పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ డేటా ఆఫర్‌ | BSNL data offer: BSNL to offer 6 times more data to postpaid users | Sakshi
Sakshi News home page

పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ డేటా ఆఫర్‌

Published Sat, Jul 1 2017 1:22 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ డేటా ఆఫర్‌

పోస్ట్‌పెయిడ్‌ యూజర్లకు బీఎస్‌ఎన్‌ఎల్‌ డేటా ఆఫర్‌

న్యూఢిల్లీ: ప్రైవేట్‌ కంపెనీలకు దీటుగా పోటీనిచ్చే క్రమంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తమ పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల కోసం భారీ డేటా ఆఫర్లు ప్రకటించింది. ప్రస్తుత పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లపై జూలై 1 నుంచి ఆరు రెట్లు అధికంగా డేటా ఇస్తున్నట్లు వెల్లడించింది. దీనిప్రకారం ప్లాన్‌–99 యూజర్లు ఇకపై 250 ఎంబీ డేటా (ఇప్పటిదాకా డేటా లేదు), ప్లాన్‌–225 వినియోగదారులు 1 జీబీ డేటా (ఇప్పటిదాకా 200 ఎంబీ మాత్రమే) పొందవచ్చు.

అలాగే ప్లాన్‌–799 యూజర్లు ఇకపై 3 జీబీ డేటా బదులుగా 10 జీబీ పొందవచ్చు. దీంతో పాటు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ సదుపాయం కూడా పొందవచ్చు. తమ కస్టమర్లకు అందుబాటు ధరలో మెరుగైన సర్వీసులు అందించడానికి కట్టుబడి ఉన్నామని బీఎస్‌ఎన్‌ఎల్‌ బోర్డు డైరెక్టర్‌ (సీఎం) ఆర్‌కే మిట్టల్‌ ఈ సందర్భంగా తెలిపారు. కస్టమర్లు చేజారిపోకుండా చూసుకునేందుకు ప్రైవేట్‌ ఆపరేటర్లు పోటాపోటీగా అధిక డేటా ఆఫర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement