దేశంలో దిగ్గజ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో ( Jio ), భారతీ ఎయిర్‌టెల్ ( Airtel ) రెండూ ఒకే రకమైన కొత్త రీచ్చార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. రెండింటి ధర రూ. 666. అయితే ప్రయోజనాల్లో మాత్రం చాలా తేడా ఉంది. రెండు ప్లాన్లతో కస్టమర్లకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
జియో రూ.666 ప్లాన్
➥ 84 రోజుల వ్యాలిడిటీ
➥ 84 రోజుల పాటు అన్ని నెట్‌వర్క్‌లకు ఉచిత కాలింగ్
➥ వ్యాలిడిటీ ఉన్నన్ని రోజులకు 126జీబీ డేటా అందిస్తుంది. రోజుకు 1.5జీబీ డేటాను ఉపయోగించవచ్చు.
➥ రోజుకు 100 SMS
➥ జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ సబ్‌స్క్రిప్షన్‌లు
ఎయిర్‌టెల్ రూ.666 ప్లాన్
➥ మొత్తంగా 115జీబీ డేటా. రోజుకు 1.5 జీబీ డేటా వాడుకోవచ్చు.
➥ 77 రోజుల వరకు వ్యాలిడిటీ
➥ అమెజాన్ ప్రైమ్ వీడియోకు సబ్‌స్క్రిప్షన్
➥ వింక్ మ్యూజిక్‌తోపాటు హలో ట్యూన్స్‌కి ఉచిత సబ్‌స్క్రిప్షన్
ఈ ప్లాన్‌లో రెండు కంపెనీలు తమ కస్టమర్లకు అపరిమిత 5G డేటాను అందిస్తున్నాయి. రిలయన్స్ జియోకు 44 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. మరోవైపు ఎయిర్‌టెల్‌కు దేశవ్యాప్తంగా 37 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. రెండు టెలికాం కంపెనీలు తమ కస్టమర్ల కోసం అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తున్నాయి. మీ బడ్జెట్, అవసరాలకు అనుగుణంగా ఈ రీఛార్జ్ ప్లాన్‌లలో దేనినైనా ఎంచుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment