JIO Prime
-
జియోకి భారీ డామేజ్ 25 లక్షల మంది BSNLకి పోర్ట్?
-
జియో బంపర్ ఆఫర్, ఇక యూజర్లకు పండగే!
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం జియో భారీ ఆఫర్లతో మరోసారి తన యూజర్లను కట్టిపడేసింది. జియో రూ. 499 టారిఫ్ ప్లాన్లను సవరించి మరోసారి అడిషనల్ బెన్ఫిట్స్ను అందిస్తుంది. యూజర్లు రూ.499తో రీఛార్జ్ చేయించుకుంటే ప్రతి రోజు 2జీబీ డేటాతో పాటు డిడ్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. జియో రూ.499 ప్లాన్ బెన్ ఫిట్స్ యూజర్లు రూ.499తో రీఛార్జ్ చేయించుకుంటే ప్రతి రోజు 2జీబీ డేటాను పొందవచ్చు. అదే సమయంలో తగ్గిన 64 కేబీపీఎస్ డేటా స్పీడ్‌ను వినియోగించుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ షిప్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో జియో టూ జియో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్,రోజుకు 100 మెసేజ్‌లను సెండ్ చేసుకోవచ్చు. రూ.499ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ సంవత్సరం వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వినియోగించుకోవచ్చు. వీటితో పాటు జియో సినిమా, జియోటీవీని పొందవచ్చు. హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ పొడిగింపు జియో న్యూఇయర్ రూ.2,545 ప్లాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గత డిసెంబర్ నెలలో జియో ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 2వరకు వ్యాలిడిటీ విధించింది. కానీ ఇప్పుడు ఆ ఆఫర్‌ను జనవరి 7వరకు పొడిగించింది. రూ.2,545 ప్లాన్‌లో ప్రతిరోజు 100ఎస్ఎంఎస్లు, 1.5జీబీను 336 రోజులు వినియోగించుకోవచ్చు. హ్యాపీ న్యూయర్ ఆఫర్లో భాగంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే యూజర్లు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీను పొందవచ్చు. దీంతో 365 రోజులపాటు వ్యాలిడిటీ యూజర్లు వినియోగించుకోవచ్చు. చదవండి: రిలయన్స్ జియో కీలక నిర్ణయం...! ఇక యూజర్లకు పండగే..? -
అందుబాటులోకి ‘జియో ప్రైమ్’ ఆఫర్
ఈ నెల 31 వరకే గడువు హైదరాబాద్: రిలయన్స్ జియో ఇటీవల ప్రకటించిన ‘జియో ప్రైమ్’ ఆఫర్ ఇప్పుడు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. కస్టమర్లు రూ.99ల వన్‌టైమ్ వార్షిక ఫీజుతో జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో సభ్యులుగా చేరి తర్వాత అందుబాటులో ఉన్న ప్లాన్స్‌లో అనువైన దాన్ని ఎంపిక చేసుకుని కంపెనీ అపరిమిత సేవలను ఏడాదిపాటు నిరంతరాయంగా పొందొచ్చు. కంపెనీ రూ.149, రూ.303, రూ.499 వంటి పలు రకాల సబ్స్క్రిప్షన్ ప్లాన్లను ఆవిష్కరించింది. జియో కొత్త యూజర్లు, హ్యాపీ న్యూ ఇయర్ కస్టమర్లు ఇరువురు రూ.99 ఫీజుతో మైజియో యాప్ లేదా www.Jio.com అనే కంపెనీ వెబ్సైట్ ద్వారా జియో ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు అప్‌గ్రేడ్ కావొచ్చు. అయితే జియో ప్రైమ్ సబ్స్క్రిప్షన్ కేవలం వచ్చే ఏడాది మార్చి 31 వరకు మాత్రమే ఉంటుంది. ప్రి–పెయిడ్, పోస్ట్–పెయిడ్, ప్రైమ్ యూజర్లు, నాన్–ప్రైమ్ కస్టమర్లు అందరూ ప్లాన్స్ వివరాల కోసం దగ్గరిలోని జియో స్టోర్ లేదా కంపెనీ అనుబంధ ఔట్‌లెట్స్‌కు వెళ్లొచ్చు. స్టోర్‌కు వెళ్లలేని వారు కంపెనీ వెబ్సైట్లో టారిఫ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఇక్కడే ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న కస్టమర్లకు, తీసుకోని యూజర్లకు లభించే సేవల మధ్య వ్యత్యాసాన్ని కూడా గమనించవచ్చు.