postpaid
-
ఎయిర్టెల్ అదిరిపోయే ఆఫర్.. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా చూడొచ్చు!
ప్రముఖ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ ఈ ఏడాది డిసెంబర్ నెల చివరి నాటికి దేశం మొత్తం 5జీ సేవల్ని అందించాలని భావిస్తోంది. సంస్థ ప్రణాళికల్లో భాగంగా రాబోయే వారాల్లో దేశంలో 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నగరాల సంఖ్య 300కి చేరుతుంది. ఈ తరుణంలో ఎంపిక చేసిన ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్స్‌లో యూజర్లు అన్లిమిటెడ్ 5జీ డేటాను పొందవచ్చు. తద్వారా 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్న నగరాల్లో యూజర్లు నెట్‌వర్క్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఇంటర్నెట్ను వినియోగించుకోవచ్చు. వీటితో పాటు అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఉచితంగా వీక్షించవచ్చు. ఉచితంగా అమెజాన్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్‌ఫామ్స్ ఎయిర్టెల్ రూ. 499 ప్లాన్ : ఈ ప్లాన్‌లో వినియోగదారులు 28 రోజుల వ్యాలిడిటీతో 5జీ అన్ లిమిడెట్ కాలింగ్, అన్లిమిటెడ్ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. అంతేకాదు 3 నెలల పాటు డిస్నీప్లస్ హాట్‌స్టార్, ఎక్స్ట్రీమ్యాప్స్ బెన్ఫిట్స్, వింక్ సబ్స్క్రిప్షన్ ఇలా అనేక ఆఫర్లు పొందవచ్చు. ఒకవేళ 5జీ లేకపోతే 4జీ యూజర్లు ప్రతిరోజు 3జీబీ డేటాను వినియోగించుకోవచ్చు ఎయిర్టెల్ రూ. 839 ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటీతో 5జీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్ఎంస్ఎస్లు పంపుకోవచ్చు. 3నెలల పాటు డిస్నీప్లస్‌హాట్ స్టార్, ఎక్స్ట్రీమ్ యాప్ బెన్ఫిట్స్, రివార్డ్స్ మినీ సబ్స్క్రిప్షన్, వింక్ సబ్‌స్క్రిప్షన్‌ను సొంతం చేసుకోవచ్చుకోవచ్చు. 4జీ యూజర్లు రోజుకు 2జీబీ డేటాను వినియోగించుకునే సౌకర్యం కల్పిస్తుంది ఎయిర్టెల్ సంస్థ. ఎయిర్టెల్ రూ.699 ప్లాన్ : ఈ సరికొత్త ప్లాన్‌లో ఎయిర్టెల్ అన్ లిమిటెడ్ 5జీ డేటా, 100 ఎస్ఎంఎస్లను 56 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. వీటితో పాటు డిస్నీప్లస్‌హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ బెన్ఫిట్స్ పొందవచ్చు. 4జీ యూజర్లు ప్రతి రోజు 3జీబీ డేటా పొందవచ్చు. ఎయిర్టెల్ రూ.999ప్లాన్ : 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 100ఎస్ఎంఎస్లు పంపుకోవచ్చు. 84రోజుల పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్, ఎక్స్ట్రీమ్ యాప్ బెన్ఫిట్స్, వింక్ సబ్స్క్రిప్షన్, రివార్డ్స్ మినీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. 4జీ యూజర్లు 2.5 జీబీ డేటాను సొంతం చేసుకోవచ్చని ఎయిర్టెల్ తెలిపింది. చదవండి👉 ‘మాధురీ మేడం వడపావ్ అదిరింది’.. యాపిల్ సీఈవో టిమ్‌కుక్ వైరల్ -
జియో అన్లిమిటెడ్ డేటా ఆఫర్.. కొత్త కస్టమర్లకు ఉచిత ట్రయల్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం కంపెనీ రిలయన్స్ జియో తాజాగా అపరిమిత డేటా ఆఫర్‌ను ప్రకటించింది. రూ.599 నెలవారీ పోస్ట్ పెయిడ్ ప్లాన్ ద్వారా కస్టమర్లు ఉచిత కాల్స్, అపరిమిత 4జీ డేటా, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందుకోవచ్చు. (వంట గ్యాస్ వినియోగదారులకు ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర!) జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్తోసహా మరిన్ని యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు. అలాగే జియో వెల్కమ్ ఆఫర్ కింద అర్హత కలిగిన వినియోగదార్లకు అపరిమిత 5జీ డేటా కూడా లభిస్తుంది. ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారాలనుకొనే వారికి, కొత్త కస్టమర్లకు జియో 30 రోజుల ఉచిత ట్రయల్‌ని ఆఫర్ చేస్తోంది. -
ఎయిర్టెల్ యూజర్లకు బంపరాఫర్!
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం ఎయిర్టెల్ రూ.799 బ్లాక్ పేరుతో కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీమియం సర్వీసులు పొందే ఈ ఒక్క ప్లాన్ కింద డీటీహెచ్‌తో పాటు ఫైబర్, మొబైల్ సేవల్ని వినియోగించుకోవచ్చు. ఎయిర్టెల్ బ్లాక్ రూ.799 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ఎయిర్టెల్ బ్లాక్ రూ.799 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌లో మొత్తం 3 కనెక్షన్లు పొందవచ్చు. అందులో 2 పోస్ట్ పెయిడ్ కనెక్షన్, మరోకటి డీటీహెచ్ కనెక్షన్. బేస్ రూ. 799 ప్లాన్ పోస్ట్‌పెయిడ్, డీటీహెచ్ ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణ ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ఆఫర్‌లాగానే 105 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ పంపుకోవచ్చు. అదనంగా, ఎయిర్టెల్ బ్లాక్ రూ. 799 ప్లాన్ వినియోగదారులకు రూ. 260 విలువైన టీవీ ఛానెళ్లు డీటీహెచ్ కనెక్షన్ కింద లభిస్తాయి. ఓటీటీ సర్వీసులు సైతం వీటితో పాటు ఎయిర్టెల్ బ్లాక్ రూ.799లో యూజర్లు అమెజాన్ ప్రైమ్ వీడియా,డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ యాప్ సర్వీసుల్ని ఉపయోగించుకోవచ్చు. ఎయిర్టెల్ షాప్‌లో బై నౌ- పే లేటర్ ఎయిర్టెల్ బ్లాక్ రూ.799లో కస్టమర్లు వన్ బిల్ అండ్ వన్ కాల్ సెంటర్ సర్వీసులు, 60 సెకండ్లలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్స్ అందుబాటులోకి వస్తారు. అలాగే ఫ్రీ సర్వీసు విజిట్లు, ఎయిర్టెల్ షాప్‌లో బై నౌ- పే లేటర్ సదుపాయం వంటివి లభిస్తాయి. 5జీ సేవలు సైతం ఎయిర్ టెల్ బ్లాక్ కస్టమర్లు వీవోఎల్టీఈ (VoLTE),వోవైఫై (VoWiFi) సేవలతో పాటు, అన్లిమిటెడ్ 5జీ సేవలు వినియోగించుకోవచ్చు. తద్వారా ఈ ఏడాది జూన్ నాటి 4వేల టౌన్లలో 5జీ సేవల్ని అందించే లక్ష్యంగా పెట్టుకుంది. -
వొడాఫోన్ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్: ఓటీటీ ఆఫర్ తెలిస్తే..!
సాక్షి, ముంబై: వొడాఫోన్ ఐడియా మరో కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. వీఐ మ్యాక్స్ 401 సౌత్ పేరుతో ఈ కొత్త ప్లాన్‌ను అందిస్తోంది. రూ. 401 ధరతో ఇప్పటికే ఇలాంటి ప్లాన్ ఉన్నప్పటికీ ఓటీటీ కంటెంట్‌ను అదనంగా అందించడం ఇందులోని ప్రత్యేకత ముఖ్యంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో లోకల్ కంటెంట్‌ని ఆస్వాదించాలనుకునే వినియోగదారులకు ఇది గొప్ప ప్లాన్. ఈ ప్లాన్ ఆఫర్లు, వాలిడిటీ వాలిడిటీ నెల, నెలకు 50 జీబీ డేటా, 3000 ఎస్ఎంఎస్లు అన్లిమిటెడ్ కాలింగ్ ఆన్లైన్లో కొనుగోలు చేస్తే అదనంగా 50జీబీడేటా కూడా లభ్యం. దీంతో పాటు ఈ రీఛార్జ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు, సన్ నెక్ట్స్ (SunNXT) ప్రీమియం HD OTT సభ్యత్వం ఉచితం. ఏడాదికి రూ. 799 విలువైన సన్ నెక్ట్స్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వోడాఫోన్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు సొంతం చేసుకోవచ్చు. ఇందులో సినిమాలు, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలను ఎంజాయ్ చేయవచ్చు. ఇంకా Vi మూవీలు, టీవీ యాప్ VIP యాక్సెస్, ZEE5 ప్రీమియమ్‌కి ఉచిత యాక్సెస్, హంగామా మ్యూజిక్, Vi యాప్ వంటి మరిన్ని ప్రయోజనాలున్నాయి. వీఐ రూ.401 సౌత్ ప్లాన్ వివరాలివే ఈ ప్లాన్ ఆన్లైన్ కొనుగోలు కోసం మాత్రమే అందుబాటులో ఉంది. అదనపు 50 జీబీతో 1 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌ను అందిస్తుంది. వినియోగదారులు రాత్రి సమయంలో అన్లిమిటెడ్ డేటాతో (ఉదయం 12 నుంచి ఉదయం 6 గంటల వరకు), అన్లిమిటెడ్ కాలింగ్, నెలకు 3000 SMSలతో 200GB నెలవారీగా పొందవచ్చు. అదనపు బెనిఫిట్స్ రూ.799 విలువైన SunNXT 12 నెలల ఫ్రీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఇపుడున్న రూ.401 ప్లాన్‌కి, దీనికి తేడా ఏమిటంటే.. ప్రస్తుతం ఉన్న రూ. 401 ప్లాన్ పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. కానీ తేడా ఏంటి అంటే సన్ నెక్ట్స్ సబ్‌స్క్రిప్షన్‌కు బదులుగా, రూ. 599 విలువైన సోనీ లివ్ మొబైల్ ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితం. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు రెండూ వీఐ వెబ్సైట్ , వీఐ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి. -
Airtel: కస్టమర్లకు నచ్చినట్టుగా ప్లాన్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ ఎయిర్టెల్ భారత్‌లో తొలిసారిగా వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. గృహ వినియోగదారులకు ఫైబర్, డీటీహెచ్, మొబైల్ సర్వీసులను ఒకే గొడుకు కిందకు తెచ్చింది. రెండు లేదా అన్ని కనెక్షన్లను కస్టమర్లు ఎంచుకోవచ్చు. నచ్చిన విధంగా ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. ఫైబర్ రూ.499, డీటీహెచ్ రూ.153, మొబైల్ రూ.499 నుంచి నెలవారీ ప్లాన్స్ మొదలవుతాయి. లేదా కంపెనీ ప్రవేశపెట్టిన నాలుగు రకాల ప్లాన్స్‌లో దేనినైనా ఎంచుకోవచ్చు. రూ.998 ప్లాన్‌లో రెండు మొబైల్, ఒక డీటీహెచ్ కనెక్షన్ పొందవచ్చు. రూ.1,598 ప్లాన్ కింద రెండు మొబైల్, ఒక ఫైబర్, రూ.1,349 ప్లాన్‌లో మూడు మొబైల్, ఒక డీటీహెచ్, రూ.2,099 ప్లాన్ కింద మూడు మొబైల్, ఒక ఫైబర్, ఒక డీటీహెచ్ కనెక్షన్ ఇస్తారు. జీఎస్టీ అదనం. ఎటువంటి అదనపు భారం లేకుండా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ బాక్స్ ఏర్పాటు చేస్తారు. ఇన్స్టాలేషన్, సర్వీస్ చార్జీలు లేవు. ఎయిర్టెల్ బ్లాక్ వినియోగదారులు కస్టమర్ కేర్ ప్రతినిధిని 60 సెకన్లలోపే ఫోన్లో సంప్రదించవచ్చని కంపెనీ తెలిపింది. -
కస్టమర్లకు వొడాఫోన్ మరో ఆఫర్
ముంబై: మొబైల్ దిగ్గజం వొడాఫోన్ ఇండియా తమ పోస్ట్‌పేడ్ కస్టమర్లకు మరో ఆఫర్ ప్రకటించింది. పోస్ట్‌పేడ్ కస్టమర్లకు ఈసిమ్‌ను అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించింది. అయితే యాపిల్ స్మార్ట్ఫోన్లను వాడే కస్టమర్లకు మాత్రమే మొదటగా ఇసిమ్ అందుబాటులో రానుందని తెలిపింది. కాగా త్వరలోనే శాంసంగ్ గాలెక్సీ జడ్ ఫ్లిప్, శాంసంగ్ గాలెక్సీ ఫోల్డ్ స్మార్ట్ఫోన్లకు ఇసిమ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ముంబై, న్యూఢిల్లీ, గుజరాత్ తదితర రాష్ట్రాలు తమ కస్టమర్లకు ఇసిమ్ సేవలు అందుబాటులో ఉంచామని, త్వరలోనే దేశంలోనే మిగతా నగరాలకు విస్తరిస్తామని వోడాఫోన్ తెలిపింది ఇసిమ్‌ను ఇన్స్టాల్ చేసుకునే విధానం: వొడాఫోన్ కస్టమర్ అయితే 199నంబర్‌కు ఎస్ఎమ్ఎస్ చేయాలి, తరువాత eSIM(ఇసిమ్) ఈమెయిల్ ఐడీని టైప్ చేయాలి. ఈమెయిల్‌ను నమోదు చేశాక మెదట ఎస్ఎమ్ఎస్ను పంపించి, ఇన్స్టాల్ ప్రక్రియను ప్రారంభించాలి. సరియైన ఈమెయిల్‌ను నమోదు చేస్తే 199 అనే నంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్‌కు ఎస్ఎమ్ఎస్ వస్తుంది. ఆ తరువాత ఇసిమ్ ఆఫర్‌ను నిర్దారిచడానికి కస్టమర్లు ఈసిమ్‌వైతో రిప్లై చేయాలి. ఆ తర్వాత కస్టమర్ల అభ్యర్థనకు మరోసారి 199నెంబర్‌తో మరో ఎస్ఎమ్ఎస్ వస్తుంది. ఆ తర్వాత రిజిస్టరయిన ఈమెయిల్‌కు క్యూఆర్ కోడ్ వస్తుంది. కస్టమర్లు క్యూర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ఈ ప్రక్రియలో మొదటగా కస్టమర్లు తమ మొబైల్‌ను వైఫైలేదా మొబైల్ డేటాకు కనెక్ట్ చేయాలి. కనెక్టు చేశాక సెట్టింగ్స్ ఆఫ్టన్‌లోకి వెళ్లాక యాడ్ డేటా ప్లాన్ దగ్గర క్లిక్ చేయాలి. మరోవైపు కొత్త కస్టమర్లకు వొడాఫోన్ స్టోర్స్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవాలి. పైన తెలిపిన ప్రక్రియనే వారు కూడా అనుసరించవచ్చు. ఇసిమ్‌ను ద్వారా విభిన్న ఫ్రోఫైల్స్‌ను కస్టమర్లు వినియోగించుకోవచ్చు. (చదవండి: భారత్‌లో కష్టమే అంటున్న వొడాపోన్ ఐడియా) -
వొడాఫోన్ ఎఫెక్ట్ : ఎయిర్టెల్ డేటా పెంపు
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన రూ.499 పోస్టు పెయిడ్ ప్లాన్‌ను సమీక్షిస్తున్నట్టు తెలిపింది. ఈ సమీక్షించిన ప్లాన్ కింద 87.5 శాతం ఎక్కువ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. అంతకముందు ఈ ప్లాన్ కింద కేవలం 40 జీబీ డేటా మాత్రమే సబ్స్క్రైబర్లకు లభించేది. ప్రస్తుతం 75 జీబీ డేటా లభ్యం కానుంది. దీనిలోనే రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఎయిర్టెల్ ఆఫర్ చేయనుంది. అదనంగా ఈ ప్లాన్‌లోనే ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్, ఎయిర్టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్, హ్యాండ్సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలను అందించనున్నట్టు తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన ప్రాంతాలకు మాత్రమేనని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో మరింత మందికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు కూడా చెప్పింది. అంతేకాక ఒక నెలలో వాడుకోని డేటాను మరో నెలకు యాడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఇటీవల వొడాఫోన్ తన రెడ్ పోస్టు పెయిడ్ ప్లాన్లు రూ.399ను, రూ.2,999ను సమీక్షించింది. దీనికి కౌంటర్‌గా ఎయిర్టెల్ సైతం ఈ నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్ సమీక్షించిన ప్లాన్లపై అపరిమిత కాల్స్‌ను, 300 జీబీ వరకు డేటాను, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఆ ఆఫర్లతోనే కాక వొడాఫోన్ ప్లే, మొబైల్ షీల్డ్, రెడ్ హాట్ డీల్స్, బిల్ గ్యారెంటీ వంటి ఉచితంగా లభించనున్నాయి. అంతేకాక కొత్త రూ.299 రెడ్ బేసిక్ పోస్టు పెయిడ్ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 20 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. మరోవైపు జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కౌంటర్‌గా కంపెనీ తన ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో కూడా మార్పులు చేపట్టింది. -
సరికొత్త ఆఫర్ : ‘జియోఫై’ పై భారీ తగ్గింపు
ముంబై : రిలయన్స్ జియో రోజుకో కొత్త ఆఫర్‌తో వినియోగదారుల ముందుకు వస్తోంది. నిన్న కాక మొన్ననే జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్ ప్రకటించిన రిలయన్స్, తాజాగా జియోఫై పోర్టబుల్ 4జీ రూటర్ విక్రయాలను పెంచడానికి సరికొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కింద కస్టమర్లకు 500 రూపాయల క్యాష్‌బ్యాక్ లభించనుంది. దీంతో జియోఫై రూటర్ 499 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. గతేడాది సెప్టెంబర్‌లోనే ఈ పోర్టబుల్ రూటర్ ధరను రూ.1999 నుంచి రూ.999కు తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించిన కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్ కేవలం కొత్త జియోఫై యూనిట్ కొనుగోలు చేసే యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఈ డివైజ్ కలిగి ఉన్నవారికి ఈ ఆఫర్ వర్తించదు. జూలై 3 నుంచి అంటే నేటి నుంచి ఈ ఆఫర్‌ను యూజర్లకు జియో అందిస్తోంది. అయితే ఎప్పుడు వరకు ఈ ఆఫర్ యూజర్లకు అందుబాటులో ఉండనుందో కంపెనీ వెల్లడించలేదు. జియోఫై క్యాష్‌బ్యాక్ ఆఫర్ యూజర్లు పొందడం కోసం, తొలుత యూజర్లు ఆ డివైజ్‌ను కొనుగోలు చేయాలి. దానిలో కొత్త పోస్టుపెయిడ్ సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవాలి. కచ్చితంగా కనీసం 199 రూపాయల విలువైన పోస్టుపెయిడ్ ప్లాన్‌తో యూజర్లు రీఛార్జ్ చేయించుకోవాలి. ఇలా 12 నెలల పాటు రీఛార్జ్ చేయించుకుంటూనే ఉండాలి. 12 నెలల తర్వాత, తర్వాత బిల్ సైకిళ్లలో ప్రకటించిన 500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను రిలయన్స్జియో అందించనుంది. జియో తన పోస్టు పెయిడ్ ప్లాన్ రూ.199 కింద 25 జీబీ డేటాను, ఉచిత వాయిస్ కాల్స్‌ను, అపరిమిత ఎస్ఎంఎస్లను, జియో యాప్స్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందనున్నారు. కొత్త జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్ ప్రకటించిన రోజుల్లోనే మరో ఆఫర్‌ను తీసుకొచ్చింది. మాన్సూన్ ఆఫర్ కింద 4,900 రూపాయల విలువైన ప్రయోజనాలను జియో తన ఒప్పో కస్టమర్లకు అందిస్తోంది. జూన్‌లో కూడా జియో తన ఎంపిక చేసిన ప్యాక్‌లకు రోజుకు 1.5 జీబీ అదనపు డేటాను యూజర్లకు ఆఫర్చేస్తోంది. -
ప్రీపెయిడే ముద్దు గురూ!!
ముంబయి/న్యూఢిల్లీ: కస్టమర్లను కాపాడుకోవాలి.. కొత్త వారిని ఆకర్షించాలి.. ఆదాయం పెంచుకుకోవాలి.. ఇలా ఎన్నో టార్గెట్లతో సతమతమౌతోన్న టెలికం కంపెనీలకు ఇంకొక చిక్కొచ్చిపడింది. కొత్త కొత్త మార్గాలతో రాబడి పెంచుకుని పూర్వవైభవాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న టెల్కోలకు పోస్ట్‌పెయిడ్ రూపంలో సమస్య ఎదురైంది. మొబైల్ యూజర్లు పోస్ట్‌పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు మారిపోతున్నారు. పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్‌తో పోలిస్తే ప్రీపెయిడ్ ప్లాన్స్ అధిక విలువ కలిగి ఉండటం ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. టెలికం కంపెనీలు పోస్ట్‌పెయిడ్ విభాగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ యూజర్లు అటువైపు నుంచి ప్రీపెయిడ్ వైపునకు వస్తున్నారు. టెల్కోలకు సాధారణంగా పోస్ట్‌పెయిడ్ విభాగం నుంచి రాబడి ఎక్కువగా ఉంటుంది. పోస్ట్‌పెయిడ్ యూజర్లు తగ్గారు.. కస్టమర్లు ప్రీపెయిడ్ ప్లాన్స్‌కు ఆకర్షితులౌతుండటంతో పోస్ట్‌పెయిడ్ విభాగపు సబ్స్క్రైబర్ల సంఖ్య త్రైమాసికం పరంగా చూస్తే తగ్గింది. సెప్టెంబర్ క్వార్టర్లో 2 శాతంమేర క్షీణించింది. సాధారణంగానే పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కన్నా ప్రీపెయిడ్ యూజర్లు ఎక్కువగా ఉంటారు. సెప్టెంబర్ క్వార్టర్లో మొత్తం సబ్స్క్రైబర్ల (4జీ ఎల్టీఈ యూజర్లు సహా) సంఖ్యలో ప్రీపెయిడ్ విభాగపు వాటా 95.6 శాతానికి ఎగసింది. జూన్ త్రైమాసికంలో ఇది 95.5 శాతంగా ఉంది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ గణాంకాల ప్రకారం.. సెప్టెంబర్ త్రైమాసికంలో పోస్ట్‌పెయిడ్ సబ్స్క్రైబర్ల సంఖ్య (ఎల్టీఈ యూజర్లు సహా) 5.17 కోట్లకు తగ్గింది. మెట్రోలు సహా ఏ, బీ కేటగిరి సర్కిళ్లలోనూ ప్రీపెయిడ్ యూజర్ల సంఖ్య పెరిగింది. ఆదాయం 10 శాతం డౌన్ సెప్టెంబర్ క్వార్టర్లో పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయం త్రైమాసికం పరంగా చూస్తే 10 శాతంమేర తగ్గింది. రూ.5,900 కోట్లుగా నమోదయ్యింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే 23 శాతంమేర తగ్గింది. ‘జూన్ త్రైమాసికం నుంచి గమనిస్తే సెప్టెంబర్ క్వార్టర్లో పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయం 10 శాతంమేర క్షీణతతో రూ.5,900 కోట్లకు తగ్గిందని కొటక్ సెక్యూరిటీస్ తెలిపింది. ఇదే సమయంలో ప్రీపెయిడ్ విభాగపు ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.24,000 కోట్లకు పెరిగింది. దీనికి జియో ప్రధాన కారణమనే అభిప్రాయముంది. పరిశ్రమ ఆదాయంలో పోస్ట్‌పెయిడ్ విభాగపు వాటా 20 శాతానికి పడిపోయింది. 2016 ఆర్థిక సంవత్సరంలో ఈ వాటా దాదాపు 30–40 శాతం గా ఉండేదని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. టెల్కోలపై ఒత్తిడి ఇంకా పెరగనుందా? టెల్కోలు ఆదాయం పెంచుకునేందుకు ఎక్కువ మందిని పోస్ట్‌పెయిడ్ విభాగంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాయి. అయితే ప్రీపెయిడ్‌లో మంచి డీల్స్ లభిస్తున్నాయి. దీంతో కస్టమర్లు ప్రీపెయిడ్ వైపు ఆకర్షితులౌతున్నారు. ఈ ట్రెండ్ నేపథ్యంలో వచ్చే త్రైమాసికాల్లో టెల్కోలపై ఆర్థికపరమైన ఒత్తిళ్లు ఎక్కువ కావొచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘రానున్న నెలల్లో పోస్ట్‌పెయిడ్ కస్టమర్లను దక్కించుకోవడం టెల్కోలకు కష్టతరం కావొచ్చు. ప్రీపెయిడ్ విభాగంలో మంచి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే పరిశ్రమలో ధరల పోటీ నడుస్తోంది’ అని ఫిచ్ డైరెక్టర్ నితిన్ సోని తెలిపారు. ప్రీపెయిడ్ విభాగంలోని ధరల తగ్గింపు అనేది పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ సేవల మధ్య ధరల విలువలో వ్యత్యాసానికి దారితీసిందని, దీంతో యూజర్లు ప్రీపెయిడ్కు వెళ్తున్నారని కోటక్ సెక్యూరిటీస్ పేర్కొంది. పోస్ట్‌పెయిడ్ ఆదాయంపై నెలకొని ఉన్న తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో టెలికం కంపెనీలు ఈ విభాగంలోని ప్లాన్స్ ధరలు సవరించడం సహా డిస్కౌంట్లను కూడా ప్రకటిస్తున్నాయని నిపుణులు పేర్కొన్నారు. 2017 తొలినాళ్లలో టారిఫ్‌లలో మార్పులు చేయడం పోస్ట్‌పెయిడ్ విభాగపు ఆదాయంపై ప్రతికూల ప్రభావం చూపిందని ఈవైకు చెందిన ప్రశాంత్ సింఘాల్ తెలిపారు. -
పోస్ట్‌పెయిడ్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ డేటా ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీలకు దీటుగా పోటీనిచ్చే క్రమంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం భారీ డేటా ఆఫర్లు ప్రకటించింది. ప్రస్తుత పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై జూలై 1 నుంచి ఆరు రెట్లు అధికంగా డేటా ఇస్తున్నట్లు వెల్లడించింది. దీనిప్రకారం ప్లాన్–99 యూజర్లు ఇకపై 250 ఎంబీ డేటా (ఇప్పటిదాకా డేటా లేదు), ప్లాన్–225 వినియోగదారులు 1 జీబీ డేటా (ఇప్పటిదాకా 200 ఎంబీ మాత్రమే) పొందవచ్చు. అలాగే ప్లాన్–799 యూజర్లు ఇకపై 3 జీబీ డేటా బదులుగా 10 జీబీ పొందవచ్చు. దీంతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ సదుపాయం కూడా పొందవచ్చు. తమ కస్టమర్లకు అందుబాటు ధరలో మెరుగైన సర్వీసులు అందించడానికి కట్టుబడి ఉన్నామని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ (సీఎం) ఆర్కే మిట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. కస్టమర్లు చేజారిపోకుండా చూసుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు పోటాపోటీగా అధిక డేటా ఆఫర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. -
జియో ఎఫెక్ట్: ఎయిర్టెల్ అన్లిమిటెడ్ డేటా
జియోతో పోటీకి అనుగుణంగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తన ప్లాన్లను రివ్యూ చేస్తోంది. మై హోం పథకంలో మరో బంపర్ఆఫర్ తో ముందుకువవచ్చింది. మై హోం ప్రమోషనల్ ఆఫర్లో మునుపటి 5 జీబీ డేటా ఆఫర్‌ను రెట్టింపు చేసింది. ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపిన పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్ సేవలపై నెలకు10 జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్రకారం ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ తోపాటు ప్రతి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ , డిజిటల్టీవీ సేవల్లో దీన్ని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం మై ఎయిర్టెల్ ఆప్‌లో మై హోమ్ ద్వారా ఈ ఆఫర్ లభ్యమవుతోందని కంపెనీ ప్రకటించింది. మై హోం యాప్‌లో ప్రస్తుతం అందుబాటులోఉందనీ, ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ లేదా ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ లేదా ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సర్వీస్ కలిగిన వినియోగదారులు ఈ అవకాశాన్నివినియోగించుకోవచ్చని తెలిపింది. గతంలో 5 జీబీ డేటా ఫ్రీ ఆఫర్ ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను జులై 1, 2016కి ముందు ప్రారంభించిన వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉంది. అలాగే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఉచిత డేటాను రెట్టింపుచేయడంతోపాటు, బ్రాడ్ బ్యాండ్, పోస్ట్ పెయిడ్, డీటీహెచ్ సర్వీసుల (ఇప్పటివరకు 25 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు, 25డీటీహెచ్ కనెక్షన్లకు పరిమితం) పరిమితులను కూడా తొలగించింది. కాగా మూడు నెలల ఉచిత ఆఫర్ తో జియో డీటీహెచ్ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వార్తలొచ్చాయి. సెట్ టాప్ బాక్సుల సాయంతో 1 జీబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలనూ పొందవచ్చని సంస్థ ప్రతినిధులు వెల్లడించారనే పలు అంచనాలతో పాటు సెట్ టాప్ బాక్సుల ఫోటోలు వీటి స్పెసిఫికేషన్స్ ఆన్ లైన్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. -
మాటలకు ఛార్జీల్లేవ్...!
ఎయిర్టెల్ పోస్ట్‌పెయిడ్ ఆఫర్లు న్యూఢిల్లీ : పోస్ట్‌పెయిడ్ విభాగంలో కస్టమర్లను ఆకర్షించేందుకు ఎయిర్టెల్ అపరిమిత కాలింగ్, ఇతర ప్రయోజనాలతో ‘మై ప్లాన్ ఇన్ఫినిటీ’ పేరుతో పలు బండిల్ ఆఫర్లను ప్రకటించింది. కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లు రూ.1,199 ప్లాన్ కింద దేశవ్యాప్తంగా ఎక్కడికైనా అపరిమితంగా లోకల్, ఎస్టీడీ మొబైల్ కాల్స్ చేసుకోవచ్చు. రోమింగ్ కూడా ఉచితం. రోజుకు 100 ఎస్ఎంఎస్లు కూడా ఉచితంగా లభిస్తాయి. దీనికితోడు 1జీబీ 3జీ/4జీ డేటా ఉచితం. వింక్ మ్యూజిక్, వింక్ మూవీస్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితమే. రూ.1,599 ప్లాన్ కింద అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, 5జీబీ 3జీ/4జీ డేటాతోపాటు వింక్ మ్యూజిక్, వింక్ మూవీస్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. అయితే, వింక్ సేవల వినియోగానికి డేటా చార్జీలు వర్తిస్తాయి. ఉచిత డేటా తర్వాత ప్రతి ఎంబీ డేటాకి 50పైసల చార్జీ ఉంటుంది. కాల్ కట్ అయితే 10 నిమిషాలు ఫ్రీ: వొడాఫోన్ మాట్లాడుతున్న సమయంలో నెట్వర్క్ వైపు నుంచి కాల్ మధ్యలో కట్ అయిపోతే పది నిమిషాల టాక్‌టైమ్‌ను ఉచితంగా అందిస్తున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది. దీనికి కొన్ని షరత్తులను కూడా పెట్టింది. కాల్ కట్ అయితే కస్టమర్లు ’ఆఉఖీఖీఉఖ’ అని టైప్ చేసి 199కు ఎస్ఎంఎస్ చేయాలి. అప్పుడే వొడాఫోన్ ఉచిత టాక్‌టైమ్‌ను జమచేస్తుంది.