
దేశంలో 5జీ సేవల ప్రారంభంతో టెలికాం సంస్థలు.. ఈ సర్వీసులను అన్నీ నగరాల్లో అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నాయి. మరో వైపు కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి.
ఇందులో ఓటీటీ బెనిఫిట్స్, అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా ఇలా పలు రకాలు సేవలను తక్కవ ధరకే కస్టమర్లకు ఆకర్షించేలా సరికొత్త ప్లాన్‌లను తీసుకొస్తున్నాయి. టెలికాం కంపెనీలు ఎన్ని కొత్త ప్లాన్‌లు తీసుకొచ్చినా దాదాపు తక్కువ రీఛార్జ్‌తో ఎక్కువ బెనిఫిట్స్ ఉండేలా జాగ్రత్త పడుతుంటాయి. తాజాగా ప్రముఖ టెలికాం దిగ్గజం 'రిలయన్స్ జియో' తన యూజర్ల కోసం కొత్త రీచార్జ్ ప్లాన్‌ని ప్రకటించింది.
డేటా ఎక్కువ ఉపయోగిస్తున్న కస్టమర్లకు దృష్టిలో ఉంచుకుని వారి కోసం ప్రత్యేకంగా ఓ ఆఫర్‌ని తీసుకొచ్చింది రిలయన్స్ జియో. ఇంటర్నెట్ స్పీడ్‌తో పాటు వీడియో కాలింగ్ యూజర్లు కోసం ప్రత్యేకంగా రూ. 61 రీఛార్జ్ ప్లాన్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో వినియోగదారులకు పలు ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో తక్కువ ధరకే 6 GB డేటాను లభిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ మీ ఇతర ప్లాన్ ఉన్నంత వరకు ఉంటుంది.