బాహుబలి ఫ్యాన్స్‌​కి ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌ | Airtel Partners With Baahubali 2 to Launch Special 4G SIMs and Data Benefits | Sakshi
Sakshi News home page

బాహుబలి ఫ్యాన్స్‌​కి ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌

Published Sat, Apr 22 2017 6:12 PM | Last Updated on Tue, Sep 5 2017 9:26 AM

బాహుబలి ఫ్యాన్స్‌​కి ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌

బాహుబలి ఫ్యాన్స్‌​కి ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌

హైదరాబాద్‌:భారత అతిపెద్ద, అతివేగమైన టెలికాం సేవల సంస్థ భారతి ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్‌ ప్రకటించింది. తమ ఖాతాదారుల సౌలభ్యంకోసం  బాహుబలి దకన్‌క్లూజన్‌ టీంతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో  4జీ డాటా  సేవలందించే స్పెషల్‌ 4 జీ సిమ్‌ లను లాంచ్‌ చేసింది.  'బాహుబలి'  పేరుతో  లాంచ్‌ చేసిన ఈ బాహుబలి సిమ్‌ ద్వారా ఉచిత 4జీడేటాను అందించనున్నట్టు ఎయిర్‌టెల్‌  తెలిపింది.  దీంతోపాటు 4జీ రీచార్జ్‌ ప్యాక్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్న ప్రకటించింది.  ఇందుకు బాహుబలి-2తో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంటున్నట్లు భారతీ ఎయిర్‌టెల్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల సీఈఓ వెంకటేష్‌ విజయరాఘవన్‌  ప్రకటించారు.   

బంజారాహిల్స్‌లోని పార్క్‌హయత్‌ హోటల్‌లో  బాహుబలి దర్శకుడు రాజమౌళి, హీరో లు ప్రభాస్,  రానా, నటి అనుష్క తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది.  ఈ సందర్భంగా బాహుబలి నెట్‌వర్క్‌ను లాంచ్‌ చేశారు.  బాహుబలి టీం సోషల్‌మీడియాను బాగా ఉపయోగించుకుందని రాజమౌళి చెప్పారు. ఈ  ఘనత  నిర్మాత శోభుకి, ఆర్కా టీంకు  దక్కుతుందన్నారు.
 
వివిధ డిజిటల్‌ ప్లాట్‌ ప్లాంలపై  బాహుబలి-2  ప్రమోషన్‌ చేపడతామని  ఎయిర్‌టెల్‌ కన్స్యూమర్ బిజినెస్ & చీఫ్ మార్కెటింగ్ డైరెక్టర్   రాజ్‌  పూడిపెద్ది చెప్పారు.  అలాగే తమ కస్టమర్లు ప్రత్యేక బాహుబలి-2 మేకింగ్‌  కంటెంట్‌ను అందించనున్నట్టు తెలిపారు. ఎయిర్‌టెల్‌ నుంచి బాహుబలి సిమ్‌తోపాటు ఉచిత 4జీ డేటా, బాహుబలి 4జీ రీఛార్జ్‌ ప్యాక్‌, బాహుబలి కంటెంట్‌లో భాగంగా వీడియోలు, వింక్‌ మ్యూజిక్‌, గెస్ట్‌ ఎడిటర్స్‌, ఇలా ప్రత్యేకమైన ఉత్పత్తులు అందిస్తున్నట్లు విజయరాఘవన్‌ తెలిపారు. దేశంలోని  వివిధ ప్రాంతాలలో ఎయిర్టెల్ 4జీ వినియోగదారుల కోసం  లైవ్‌  ఓపెన్‌ ఇంటరాక్టివ్  క్యాంపెయిన్‌ త్వరలో  నిర్వహించనుంది. అయితే రీఛార్జ్ ప్యాక్‌లపై వివరాలను స్పష్టంగా తెలియలేదు.

కాగా శనివారం విడుదలైన ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించి ప్రమోషన్‌ ప్రోమో దుమ్ము రేపుతోంది. బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 28న  థియేటర్లను పలకరించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement