Data Offers
-
Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటా
రిలయన్స్ జియో తన డేటా-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్లను అప్డేట్ చేసింది. కొత్త చవక డేటా ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ 10జీబీ డేటాను అందిస్తుంది. పూర్తి యాక్టివ్ ప్లాన్ అవసరం లేకుండా తక్షణ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది.కొత్త డేటా ప్లాన్జియో పరిచయం చేసిన కొత్త చవక డేటా ప్లాన్ ధర రూ. 11. ఈ ప్లాన్ ఒక గంట చెల్లుబాటుతో 10జీబీ డేటాను అందిస్తుంది. ఈ "డేటా-ఓన్లీ" యాడ్-ఆన్లు జియో ప్రామాణిక బూస్టర్ ప్యాక్‌ల నుండి విభిన్నంగా ఉంటాయి. ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రిప్షన్‌తో సంబంధం లేకుండా వినియోగదారుల కోసం స్వతంత్రంగా పనిచేస్తాయి. అయితే వాయిస్ కాల్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లేకపోయినప్పటికీ, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్‌లతో ఈ పరిమితి పెద్దగా ప్రభావం చూపదు.జియోలో ప్రస్తుత డేటా ప్లాన్లు ఇవే..» రూ. 11 ప్లాన్: 10జీబీ డేటా, 1 గంట వ్యాలిడిటీ.» రూ. 49 ప్లాన్: 25జీబీ డేటా, 1 రోజు చెల్లుబాటు.» రూ. 175 ప్లాన్: 10జీబీ డేటా, 28 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే జియోసినిమా ప్రీమియం, సోనీ లివ్‌తో సహా 10 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్.» రూ. 219 ప్లాన్: 30జీబీ డేటా, 30 రోజుల చెల్లుబాటు.» రూ. 289 ప్లాన్: 40జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ.ఇదీ చదవండి: రూ.6కే అన్లిమిటెడ్.. బీఎస్ఎన్ఎల్లో బెస్ట్ ప్లాన్ -
రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్ జియో.. ఆ కస్టమర్లకు పండగే!
దేశంలో 5జీ సేవల ప్రారంభంతో టెలికాం సంస్థలు.. ఈ సర్వీసులను అన్నీ నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. మరో వైపు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. ఇందులో ఓటీటీ బెనిఫిట్స్, అన్లిమిటెడ్ కాలింగ్, డేటా ఇలా పలు రకాలు సేవలను తక్కవ ధరకే కస్టమర్లకు ఆకర్షించేలా సరికొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. టెలికాం కంపెనీలు ఎన్ని కొత్త ప్లాన్లు తీసుకొచ్చినా దాదాపు తక్కువ రీఛార్జ్‌తో ఎక్కువ బెనిఫిట్స్ ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం 'రిలయన్స్ జియో' తన యూజర్ల కోసం కొత్త రీచార్జ్ ప్లాన్‌ని ప్రకటించింది. డేటా ఎక్కువ ఉపయోగిస్తున్న కస్టమర్లకు దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రత్యేకంగా ఓ ఆఫర్‌ని తీసుకొచ్చింది రిలయన్స్ జియో. ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు వీడియో కాలింగ్ యూజర్లు కోసం ప్రత్యేకంగా రూ. 61 రీఛార్జ్ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో తక్కువ ధరకే 6 GB డేటాను లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ మీ ఇతర ప్లాన్ ఉన్నంత వరకు ఉంటుంది. చదవండి: ఉద్యోగులకు ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ మరో షాక్! -
రిలయన్స్ జియో మరో ఆఫర్
రోజురోజుకి టెల్కోల మధ్య పోటీ తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ల మధ్య ఈ పోటీగా భారీగా ఉంది. తాజాగా 799 రూపాయలతో సరికొత్త ప్లాన్‌ను లాంచ్ చేసిన రిలయన్స్ జియో, వెంటనే మరో ఆఫర్‌ను ప్రకటించింది. తన 299 రూపాయల ప్యాక్‌ను సమీక్షిస్తున్నట్టు ప్రకటించింది. ఈ సమీక్షించిన ప్యాక్ కింద అదనంగా రోజుకు 1.5జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు రిలయన్స్ జియో పేర్కొంది. అంటే ఇన్ని రోజులు ఈ ప్యాక్‌పై రోజుకు 3 జీబీ డేటా అందుబాటులో ఉండగా.. ఇక నుంచి 4.5జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. దీంతో ఇక నుంచి జియో యూజర్లు రూ.299 ప్యాక్‌పై 28 రోజులకు 126 జీబీ డేటా పొందనున్నారు. ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకే అందుబాటులో ఉండనుంది. ఎక్కువ డేటా ప్రయోజనాలతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్(రోమింగ్‌తో కలిపి), రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ కొత్త స్కీమ్ కింద రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్‌లపై రోజుకు 3 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. అంతేకాక మైజియో యాప్‌పై ఫోన్‌పే వాలెట్ వాడే కస్టమర్లకు 300 రూపాయల కంటే ఎక్కువున్న అన్ని రీఛార్జ్‌లపై 100 రూపాయల డిస్కౌంట్ లభించనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌లకు కేవలం 20 శాతం డిస్కౌంట్‌ను మాత్రమే జియో ఆఫర్ చేయనుంది. -
భలే ఆఫర్ : 99 రూపాయలకే 45జీబీ డేటా
ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్ఎన్ఎల్, భారత్‌లో అతిపెద్ద బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్‌గా దూసుకుపోతుంది. మరే ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్రొవైడర్ అందించని ప్లాన్లను ఆఫర్ చేస్తూ.. కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ నాలుగా కొత్త నాన్-ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ప్రకటించింది. అవి ఒకటి 99 రూపాయల ప్లాన్, రెండు 199 రూపాయల ప్లాన్, మూడు 299 రూపాయల ప్లాన్, నాలుగో 399 బీబీజీ యూఎల్డీ కోంబోలతో బీఎస్ఎన్ఎల్ వీటిని ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లపై రోజువారీ డేటా ప్రయోజనాలతో పాటు, అపరిమిత వాయిస్ కాలింగ్ సౌకర్యాలను యూజర్లు పొందవచ్చు. 45 జీబీ నుంచి 600 జీబీ వరకు డేటాను ఆఫర్ చేయనున్నామని కంపెనీ తెలిపింది. ఈ ప్లాన్ల డౌన్లోడ్ స్పీడు 20 ఎంబీపీఎస్. ఒక్కసారి రోజువారీ పరిమితి అయిపోతే, ఈ స్పీడు 1ఎంబీపీఎస్‌కు దిగి వస్తుందని టెలికాంటాక్ రిపోర్టు చేసింది. 99 రూపాయల ప్లాన్‌పై బీఎస్ఎన్ఎల్ మొత్తంగా 45 జీబీ డేటాను అందిస్తోంది. దీని రోజువారీ పరిమితి 1.5జీబీ. అదేవిధంగా 199 రూపాయల 150 జీబీ ప్లాన్ రోజువారీ పరిమితి 5 జీబీ డేటా. 299 రూపాయల 300 జీబీ ప్లాన్ రోజువారీ పరిమితి 10 జీబీ డేటా. 399 రూపాయల 600 జీబీ ప్లాన్ రోజువారీ పరిమితి 20 జీబీ డేటా. ఈ ప్లాన్లపై బీఎస్ఎన్ఎల్ ఉచిత ఈ-మెయిల్ ఐడీతోపాటు 1జీబీ స్టోరేజ్‌ను అందిస్తోంది. తొలుత 90 రోజుల వాలిట్‌తో ప్రమోషనల్ బేసిస్‌లో వీటిని లాంచ్చేసింది. డిమాండ్ బట్టి ఒకవేళ ఈ ప్లాన్ల తుదిగడువును పెంచాల్సి వస్తే పెంచుతామని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. పాత యూజర్లు ఈ ప్లాన్లలోకి తరలి రాలేరని, కేవలం కొత్త యూజర్లను దృష్టిలో పెట్టుకుని ఈ ప్లాన్లను లాంచ్ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ ప్లాన్లను కొనుగోలు చేసేటప్పుడు 500 రూపాయలు సెక్యురిటీ డిపాజిట్ చేయాలి. ఆరు నెలల అనంతరం ఇతర బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలోకి యూజర్లు వెళ్లిపోవచ్చు. -
ఆ ప్యాక్‌లపై రోజువారీ డేటా పెంపు
రిలయన్స్ జియోను ఎదుర్కొనడానికి టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ డేటా రేట్లను తగ్గిస్తూనే ఉంది. అంతేకాక తాను అందించే ప్యాక్‌ల వాలిడిటీ పెంచడం, డేటాను ఎక్కువగా ఆఫర్ చేయడం కూడా చేస్తూ ఉంది. తాజాగా మరో మూడు ప్రీపెయిడ్ ప్యాక్‌లను ఎయిర్టెల్ సమీక్షించింది. దీనిలో 199 రూపాయల ప్యాక్, 448 రూపాయల ప్యాక్, 509 రూపాయల ప్యాక్ ఉన్నాయి. ఈ మూడు ప్యాక్‌లపై ఇక నుంచి రోజుకు 1.4జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ఎయిర్టెల్ పేర్కొంది. అంతకముందు ఈ ప్యాక్‌లపై రోజుకు కేవలం 1జీబీ డేటాను మాత్రమే యూజర్లు పొందేవారు. రోజువారీ డేటా పరిమితిని పెంచడమే కాకుండా... అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందిస్తోంది. రూ.199 ప్యాక్ వాలిడిటీ 28 రోజులు కాగ, రూ.448 ప్యాక్ వాలిడిటీ 82 రోజులు, రూ.509 ప్యాక్ వాలిడిటీ 90 రోజులుగా ఉంది. అప్డేట్ చేసిన ఈ మూడు ప్యాక్‌లు రిలయన్స్ జియోకు డైరెక్ట్ పోటీగా ఉన్నాయి. ఎయిర్టెల్ 199 రూఎయిర్టెల్, ప్రీపెయిడ్ ప్యాక్స్, డేటా ఆఫర్పాయల ప్యాక్, జియో 198 రూపాయల ప్యాక్‌కు గట్టి పోటీ ఇస్తోంది. జియో తన 198 ప్యాక్‌పై రోజుకు 1.5జీబీ డేటాను యూజర్లకు అందిస్తుండగా.. ఎయిర్టెల్ 1.4జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అదేవిధంగా ఎయిర్టెల్ 448 రూపాయల ప్యాక్, జియో 498 రూపాయల ప్యాక్‌కు పోటీగా ఉంది. ఈ ప్యాక్‌పై కూడా రోజుకు 1.5జీబీ హైస్పీడ్ డేటాను 84 రోజుల పాటు ఆఫర్ చేస్తోంది. ఇక చివరిగా 509 రూపాయల ప్యాక్, జియో 498 రూపాయల ప్యాక్‌కు పోటీ ఇస్తోంది. ఈ మూడు ప్యాక్‌లు మాత్రమే కాక, ఎయిర్టెల్ 349 రూపాయల ప్యాక్‌ను అప్డేట్ చేసింది. దీనిపై రోజుకు 2.5జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ఇటీవలే ప్రకటించింది. మిగతా ప్రయోజనాలన్నీ అదేవిధంగా ఉండనున్నాయి. ప్రస్తుతం సమీక్షించిన ప్యాక్‌లు, వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇంకా మై ఎయిర్టెల్ యాప్‌లో కంపెనీ అప్డేట్ చేయలేదు. ఎయిర్టెల్ కూడా వీటిపై అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. -
పోస్ట్‌పెయిడ్ యూజర్లకు బీఎస్ఎన్ఎల్ డేటా ఆఫర్
న్యూఢిల్లీ: ప్రైవేట్ కంపెనీలకు దీటుగా పోటీనిచ్చే క్రమంలో ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం భారీ డేటా ఆఫర్లు ప్రకటించింది. ప్రస్తుత పోస్ట్‌పెయిడ్ ప్లాన్లపై జూలై 1 నుంచి ఆరు రెట్లు అధికంగా డేటా ఇస్తున్నట్లు వెల్లడించింది. దీనిప్రకారం ప్లాన్–99 యూజర్లు ఇకపై 250 ఎంబీ డేటా (ఇప్పటిదాకా డేటా లేదు), ప్లాన్–225 వినియోగదారులు 1 జీబీ డేటా (ఇప్పటిదాకా 200 ఎంబీ మాత్రమే) పొందవచ్చు. అలాగే ప్లాన్–799 యూజర్లు ఇకపై 3 జీబీ డేటా బదులుగా 10 జీబీ పొందవచ్చు. దీంతో పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ సదుపాయం కూడా పొందవచ్చు. తమ కస్టమర్లకు అందుబాటు ధరలో మెరుగైన సర్వీసులు అందించడానికి కట్టుబడి ఉన్నామని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ (సీఎం) ఆర్కే మిట్టల్ ఈ సందర్భంగా తెలిపారు. కస్టమర్లు చేజారిపోకుండా చూసుకునేందుకు ప్రైవేట్ ఆపరేటర్లు పోటాపోటీగా అధిక డేటా ఆఫర్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. -
డేటా వార్: బెస్ట్ ప్లాన్ ఏది?
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో, టెల్కోలతో గతేడాది సెప్టెంబర్ నుంచి కొనసాగిస్తున్న హోరాహోరీ పోరును ఇప్పట్లో ముగించేటట్టు లేదు. ఉచిత సర్వీసులతో చుక్కలు చూపెడుతోంది. ఓవైపు సమ్మర్ సర్ ప్రైజ్ ఆఫర్ కు ట్రాయ్ చెక్ పెట్టడంతో, ఆ ఆఫర్‌ను రీచార్జ్ చేసుకోలేకపోయిన ప్రైమ్ యూజర్లు, కొత్త కస్టమర్లే లక్ష్యంగా ధన్ ధనా ధన్ ఆఫర్ ను ప్రకటించింది. జియో ఈ ప్లాన్ ప్రకటించిన అనంతరం టెల్కోలు సైతం తమ కస్టమర్లను కాపాడుకోవడానికి హెవీ-డేటా ఆఫర్లను తీసుకొస్తున్నాయి. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్లాన్ ఏది? ఏ కంపెనీ ఎంత రీఛార్జ్ తో ఏ మేర డేటాను ఆఫర్ చేస్తోందో ఓ సారి తెలుసుకుందాం... ఎయిర్ టెల్ రూ.244 ప్యాక్ ఈ కొత్త 244 రూపాయల ఆఫర్ కింద, ఎయిర్ టెల్ యూజర్లు రోజుకు 1జీబీ డేటాను 70 రోజుల పాటు వాడుకోవచ్చు. అయితే యూజర్లకు కచ్చితంగా 4జీ స్మార్ట్ ఫోన్, 4జీ సిమ్ కార్డు ఉండాల్సిందే. 1జీబీ డేటా ఎఫ్‌యూపీ మినహా డేటా వినియోగంపై కంపెనీ ఎలాంటి పరిమితులు విధించలేదు. ఆ ఆఫర్ కిందనే అపరిమిత ఎస్టీడీ, లోకల్ కాల్స్ ను ఆఫర్ చేస్తున్నట్టు కంపెనీ తన వెబ్ సైట్లో, మైఎయిర్ టెల్ యాప్ లో పేర్కొంది.. కానీ రోజుకు గరిష్టంగా 300 నిమిషాల ఉచిత ఎయిర్ టెల్ టూ ఎయిర్ టెల్ కాల్స్ మాత్రం చేసుకోవడానికి వీలుంటుంది. అదే ఇతర నెట్ వర్క్ కు అయితే వారంలో 1200 నిమిషాల ఉచిత కాల్స్ వస్తున్నాయి. ఎయిర్ టెల్ రూ.399 ప్యాక్ ఈ ప్యాక్ కింద 4జీ స్మార్ట్ ఫోన్, 4జీ సిమ్ కార్డు ఉన్న యూజర్లు రోజుకు 1జీబీ డేటాను పొందవచ్చు. ఏ నెట్ వర్క్ కైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. కానీ ఆ పరిమితి 3000 నిమిషాలు మాత్రమే. అది కూడా 70 రోజులు మాత్రమే. ఉచిత నిమిషాలు అయిపోయిన తర్వాత నిమిషానికి 0.10 ఛార్జ్ ను కంపెనీ వసూలు చేస్తోంది. ఎయిర్ టెల్ నెంబర్లకు కాల్స్ చేసుకోవాలంటే రోజుకు 300 నిమిషాల పరిమితి, వారానికి 1200 నిమిషాల పరిమితిని కంపెనీ విధించింది. ఎలాంటి టెక్ట్స్ మెసేజ్ లను కంపెనీ ఆఫర్ చేయడం లేదు. ఎయిర్ టెల్ కొత్త రూ.345 ప్యాక్ ఈ ప్లాన్ 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. 345 తో రీఛార్జ్ చేసుకున్న వారికి రోజుకు 2జీబీ 4జీ డేటాను కంపెనీ యూజర్లకు అందిస్తోంది. ఎయిర్ టెల్ టూ ఎయిర్ టెల్ కాల్స్ రోజుకు 300 నిమిషాలు, వారానికి 1200 నిమిషాలు. ఎలాంటి ఉచిత మెసేజ్ లకు అవకాశముండదు. అయితే రూ.244, రూ.399 ప్లాన్స్ అందరికీ అందుబాటులో లేవట. ఆ ప్లాన్స్ కావాలంటే ముందస్తుగా మైఎయిర్ టెల్ యాప్ లేదా ఎయిర్ టెల్ వెబ్ సైట్లోకి లాగిన్ అయి, మీరు అర్హులో కాదో తెలుసుకోవాల్సి ఉంటుంది. వొడాఫోన్ ఇండియా రూ.352 ప్లాన్ ను వొడాఫోన్ ఇండియా అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. రోజుకు 300 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్ ను, వారానికి 1200 నిమిషాల కాల్స్ ను అందిస్తోంది. అయితే ఈ కంపెనీ కూడా ఎలాంటి ఉచిత మెసేజ్ లను అందించడం లేదు. ఐడియా సెల్యులార్ ఐడియా సెల్యులార్ సైతం తన యూజర్ల కోసం రెండు రకాల ప్లాన్స్ ను అందుబాటులో ఉంచింది. ఒకటి రూ.297 ప్లాన్(70రోజులు), రెండు రూ.447 ప్లాన్(70రోజులు). ఈ రెండు ప్లాన్స్ కింద రోజుకు 1జీబీ 4జీ డేటాను అందిస్తోంది. అపరిమితి ఐడియా టూ ఐడియా కాల్స్(లోకల్ ప్లస్ ఎస్టీడీ). అదే ఇతర నెట్ వర్క్ లకైతే రూ.297 ప్లాన్ కింద రోజుకు 300 నిమిషాలను, వారానికి 1200 నిమిషాలను వాడుకోవచ్చు. అదే రూ.447 ప్లాన్ కిందైతే 3000 నిమిషాలను ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్ తన కొత్త యూజర్ల కోసం రూ.249 ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద నెలకు 300 జీబీ వరకు డేటాను అందించనున్నట్టు ప్రకటించింది. రాత్రి 9 నుంచి ఉదయం 7 వరకు అపరిమిత కాల్స్ ను ఆఫర్ చేస్తోంది. ఆదివారం రోజు మాత్రం రోజంతా ఈ ఉచిత కాల్స్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ జియో జియో తన కస్టమర్లకు రూ.309 రీచార్జ్‌తో 84 రోజులకు 84 జీబీ డేటాను, రూ.509 రీచార్జ్‌తో 84 రోజులకు 168 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. అంటే రోజుకు దాదాపుగా 1 జీబీ (రూ.309), 2 జీబీ (రూ.509) డేటాను పొందొచ్చు. దీనితోపాటు ఇక ఎస్ఎంఎస్, కాల్స్, జియో యాప్స్ సబ్స్క్రిప్షన్ మూడు నెలలపాటు ఉచితం. ఇక నాన్ ప్రైమ్ యూజర్లు, కొత్త కస్టమర్లు ఇవే ప్రయోజనాలను రూ.408, రూ.608 రీచార్జ్‌లతో పొందొచ్చు. ధన్ ధనా ధన్ ఆఫర్ కేవలం ఒక రీచార్జ్‌కు మాత్రమే పరిమితం.