అందుబాటులోకి ‘జియో ప్రైమ్’ ఆఫర్
ఈ నెల 31 వరకే గడువు
హైదరాబాద్: రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన ‘జియో ప్రైమ్’ ఆఫర్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లు రూ.99ల వన్‌టైమ్ వార్షిక ఫీజుతో జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో సభ్యులుగా చేరి తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్స్‌లో అనువైన దాన్ని ఎంపిక చేసుకుని కంపెనీ అపరిమిత సేవలను ఏడాదిపాటు నిరంతరాయంగా పొందొచ్చు. కంపెనీ రూ.149, రూ.303, రూ.499 వంటి పలు రకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఆవిష్కరించింది.
జియో కొత్త యూజర్లు, హ్యాపీ న్యూ ఇయర్ కస్టమర్లు ఇరువురు రూ.99 ఫీజుతో మైజియో యాప్ లేదా www.Jio.com అనే కంపెనీ వెబ్‌సైట్ ద్వారా జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు అప్‌గ్రేడ్ కావొచ్చు. అయితే జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కేవలం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. ప్రి–పెయిడ్, పోస్ట్–పెయిడ్, ప్రైమ్ యూజర్లు, నాన్–ప్రైమ్ కస్టమర్లు అందరూ ప్లాన్స్ వివరాల కోసం దగ్గరిలోని జియో స్టోర్ లేదా కంపెనీ అనుబంధ ఔట్‌లెట్స్‌కు వెళ్లొచ్చు. స్టోర్‌కు వెళ్లలేని వారు కంపెనీ వెబ్‌సైట్‌లో టారిఫ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక్కడే ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న కస్టమర్లకు, తీసుకోని యూజర్లకు లభించే సేవల మధ్య వ్యత్యాసాన్ని కూడా గమనించవచ్చు.