు. కాగితంపై కనిపించే కేటాయింపులు క్రియలో కొరవడుతున్నాయని విమరించారు. ఈ విషయమై నాలుగైదు సార్లు జెడ్పీ సమావేశాల్లో అడిగితే ఆ నిధులు రాలేదన్నారని తెలిపారు. 45 శాఖలకు సబ్‌ప్లాన్ నిధులు కేటాయించవలసి ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ విడుదల కాకపోవడం చూస్తుంటే పథాకాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16 సంవత్సరంలో జిల్లాలో రూ.113 కోట్లతో 7 వేల యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించగా దరఖాస్తులు మాత్రం 4 వేలు మాత్రమే చేసుకోమని, 2 వేల యూనిట్లే మంజూరు చేశారని తెలిపారు. చివరికి 1,800 యూనిట్లకే సబ్సిడీ విడుదలైనట్టు తెలిపారన్నారు. సబ్సిడీ విడుదలైన 15 రోజుల్లో రుణమివ్వాల్సి ఉండగా కేవలం 82 యూనిట్లకు మాత్రమే ప్రక్రియ పూర్తి చేసి రూ.కోటి విడుదల చేశారని వివరించారు. ఇలా ఎస్సీ సబ్‌ప్లాన్, ఎస్సీ కార్పొరేషన్ పథకాలను నిర్వీర్యం చేసి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ప్రసన్నకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
గ్రామ్ గోల్డ్ బాండ్ @రూ. 3119
ఈ నెల 18 నుంచి నాలుగో దఫా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ న్యూఢిల్లీ: బంగారం బాండ్ల నాలుగో దఫాకు సబ్స్క్రిప్షన్ ఈ నెల 18(వచ్చే సోమవారం) నుంచి ప్రారంభమై 22న ముగుస్తుంది. ఈ నాలుగో దఫా పుత్తడి బాండ్ల ధరను ఒక్కో గ్రామ్‌కు రూ. రూ.3,119గా ఆర్బీఐ నిర్ణయించింది. బంగారాన్ని భౌతిక రూపంలో కొనుగోలు చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఈ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్(ఎస్జీబీ)ను రూపొందించింది. బాండు కొనుగోలుచేసినప్పటి బంగారం ధరపై ప్రతీ ఆరు నెలలకు చెల్లించేలా 2.75 శాతం వార్షిక వడ్డీ వుంటుంది. పుత్తడి ధర పెరిగితే బాండు ధర కూడా పెరుగుతుంది. లేదా ధర తగ్గితే తగ్గుతుంది. ఈ బాండ్లను బ్యాంక్‌లు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్, ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈల ద్వారా ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకూ మూడు దఫాలుగా రూ.1,322 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లు జారీ చేశారు. కనీసంగా ఒక గ్రాము, గరిష్టంగా 500 గ్రాముల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. గోల్డ్ బాండ్ స్కీమ్ కింద 5,10,50, 100 గ్రాముల డినామినేషన్లలో 5-7 కాలపరిమితితో ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తారు. -
నవ్కార్ ఐపీఓకు 3 రెట్లు సబ్ స్క్రిప్షన్
న్యూఢిల్లీ: లాజిస్టిక్స్ కంపెనీ నవ్కార్ కార్పొరేషన్ ఐపీఓ బుధవారం 2.8 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ద్వారా రూ.600 కోట్లు సమీకరించాలని నవ్కార్ కంపెనీ యోచిస్తోంది. స్టాక్ మార్కెట్ క్షీణపథంలో ఉన్నా, ఈ కంపెనీ ఐపీఓకు మంచి స్పందన లభించింది. రూ.147-155 ప్రైస్‌బాండ్‌తో సోమవారం ప్రారంభమైన ఈ ఐపీఓ బుధవారం ముగిసింది. కాగా ఐపీఓకు వచ్చిన రెండో రోజైన బుధవారం నాడు శ్రీ పుష్కర్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఐపీఓ 46 శాతం, పెన్నార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ ఐపీఓ 7 శాతం చొప్పున సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఈ రెండు కంపెనీల ఐపీఓలు నేడు(గురువారం) ముగియనున్నాయి. శ్రీ పుష్కర్ కెమికల్స్ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.70 కోట్లు, పెన్నార్ ఇంజినీర్డ్ బిల్డింగ్ సిస్టమ్స్ రూ.156 కోట్ల చొప్పన సమీకరించాలని యోచిస్తున్నాయి. శ్రీ పుష్కర్ ప్రైస్‌బాండ్ రూ.61-65, పెన్నార్ ప్రైస్‌బాండ్ రూ.170-178 రేంజ్లో ఉన్నాయి. -
ఆర్టీసీలో చందా దందా!
యూనియన్ కాంట్రిబ్యూషన్ కోసం కార్మికుల వేతనాల్లో కోత విభజనకు పూర్వం ఆ విధానాన్ని నిషేధించిన ఎండీ ఏపీఎస్ ఆర్టీసీలో కొనసాగుతున్న నిషేధం... టీఎస్ఆర్టీసీలో డోంట్ కేర్ గతంలోనే సంస్థ వసూలు చేయడాన్ని తప్పుపట్టిన కోర్టు ఈసారి సంవత్సరం చందా ఒకేసారి వసూలుకు సర్క్యులర్ జారీ కార్మిక నేతల చేతుల్లోకి చందాలు! భారీ అక్రమాలకు ఊతమిచ్చినట్లేనని కార్మికుల ఆందోళన హైదరాబాద్: సంఘం సంక్షేమం కోసమంటూ సభ్యుల నుంచి చందాలు వసూలు చేయడం సహజం. ఇది ఆయా సంఘాల్లోని సభ్యుల ఇష్టపూర్వకంగా జరుగుతుంది. కానీ, ఆర్టీసీలో వింత విధానం కొనసాగుతోంది. కార్మికుడికి ఇష్టం ఉన్నా లేకపోయినా అతడి వేతనంలో నుంచి ఆ మొత్తాన్ని మినహాయించి సంఘం నేతల చేతుల్లో పెడుతోంది. కార్మికులు దీనిని ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నా యాజమాన్యం మాత్రం సంఘం నేతలకు గులాంలా వ్యవహరిస్తోంది. వసూళ్లు సరికాదంటూ కోర్టు చెప్పినా... 2015 సంవత్సరానికి ఒకేసారి 12 నెలల చందా వసూలుకు సర్క్యులర్ జారీ చేసింది. ఇది అక్రమాలకు ఊతమిస్తోందంటూ కార్మికులు నేరుగా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇదీ సంగతి... ఆర్టీసీ కార్మికులు వారు ప్రాతినిథ్యం వహిస్తున్న కార్మిక సంఘానికి ప్రతినెలా రూ.30 వరకు చందా చెల్లించాల్సి ఉంటుంది. కార్మికుల ఆమోదం ప్రకారం దీన్ని నెలకోసారి.. లేదా కొన్ని నెలలకు కలిపి ఓసారి వసూలు చేసుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం వరకు అలాగే జరిగేది. కానీ, గుర్తింపు సంఘం సభ్యుల నుంచి తానే ఆ మొత్తాన్ని వసూలు చేసి ఆ యూనియన్‌కు చెల్లిస్తామంటూ 2012లో నిర్ణయించిన ఆర్టీసీ అప్పటి నుంచి అలాగే చేస్తోంది. సంఘం, కార్మికుల సంక్షేమం కోసం ఉపయోగపడాల్సిన ఆ చందా మొత్తాన్ని నేరుగా కార్మిక నేతల చేతుల్లో పెట్టడంతో భారీ అక్రమాలకు ఆస్కారం కలుగుతోందని, కొందరు యూనియన్ సభ్యులు ఇష్టం వచ్చినంత మొత్తాన్ని అంగీకార పత్రాల్లో రాసి బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారని కార్మికుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. నిషేధించినా అమలు.. గత మే నెలలో ఆర్టీసీలో సమ్మె జరిగిన సమయంలో... ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఎన్ఎంయూకు రూ.80 లక్షల చెక్కును అందజేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో అసలు ఈ విధానమే సరికాదంటూ ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ సాంబశివరావు దాన్ని నిషేధించారు. అప్పటికి ఆర్టీసీ విభజన కానందున ఆ నిషేధం రెండు రాష్ట్రాల్లో అమలులో ఉంటుందని ఉత్తర్వులో స్పష్టం చేశారు. దాని ప్రకారం ప్రస్తుతం ఏపీఎస్ ఆర్టీసీలో నిషేధం అమలవుతుండగా.. తెలంగాణలో మాత్రం యాజమాన్యం దాన్ని అమలు చేస్తూనే ఉంది. ఒకేసారి ఏడాది మొత్తానికి వేతనాల నుంచి రికవరీ చేస్తే... మధ్యలోనే పదవీ విరమణ, ఇతర కారణాలతో వైదొలిగేవారు నష్టపోతారని ముఖ్యమంత్రికి ఇచ్చిన ఫిర్యాదులో కార్మికులు పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరితోనే గుర్తింపు యూనియన్ గడువు ముగిసినందున ఇప్పుడు వసూలు చేయాలనే నిర్ణయం అక్రమమేనని వారు పేర్కొన్నారు. -
అడిగినంత ఇవ్వలేదని హిజ్రాల దాడి
కేసు నమోదు చేసిన పోలీసులు అడ్డగుట్ట: అడిగినంత చందా ఇవ్వలేదని మొబైల్ షాపు యజమానిపై ిహ జ్రాలు దాడి చేసి, రూ. 30 వేలు విలువ చేసే బంగారు గొలుసు లాక్కొన్నారు. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకొని పారిపోగా.. హిజ్రాలు షాపులోని కుర్చీలను విరగ్గొట్టడంతో పాటు వస్తువులను ధ్వంసం చేశారు. తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం... అడ్డగుట్ట డివిజన్‌కు చెందిన శ్రీనివాస్ తుకారాంగేట్ మీనా హాస్పటల్ ఎదురుగా తిరుమల కమ్యునికేషన్స్ అండ్ మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. అయితే, బుధవారం రాత్రి కొందరు హిజ్రాలు దుకాణానికి వచ్చారు. హోళీ సందర్భంగా తమకు చందా ఇవ్వాలని యజమాని శ్రీనివాస్‌ను అడిగారు. అతను రూ. 50 ఇవ్వగా.. తమకు రూ. 500 కావాలని పట్టబట్టారు. అంత ఇవ్వలేనని శ్రీనివాస్ అనడంతో హిజ్రాలందరూ కలిసి అతని పై దాడి చేసి మెడలోని గొలుసు లాక్కున్నారు. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం హిజ్రాలు దుకాణంలోని వస్తువులన్నీ ధ్వంసం చేసి, కుర్చీలు విరగ్గొట్టి, స్టిక్కర్లను చింపేశారు. కౌంటర్లో ఉన్న డబ్బును కూడా హిజ్రాలు ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. గురువారం ఉదయాన్నే బాధితుడు తుకారాంగేట్ పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎకరాకు లక్ష చందా ఇస్తాం
వాటితో ఎక్కడైనా రాజధానికి భూములు కొనుక్కొని నిర్మించుకోండి {పభుత్వంపై విరుచుకుపడిన నిడమర్రు రైతులు మంగళగిరి:రాజధాని నిర్మాణానికి అవసరమైతే మేం ఎకరాకు లక్ష రూపాయలు చొప్పున ప్రభుత్వానికి చందా ఇస్తామని, వాటితో వేరే చోట ఎక్కడైనా భూములు సేకరించి రాజధాని నిర్మించుకోవాలని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు గ్రామాల రైతులు ప్రభుత్వానికి సూచించారు. తమ భూములను సెంటు కూడా వదులుకోబోమని, ఒకవేళ బలవంతంగా భూములు సేకరించదలచుకుంటే తమ శవాలపై రాజధాని నిర్మించుకోవాల్సి వుంటుందంటూ వారు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ రైతు హక్కుల పరిరక్షణ కమిటీ గురువారం పై మూడు గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఉండవల్లిలో రైతు కూలీ ధనలక్ష్మి మాట్లాడుతూ రైతుల భూములు ప్రభుత్వం తీసుకుంటే తాము ఎవరి దగ్గర కూలీ పనికి వెళ్లి బతకాలని వారు ప్రశ్నించారు. రైతు అన్నపురెడ్డి గోవిందరెడ్డి మాట్లాడుతూ తమకు ఎకరంన్నర పొలం వుందని, దానిలో ఎకరం పొలం కూతురుకు కట్నంగా ఇచ్చి వివాహం చేద్దామనుకున్నానని, గత నెల రోజుల నుంచి ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలతో ఆందోళనకు గురవుతున్నామని చెప్పారు. పెనుమాకలో రైతుకూలీ శివ మాట్లాడుతూ తాము అనారోగ్యానికి గురై పనికి వెళ్లలేకపోయినా రైతు దగ్గరకు వెళ్లి రేపు పనికి వస్తామని చెప్పి వంద రూపాయలు తెచ్చుకునే వాళ్లమని, ఇప్పుడు ఆ భూములను ప్రభుత్వం తీసుకుంటే తాము ఎవరి దగ్గరకు వెళ్లాలన్నారు. నిడమర్రులో పంట పొలాల్లో పరిశీలించిన సమయంలో మహిళా రైతు బత్తుల జయమ్మ కమిటీ ఎదుట కన్నీటిపర్యంతమైంది. కూలీ రైతు కె.భారతి,మహిళా రైతులు కె లలిత, ఉషారాణి తదితరులు వారి బాధలను కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం గ్రామంలో జరిగిన సమావేశంలో రైతులు భీమవరపు కృష్ణారెడ్డి, బుర్రముక్క సుందరరెడ్డి, గాదె ప్రకాష్‌రెడ్డి, కంఠం నరేంద్రరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు ప్రభుత్వానికి చందాలు ఇస్తాం కానీ భూములు మాత్రం ఇవ్వమని తేల్చి చెప్పారు. తాము ఆత్మహత్యలకైనా సిద్ధమేనన్నారు. మహిళా రైతు గుదిబండ చిట్టెమ్మ మాట్లాడుతూ ఎలాగైనా తమ భూములను కాపాడాలని కమిటీని వేడుకున్నారు. -
త్వరలో 100 కోట్ల వాట్స్‌యాప్ యూజర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆదాయార్జనకు ప్రధానంగా సబ్స్క్రిప్షన్ విధానంపైనే దృష్టి పెడుతున్నట్లు మొబైల్ మెసెంజర్ సేవల సంస్థ వాట్స్‌యాప్ బిజినెస్ హెడ్ నీరజ్ ఆరోరా చెప్పారు. ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్న ఆలోచన సంస్థకు ప్రారంభం నుంచే లేదన్నారు. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఏడాదికి నామమాత్రంగా ఒక్క డాలరు (సుమారు రూ. 60) మాత్రమే సబ్స్క్రిప్షన్ ఫీజు కింద తీసుకుంటున్నట్లు వివరించారు. క్రెడిట్ కార్డులు మొదలైన సాధనాల ద్వారా చెల్లింపులు భారత్‌లో ఇంకా పూర్తిగా ప్రాచుర్యంలోకి రాకపోవడం వల్ల ఈ నామమాత్ర సబ్‌స్క్రిప్షన్‌కు కూడా అవరోధాలు ఏర్పడుతున్నాయని ఆరోరా చెప్పారు. ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) పూర్వ విద్యార్థి అయిన ఆరోరా మంగళవారం ఇక్కడ కళాశాల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. వివిధ సంస్థలు, ఐఎస్బీ నుంచి వాట్స్‌యాప్ దాకా తన ప్రస్థానం, అనుభవాలను ఐఎస్బీ విద్యార్థులతో పంచుకున్నారు. వాట్స్‌యాప్‌ను ఫేస్బుక్ ఏకంగా 20 బిలియన్ డాలర్ల పైచిలుకు వెచ్చించి కొనుగోలు చేయడంలో ఆరోరా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. వాట్స్‌యాప్- ఫేస్బుక్ డీల్‌ను ప్రస్తావిస్తూ.. సాధారణంగా టెక్నాలజీ రంగంలో తమ వంటి సంస్థలకున్న యాక్టివ్ యూజర్ల సంఖ్యను బట్టి వేల్యుయేషన్లు ఉంటాయని నీరజ్ పేర్కొన్నారు. ప్రస్తుతం తమ యూజర్ల సంఖ్య 60 కోట్ల పైచిలుకు ఉందని, త్వరలో 100 కోట్ల స్థాయికి చేరుకోగలమని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఇంతమందికి చేరువైన కంపెనీలు ప్రస్తుతం పది కూడా లేవని వివరించారు. ఈ సామర్ధ్యాన్ని గుర్తించే ఫేస్బుక్ భారీ వేల్యుయేషన్ కట్టినట్లు ఆయన పేర్కొన్నారు. వాట్స్‌యాప్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు టెలికం కంపెనీలతో చేతులు కలపడం కూడా లాభిస్తోందని చెప్పారు. భారత్‌లో 5 టెలికం సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు వివరించారు. డేటా సేవల ద్వారా ఆదాయాలను ఆర్జించే అవకాశాలు పుష్కలంగా ఉండటంతో టెల్కోలు కూడా ఇందుకు ముందుకు వచ్చినట్లు నీరజ్ పేర్కొన్నారు. ఇక, తమ కంపెనీలో సిబ్బంది సంఖ్య 80 మాత్రమే ఉన్నప్పటికీ.. యూజర్ల సమస్యల పరిష్కారం కోసం 30 మందితో కస్టమర్ కేర్ సేవలు కూడా అందిస్తున్నట్లు వివరించారు. చైనా మార్కెట్.. చైనా, కొరియా వంటి దేశాల్లో భిన్న సంస్కృతి కారణంగా ఆయా మార్కెట్లలో విస్తరించడానికి సమస్యలు ఉంటాయని నీరజ్ చెప్పారు. అందుకే గూగుల్ వంటి దిగ్గజాలు సైతం అక్కడ పెద్ద ఎత్తున విస్తరించలేకపోయాయన్నారు. తాము మెరుగైన ఉత్పత్తిని ప్రపంచ స్థాయిలో రూపొందించడంపైనే దృష్టి కేంద్రీకరించామని, ఇప్పటికిప్పుడు ఒకటి రెండు దేశాల్లో విస్తరించ లేకపోయినా.. ఓపిగ్గా తగిన సమయం కోసం వేచి చూస్తామని నీరజ్ చెప్పారు. వాట్స్‌యాప్ లాంటి భారీ సంస్థను ప్రపంచానికి అందించే సత్తా, సామర్థ్యం భారతీయుల్లో కూడా ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, అందుకు అనువైన పరిస్థితులు ఇక్కడ కల్పించాల్సి ఉందన్నారు. -
మహిళలు.. మనీ రాణులు
మహిళలు వంటింటికే పరిమితమన్న మాటలకు కాలం చెల్లి చాలా రోజులయ్యింది. ఆర్థిక రంగం నుంచి అంతరిక్షం దాకా అన్నింటిలోనూ వారు దూసుకెళ్లిపోతున్నారు. ప్రపంచస్థాయిలో పెద్ద పెద్ద కంపెనీల్లో వన్ మ్యాన్ షో .. సారీ.. వన్ ఉమన్ షో నడిపించేస్తున్నారు. పురుషాధిక్య రంగాల్లో కూడా ఆధిపత్యాన్ని చాటుతున్నారు. దేశంలోనే అతి పెద్ద బ్యాంకులైన ఎస్బీఐ (అరుంధతి భట్టాచార్య), ఐసీఐసీఐ బ్యాంకు (చందా కొచర్), యాక్సిస్ (శిఖా శర్మ) బ్యాంకులకు సారథ్యం వహిస్తున్నది మహిళలే. అంతర్జాతీయంగా సాఫ్ట్‌డ్రింక్స్ దిగ్గజం పెప్సీకి (ఇంద్రా నూయి), ఇంటర్నెట్ దిగ్గజం యాహూకి (మెరిస్సా మెయర్) నేతృత్వం వహిస్తున్నది వారే. వీరికి ఇంతటి విజయాలెలా సాధ్యమయ్యాయి.. వీటి వెనుక రహస్యాలేమిటి.. మనీ మ్యాటర్స్‌లో పురుషాధిక్యతను అధిగమించగలగడంలో మహిళల ప్రత్యేకతలేమిటీ? వీటిపైనే ఈ వారం ధనం కథనం. టైమ్ కావొచ్చు, మనీ కావొచ్చు.. మేనేజ్మెంట్ విషయంలో మహిళలే నంబర్‌వన్. అందుకే, మిగతా విషయాలెలా ఉన్నా ఇంటి ఖర్చుల మేనేజ్మెంటు బాధ్యతలు వారికి అప్పగిస్తుంటారు. పెద్దగా దృష్టి పెట్టం గానీ.. రిస్కులు తీసుకోవడం నుంచి లక్ష్యాలు సాధించడం దాకా మహిళల్లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో కొన్ని.. లక్ష్యం నిర్దేశించుకోవడం.. లక్ష్యాలు నిర్దేశించుకోవడం, సాధించడంలో మహిళలు మేటి. అత్యధిక శాతం మహిళలు ఇంటిలోనైనా ఆఫీసులోనైనా.. ఏదో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంపైనా, సాధించడంపైనా ఎక్కువగా ఆసక్తి చూపుతారు. అందుకే, స్కూలు స్థాయి నుంచి యూనివర్సిటీల దాకా టాపర్స్‌లో ఎక్కువశాతం వారే. లక్ష్య సాధనపై దృష్టి కారణంగానే కెరియర్లో కూడా మగవారి కన్నా కాస్త వేగంగా ముందుకెళ్లగలుగుతారు. ఇలా లక్ష్యాలను నిర్దేశించుకోవడమనేది విజయంతో పాటు కాస్త సమయం ఆదా చేసుకోవడానికి కూడా తోడ్పడుతుంది. విద్య ఎంపికలో.. చదువుకు సంబంధించి కోర్సులను ఎంచుకోవడంలో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. తమకు అనుకూలమైనవి, తాము అన్ని విధాలా రాణించేందుకు అవకాశాలు ఉన్న రంగాలను ఎంచుకుంటూ ఉంటారు. మేనేజ్మెంట్, మెడికల్, అడ్మినిస్ట్రేటివ్ కోర్సులు వారికి ఆల్‌టైమ్ ఫేవరెట్స్‌గా ఉంటుంటాయి. ఒక టి, రెండు మార్కులు పోయినా పర్లేదులే అని అబ్బాయిలు లైట్‌గా తీసుకున్నా.. అమ్మాయిలు మాత్రం ఆ ఒక్క మార్కు కూడా పోకూడదని సీరియస్‌గానే తీసుకుంటుంటారు. సాధించేందుకు గట్టిగా ప్రయత్నిస్తారు. సెల్ఫ్-హెల్ప్.. ఇంటి పనుల విషయంలో చూడండి. పిల్లల డైపర్లు మార్చడం నుంచి నిత్యావసరాలు కొనుక్కుని తెచ్చుకోవడం, బిల్లులు కట్టేసేయడం దాకా అన్ని విషయాలను ఎవరిపైనా ఆధారపడకుండా స్వంతంగానే చక్కబెట్టుకుంటుంటారు మహిళలు. వారు సెల్ఫ్-హెల్ప్‌కి ప్రాధాన్యమిస్తారు. భర్తకో, కుటుంబ సభ్యులకో, స్నేహితులకో పని అప్పజెప్పి.. వారు చేసే దాకా ఎదురుచూస్తూ కూర్చుని సమయం వృదా చేసుకోవడం కన్నా సొంతంగా పనులు పూర్తి చేసుకోవడానికి మొగ్గు చూపుతారు. ఇతరులకు అప్పజెబితే తమలాగా శ్రద్ధగా చేస్తారో లేదోనన్న సందేహం కూడా దీనికి కొంత కారణం. ఎందుకంటే..మహిళలు పర్ఫెక్షనిస్టులు కూడా. రోజువారీ రికార్డు.. ఆర్థిక విషయాలు ఇంటికి సంబంధించినవైనా.. ఆఫీసుకు సంబంధించినవైనా.. మహిళలు రికార్డు పాటించడంలో పక్కాగా ఉండేందుకు ఇష్టపడతారు. ప్రతీ పైసాకి వారి దగ్గర లెక్క ఉంటుంది. ఇది మగవారికి కాస్త చాదస్తంగా అనిపించినా.. నెల తిరిగేసరికి జమాఖర్చుల పక్కా రికార్డు చూస్తే మరి మాట్లాడటానికి ఉండదు. నేర్చుకోవడానికి ప్రాధాన్యం.. మహిళలు సాధ్యమైనంత వరకూ తప్పులకు దూరంగా ఉండటానికి ప్రాధాన్యమిస్తారు. ఒకవేళ చేసినా దాన్నుంచి నేర్చు కుంటారు. ఒకసారి చేసిన మిస్టేక్‌ను మరోసారి చేయరు. ఏదైనా డీల్‌తో లాభం వచ్చిందంటే.. మరింత అధిక టార్గెట్లతో మరోసారి ప్రయత్నిస్తారు. అదే నష్టం వస్తే.. దాన్ని పాఠంగా తీసుకుని మళ్లీ రిపీట్ కాకుండా జాగ్రత్తపడతారు. ప్లాన్ బీ.. ఒక ప్లాన్ వర్కవుట్ కాకపోతే.. మరొకటి..ఇలా ప్రతిదానికీ మహిళల దగ్గర ప్లాన్ బి అంటూ ఒకటి ఉంటుంది. డైనింగ్ టేబుల్ దగ్గర ఫుడ్ సరిగ్గా లేకపోయినా.. నచ్చినవి కొనేందుకు సరిపడేంత డబ్బు చేతిలో లేకపోయినా.. అప్పటికప్పుడు ఏదో ఒకటి అరేంజ్ చేసేయగలరు వారు. సందర్భం ఏదైనా సరే వారి దగ్గర ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. ఆఖరు నిమిషంలో కూడా మార్పులు, చేర్పులను సమర్థంగా చేయగలరు. అప్పులు.. సాధ్యమైనంత వరకూ అప్పు ఊసే ఉండకుండా చూసుకోవడానికి మహిళలు మొగ్గు చూపుతుంటారు. కుటుంబసభ్యులో, స్నేహితులో ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకుని కొనుక్కోవడం కన్నా.. చేతిలో ఉన్నప్పుడే కొనుక్కునేందుకు ఇష్టపడుతుంటారు. అందుకే మహిళలు అప్పుల బారిన పడటం కూడా చాలా తక్కువే. ఎలాంటి పరిస్థితినైనా మేనేజ్ చేసేయగల పుష్కలమైన మేనేజ్మెంట్ నైపుణ్యాలు, ఆఖరు నిమిషంలో కూడా దేన్నయినా సెట్ రైట్ చేయగలిగే సామర్థ్యాలు ఉండటమే ఇందుకు కారణం. రిస్కుకి రెడీ.. మిగతావారు మనకి రిస్కు ఎందుకులే అనుకున్న వాటిని కూడా జంకకుండా చేపట్టగలిగే ధైర్యం మహిళల సొంతం. రిస్కు తీసుకున్నా.. విజయాలు సాధించిన వారి ఉదంతాలు కోకొల్లలు. నష్టపోవాల్సి వస్తుందన్న భయం కన్నా.. విజయంపై ఆశావహంగా ఉండగలగడం, నేర్పుగా వ్యవహరించగలగడం ఇందుకు కారణం. పైగా.. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో సమర్థత కలిగి ఉండటం మరో కారణం. మనీ మేనేజ్మెంట్.. కీలకమైన డబ్బు సంగతికొస్తే.. ఎక్కడ, దేనిపై, ఎంత ఖర్చు చేయాలన్న దానిపై మహిళలు ఆచితూచి వ్యవహరిస్తుంటారు. అనవసరమైన వాటిపై ఖర్చు చేయడం కన్నా.. దీర్ఘకాలిక అవసరాల కోసం డబ్బును పొదుపు చేయడానికే ప్రాధాన్యమిస్తుంటారు. ఆదాయం కన్నా ఖర్చుల లిస్టు తక్కువగా ఉండేలా చూసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇంటి విషయంలోనైనా ఆఫీసు విషయంలోనైనా అవసరమనుకున్న వాటిపై తప్ప మిగతా వాటిపై ఖర్చు చేసేందుకు ఇష్టపడరు. మనీ మేనేజ్మెంట్లో వారి సామర్థ్యం ఇందుకు ఉపయోగపడుతుంది. -
బెల్టు షాపు వద్దన్నందుకు కుటుంబం వెలి
కేవీబీపురం: గ్రామంలో బెల్టుషాపు వద్దన్నందు కు ఓ కుటుంబాన్ని వెలివేశారు ఆ ఊరిపెద్దలు. కేవీబీ పురం మండలంలోని అంజూరుపాళెంలో ఈ సాంఘిక దురాచారం చోటు చేసుకుంది. బాధితుడు ఎన్ షణ్ముగం కథనం మేరకు ఈ సంఘటన వివరాల్లోకి వెళితే... అంజూరుపాళెం గ్రామంలో ప్రతి ఏటా గంగమ్మకు జాతర చేస్తారు. గతేడాది గ్రామం లో బెల్టు షాపు నిర్వహణకు వేలం పాడారు. షాపు నిర్వహించడానికి షణ్ముగం కుటుంబ సభ్యులు వ్యతిరేకత తెలిపారు. అయితే అదేవిధంగా ఈ ఏడాది కూడా వేలం నిర్వహించారు. యథాతథంగా ఈసారి కూడా వ్యతిరేకించారు. దీంతో గ్రామపెద్దలు నెంబలి వెంకట కృష్ణయ్య, నెంబలి పచ్చయ్య, అత్తింజేరి రామచంద్రయ్య, నంబాకం వెంకటేశులు, కే. వేమయ్య ఆ కుటుంబాన్ని వెలివేసినట్లు దండోరా వేయించారు. ఆ కుటుంబానికి నీళ్లు, ఇతర సౌకర్యాలు కల్పించకూడదని గ్రామకట్టుబాటు విధించారు. జాతరకు ఆ ఇంటి నుంచి నైవేద్యం, ఇతర కానుకలు, చందాలు తీసుకోరాదని నిర్ణయించారు. ఆ కుటుంబసభ్యులతో గ్రామస్తులు మాట్లాడినా, వారి ఇంటికి వెళ్లినా... వారికి కూడా గ్రామబహిష్కరణ తప్పదని హెచ్చరించారు. సోమవారం బాధితుడు షణ్ముగం ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది సాంఘిక దురాచారమని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. గ్రామ పెద్దలపై సాంఘిక దురాచార చట్టం కింద కేసులు నమోదు చేశారు. -
కేసీఆర్ ఓ అహంకారి
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ - హరీశ్‌తో ‘బొత్స’కున్న సంబంధాలు నిరూపిస్తా... - కవిత ఎన్ఆర్ఐల చందాలు దుర్వినియోగం చేశారని ఆరోపణ కోరుట్ల, న్యూస్‌లైన్ : టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖ ర్రావు అహంకారి అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ విమర్శించారు. సోమవారం ఆయన ఇక్కడ జరిగిన బహిరంగ సభ లో మాట్లాడారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను ఆయుధంగా మల్చుకున్న కేసీఆర్‌కు ప్రజలకు సేవ చేయాలనే ధ్యాస ఏమాత్రం లేదన్నారు. ఆయన తపనంతా అధికారం కోసమే అని మండిపడ్డారు. తనను వేలెడంత యాక్టర్ అన్న ఆయనకు తన పవర్ తెలియదని, తెగిస్తే తన సత్తా చూపిస్తానన్నారు. అందరినీ అహంకారంతో తిట్టే కేసీఆర్ రేపు తెలంగాణకు నిధులెలా తెస్తారని ప్రశ్నించారు. ఇతర పార్టీల నాయకులను అహంకారంతో తిడితే ఊరుకోబోరన్నారు. ఉద్యమం పేరుతో ఆయన కూతురు కల్వకుంట్ల కవిత ఎన్ఆర్ఐల నుంచి చందాలు వసూ లు చేశారని ఆరోపించారు. వాటి లెక్కలు చూపడం లేదని తనకు చాలా మంది ఫోన్లు చేశారన్నారు. హరీశ్‌రావుకు ఉత్తరాంధ్ర కాంగ్రెస్ నాయకుడు బొత్స సత్యనారాయణతో ఉన్న సంబంధాలు నిరూపిస్తానన్నారు. ఏ సంబంధం లేకుండా హరీశ్‌రావు విజయనగరం ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. అలస్యమైనా..హంగామా కోరుట్లలో పవన్ సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా మూడు గంటలు ఆలస్యంగా మొదలైంది. అప్పటిదాకా స్థానిక నేతలు బీజేపీకి ఓటేసి గెలిపించాలని కోరుతూ ఉపన్యాసాలతో కాలం గడిపారు. పవన్‌కల్యాణ్ రావడంతో యువకులు ఆనందంతో కేకలు వేశారు. సభ బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.