Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటా | SUPERHIT affordable packs for Jio users Get 10 GB data for just Rs 11 | Sakshi
Sakshi News home page

Jio: టీ ధర కంటే తక్కువకే 10 జీబీ డేటా

Published Sat, Nov 16 2024 1:48 PM | Last Updated on Sat, Nov 16 2024 2:50 PM

SUPERHIT affordable packs for Jio users Get 10 GB data for just Rs 11

రిలయన్స్ జియో తన డేటా-ఓన్లీ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అప్‌డేట్ చేసింది. కొత్త చవక డేటా ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్ 10జీబీ డేటాను అందిస్తుంది. పూర్తి యాక్టివ్‌ ప్లాన్‌ అవసరం లేకుండా తక్షణ డేటా అవసరమయ్యే వినియోగదారులకు ఇది ఉపయోగపడుతుంది.

కొత్త డేటా ప్లాన్‌
జియో పరిచయం చేసిన కొత్త చవక డేటా ప్లాన్‌ ధర రూ. 11. ఈ ప్లాన్ ఒక గంట చెల్లుబాటుతో 10జీబీ డేటాను అందిస్తుంది. ఈ "డేటా-ఓన్లీ" యాడ్-ఆన్‌లు జియో ప్రామాణిక బూస్టర్ ప్యాక్‌ల నుండి విభిన్నంగా ఉంటాయి. ఇప్పటికే ఉన్న సబ్‌స్క్రిప్షన్‌తో సంబంధం లేకుండా వినియోగదారుల కోసం స్వతంత్రంగా పనిచేస్తాయి. అయితే వాయిస్ కాల్, ఎస్‌ఎంఎస్‌ ప్రయోజనాలు లేకపోయినప్పటికీ, వాట్సాప్‌ వంటి మెసేజింగ్ యాప్‌లతో ఈ పరిమితి పెద్దగా ప్రభావం చూపదు.

జియోలో ప్రస్తుత డేటా ప్లాన్లు ఇవే..
» రూ. 11 ప్లాన్: 10జీబీ డేటా, 1 గంట వ్యాలిడిటీ.
» రూ. 49 ప్లాన్: 25జీబీ డేటా, 1 రోజు చెల్లుబాటు.
» రూ. 175 ప్లాన్: 10జీబీ డేటా, 28 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. అలాగే జియోసినిమా ప్రీమియం, సోనీ లివ్‌తో సహా 10 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లకు యాక్సెస్.
» రూ. 219 ప్లాన్: 30జీబీ డేటా, 30 రోజుల చెల్లుబాటు.
» రూ. 289 ప్లాన్: 40జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ.

ఇదీ చదవండి: రూ.6కే అన్‌లిమిటెడ్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో బెస్ట్‌ ప్లాన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement