recharge benefits
-
సూపర్ రీచార్జ్ ప్లాన్: రెండు కంపెనీల్లో ఒకటే.. మరి ఏది బెస్ట్?
దీర్ఘకాల వ్యాలిడిటీ రీచార్జ్ ప్లాన్ల కోసం చూస్తున్న వారి కోసం ప్రముఖ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్లలో అద్భుతమైన ప్లాన్లు ఉన్నాయి. రూ.395తో రెండు కంపెనీలు ప్లాన్లను అందిస్తున్నాయి. ధర ఒకటే అయినా వ్యాలిడిటీ, డేటా, ఇతర ప్రయోజనాల్లో తేడాలున్నాయి. ఏ కంపెనీ రీచార్జ్ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్లు ఉన్నాయో ఇక్కడ మీ కోసం అందిస్తున్నాం..జియో రూ.395 ప్లాన్» 84 రోజుల వ్యాలిడిటీ» అపరిమిత 5జీ డేటా» 5జీ కనెక్టివిటీ, 5జీ ఎనేబుల్డ్ హ్యాండ్సెట్ లేకపోతే వాడుకునేందుకు 6 జీబీ డేటా» అపరిమిత వాయిస్ కాలింగ్ » మొత్తం 1000 ఎస్ఎంఎస్లు» జియో టీవీ, జియో సినిమా, జియోక్లౌడ్‌కు కాంప్లిమెంటరీ యాక్సెస్» "మై జియో యాప్ ఎక్స్ క్లూజివ్" ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ఎయిర్ టెల్ రూ.395 ప్లాన్» 70 రోజుల వ్యాలిడిటీ » మొత్తంగా 6 జీబీ హైస్పీడ్ డేటా» 600 ఎస్ఎంఎస్లు» అపోలో 24|7 సర్కిల్‌కు 3 నెలల పాటు యాక్సెస్» ఉచిత హలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ వంటి ప్రయోజనాలు» అపరిమిత లోకల్, ఎస్టీడీ కాలింగ్» రీఛార్జ్ ప్లాన్ ఎయిర్టెల్ యాప్, వెబ్సైట్లో లభ్యం -
ఉచితంగా నెట్‌ఫ్లిక్స్.. ఎయిర్టెల్, జియో లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ఇవే!
ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్టెల్, జియోలు యూజర్లకు శుభవార్త చెప్పాయి. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను వీక్షించేలా ప్రీపెయిడ్ ప్లాన్ బండిల్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి.. ఈ ఏడాది ప్రారంభంలో జియో సైతం ఈ తరహా రీఛార్జ్ ప్లాన్లను యూజర్లకు అందించగా.. ఎయిర్టెల్ తాజాగా సబ్స్క్రిప్షన్ బండిల్స్‌ను ప్రారంభించింది. ఎయిర్టెల్, జియోలు దేశంలో 5జీ సేవల్ని అందిస్తున్నాయి. అయితే కస్టమర్ల కోసం ఈ రెండు సంస్థలు కలిసి నెట్‌ఫ్లిక్స్ బండిల్స్‌తో పాటు అన్లిమిటెడ్ 5జీ డేటాను అందిస్తుండగా.. వాటిల్లో నెట్‌ఫ్లిక్స్‌ని ఫ్రీగా వీక్షించే అవకాశం కల్పించాయి. ఇక ఎయిర్టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ల విషయానికొస్తే..84 రోజుల వ్యాలిడిటీతో రూ.1499 విలువైన ప్లాన్‌లో ప్రతి రోజు 3జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌ను అందిస్తుంది. 5జీ సేవలున్న ప్రాంతాల్లో పైన పేర్కొన్న ప్లాన్‌ను ఉపయోగిస్తే 5జీ కంటే ఎక్కువ డేటా పొందవచ్చు. కొత్తగా విడుదల చేసిన ఈ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లో బేసిక్ నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ సైతం వినియోగించుకోవచ్చు. ల్యాప్‌ట్యాప్స్, స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్, టీవీ ఇలా ఏదైనా ఒక డివైజ్‌లో ఓటీటీ సేవల్ని పొందొచ్చు. ఉచితంగా ఎయిర్టెల్ హలోట్యూన్స్‌ను యాక్సెస్ చేయొచ్చు. మరోవైపు జియో అందిస్తున్న రెండు ప్లాన్లలో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ వీక్షించవచ్చు. అందులో ఒక ప్లాన్ ఖరీదు రూ.1,099 ఉండగా ప్రతి రోజు 2జీబీ డేటాను వాడుకోవచ్చు. మరో ప్లాన్ రూ.1,499లో ప్రతి రోజు 3జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఈ రెండు జియో ప్లాన్లలో ముందుగా చర్చించిన నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్స్క్రిప్షన్ కూడా ఉంది. ఎయిర్టెల్ ప్లాన్ మాదిరిగానే, ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు కూడా ఒక్కొక్కటి 84 రోజుల వ్యాలిడిటీ ఉంది. జియో ప్లాన్లు రోజువారీ డేటా ప్యాక్‌తో పాటు అపరిమిత 5జీ డేటాను కూడా అందిస్తుంది. -
జియో బంపరాఫర్, ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ చూడొచ్చు.. ఫుడ్ ఐటమ్స్ తినొచ్చు
ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో యూజర్లకు బంపరాఫర్ ప్రకటించింది. ఆ సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా ఎంపిక చేసిన యూజర్లకు ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. ఇందులో భాగంగా రూ.299 ప్లాన్‌లో 7జీబీ డేటా,రూ.749 ప్లాన్‌లో 14జీబీ, రూ.2999 ప్లాన్‌లో 21 జీబీ డేటాను అదనంగా ఇస్తుంది. వీటితో పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ వీక్షించే అవకాశం కల్పించడంతో పాటు.. నిబంధనలకు అనుగుణంగా మెక్‌డొనాల్డ్స్‌లో ఫుడ్ ఐటమ్స్‌ను ఫ్రీగా తినొచ్చు. రూ.299 ప్లాన్ రూ.299 ప్లాన్‌లో జియో కస్టమర్లు ప్రతిరోజు 2జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లతో పాటు రోజువారీ 2జీబీ డేటాను అందిస్తుంది. ప్రత్యేకంగా జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లో జియో వార్షికోత్సవ ఆఫర్లో అదనంగా 7జీబీ డేటా కూడా ఉంది. ఈ ప్లాన్‌కి 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. రూ.749 ప్లాన్ రూ. 749 జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లో ప్రతి రోజు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. కస్టమర్లు అదనంగా 14జీబీ డేటాను అందుకుంటారు. 90 రోజుల వ్యాలిడిటీతో 7జీబీ డేటాను రెండు సార్లుగా పొందవచ్చు. రూ.2,999 ప్లాన్ రూ.2,999 ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజు 100 ఎస్ఎంఎస్లు, 2.5జీబీ డేటాను అందిస్తుండగా..ప్రత్యేక ఆఫర్లో భాగంగా కస్టమర్లు అదనంగా 21జీబీ డేటాను అందుకుంటారు. మూడు సార్లు 7జీబీ డేటాను జియో కూపన్ల రూపంలో అందిస్తుంది. కాగా, కొత్త జియో వార్షికోత్సవ ఆఫర్ సెప్టెంబర్ 30 వరకు చెల్లుబాటులో ఉంటుంది. ఇది కాకుండా అజియోపై 200 తగ్గింపు, నెట్‌మెడ్స్‌పై 20శాతం వరకు తగ్గింపు (రూ. 800 వరకు), స్విగ్గీలో రూ.100 తగ్గింపు, రిలయన్స్ డిజిటల్లో 10 శాతం తగ్గింపు పొందవచ్చు.తరచుగా ప్రయాణం చేసే వారికి విమానా ఛార్జీలలో రూ.1500, హోటళ్లపై 15 శాతం తగ్గింపు, ట్రావెల్ ఏజెన్సీ వెబ్‌పోర్టల్ యాత్రలో ఏదైనా హోటల్స్‌ను బుక్ చేసుకుంటే రూ. 4000 వరకు డిస్కౌంట్, భోజన ప్రియులైతే రూ.149 కంటే ఎక్కువ ధర ఉన్న ఫుడ్ ఐటమ్స్‌ను ఫ్రీగా తినే అవకాశాన్ని జియో కల్పించింది. జియో ప్రీపెయిడ్ నెట్‌ఫ్లిక్స్ బండిల్ రూ.1099 ప్లాన్ - 84 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు 2జీబీ డేటాను పొందవచ్చు. అయితే, 5జియో వెల్కమ్ ఆఫర్లో 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేసే మొబైల్‌పై అన్లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. ఇక ఇదే ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ను మీ స్మార్ట్ఫోన్లలో 480pలో కంటెంట్‌ను వీక్షించవచ్చు. 1499 ప్లాన్ - ఈ ప్లాన్‌లో బేసిక్ నెట్‌ఫ్లిక్స్ ఆఫర్స్ సొంతం చేసుకోవచ్చు. మొబైల్స్, ట్యాబ్స్ ,ల్యాప్‌టాప్‌లు, టీవీలలో 720పీలో చూడొచ్చు.నెట్‌ఫ్లిక్స్ బండిల్‌తో పాటు, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజువారీ 3జీబీ డేటాను సైతం సొంతం చేసుకోవచ్చని జియో ప్రతినిధులు చెబుతున్నారు. -
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. కేవలం రూ.148 చెల్లించి ఎక్స్ ట్రీమ్ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని తెలిపింది. తద్వారా యూజర్లు 15 ఓటీటీలను వీక్షించే అవకాశం కలగనుందని వెల్లడించింది. . అంతేకాదు రూ.148 డేటా వోచర్‌తో 15 జీబీ డేటా, ఎక్స్ట్రీమ్ ప్లే సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నట్లు పేర్కొంది. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సబ్స్క్రిప్షన్ ఎంపిక చేసుకున్న కస్టమర్లు సోనీలీవ్ ప్రీమియం, ఎరోస్ నౌ,హోయిచోయ్, లయన్స్‌గేట్ ప్లే తో పాటు మొత్తం 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ లభిస్తుంది. అయితే, దీంతో పాటు రూ.149 రీఛార్జ్‌తో కూడా 28 రోజులపాటు ఈ ఓటీటీల సదుపాయాన్ని వినియోగించవచ్చని స్పష్టం చేసింది. గతంలో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లలో 15 కంటే ఎక్కువ ఓవర్-ది-టాప్ కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. వీటిలో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్లు రూ. 359, రూ. 399, రూ. 499, రూ. 699, రూ. 839, రూ. 999. అన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల డేటా, అపరిమిత టాక్ టైమ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. -
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్.. ఫ్రీగా ఓటీటీ సబ్ స్క్రిప్షన్లు.. ఎలా అంటే?
ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. అపరిమిత ఇంటర్నెట్ నుండి 5జీ డేటా యాక్సెస్, ఉచిత ఓటీటీ సబ్స్క్రిప్షన్ల వరకు కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా అనేక రకాల రీఛార్జ్ ప్లాన్లను అందిస్తోంది. అయితే, తాజాగా ఎయిర్టెల్ డిస్నీ+ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను ఫ్రీగా చూసే అవకాశం కల్పించేలా కొత్త రీఛార్జ్ ప్లాన్లను విడుదల చేసింది. మీ ప్రీపెయిడ్ మొబైల్ రీఛార్జ్ ప్లాన్‌లోనే మీకు కావాల్సినట్లుగా ఎయిర్టెల్ డిస్నీ+ హాట్‌స్టార్ తో పాటు 15 రకాల ఇతర ఓటీటీ ఛానెల్స్‌ను ఉచితంగా యాక్సెస్ చేయొచ్చు. అపరిమిత కాలింగ్, 5జీ డేటా, ఓటీటీ ప్రయోజనాలను అందించే ఎయిర్టెల్ ప్లాన్లు ఇలా ఉన్నాయి. రూ. 359 ప్లాన్: ఈ ప్లాన్‌తో ఎయిర్టెల్ అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చు. నెలరోజుల పాటు ప్రతి రోజు 2జీబీ డేటాను వినియోగించుకోవచ్చు. అదనంగా, వినియోగదారులు అపోలో 24/7, హలెట్యూన్స్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే వంటి అనేక అదనపు ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లే సోనీ లీవ్,ఏరోస్ నౌ, లైన్స్ గేట్ప్లేతో పాటు 15 కంటే ఎక్కువ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను వీక్షించే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో వినియోగదారులు 5జీ ఇంటర్నెట్ డేటాను వినియోగించుకోవచ్చు. రూ. 399 ప్లాన్: ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్, 3జీబీ హై-స్పీడ్ డేటా ప్రయోజనాలు పొందవచ్చు. 15+ ఓటీటీ ఛానెల్‌లకు యాక్సెస్‌ను అందించే ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేకి ఉచిత యాక్సెస్‌తో సహా అదనపు ప్రయోజనాలు పొందవచ్చు. రూ. 499 ప్లాన్: 5జీ ప్రయోజనాలతో రూ. 399 ప్లాన్‌తో పోలిస్తే ఎయిర్టెల్ ఈ ప్లాన్‌కు దాదాపు సమానమైన ప్రయోజనాలను అందిస్తుంది. అయితే, ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్‌తో పాటు, రీఛార్జ్ ప్లాన్ 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. రూ. 699 ప్లాన్: మీరు ఒక నెల కంటే ఎక్కువ వ్యాలిడీ ఉన్న ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీ కోసమే. 56 రోజుల వ్యాలిడిటీతో రోజువారీ డేటా 3జీబీ, అన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను సెండ్ చేసుకోవచ్చు. చదవండి👉 కొత్త అనుమానాలు.. అదానీ ట్రైన్ టిక్కెట్ల బిజినెస్‌పై ఐఆర్సీటీసీ ఏమందంటే? -
వొడాఫోన్ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్: ఓటీటీ ఆఫర్ తెలిస్తే..!
సాక్షి, ముంబై: వొడాఫోన్ ఐడియా మరో కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. వీఐ మ్యాక్స్ 401 సౌత్ పేరుతో ఈ కొత్త ప్లాన్‌ను అందిస్తోంది. రూ. 401 ధరతో ఇప్పటికే ఇలాంటి ప్లాన్ ఉన్నప్పటికీ ఓటీటీ కంటెంట్‌ను అదనంగా అందించడం ఇందులోని ప్రత్యేకత ముఖ్యంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లోకల్ కంటెంట్‌ని ఆస్వాదించాలనుకునే వినియోగదారులకు ఇది గొప్ప ప్లాన్. ఈ ప్లాన్ ఆఫర్లు, వాలిడిటీ వాలిడిటీ నెల, నెలకు 50 జీబీ డేటా, 3000 ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాలింగ్ ఆన్లైన్లో కొనుగోలు చేస్తే అదనంగా 50జీబీడేటా కూడా లభ్యం. దీంతో పాటు ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు, సన్ నెక్ట్స్ (SunNXT) ప్రీమియం HD OTT సభ్యత్వం ఉచితం. ఏడాదికి రూ. 799 విలువైన సన్ నెక్ట్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు సొంతం చేసుకోవచ్చు. ఇందులో సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలను ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా Vi మూవీలు, టీవీ యాప్ VIP యాక్సెస్, ZEE5 ప్రీమియమ్‌కి ఉచిత యాక్సెస్, హంగామా మ్యూజిక్, Vi యాప్ వంటి మరిన్ని ప్రయోజనాలున్నాయి. వీఐ రూ.401 సౌత్ ప్లాన్ వివరాలివే ఈ ప్లాన్ ఆన్లైన్ కొనుగోలు కోసం మాత్రమే అందుబాటులో ఉంది. అదనపు 50 జీబీతో 1 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందిస్తుంది. వినియోగదారులు రాత్రి సమయంలో అన్లిమిటెడ్ డేటాతో (ఉదయం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు), అన్లిమిటెడ్ కాలింగ్, నెలకు 3000 SMSలతో 200GB నెలవారీగా పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ రూ.799 విలువైన SunNXT 12 నెలల ఫ్రీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఇపుడున్న రూ.401 ప్లాన్‌కి, దీనికి తేడా ఏమిటంటే.. ప్రస్తుతం ఉన్న రూ. 401 ప్లాన్ పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ తేడా ఏంటి అంటే సన్ నెక్ట్స్ సబ్‌స్క్రిప్షన్‌కు బదులుగా, రూ. 599 విలువైన సోనీ లివ్ మొబైల్ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు రెండూ వీఐ వెబ్సైట్ , వీఐ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. -
ఎయిర్ టెల్ యూజర్లకు భారీ షాక్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వినియోగం పెరిగుతున్నకొద్దీ టెలికం టారిఫ్ ధరలు వినియోగదారులకు మరింత భారం కానున్నాయి. ఇప్పటికే పలు టెలికం కంపెనీలు టారిఫ్ ధరల్ని పెంచే యోచనలో ఉండగా.. తాజాగా ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్‌ను భారీగా పెంచింది. కొద్దిరోజుల క్రితం ఎయిర్టెల్ సీఈవో సునిల్ మిట్టల్ మాట్లాడుతూ ప్రతి యూజర్‌పై సగటు ఆదాయాన్ని (ఏఆర్పీయూ) నెలకు రూ.300కి పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. టెలికాం కంపెనీలు ఏఆర్‌పీయూని నెలకు 300 రూపాయలకు పెంచినప్పటికీ, వినియోగదారులు తక్కువ ధరలోనే నెలకు 60జీబీ డేటాను వినియోగిస్తున్నందున ప్రజలకు పెద్దగా ఇబ్బంది ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎయిర్టెల్ తాజాగా అన్లిమిటెడ్ ప్యాక్స్‌లో కనీస రీచార్జ్ ధరను రూ.155కు చేర్చింది. అంతకు మునుపు అదే అన్లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్ రూ.99గా ఉంది. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది సర్కిళ్లలో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ప్యాక్ కాలపరిమితి 24 రోజులు.1 జీబీ డేటా, 300 ఎస్ఎంఎస్, అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. హెలోట్యూన్స్, వింక్ మ్యూజిక్ ఉచితం. రూ.99 రీచార్జ్ ప్లాన్‌ను ఎయిర్టెల్ నిలిపివేసింది. ఎయిర్టెల్ బాటలో మరికొన్ని కంపెనీలు పెరిగిన ధరల కారణంగా యావరేజ్ పర్ రెవెన్యూ యూజర్(ఏఆర్పీయూ) అంటే యూజర్ల నుంచి వచ్చే సగటు తలసరి ఆదాయం అర్ధం. ఇప్పుడు అదే ఆదాయం క్యూ2 నాటికి ఎయిర్టెల్ ఏఆర్పీయూ రూ.190, రిలయన్స్ జియో సగటు ఆదాయం ఒక్కో వినియోగదారుకు రూ.177.2 అని చెబుతోంది. వొడాఫోన్-ఐడియా అత్యల్పంగా ఉంది. అదే త్రైమాసికంలో ఇది రూ. 131గా నివేదించబడింది. ఎయిర్‌టెల్‌తో పోల్చితే వీఐ, జియో ఏఆర్పీయూ రూ. 300కి చేరుకోవడం కొంచెం కష్టమే. ధరల పెంపు సాధారణంగా అదే శాతంలో ఉంటుంది కాబట్టి కంపెనీలు ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచితే ఎయిర్టెల్ ముందుగా పెంచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకు తగ్గట్లుగానే ఎయిర్టెల్ అన్లిమిటెడ్ ప్యాక్స్‌లో కనీస రీచార్జ్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. -
జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. ఈ ప్లాన్లపై అదిరిపోయే ఆఫర్లు, ఫుల్‌గా బెనిఫిట్స్ కూడా!
దసరా పండుగ వచ్చేసింది. ఈ నేపథ్యంలో కంపెనీలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు మీద ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా జియో కూడా తగ్గేదేలే అంటూ తన కస్టమర్లకు అదిరిపోయే పండుగ ఆఫర్లను ప్రకటించింది. దసరా సందర్భంగా రెండు ప్లాన్లపై అదనపు తగ్గింపు ఆఫర్లతో పాటు బోలెడు బెనిఫిట్స్ కూడా అందిస్తోంది జియో. అయితే ఇది పరిమిత కాల ఆఫర్. కొన్ని రోజులే మాత్రమే అందుబాటులో ఉంటుంది. జియో కస్టమర్లకు ప్రకటించిన ఈ ఫెస్టివల్ బొనాంజాలో ఏకంగా రూ. 4,500 వరకు బెనిఫిట్స్ సొంతం చేసుకోవచ్చు. జియో ఫైబర్ తన కస్టమర్లకు ప్రీపెయిడ్ ప్లాన్స్‌తో పాటు పోస్ట్ పెయిడ్ సేవలను కూడా అందుబాటులో ఉంచింది. తాజాగా జియో ఫైబర్‌కు చెందిన రెండు పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తన కొత్త కస్టమర్ల కోసం రూ. 599, రూ. 899 ప్లాన్లపై అవాకయ్యే ఆఫర్లును జత చేసింది. ఈ ఆఫర్ అక్టోబర్ 9 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. JioFiber ప్రకటించిన ఫెస్టివల్ ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.. JioFiber ₹599 ప్లాన్ ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో 30 Mbps డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్‌తో అపరిమిత డేటా ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాకుండా ఇందులో సోనీలివ్( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్ ( Disney+ Hotstar), వూట్ సెలెక్ట్( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో కింద బెనిఫిట్స్ కూడా ఉన్నాయండోయ్ ►రిలయన్స్ డిజిటల్లో ₹1000 తగ్గింపు ►Myntra లో ₹1000 తగ్గింపు, Ajioలో ₹1000 తగ్గింపు ►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు. జియో ఫైబర్ ఫెస్టివల్ బొనాంజా కింద ఈ ప్రయోజనాలను పొందాలంటే, కొత్త కస్టమర్లు తప్పనిసరిగా కనీసం 6 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. JioFiber ₹899 ప్లాన్ ఈ ప్లాన్‌లో 100 Mbps డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్‌తో అన్లిమిటెడ్ డేటా ప్రయోజనాలు ఉన్నాయి. వీటితో పాటు సోనీలివ్( SonyLIV), డిస్నీ+ హాట్‌స్టార్ ( Disney+ Hotstar), వూట్ సెలెక్ట్( Voot Select)తో పాటు మరిన్నింటికి సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ఈ ప్లాన్ జియో.కామ్, (Jio.com), మై జియో (MyJio) యాప్‌లో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో కింద బెనిఫిట్స్ కూడా ఉన్నాయండోయ్ ►రిలయన్స్ డిజిటల్లో ₹500 తగ్గింపు ► Myntraలో ₹500 తగ్గింపు ►Ajioలో ₹1000 తగ్గింపు ►ఇక్సిగోలో ₹1500 తగ్గింపు. అయితే జియో ఫైబర్ కొత్త కస్టమర్ కనీసం 3 నెలల వ్యాలిడిటీతో ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాలి. చదవండి: అక్టోబర్‌లో 3 నుంచి 9 వరకు బ్యాంకులు పని చేయని నగరాలు ఇవే! -
బీఎస్ఎన్ఎల్ చవకైన ప్లాన్.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్ లాస్ట్ డేట్ ఇదే!
BSNL Rs.275 Broadband Plan: ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) స్వాతంత్య్ర దినోత్సవం (Independence Day 2022) సందర్భంగా తమ కస్టమర్ల కోసం అదరిపోయే ఆఫర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారుల కోసం చవకైన ప్లాన్‌ని ప్రవేశపెట్టింది. తక్కువ ధరలో అధిక ప్రయోజనాలు యూజర్లకు కలిగే విధంగా ఈ ప్లాన్‌ని ప్రకటించింది. అయితే ఈ ప్లాన్ పరిమిత కాలమే ఉంటుందన్న బీఎస్ఎన్ఎల్ తాజాగా ఆ ఆఫర్ చివరి తేదీని వెల్లడించింది. ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ప్లాన్ రూ. 275 బీఎస్ఎన్ఎల్(BSNL) తన ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ కస్టమర్లకోసం సరికొత్త ప్లాన్ రూ.275ను ప్రకటించింది. ప్రత్యేకంగా ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 60 Mbps స్పీడ్‌తో 3300జీబీ (3.3TB) వరకు డేటా లభిస్తుంది. అయితే ఇది ప్రమోషనల్ ప్లాన్ కాబట్టి, ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రవేశపెట్టిన ఈ ప్రత్యేక ప్లాన్‌ను అక్టోబర్ 13వ తేదీ వరకే అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ తాజాగా ప్రకటించింది. అంటే ఈ రూ.275 ప్లాన్ బెనిఫిట్స్ పొందాలంటే అక్టోబర్ 13వ తేదీలోగా రీచార్జ్ చేసుకోవాలి. కొత్త కస్టమర్లు, ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ వాడుతున్న కస్టమర్లు కూడా ఈ ఆఫర్‌ను పొందవచ్చు. రూ.275 భారత్ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ వివరాలు ఇవే బీఎస్ఎన్ఎల్ రూ.275 ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఆఫర్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఆఫ్షన్లకు కూడా వ్యాలిడిటీ మాత్రం 75 రోజులు ఉంటుంది. డేటా కూడా 3.3టీబీ(3.3TB) అంటే 3,300జీబీ వరకు డేటా లభిస్తుంది. అయితే ఇందులో ఓ ఆప్షన్‌కి 30Mbps, మరో ఆప్షన్‌కి 60Mbps స్పీడ్ లభిస్తుంది. వినియోగదారులు ఈ ప్లాన్‌లో తమకు నచ్చిన ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. డేటా కోటా పూర్తవగానే 2Mbps స్పీడ్‌తో ఇంటర్నెట్ వస్తుంది. చదవండి: టెన్షన్ పెడుతున్న కొత్త రకం బ్యాంకింగ్ వైరస్.. స్మార్ట్‌ఫోన్ వినియోగదారులూ జాగ్రత్త! -
పెప్సీ కొంటే.. కస్టమర్లకు ఎయిర్టెల్ పండుగ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ కస్టమర్లకు పండుగ ఆఫర్‌నుప్రకటించింది. రీఛార్జ్ కూపన్స్ అందించేలా పెప్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. పెప్సీ కంపెనీ డ్రింక్స్ కొనుగోలు చేసిన వినియోగ దారులకు రీచార్జ్ కూపన్లను అందిస్తోంది. ఎయిర్టెల్ ఇలాంటి భాగస్వామ్యాన్ని ప్రకటించడం ఇదే మొదటిసారి కాదు. పండుగ సీజన్‌కు ముందుప్రీపెయిడ్ వినియోగదారులకు రీఛార్జ్ కూపన్లను అందించడానికి ఎయిర్టెల్ పెప్సీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా పెప్సీ, మౌంటైన్ డ్యూ, మిరిండా, 7UP, స్లైస్, ట్రోపికానా పెట్ బాటిళ్లతో సహా పెప్సీ ఇతర పానీయాలను కొనుగోలు చేసే వినియోగదారులకు రూ. 10 నుండి రూ. 20 విలువైన ఎయిర్టెల్ రీఛార్జ్ కూపన్లు లభిస్తాయి. పెప్సీ ప్రత్యేక ఎడిషన్ బాటిళ్లలో లేబుల్ వెనుక వైపు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ డిస్కౌంట్ కోడ్ ఉంటుంది. 12 అంకెల కోడ్ కూపన్‌ను ద్వారా రీచార్జ్ కూపర్లను రిడీమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో కనీసం రూ. 99 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ప్రతీ మొబైల్ నంబర్‌కు, డిస్కౌంట్ కోడ్లు రెండుసార్లు మాత్రమే పని చేస్తాయి. ఎయిర్టెల్ పెప్సికో ఆఫర్ ఫిబ్రవరి 2023 వరకు వినియోగ దారులకు అందుబాటులో ఉంటుందని ఎయిర్టెల్ మార్కెటింగ్ , కమ్యూనికేషన్స్ డైరెక్టర్ శాశ్వత్ శర్మ తెలిపారు. -
అదిరిపోయే బంపరాఫర్, ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ పొందండిలా!
ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ను ఫ్రీగా యాక్సెస్ చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో బంపరాఫర్. నెట్‌ఫ్లిక్స్ తాజాగా సరికొత్త ఆఫర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోస్ట్ పెయిడ్ ఆఫర్ ప్యాక్‌ను వినియోగించుకున్న యూజర్లు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను వీక్షించవచ్చు. నెట్‌ఫ్లిక్స్ సంస్థ బేసిక్, స్టాండర్డ్ సబ్ స్క్రిప్షన్ బండిల్‌ను ఓటీటీ లవర్స్‌కు ఫ్రీగా అందిస్తుంది. ఇందుకోసం దేశీయ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌తో జతకట్టింది.ఎయిర్టెల్ ప్రత్యేకంగా రూ.1199, రూ.1599 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను యూజర్లకు అందిస్తుంది. పోస్ట్ పెయిడ్ యూజర్లు ఈ ప్లాన్లకు అప్‌గ్రేడ్ అవ్వడం ద్వారా నెట్‌ఫ్లిక్స్‌ను ఉచితంగా వీక్షించడమే కాదు ఇతర అదనపు ప్రయోజనాల్ని పొందవచ్చు. ఎయిర్టెల్ ఇన్ఫినిటీప్లాన్లో రూ.1199 పోస్ట్ పెయిడ్ ప్యాక్‌తో ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్‌ను వినియోగించుకోవచ్చు. రెండు ఉచిత ఫ్యామిలీ యాడ్ ఆన్ కనెక్షన్‌తో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100ఎస్ఎంఎస్, నెలకు 150జీబీ డేటాను సొంతం చేసుకోవచ్చు. ఎయిర్టెల్ అందిస్తున్న మరో రూ.1599 ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ స్టాండర్డ్ ప్లాన్‌ని ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. యూజర్లు సైతం 3 ఉచిత ఫ్యామిలీ యాడ్ ఆన్ కనెక్షన్లను పొందవచ్చు. అపరిమిత కాలింగ్, రోజుకు ఎస్ఎంఎస్లు,నెలకు 250జీబీ డేటాతో ఇతర ప్రయోజనాల్ని సొంతం చేసుకోవచ్చు. నెట్‌ఫ్లిక్స్‌తో పాటు, 6నెలల ఫ్రీ అమెజాన్ సబ్స్క్రిప్షన్, అదనపు ఖర్చు లేకుండా సంవత్సరం పాటు డిస్నీ+ హాట్‌స్టార్ యాక్సెస్, షా అకాడమీ లైఫ్‌టైమ్ యాక్సెస్, వింక్ (Wynk) ప్రీమియం ఓటీటీ సబ్ స్క్రీప్షన్లను పొందవచ్చు. ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌తో కూడిన నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ పొందాలంటే ►ముందుగా ఎయిర్టెల్ వెబ్సైట్ లేదా ఎయిర్టెల్ థాంక్స్ అప్లికేషన్ ద్వారా రెండు ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లలో దేనికైనా అప్‌గ్రేడ్ చేయండి. ► ఇప్పుడు, ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌ని ఓపెన్ చేసి పేజీ పైన ఉన్న 'డిస్కవర్ ఎయిర్టెల్ థాంక్స్ బెనిఫిట్'పై క్లిక్ చేయండి. ►క్లిక్ చేస్తే కింద భాగంలో “ఎంజాయ్ యువర్ రివార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌ను ట్యాప్ చేస్తే నెట్‌ఫ్లిక్స్ ఆప్షన్ కనిపిస్తుంది. ►కాంప్లిమెంటరీ ప్లాన్‌ను యాక్సెస్ చేయడానికి నెట్‌ప్లిక్స్ సింబల్‌పై ట్యాప్ చేసి వివరాల్ని ఎంటర్ చేయండి ►అంతే ఎయిర్టెల్,నెట్‌ఫ్లిక్స్ అందించే ఫ్రీ సబ్‌స్క్రీప్షన్ ఉచితంగా పొందవచ్చు. చదవండి👉గుడ్ న్యూస్: భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు..ఎప్పటి నుంచంటే! -
రిలయన్స్ జియో యూజర్లకు గుడ్‌న్యూస్!
గతేడాది నవంబర్‌లో దేశీయ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు బెన్ఫిట్స్ తగ్గించి టారిఫ్ ధరల్ని భారీగా పెంచాయి. పెరిగిన టారిఫ్ ధరలతో కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్స్ ధరలు డబుల్ అయ్యాయి. దీంతో యూజర్లు తమకు లాభదాయకంగా ఉన్న టెలికాం కంపెనీల వైపు మొగ్గు చూపడంతో ఆయా కంపెనీల మధ్య పోటీ నెలకొంది. ఈ పోటీని తట్టుకునేందుకు జియో బంపరాఫర్ ప్రకటించింది. రూ.200ల లోపు ఉన్న టారిఫ్ ప్లాన్లకు ప్రతి రోజు 1జీబీ డేటాను అందిస్తుంది. ఈఏడాది చివరి నాటికి దేశంలో వెయ్యి నగరాల్లో 5జీ సేవల్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 4జీ టారిఫ్ ధరల్ని పెంచి 5జీపై పెట్టుబడులు పెట్టింది. అయితే టారిఫ్ ధరలు పెరగడంతో జియో యూజర్లు కాస్తా ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను వినియోగించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో జియో యూజర్లకు తక్కువ ధరలో అదిరిపోయే ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఆ ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రత్యేకంగా జియో యుజర్లకు ►రూ.149 ప్రీపెయిడ్ ప్లాన్ కు ప్రతిరోజు 1జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లను సెండ్ చేసుకోవచ్చు. 