రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్స్ అన్నీ ఇటీవల భారీగా పెరిగాయి. ఈ తరుణంలో అంబానీ 'క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ' పేరుతో ఓ ప్లాన్ తీసుకువచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ కోసం రూ.319 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. అంటే ఈ రోజు (ఆగష్టు 2) ప్లాన్ యాక్టివేట్ లేదా రీఛార్జ్ చేసుకుంటే.. సెప్టెంబర్ 1వరకు యాక్టివ్‌గా ఉంటుంది. మళ్ళీ మీరు సెప్టెంబర్ 2న రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
క్యాలెండర్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్ ఫీచర్స్
ఈ ప్లాన్ ఎంచుకునే యూజర్లు రోజుకు 1.5 జీబీ హైస్పీడ్ డేటా పొందవచ్చు. లిమిటెడ్ ముగిసిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది.
ఈ ప్లాన్‌లో భారతదేశం అంతటా ఏ నెట్‌వర్క్‌కైనా అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.
యూజర్లు రోజుకు గరిష్టంగా 100 ఎస్ఎమ్ఎస్‌లు పంపుకోవచ్చు.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI).. టెలికాం కంపెనీలు 30 రోజుల వ్యాలిడిటీతో ప్లాన్‌లను అందించాలని కోరింది. దీనికి స్పందించిన జియో రూ.296, రూ.259 ప్లాన్‌లను విడుదల చేసింది. రూ.296 ప్లాన్‌లో అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS మరియు 30 రోజుల పాటు 25GB డేటా ఉన్నాయి. అదే విధంగా రూ.259 ప్లాన్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment