ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వం తిలోదకాలు
ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వం తిలోదకాలు
Published Wed, Nov 23 2016 11:08 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
కాగితాలపైనే ఘనమైన కేటాయింపులు
జెడ్పీ ప్రతిపక్షనేత ప్రసన్నకుమార్ ధ్వజం
కొత్తపేట : ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వం తిలోదకాలిస్తోందని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన కొత్తపేటలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.8,850 కోట్ల బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పటికి రూ.1,000 కోట్లు కూడా విడుదల చేయలేదని చెప్పారు. కాగితంపై కనిపించే కేటాయింపులు క్రియలో కొరవడుతున్నాయని విమరించారు. ఈ విషయమై నాలుగైదు సార్లు జెడ్పీ సమావేశాల్లో అడిగితే ఆ నిధులు రాలేదన్నారని తెలిపారు. 45 శాఖలకు సబ్‌ప్లాన్ నిధులు కేటాయించవలసి ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ విడుదల కాకపోవడం చూస్తుంటే పథాకాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16 సంవత్సరంలో జిల్లాలో రూ.113 కోట్లతో 7 వేల యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించగా దరఖాస్తులు మాత్రం 4 వేలు మాత్రమే చేసుకోమని, 2 వేల యూనిట్లే మంజూరు చేశారని తెలిపారు. చివరికి 1,800 యూనిట్లకే సబ్సిడీ విడుదలైనట్టు తెలిపారన్నారు. సబ్సిడీ విడుదలైన 15 రోజుల్లో రుణమివ్వాల్సి ఉండగా కేవలం 82 యూనిట్లకు మాత్రమే ప్రక్రియ పూర్తి చేసి రూ.కోటి విడుదల చేశారని వివరించారు. ఇలా ఎస్సీ సబ్‌ప్లాన్, ఎస్సీ కార్పొరేషన్ పథకాలను నిర్వీర్యం చేసి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ప్రసన్నకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
Advertisement