oppostion
-
కువిమర్శే ప్రతిపక్షం పనా?
స్వాతంత్య్రానంతర కాలంలో రాజకీయాల్లో ఉన్న విలువలు క్రమక్రమంగా మృగ్యం అవుతున్నాయి. రాజనీతి శాస్త్రంలోని నీతి, శాస్త్రీయత మాయమై రాజకీయాలు మాత్రమే మిగులుతున్నాయి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలిస్తే జగన్ రాజకీయ విలువల పునరుద్ధరణ దిశలో పయనిస్తుంటే... ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రం రాజకీయ విలువలను మరింత దిగజార్చే విధంగా ప్రవర్తిస్తున్నట్లు అర్థమవు తుంది. ముఖ్యమంత్రిగా విలువల వలువలొలిచే రాజకీయాలను నడిపి, ప్రతిపక్ష నాయకుడుగా మరింత బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తున్నారు బాబు. జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలను, ప్రజారంజక పాలనను ఏమాత్రం పట్టించుకోకుండా, కనీసంగా గమనించకుండా ఏది చేసినా కువిమర్శలతో, ప్రతీఘాత ఉద్యమాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షాల పైనా, జగన్ పైనా కక్ష తీర్చుకున్నట్లూ, పార్టీ మార్పిడు ల్లాంటివి ప్రోత్సహించినట్లూ... వైఎస్ జగన్ కూడా చేసి ఉంటే... ప్రస్తుతం టీడీపీకి ఉన్న 23 సీట్లలో మూడు సీట్లు కూడా మిగులకుండా ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయేది. పార్టీ మార్పిడులను ప్రోత్సహించక పోవడం, సామాజికంగా వెనుకబడిన కులాలవారికి ప్రాధాన్యత నివ్వడం, మత సామరస్యాన్ని కాపాడటం, విద్య, వైద్యం, సేద్యాలకు ప్రాముఖ్యతనిస్తూ మెజారిటీ ప్రజల నాదుకోవడం లాంటి ఎన్నో చర్యల్లో జగన్ విలువలు ప్రతిబింబిస్తున్నాయి. ఇవేవీ చంద్రబాబుకు నచ్చవు. ఇంతకీ ప్రతిపక్ష నాయకుడంటే ఎవరు? ప్రతిపక్షం అంటే ఎలా ఉండాలి? ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసిన ప్రతి పనినీ వ్యతిరేకించి తీరాలనీ, ప్రభుత్వాన్ని నిరం తరం తిడుతూ, పాలన స్తంభింపచేసేవాడే ప్రతిపక్ష నాయకుడనీ చంద్రబాబు అభిప్రాయంలా ఉంది. రచయితల విషయంలో... రచయిత అనేవాడు ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండాలనే అభిప్రాయం ఒకటుంది. రచయితలంతా ఎందుకు ప్రతిపక్షంలో ఉండాలి? ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాల్లా ప్రభుత్వం ఏంచేసినా తిడుతూనే ఉండాలా? నేటి పాలకపక్షం రేపటి ప్రతిపక్షం కావచ్చు. అందువల్ల రచయిత, జర్నలిస్టు ప్రతిసారీ ప్రతిపక్షంలోనే ఉండాల్సిన పనిలేదు. ప్రభుత్వాలు ప్రజోపయోగకరమైన పనులు చేసినప్పుడు, ప్రజాస్వామ్య లౌకిక విలువలను కాపాడినప్పుడు మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, ప్రజలు కూడా సపోర్టు చేయాలి. తాను అధికారంలో ఉన్నప్పుడు చేసినవన్నీ కరెక్టేననీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసేవన్నీ తప్పులేననీ చంద్రబాబునాయుడి ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎన్నో ఆదర్శాలను జీర్ణించుకొని, ఎంతో రీసెర్చ్ చేసి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం జగన్ ప్రతి నిర్ణయాన్నీ తప్పుపడుతున్నారు చంద్రబాబు. ఆడ బిడ్డల రక్షణకు తెచ్చిన ‘దిశ’ చట్టాన్నీ చంద్ర బాబు విమర్శించారు. బహుజనుల, పేదల చిరకాల స్వప్నమైన ఇంగ్లిష్ మాధ్యమాన్ని ప్రవేశపెడితే దానిపైనా విమర్శే! అన్ని ప్రాంతాల సమాన అభివృద్ధికి ‘మూడు రాజధాను’ల అవసరాన్ని ముందుకు తెచ్చిన జగన్ పనిని ఇప్పటికే విమర్శిస్తూ ఉద్యమాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతున్నందుకు కూడా వీరావేశంతో విమర్శలు చేయడం బాబుకే చెల్లింది. మనిషి కేంద్రంగా... దేశమంటే మనుషులేనన్న దృక్పథంతో రాజకీయాలను మలుచుకున్న నాయకులే నిజమైన ప్రజానాయకులు. అలాంటి ప్రజా నాయకుడే జగన్ అని గత మూడేళ్ల పాలన రుజువు చేస్తోంది. వయస్సులో చిన్న వాడైనా జగన్ నుంచి చంద్రబాబు లాంటివాళ్ళు చాలా నేర్చుకోవాల్సి ఉంది. (క్లిక్: విద్యావ్యవస్థకు ఒక షాక్ ట్రీట్మెంట్) - డాక్టర్ కాలువ మల్లయ్య ప్రముఖ సాహితీవేత్త -
పార్లమెంట్‌ను కుదిపేసిన ఇంధన ధరల పెంపు
న్యూఢిల్లీ: ధరల పెంపు అంశం పార్లమెంట్‌ని కుదిపేసింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల పెరుగుదలపై వరుసగా రెండోరోజూ పార్లమెంట్ దద్దరిల్లింది. విపక్షాల నిరసనలతో ఉభయసభలు అట్టుడికాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఆందోళనల మధ్యే స్పీకర్ ఓంబిర్లా క్వశ్చన్ అవర్ నిర్వహించారు. అయినప్పటికీ విపక్షాలు వెనక్కి తగ్గలేదు. వెల్‌లో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలతో గందరగోళం సృష్టించారు. దీంతో లోక్‌సభను కాసేపు వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా. అటు రాజ్యసభలోనూ ఇదే గందరగోళం నెలకొంది. సభ ప్రారంభం కాగానే షాహిద్ దివస్ సందర్భంగా భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం విపక్ష ఎంపీలు ఇంధన ధరల పెంపునకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. ఛైర్మన్ వారించినా వారు వెనక్కి తగ్గకపోవడంతో సభ మధ్యాహ్నానికి వాయిదాపడింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఉపంసంహరించుకోవాలి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ మార్గాని భరత్ లోక్‌సభలో కేంద్రాన్ని డిమాండ్ చేశారు. క్యాపిటివ్ మైన్స్ కేటాయించి ప్లాంట్‌ను పరిరక్షించాలని కోరారు. క్వశ్చన్ అవర్‌లో ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. దీనికి బదులిచ్చిన కేంద్ర ఉక్కుమంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్.. స్టీల్‌ప్లాంట్ నష్టాలకు సొంత గనులు లేకపోవడం కారణం కాదన్నారు. ప్రైవేటీకరణతో ప్లాంట్‌తోపాటు ఆ ప్రాంతం, ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు. -
రాజ్యసభ సమావేశాలు మరోరోజు పొడగింపు
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ సమావేశాలను కేంద్రం మరోరోజు పొడిగించింది. విపక్షాల ఆందోళనలతో శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగడం, పలు అంశాలపై చర్చలు పెండింగ్‌లో ఉండటంతో సభను బుధవారానికి పొడిగించారు. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అయితే, రాజ్యసభను రేపటికి పొడగించడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేశాయి. అజెండాలో ఏం పొందుపరుస్తున్నారో కూడా చెప్పడంలేదని .. వ్యవస్థలను నాశనం చేసినట్టే పార్లమెంట్‌నూ చేయాలని చూస్తున్నారని మండిపడ్డాయి. కేంద్రం తీరును నిరసిస్తూ.. కాంగ్రెస్ సహా విపక్ష పార్టీల సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకు దిగాయి. గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపాయి. గులాంనబి అజాద్, ఆనంద్ శర్మ, డి. రాజా. కనిమొళి, సహా పలువురు రాజ్యసభ సభ్యులు ఈ ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్రం మాత్రం సమావేశాల పొడిగింపు అంశం ప్రభుత్వ విచక్షణాధికారమని స్పష్టంచేసింది. కీలకమైన ఈబీసీ కోటా బిల్లుతోపాటు పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చించాల్సి ఉన్నందున.. రాజ్యసభ గడువును పొడిగించినట్టు పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి విజయ్ గోయెల్ తెలిపారు. -
ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వం తిలోదకాలు
కాగితాలపైనే ఘనమైన కేటాయింపులు జెడ్పీ ప్రతిపక్షనేత ప్రసన్నకుమార్ ధ్వజం కొత్తపేట : ఎస్సీ సబ్‌ప్లాన్‌కు ప్రభుత్వం తిలోదకాలిస్తోందని జిల్లా పరిషత్ ప్రతిపక్ష నాయకుడు సాకా ప్రసన్నకుమార్ ఆరోపించారు. బుధవారం ఆయన కొత్తపేటలో విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.8,850 కోట్ల బడ్జెట్ విడుదల ఉత్తర్వులు ఇవ్వగా ఇప్పటికి రూ.1,000 కోట్లు కూడా విడుదల చేయలేదని చెప్పారు. కాగితంపై కనిపించే కేటాయింపులు క్రియలో కొరవడుతున్నాయని విమరించారు. ఈ విషయమై నాలుగైదు సార్లు జెడ్పీ సమావేశాల్లో అడిగితే ఆ నిధులు రాలేదన్నారని తెలిపారు. 45 శాఖలకు సబ్‌ప్లాన్ నిధులు కేటాయించవలసి ఉండగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ విడుదల కాకపోవడం చూస్తుంటే పథాకాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16 సంవత్సరంలో జిల్లాలో రూ.113 కోట్లతో 7 వేల యూనిట్ల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించగా దరఖాస్తులు మాత్రం 4 వేలు మాత్రమే చేసుకోమని, 2 వేల యూనిట్లే మంజూరు చేశారని తెలిపారు. చివరికి 1,800 యూనిట్లకే సబ్సిడీ విడుదలైనట్టు తెలిపారన్నారు. సబ్సిడీ విడుదలైన 15 రోజుల్లో రుణమివ్వాల్సి ఉండగా కేవలం 82 యూనిట్లకు మాత్రమే ప్రక్రియ పూర్తి చేసి రూ.కోటి విడుదల చేశారని వివరించారు. ఇలా ఎస్సీ సబ్‌ప్లాన్, ఎస్సీ కార్పొరేషన్ పథకాలను నిర్వీర్యం చేసి ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని ప్రసన్నకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.