20రోజుల వ్యాలిడిటీతో జియో మూవీస్, జియో క్లౌడ్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ►24రోజుల వ్యాలిడిటీతో రూ.179ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చిన జియో..ప్రతిరోజూ 1జీబీ డేటా,100ఎస్ఎంఎస్లు,అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వ్యాలిడిటీని పెంచుకోవాలంటే అదనంగా రూ.149 రిఛార్జ్ చేసుకోవచ్చు. ►రూ.209తో రీఛార్జ్ చేసుకుంటే 28రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 100ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, జియో మువీస్, జియో క్లౌడ్‌తో పాటు మరిన్ని సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. ఇక 28రోజుల వ్యాలిడిటీతో వొడాఫోన్ ఐడియా రూ.269 వసూలు చేస్తుంది. బేసిక్ లెవల్స్‌లో బెన్ఫిట్స్ ఉన్నాయి ►రూ.119చెల్లిస్తే ప్రతిరోజు 1.5జీబీ డేటాతో అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్,300 ఎస్ఎంఎస్లను పంపుకోవచ్చు. దీని వ్యాలిడిటీ 14రోజులు మాత్రమే. ►రూ.199కి రీఛార్జ్ చేసుకుంటే 23రోజుల వ్యాలిడిటీతో ప్రతిరోజు 1.5జీబీ డేటా,100ఎస్ఎంఎస్లు, అన్లిమిటెడ్ వాయిస్‌కాల్స్ మాట్లాడొచ్చు. చదవండి: రిలయన్స్ జియోకు దిమ్మతిరిగేలా షాక్..! దెబ్బ మామూలుగా లేదు -
జియోకి ఝలక్:ఎయిర్టెల్ మూడు సూపర్ ప్లాన్లు
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్టెల్ మరో ఆకర్షణీయమైనప్లాన్ను తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ ఖాతాదారులకోసం సరికొత్త వార్షిక పథకాన్ని ప్రకటించింది. అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత డేటా, ఎస్ఎంఎస్లతో మూడు కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఎయిర్టెల్ వెబ్ సైట్ లో పొందుపర్చిన సమాచారం ప్రకారం నేషనల్ రోమింగ్, ఎస్ఎమ్ఎస్ ఫ్రీ (100 ఎస్ఎంఎస్ /రోజుకు), రూ. 3999, రూ. 1999, రూ. 999 ల రీచార్జి ప్లాన్‌ను ప్రీ పెయిడ్ కస్టమర్లకు అందిస్తోంది. రూ.3999 రీచార్జ్ ప్లాన్ లో 300 జీబీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. 360 రోజులు చెల్లుబాటయ్యేలా ఈ ప్లాన్‌ను లాంచ్ చేసింది. రూ.1999 రీచార్జ్‌పై 180 రోజుల (ఆరునెలలు) కాలపరిమితిలో.. 125 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ (నేషనల్ రోమింగ్), 100 ఎస్ఎంఎస్లు రోజుకు ఉచితం. రూ. 999 రీచార్జ్‌పై 90 రోజులు(మూడు నెలలు) వ్యవధిలో 60 జీబీ డేటా, దీంతోపాటు నేషనల్ రోమింగ్ & ఎస్ఎమ్ఎస్లు (100 ఎస్ఎంఎస్ / రోజుకు) ఉచితం. కాగా టెలికాం మార్కెట్లో నెలకొన్ని తీవ్ర పోటీనేపథ్యంలో తాజాగా ఈవార్షికప్లాన్లను లాంచ్ చేసింది. రిలయన్స్ జియో 360 రోజులకు రూ.9999 లకు అన్లిమిటెడ్ కాలింగ్, డేటా సేవలనుఅందిస్తోంది.. జియోకు షాకిచ్చేలా ఎయిర్ టెల్ తన కస్టమర్లకు సరికొత్త ఆకర్షణీయ రీచార్జ్‌ప్లాన్లను లాంచ్ చేయడం విశేషం. -
బీఎస్ఎన్ఎల్ ఇండిపెండెన్స్ డే ప్లాన్స్
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు ఇండిపెండెన్స్ డే ఆఫర్లను అందిస్తోంది. నేషనల్ రోమింగ్ సేవల్లో ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఆగష్టు 15 నుంచి ప్రత్యేక రీఛార్జిల ద్వారా లభించే రాయితీ రేట్లలో ఈ సేవలను అందించనుంది. భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను అందించేందుకు నిర్ణయించామని బీఎస్ఎన్ఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా ఆగష్టు 15, 2017 నుంచి జాతీయ రోమింగ్‌పై వాయిస్ , ఎస్ఎంఎస్ లేదా స్పెషల్ టారిఫ్ వోచర్స్ (ఎస్.టి.వి) , కాంబో వోచర్ల ద్వారా అదనపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించనున్నట్టు పేర్కొంది. ప్రధానంగా సాయుధ దళ సిబ్బంది, నిపుణులు, వ్యాపారస్తులు ,విద్యార్ధులు ఈ పథకం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారని బీఎస్ఎన్ఎల్ బోర్డు కన్స్యూమర్ మొబిలిటీ డైరెక్టర్ ఆర్.కె. మిట్టల్ చెప్పారు. ఇతర దేశాలు లేదా వేరొక టెలికాం సర్కిల్‌కు ప్రయాణిస్తున్నప్పుడు వినియోగదారుడు ఈ లాభాలను పొందలేరని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది.