Data Benefits
-
వొడాఫోన్ ఎఫెక్ట్ : ఎయిర్టెల్ డేటా పెంపు
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన రూ.499 పోస్టు పెయిడ్ ప్లాన్‌ను సమీక్షిస్తున్నట్టు తెలిపింది. ఈ సమీక్షించిన ప్లాన్ కింద 87.5 శాతం ఎక్కువ డేటాను ఆఫర్ చేయనున్నట్టు ప్రకటించింది. అంతకముందు ఈ ప్లాన్ కింద కేవలం 40 జీబీ డేటా మాత్రమే సబ్స్క్రైబర్లకు లభించేది. ప్రస్తుతం 75 జీబీ డేటా లభ్యం కానుంది. దీనిలోనే రోజుకు 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఎయిర్టెల్ ఆఫర్ చేయనుంది. అదనంగా ఈ ప్లాన్‌లోనే ఏడాది పాటు అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్, ఎయిర్టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్, హ్యాండ్సెట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ వంటి ప్రయోజనాలను అందించనున్నట్టు తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఎంపిక చేసిన ప్రాంతాలకు మాత్రమేనని కంపెనీ పేర్కొంది. భవిష్యత్తులో మరింత మందికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు కూడా చెప్పింది. అంతేకాక ఒక నెలలో వాడుకోని డేటాను మరో నెలకు యాడ్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పిస్తోంది. ఇటీవల వొడాఫోన్ తన రెడ్ పోస్టు పెయిడ్ ప్లాన్లు రూ.399ను, రూ.2,999ను సమీక్షించింది. దీనికి కౌంటర్‌గా ఎయిర్టెల్ సైతం ఈ నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్ సమీక్షించిన ప్లాన్లపై అపరిమిత కాల్స్‌ను, 300 జీబీ వరకు డేటాను, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించనున్నట్టు ప్రకటించింది. ఆ ఆఫర్లతోనే కాక వొడాఫోన్ ప్లే, మొబైల్ షీల్డ్, రెడ్ హాట్ డీల్స్, బిల్ గ్యారెంటీ వంటి ఉచితంగా లభించనున్నాయి. అంతేకాక కొత్త రూ.299 రెడ్ బేసిక్ పోస్టు పెయిడ్ ప్లాన్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్ కింద 20 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. మరోవైపు జియోగిగాఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ కౌంటర్‌గా కంపెనీ తన ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లలో కూడా మార్పులు చేపట్టింది. -
జియో అద్భుత ఆఫర్ : 3.2 టీబీ 4జీ డేటా
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులు విపరీతంగా ఆకట్టుకుంటోంది. తాజాగా మరో కొత్త ఆఫర్ - జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్‌ను తన ప్రీపెయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కొత్త స్కీమ్ కింద యూజర్లు 3.2 టీబీ జియో 4జీ డేటాను పొందనున్నారు. 4900 రూపాయల వరకు ప్రయోజనాలను జియో తన ప్రీపెయిడ్ యూజర్లకు ఆఫర్ చేస్తుంది. ఈ ఆఫర్ పాత లేదా కొత్త జియో సిమ్‌ను కలిగి ఉన్న ఒప్పో ఫోన్ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ పొందడానికి కొత్త ఒప్పో ఫోనే కొనుగోలు చేయాల్సినవసరం లేదు. జూన్ 28 నుంచి ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఆఫర్‌ను పొందడానికి మాత్రం సబ్స్క్రైబర్లు 198 రూపాయలు, 299 రూపాయల జియో ప్రీపెయిడ్ ప్లాన్లతో తమ ఫోన్లకు రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. జియో ఒప్పో మాన్సూన్ ఆఫర్.. ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలు... 1800 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను యూజర్లు 50 రూపాయల విలువైన 36 క్యాష్‌బ్యాక్ ఓచర్ల రూపంలో పొందనున్నారు. జియో మనీ క్రెడిట్.... 13వ, 26వ, 39వ రీఛార్జ్‌ల అనంతరం 600 రూపాయల చొప్పున మూడు సార్లు యూజర్లకు 1800 రూపాయలు క్రెడిట్ కానున్నాయి. పార్టనర్ కూపన్ బెనిఫిట్స్... మేక్మైట్రిప్ నుంచి 1300 రూపాయల విలువైన డిస్కౌంట్ కూపన్లు అందుబాటులో ఉండనునఆనయి. ఆఫర్ ప్రారంభ తేదీ.. 2018 జూన్ 28 మైజియో యాప్‌లో ఉన్న ఫోన్ పే ద్వారా రీఛార్జ్ చేసుకున్న వారికి రూ.50 క్యాష్ బ్యాక్ ఓచర్లు వెంటనే పొందవచ్చు. రూ.299 రీఛార్జ్‌పై ప్రస్తుతం జియో 126 జీబీ డేటాను అందిస్తోంది. -
రాఖీ గిఫ్ట్: బీఎస్ఎన్ఎల్ కొత్త ఆఫర్
రక్షా బంధన్ సెలబ్రేషన్స్‌లో భాగంగా ప్రభుత్వరంగ టెలికాం బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. 'రాఖీ పె సౌగత్' రీఛార్జ్ ప్లాన్‌ను తన ప్రీపెయిడ్ కస్టమర్లకు ప్రకటించింది. ఈ ప్లాన్‌లో 74 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాల్స్‌ను, డేటా ప్రయోజనాలను వినియోగదారులకు అందించనుంది. అయితే ఇది కేవలం తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు, ఐదు రోజుల వరకే వాలిడ్‌లో ఉంటుంది. కానీ ఐదురోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్ ఆన్ నెట్ ద్వారా తమ కస్టమర్లకు చేసుకోవచ్చు. టాక్ వాల్యుతో పాటు ఐదు రోజుల వరకు 1జీబీ డేటాను యూజర్లు వాడుకోవచ్చు. నేటి(ఆగస్టు3) నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి వస్తోందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. 12 రోజుల వరకు ఇది అందుబాటులో ఉంటుందని పేర్కొంది. పండుగలను పురస్కరించుకుని ఇలాంటి చౌక టారిఫ్‌లను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేయడం సంప్రదాయమని బీఎస్ఎన్ఎల్ బోర్డు డైరెక్టర్ ఆర్కే మిట్టల్ తెలిపారు. అదనంగా రూ.189, రూ.289, రూ.389లతో కొన్ని కొంబో ఆఫర్లను కూడా బీఎస్ఎన్ఎల్ లాంచ్చేసింది. ఈ ఆఫర్స్‌లో అదనంగా 18 శాతం టాక్ వాల్యు, 1జీబీ డేటాను ఉచితంగా అందించనుంది. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం 128జీబీ డేటాతో 'సిక్సర్ 666' ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద తన ప్రీపెయిడ్ యూజర్లు రోజుకు 2జీబీ డేటాను పొందుతారు. ఈ ప్లాన్ 60 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. రిలయన్స్ జియోకు కౌంటర్ ఇచ్చేందుకు బీఎస్ఎన్ఎల్ ఈ ఆఫర్లను ప్రకటిస్తోంది. ఫెస్టివ్ సీజన్లో కస్టమర్లను మరింత ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. -
బాహుబలి ఫ్యాన్స్‌కి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
హైదరాబాద్:భారత అతిపెద్ద, అతివేగమైన టెలికాం సేవల సంస్థ భారతి ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తమ ఖాతాదారుల సౌలభ్యంకోసం బాహుబలి దకన్క్లూజన్ టీంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 4జీ డాటా సేవలందించే స్పెషల్ 4 జీ సిమ్ లను లాంచ్ చేసింది. 'బాహుబలి' పేరుతో లాంచ్ చేసిన ఈ బాహుబలి సిమ్ ద్వారా ఉచిత 4జీడేటాను అందించనున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. దీంతోపాటు 4జీ రీచార్జ్ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రకటించింది. ఇందుకు బాహుబలి-2తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటున్నట్లు భారతీ ఎయిర్టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సీఈఓ వెంకటేష్ విజయరాఘవన్ ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్ హోటల్లో బాహుబలి దర్శకుడు రాజమౌళి, హీరో లు ప్రభాస్, రానా, నటి అనుష్క తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా బాహుబలి నెట్‌వర్క్‌ను లాంచ్ చేశారు. బాహుబలి టీం సోషల్‌మీడియాను బాగా ఉపయోగించుకుందని రాజమౌళి చెప్పారు. ఈ ఘనత నిర్మాత శోభుకి, ఆర్కా టీంకు దక్కుతుందన్నారు. వివిధ డిజిటల్ ప్లాట్ ప్లాంలపై బాహుబలి-2 ప్రమోషన్ చేపడతామని ఎయిర్టెల్ కన్స్యూమర్ బిజినెస్ & చీఫ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజ్ పూడిపెద్ది చెప్పారు. అలాగే తమ కస్టమర్లు ప్రత్యేక బాహుబలి-2 మేకింగ్ కంటెంట్‌ను అందించనున్నట్టు తెలిపారు. ఎయిర్టెల్ నుంచి బాహుబలి సిమ్‌తోపాటు ఉచిత 4జీ డేటా, బాహుబలి 4జీ రీఛార్జ్ ప్యాక్, బాహుబలి కంటెంట్‌లో భాగంగా వీడియోలు, వింక్ మ్యూజిక్, గెస్ట్ ఎడిటర్స్, ఇలా ప్రత్యేకమైన ఉత్పత్తులు అందిస్తున్నట్లు విజయరాఘవన్ తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఎయిర్టెల్ 4జీ వినియోగదారుల కోసం లైవ్ ఓపెన్ ఇంటరాక్టివ్ క్యాంపెయిన్ త్వరలో నిర్వహించనుంది. అయితే రీఛార్జ్ ప్యాక్‌లపై వివరాలను స్పష్టంగా తెలియలేదు. కాగా శనివారం విడుదలైన ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించి ప్రమోషన్ ప్రోమో దుమ్ము రేపుతోంది. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న థియేటర్లను పలకరించనుంది.