
సాక్షి, ముంబై: వొడాఫోన్ ఐడియా మరో కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. వీఐ మ్యాక్స్ 401 సౌత్ పేరుతో ఈ కొత్త ప్లాన్‌ను అందిస్తోంది. రూ. 401 ధరతో ఇప్పటికే ఇలాంటి ప్లాన్ ఉన్నప్పటికీ ఓటీటీ కంటెంట్‌ను అదనంగా అందించడం ఇందులోని ప్రత్యేకత ముఖ్యంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లోకల్ కంటెంట్‌ని ఆస్వాదించాలనుకునే వినియోగదారులకు ఇది గొప్ప ప్లాన్.
ఈ ప్లాన్ ఆఫర్లు, వాలిడిటీ
వాలిడిటీ నెల, నెలకు 50 జీబీ డేటా, 3000 ఎస్‌ఎంఎస్‌లు
అన్‌లిమిటెడ్ కాలింగ్
ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే అదనంగా 50జీబీడేటా కూడా లభ్యం.
దీంతో పాటు ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు, సన్ నెక్ట్స్ (SunNXT) ప్రీమియం HD OTT సభ్యత్వం ఉచితం. ఏడాదికి రూ. 799 విలువైన సన్ నెక్ట్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు సొంతం చేసుకోవచ్చు. ఇందులో సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలను ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా Vi మూవీలు, టీవీ యాప్ VIP యాక్సెస్, ZEE5 ప్రీమియమ్‌కి ఉచిత యాక్సెస్, హంగామా మ్యూజిక్, Vi యాప్ వంటి మరిన్ని ప్రయోజనాలున్నాయి.
వీఐ రూ.401 సౌత్ ప్లాన్ వివరాలివే
ఈ ప్లాన్ ఆన్‌లైన్ కొనుగోలు కోసం మాత్రమే అందుబాటులో ఉంది. అదనపు 50 జీబీతో 1 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందిస్తుంది. వినియోగదారులు రాత్రి సమయంలో అన్‌లిమిటెడ్ డేటాతో (ఉదయం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు), అన్‌లిమిటెడ్ కాలింగ్, నెలకు 3000 SMSలతో 200GB నెలవారీగా పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ రూ.799 విలువైన SunNXT 12 నెలల ఫ్రీ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్
ఇపుడున్న రూ.401 ప్లాన్‌కి, దీనికి తేడా ఏమిటంటే..
ప్రస్తుతం ఉన్న రూ. 401 ప్లాన్ పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ తేడా ఏంటి అంటే సన్ నెక్ట్స్ సబ్‌స్క్రిప్షన్‌కు బదులుగా, రూ. 599 విలువైన సోనీ లివ్ మొబైల్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు రెండూ వీఐ వెబ్‌సైట్ , వీఐ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment