![Jio Introduced Rs 499 Prepaid Plan,extends Happy New Year Offer - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/6/jio.jpg.webp?itok=PCEW9men)
ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం జియో భారీ ఆఫర్లతో మరోసారి తన యూజర్లను కట్టిపడేసింది. జియో రూ. 499 టారిఫ్ ప్లాన్‌లను సవరించి మరోసారి అడిషనల్ బెన్‌ఫిట్స్‌ను అందిస్తుంది. యూజర్లు రూ.499తో రీఛార్జ్ చేయించుకుంటే ప్రతి రోజు 2జీబీ డేటాతో పాటు డిడ్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.
జియో రూ.499 ప్లాన్ బెన్ ఫిట్స్
యూజర్లు రూ.499తో రీఛార్జ్ చేయించుకుంటే ప్రతి రోజు 2జీబీ డేటాను పొందవచ్చు. అదే సమయంలో తగ్గిన 64 కేబీపీఎస్ డేటా స్పీడ్‌ను వినియోగించుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ షిప్‌తో 28 రోజుల వ్యాలిడిటీతో జియో టూ జియో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్,రోజుకు 100 మెసేజ్‌లను సెండ్ చేసుకోవచ్చు. రూ.499ప్లాన్‌లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ సంవత్సరం వరకు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా వినియోగించుకోవచ్చు. వీటితో పాటు జియో సినిమా, జియోటీవీని పొందవచ్చు.
హ్యాపీ న్యూఇయర్ ఆఫర్ పొడిగింపు
జియో న్యూఇయర్ రూ.2,545 ప్లాన్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గత డిసెంబర్ నెలలో జియో ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 2వరకు వ్యాలిడిటీ విధించింది. కానీ ఇప్పుడు ఆ ఆఫర్‌ను జనవరి 7వరకు పొడిగించింది. రూ.2,545 ప్లాన్‌లో ప్రతిరోజు 100ఎస్‌ఎంఎస్‌లు, 1.5జీబీను 336 రోజులు వినియోగించుకోవచ్చు. హ్యాపీ న్యూయర్ ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే యూజర్లు అదనంగా 29 రోజుల వ్యాలిడిటీను పొందవచ్చు. దీంతో 365 రోజులపాటు వ్యాలిడిటీ యూజర్లు వినియోగించుకోవచ్చు.
చదవండి: రిలయన్స్ జియో కీలక నిర్ణయం...! ఇక యూజర్లకు పండగే..?
Comments
Please login to add a commentAdd a comment