
Reliance Jio new plan : సరసమైన రీఛార్జ్ ప్లాన్‌లకు పేరుగాంచిన దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ కంపెనీ టెలికాం రంగంలోకి ప్రవేశించినప్పటి నుంచి వినియోగదారులకు చౌకైన, సరసమైన ప్లాన్‌లను అందిస్తోంది. అందుకే జియోకి 44 కోట్ల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్నారు.
జియో తాజాగా 84 రోజుల పాటు చెల్లుబాటు అయ్యే కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. అదనపు డేటాతోపాటు 14 ప్రముఖ ఓటీటీలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఈ ప్లాన్ అందిస్తోంది. జియోకి సంబంధించిన ఓటీటీలతోపాటు అనేక ఇతర ఓటీటీల ఉచిత ప్రయోజనాలను అందించే రూ. 1,198 విలువైన కొత్త ప్లాన్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..
రూ. 1198 ప్లాన్ వివరాలు
రిలయన్స్ జియో రూ. 1198 విలువైన ప్లాన్ 84 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.ఏ నెట్‌వర్క్‌లోనైనా ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 84 రోజుల పాటు 168జీబీ డేటా లభిస్తుంది. రోజుకు 2జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రోజువారీ డేటా పరిమితి ముగిసిన తర్వాత 64kbps వేగంతో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. రోజుకు 100 SMSలు లభిస్తాయి.
ఉచిత ఓటీటీలు ఇవే..
ఓటీటీలు చూడడాన్ని ఇష్టపడే వారి కోసం జియో రూ. 1198 ప్లాన్ 14 ఓటీటీలకు ఉచిత సబ్‌స్క్రిప్షన్లు అందిస్తోంది. వీటిలో సోనీ లివ్, జీ5, లయన్స్‌గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ NXT, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, డాక్యుబే, ఎపిక్ ఆన్, జియో టీవీ యాప్ ద్వారా Hoichoi, ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ వంటివి ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment