భారతీ ఎయిర్‌టెల్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన రూ.499 పోస్టు పెయిడ్ ప్లాన్‌ను సమీక్షిస్తున్నట్టు తెలిపింది. ఈ సమీక్షించిన ప్లాన్ కింద 87.5 శాతం ఎక్కువ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. అంతకముందు ఈ ప్లాన్ కింద కేవలం 40 జీబీ డేటా మాత్రమే సబ్‌స్క్రైబర్లకు లభించేది. ప్రస్తుతం 75 జీబీ డేటా లభ్యం కానుంది. దీనిలోనే రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఎయిర్‌టెల్ ఆఫర్ చేయనుంది. అదనంగా ఈ ప్లాన్‌లోనే ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్, హ్యాండ్‌సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలను అందించనున్నట్టు తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన ప్రాంతాలకు మాత్రమేనని కంపెనీ పేర్కొంది.
భవిష్యత్తులో మరింత మందికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు కూడా చెప్పింది. అంతేకాక ఒక నెలలో వాడుకోని డేటాను మరో నెలకు యాడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఇటీవల వొడాఫోన్ తన రెడ్ పోస్టు పెయిడ్ ప్లాన్లు రూ.399ను, రూ.2,999ను సమీక్షించింది. దీనికి కౌంటర్‌గా ఎయిర్‌టెల్ సైతం ఈ నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్ సమీక్షించిన ప్లాన్లపై అపరిమిత కాల్స్‌ను, 300 జీబీ వరకు డేటాను, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఆ ఆఫర్లతోనే కాక వొడాఫోన్ ప్లే, మొబైల్ షీల్డ్, రెడ్ హాట్ డీల్స్, బిల్ గ్యారెంటీ వంటి ఉచితంగా లభించనున్నాయి. అంతేకాక కొత్త రూ.299 రెడ్ బేసిక్ పోస్టు పెయిడ్ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 20 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. మరోవైపు జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కౌంటర్‌గా కంపెనీ తన ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో కూడా మార్పులు చేపట్టింది.
Comments
Please login to add a commentAdd a comment