జియో ఎఫెక్ట్: ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ డేటా
జియోతో పోటీకి అనుగుణంగా టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ తన ప్లాన్లను రివ్యూ చేస్తోంది. మై హోం పథకంలో మరో బంపర్‌ఆఫర్ తో ముందుకువవచ్చింది. మై హోం ప్రమోషనల్ ఆఫర్‌లో మునుపటి 5 జీబీ డేటా ఆఫర్‌ను రెట్టింపు చేసింది. ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ కనెక్షన్‌తో కలిపిన పోస్ట్‌పెయిడ్, డిటిహెచ్ సేవలపై నెలకు10 జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్టు శనివారం ప్రకటించింది. ఈ ప్రమోషనల్ ఆఫర్ ప్రకారం ఎయిర్‌టెల్ బ్రాడ్ బ్యాండ్ తోపాటు ప్రతి పోస్ట్ పెయిడ్ కనెక్షన్ , డిజిటల్‌టీవీ సేవల్లో దీన్ని ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం మై ఎయిర్‌టెల్ ఆప్‌లో మై హోమ్ ద్వారా ఈ ఆఫర్ లభ్యమవుతోందని కంపెనీ ప్రకటించింది.
మై హోం యాప్‌లో ప్రస్తుతం అందుబాటులోఉందనీ, ఎయిర్టెల్ బ్రాడ్ బ్యాండ్ లేదా ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్ కనెక్షన్ లేదా ఎయిర్టెల్ డిజిటల్ టీవీ సర్వీస్ కలిగిన వినియోగదారులు ఈ అవకాశాన్నివినియోగించుకోవచ్చని తెలిపింది.
గతంలో 5 జీబీ డేటా ఫ్రీ ఆఫర్ ఎయిర్టెల్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను జులై 1, 2016కి ముందు ప్రారంభించిన వినియోగదారులకు మాత్రం అందుబాటులో ఉంది. అలాగే కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఉచిత డేటాను రెట్టింపుచేయడంతోపాటు, బ్రాడ్ బ్యాండ్, పోస్ట్ పెయిడ్, డీటీహెచ్ సర్వీసుల (ఇప్పటివరకు 25 పోస్ట్‌పెయిడ్ కనెక్షన్లు, 25డీటీహెచ్ కనెక్షన్లకు పరిమితం) పరిమితులను కూడా తొలగించింది.
కాగా మూడు నెలల ఉచిత ఆఫర్ తో జియో డీటీహెచ్ సేవల్లోకి ఎంట్రీ ఇవ్వనుందని ఇటీవల వార్తలొచ్చాయి. సెట్ టాప్ బాక్సుల సాయంతో 1 జీబీపీఎస్ వేగంతో బ్రాడ్ బ్యాండ్ సేవలనూ పొందవచ్చని సంస్థ ప్రతినిధులు వెల్లడించారనే పలు అంచనాలతో పాటు సెట్ టాప్ బాక్సుల ఫోటోలు వీటి స్పెసిఫికేషన్స్ ఆన్ లైన్లో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.