రూ.1,999తో కొత్త రీఛార్జ్ ప్లాన్
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ఒకసారి రీఛార్జ్ చేస్తే 12 నెలల పాటు సర్వీసులు పొందేలా కొత్త ప్లాన్‌ను విడుదల చేసింది. తరచూ రీఛార్జ్‌లు, ఇతర టెలికాం ప్రొవైడర్ల నుంచి పెరుగుతున్న ఖర్చుల భారంతో సతమతమవుతున్న వినియోగదారులకు ఊరటనిచ్చేందకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
సూపర్ రీఛార్జ్ ప్లాన్
బీఎస్ఎన్ఎల్ లేటెస్ట్ ఆఫర్ కేవలం రూ.1,999కే ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 12 నెలలు. నెలవారీ రీఛార్జ్‌ల ఇబ్బంది లేకుండా వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులోని కీలక ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.
అన్ లిమిటెడ్ కాలింగ్: యూజర్లు అన్ని లోకల్, ఎస్‌టీడీ నెట్‌వర్క్‌లపై అపరిమిత ఉచిత కాలింగ్‌ను వినియోగించుకోవచ్చు.
600 జీబీ డేటా: ఈ ప్లాన్‌లో రోజువారీ వినియోగ పరిమితులు లేకుండా మొత్తం 600 జీబీ డేటా లభిస్తుంది. యూజర్లు ఏడాది పొడవునా తమ సౌలభ్యం మేరకు ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు.
రోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు: నిరంతరాయంగా కమ్యూనికేషన్ కోసం రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లను కూడా ఈ ప్లాన్ అందిస్తుంది.
బీఎస్‌ఎన్‌ఎల్ చౌకైన రీఛార్జ్ ప్లాన్‌లు, దీర్ఘకాలిక వాలిడిటీ ఆఫర్లను అందిస్తుంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు ఇటీవల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు చౌక రీఛార్జ్ ధరల కోసం బీఎస్‌ఎన్‌ఎల్ వైపు మొగ్గు చూపుతున్నారు. కొత్త సూపర్ రీఛార్జ్ ప్లాన్ మరింత మంది యూజర్లను ఆకర్షిస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇదీ చదవండి: రైల్వే అంతటా ‘కవచ్’ అమలు
ఇతర ప్రొవైడర్లు ఇలా..
ఇతర టెలికాం ప్రొవైడర్లతో పోలిస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఉదాహరణకు, జియో పైన తెలిపిన సర్వీసులతో వార్షిక ప్లాన్‌ను రూ.3,599కు అందిస్తుంది. ఇందులో 2.5 జీబీ రోజువారీ పరిమితితో 912.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ యాక్సెస్ ఉన్నాయి. ఎక్కువ డేటాను అందిస్తుండడంతో జియో ప్లాన్ బీఎస్ఎన్ఎల్ కంటే ఖరీదుగా ఉంది. అయితే అందుకోసం కొన్ని సర్వీసులు అదనంగా ఇస్తుంది. యూజర్లు నిజంగా ఈ సర్వీసులను పూర్తి స్థాయిలో ఉపయోగిస్తేనే ఆ ప్లాన్ మేలని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలోనూ ఇలా బీఎస్‌ఎన్‌ఎల్‌తో పోలిస్తే అదనంగానే వసూలు చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment